Friday, 2 June 2023
Friday, 5 May 2023
మాలిక పత్రిక మే 2023 సంచిక విడుదల
స్వాగతం... సుస్వాగతం... మాలిక పాఠక, రచయిత మిత్రులందరికీ మండే మే నెల సంచికకు స్వాగతం. అయినా ఈ వేసవికాలం ఏంటో అస్సర్ధం కావట్లేదు. ఏప్రిల్ నెలలోనే వేడి పెరిగింది మే ఎలా కాల్చేస్తుందో అని అందరూ భయపడుతూంటే, ఆకాశం బద్ధలైనట్టు వానలు ఉరుములు, మెరుపులతో ముంచేస్తున్నాయి. ఏంటో ఈ చెడగొట్టు వానలు. ఇక ఇప్పుడు జరిగేది... జరుగుతున్నది... జరగబోయేది మామిడి , మల్లెల కాలం... మల్లెలు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా మామిడిపళ్లను మాత్రం మరువగలమా.. పచ్చి మామిడికాయలతో రోజూ వంటలు, ఆవకాయలు. తర్వాత ముక్కలు కోసి ఎండబెట్టి ఒరుగులు చేసుకోవడం. మామిడిపళ్లైతే రోజొకటి తినాల్సిందే... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆవకాయల బిజీ కనిపిస్తోంది. మరో పక్క పచ్చని మామిడిపళ్ల దృశ్యాలు.. ఆహా! ఏమి రుచి! మంచి మంచి కథలు, సీరియల్స్, కవితలు, వ్యాసాలు, కార్టూన్స్ తో మీ ముందుకు వచ్చింది మే నెల మాలిక పత్రిక.. మీకు నచ్చే... మీరు మెచ్చే విశేషాలు ఎన్నో...
ఈ మాసపు విశేషాలు:
1. జీవనవేదం – 9
2. గోపమ్మ కథ… 8
4. అమ్మమ్మ – 46
5. పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!
13. కవిత్వం పరమార్ధం
రాసింది జ్యోతి at 17:34 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక పత్రిక
Tuesday, 4 April 2023
మాలిక పత్రిక ఏప్రిల్ 2023 సంచిక విడుదల
పాఠక మిత్రులు, రచయితలకు సాదర ఆహ్వానం.. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని దారుణాలు జరిగినా కాలం మాత్రం ఆగకుండా పోతూనే ఉంటుంది. అప్పుడే తెల్లారిందా? అప్పుడే రాత్రయిందా? అప్పుడే మొదటి తారీఖు వచ్చేసిందా అనిపిస్తోంది కదా..
పిల్లలు ఎదుగుతున్నారు. చదువులు, ఉద్యోగాలు, విదేశాలు, పెళ్లిళ్లు, వాళ్లకు పిల్లలు.. ఇవన్నీ చూస్తుంటే మనం ఎంత పెద్దవాళ్లమయ్యామో కదా.. ఈ వేదాంతం ఎందుకు కాని ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి. మామిడి పులుపు రుచి చూస్తుండగానే తీపి మామిడిపళ్లు కళ్లముందు ఊరిస్తున్నాయి. మల్లెలు గుబాళిస్తున్నాయి. ఆవకాయలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు మొదలయ్యాయి..
ప్రకృతిలోని అందాలను ఆస్వాదిద్దాం. కాలంతోపాటుగా వడివడిగా అడుగులేద్దాం.. సంతోషాలు, సుఖఃదుఖాలను, అన్నింటిని మోసుకుంటూ సాగిపోదాం..
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు విశేషాలు:
11. ఏది శాశ్వతం?
12. గోపమ్మ కథ – 7
13. పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!
15. విరించినై విరచించితిని – అడివి గీత
18. ఊహల హరివిల్లు
19. కార్టూన్స్ – CSK
రాసింది జ్యోతి at 00:08 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక పత్రిక
Thursday, 2 March 2023
మాలిక పత్రిక మార్చ్ 2023 సంచిక విడుదల
స్వాగతం సుస్వాగతం..
మరి కొద్దిరోజుల్లో తెలుగువారి కొత్త సంవత్సరానికి కూడా స్వాగతం పలుకుదాం.
చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
- బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
- ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
- వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
- చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
- పచ్చి మామిడి ముక్కలు- వగరు - కొత్త సవాళ్లు
- కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు
ఈ మధ్య కాలంలో ఎందరో ప్రముఖులను కోల్పోయాము. బాధగా ఉన్నా కాలం ఎవరికోసమో ఆగదు కదా.. నిరాశా, నిస్పృహలమధ్య కొత్త సంవత్సరంలో అంతా బాగుండాలనే ఆశ అందరికీ కలుగుతుంది. ఈ కొత్తసంవత్సరం మీ అందరికీ శుభం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
ఈ మాసపు మాలిక పత్రికలో ఎన్నో కథలు ఉన్నాయి.. అంతేకాదు వ్యాసాలు, కార్టూన్లు, కవితలు, సమీక్షలు కూడా మీ కోసం వచ్చాయి...
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
మార్చి నెల విశేషాలు ఇవే:
3. పరివర్తన
5. కాన్ఫిడెన్స్
7. జీవనవేదం - 7
10. అమ్మమ్మ – 44
13. ఉనికి
14. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్
16. సుందరము – సుమధురము – వ్రేపల్లియ ఎద జల్లున
17. బాలమాలిక కథ – అడవిలో ఉగాది
18. సృజనాత్మక చిత్ర కవిత్వమే నేరెళ్ల సృజనోదయం
19. విరించినై విరచించితిని – మంజుల ఘట్టమనేని
22. శిశిరం
23. దైవేచ్చ
24. ఆత్మీయత
25. ఆల్లెం గుండు
రాసింది జ్యోతి at 23:06 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక పత్రిక
Saturday, 4 February 2023
మాలిక పత్రిక ఫిబ్రవరి 2023 సంచిక విడుదల
పువ్వులు నవ్వులు, ఊసులు, సంతోషాలు, అభినందనలు... ఇలా ఎన్నింటికో ప్రతిరూపంగా భావిస్తాము మనం. సంవత్సరం పొడవునా ఏదో ఒక పువ్వు విరబూస్తూనే ఉంటుంది. ఎండా, వాన, చలి అంటూ అలసట చెందక అందంగా విరబూసి, చూసినవారికి ఆనందాన్ని ఇస్తాయి. లేదా భగవంతునికి సమర్పింపబడతాయి. తాత్కాలికమైన జీవనం కలిగి ఉండే పువ్వులు వీలైనంత సంతోషాన్ని ఇస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
కొద్దికాలంగా ఎందరో ప్రముఖ వ్యక్తులను ముఖ్యంగా సినీరంగానికి చెందినవారిని కోల్పోతున్నాము. మనకు బంధువులు కాకున్నా వారి చిత్రాలద్వారా కొంత అనుబంధం ఏర్పడిపోయింది. వయసు మీరినా, ఎప్పుడో ఒకప్పుడు అందరూ పోవాల్సినవారే అనుకున్నా కూడా వారు ఇక శాశ్వతంగా మన కంటికి కనపడరు, మాట్లాడరు అన్న విషయం మనకు చాలా బాధను కలిగిస్తుంది. ఇక బంధువులలో అంటే ఆ వేదన తీరనిది. కాని సృష్టి కార్యం అలా సాగిపోతూనే ఉంటుంది.
ఎందరో ప్రముఖ రచయితల రచనలతో మిమ్మల్ని ప్రతీనెల అలరిస్తోంది మీ మాలిక... 2020 మార్చి సంచికలో ప్రారంభమైన ప్రముఖ రచయిత్రి మన్నెం శారదగారి నవల 'చంద్రోదయం" ఈ నెలతో ముగుస్తోంది. మన్నెం శారదగారికి మాలిక పత్రిక తరఫున మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరొక ప్రముఖ కవి, రచయిత రామా చంద్రమౌళిగారి పుస్తకం లోపలి ఖాళి లోని కథలను ప్రతీ నెల ఒక్కొక్కటిగా మాలిక పత్రికలో ప్రచురించబడతాయి. ఈ మాసంలో మొదటి కథ మీరు చదవొచ్చు.
కవితలు, గజల్స్, వ్యాసాలు, కార్టూన్స్, కథలు, సీరియల్స్, సినిమా గురించిన విశేషాలతో కూడిన ఫిబ్రవరి నెల మాలిక పత్రిక మీకోసం ముస్తాబై వచ్చేసింది.
ఈ మాసపు విశేషాలు:
2. సుందరము – సుమధురము – 2 – అందెల రవమిది
3.ఆ కీర్తనల శృంగారం అతి గుంభనం – శోభారాజ్
4. కోకో
9.పరవశానికి పాత(ర) కథలు – చరిత్ర శిధిలం
11. అమ్మమ్మ – 43
12.కార్టూన్స్ – భోగా పురుషోత్తం
13. పువ్వుల వనము
రాసింది జ్యోతి at 14:28 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక పత్రిక


