ఇలా అనగానే మనకెదురుగా ఉన్నా వ్యక్తి అలాగే విగ్రహం లా నిలబడిపోవాలి. కంటి రెప్పలు కూడా కదల్చకూడదు. గుర్తుందా. ఈ ఆట ఒక సినిమాలో పాపులర్ ఐంది. ఒక స్కూలు అమ్మాయి ఓ సినిమా నటుడి పిచ్చిలో కనే కలలు కంటూ , అతనే తన జీవితం అనుకుంటుంది. సినిమా అనగానే అద్భుత ప్రపంచం. అందమైనది అనుకుంటారు చాలామంది.... కాని సినిమా వెనకున్న అసలు కథను చూపించే ఒక అత్యద్భుతమైన సినిమా "గుడ్డీ". జయాబాధురి నటించిన మొదటిసినిమా. ఆ చిత్ర విశేషాలు నవతరంగంలో .. అందులోని కొన్ని మరపురాని, మధురమైన పాటలు ఇక్కడ..
ఓటర్లకు , నాయకులకు ప్రాణం ఓటు మీకు, మాకు, అందరికి ప్రాణం ఓటు (O2)...
ఇంటిలోన పాలబిల్లు ఎంతో తెలీదంట ఓటడగా వెళ్లి నేర్పుగా పాలు పితికేరంట....
వందనోటు విడిపిస్తే ఏగాని మిగలదంట ఆ వందకే నెల సరుకులు ఎలా ఇచ్చేరంట...
నల్లచుక్క కనపడదు నాలుగు రోజుల్లో నాయకుడు కనపడదు నాలుగు ఏళ్లలో .....
మీట నొక్కేవరకు నీ కాల్మొక్త బాంచన్ మీట నోక్కేసాక నా కాల్మోక్కరా బద్మాష్..
కొద్ది కాలంగా జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్న వింతలు, విశేషాలు, మోసాలు, తమాషాలు, వేషాలు చూసి చిరాకేసి రాసుకున్న భావవ్యక్తీకరణ. అసలైతే ఇంతకంటే వందరెట్లు చిరాకుగా , కోపంగా ఉంది..
అదేంటో గాని ఈమధ్య జనాలకి నాజూకులు, స్టైళ్ళు ఎక్కువయ్యాయేమో అనిపిస్తుంది .. బంతి బోజనాలు అంటే అదో వింతలా మారిపోతుంది. నిలబడే తినడం సర్వసాధారణం ఐంది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్ హాళ్ళు అంటే సరే అనుకోవచ్చు. కాని ఇళ్ళలో చేసే చిన్న చిన్న పార్టీలకు కూడా కేటరింగ్, బఫే .. ఆ గృహస్తుకే ఓపిక, అతిథులకు కడుపారా కూర్చోబెట్టి వడ్డించాలనే కోరిక లేదు. డబ్బులున్నాయి. ఎవరు వడ్డిస్తారులే . అని వివిధరకాలు ఆర్డర్ ఇచ్చేసి అదే గొప్ప అనుకుంటారు. వచ్చినవాడు కట్నం ఇవ్వకపోతాడా. వాళ్ల ధోరణి చూస్తే అనిపిస్తుంది నాకైతే చచ్చినట్టు పెట్టింది తినక పోతాడా అని.కనీసం పాతిక మందికి కూడా స్వయంగా భోజనం తయారు చేయలేనప్పుడు అలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలి. ఈ రోజుల్లో సత్యనారాయణ వ్రతం, తద్దినాలకు కూడా క్యాటరింగ్ భోజనమే. అలా పిలిచి పెట్టకపోతే ఎవడన్నా తంతాడా. లేదే... పూజ చేసుకుని ఊరుకుంటే పోలా. కనీసం ఇలాంటి వాటికైనా కూర్చోబెట్టి వడ్డించే దిక్కు ఉండదు. అన్ని రకాలు చేయించాం, ఇన్ని రకాలు చేయించాం, అంత బిల్లు ఐంది , ఇంత బిల్లు ఐంది అని పైగా గొప్పలు..ఆ వచ్చినవాడు ఎన్ని తిట్టుకున్నాడో వీళ్ళకు తెలియదు. తెలిసినా.. ఆ ఈ రోజుల్లో ఎవరికీ వండి వడ్డించే ఓపిక ఉంది అంటారు మననే.. ఇలా ఎందుకు జరుగుతుంది. అంత వాళ్ళు వంగట్లేదా?? చేసేవాళ్ళు లేరు అంటారు.మనం వెళ్లి వేరేవాళ్ళకు సహాయపడితేనే కదా వాళ్ళు మనింటికొచ్చి చేసేది. హై క్లాస్ క్యాటరింగ్ నుండి రకరకాల వంటకాలు చేయించి , (ఆ సంస్థ వల్లే అతిథులకు వడ్డించి) అదే గృహస్తు ప్రేస్తీజ్ ఇష్యూ ఐంది. ఇదా అతిథి మర్యాద . మనకు గతిలేకా వాళ్ల ఇంటికి చచ్చి చెడి వెళ్ళేది..
ఇక తినేవాళ్ళు కొందరు మరీ సుతారం.. హాయిగా ఆంధ్రా భోజనం కూడా, అదీ తెలుగు దేశం (పార్టీ కాదండోయ్) లో ఉంది ఇంచక్కా చేతులతో తినక స్పూన్లతో నాజూగా తింటారు. చేతులు మనవే, తినేది మనమే, మన చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో మనకు తెలుసు ( వంటకాల సంగతి ఎలాగూ తెలియుడు), మరి స్పూనుతో తినడమేంటి? ఏదో ఇడ్లీ, వడ అంటే ఒకే. స్వీట్లు, అన్నం, పప్పు,కూరగాయలు, అన్నీ స్పూనుతో కష్టపడి తింటారు. మరి వాళ్ల ఇంట్లో ఎలా తింటారో రోజూ.. మరి పూరీలు ఎలా తింటారో అని నా అనుమానం. ఇక హోటళ్ళలో కూడా స్పూన్ల గోల. చేత్తో తింటే అవమానం. హై క్లాస్ ,బిజినెస్ పార్టీ అంటే ఒకే. మామూలుగా వెళ్ళినా అంతేనా. చికెన్ ముక్కను ఎంత కష్టపడి చాకు, ముళ్ళ చెంచాతో ముక్కలు చేసి తింటారో చూస్తుంటే నవ్వాగదు. కాస్త గట్టిగా అంటే పక్క టేబిల్ వాడి మీద పడొచ్చు. ఆ జాగ్రత్త మరోటి. భారత దేశంలో ఉన్నవాళ్ళందరికీ తెలుసు చేతులతోనే తింటారు అని. మరి ఈ తిప్పలేంటి జనాలకు. ఏమో బాబు నాకైతే ఎంచక్కా చిన్న చిన్న పార్తీలకైతే వండి వడ్డించడం లోనే తృప్తి. ఎవరు తిన్నారు, ఎవరు తినలేదు అన్నది తెలుస్తూంది.హాయిగా మాట్లాడుకుంటూ కూర్చుని తినొచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలంటే బఫే అంటేనే చిరాకేస్తుంది.కళ్ళముందు ఎన్నో వంటకాలు, తినాలని మనసౌతుంది. ప్లేట్లో ఎన్నని పెట్టుకుంటాము. ప్లేటును బ్యాలన్సు చేసుకుంటూ నిలబడాలి. కాళ్ళు పీక్కుపోతాయి.ఎవరితోనన్నా మాట్లాడుతూ చేయి తగిలితే , ఆ వంటకాల రుచి మన బట్టలకు కూడా చూపించాల్సి వస్తూంది. ( ఎపుడు ఇంటికెళ్ళి కడిగేద్దామా అనే టెన్షన్ మరోటి) . ఆ కార్యక్రమం పూర్తీ చేసి ఇంటికొచ్చాక ఏదో పెద్ద బరువు దింపుకున్నట్టే. తెల్లారి బావుంటే సరే. లేదా గోవిందం , భజగోవిందం..
" రాజుగారు !! బావున్నారా??" "ఓ! పేరయ్యగారా ! రండి రండి!!. ఎలా ఉన్నారు? మీ వృత్తి ఎలా ఉంది ?సీజన్ కదా ఫుల్ బిజీ అనుకుంటా?" " ఏం బిజీ అండి ! అదేంటొ! ఈ మధ్య ఎవరూ నన్ను పిలవడం లేదు. నేనే వెళ్లి అడిగినా మొహం చిరాగ్గా పెట్టి తర్వాత రండి అంటున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. ఏమైందో అర్ధం కావట్లేదు. శని నా నెత్తిన కూర్చున్నట్టుంది " " పేరయ్యగారు! మీ సమస్య నాకు అర్ధమైందండి. సమాధానం చెప్పమంటారా?? " చెప్పండి బాబు. పుణ్యముంటుంది." " అదేం లేదండి. ఒక్కసారి మీ మొహాన్ని అద్దంలో చూసుకోండీ. ఆ మాసిన గడ్డం అది.. అలా ఉంటే చూసేవాల్లకు చికాకు , నీరసం కలగదా?? మీరు ఈ బ్లేడ్ తీసుకుని షేవ్ చేసుకుని మీ పనులు చేసుకోండి. తేడా మీకే తెలుస్తుంది." "నిజమేనండి. ధన్యవాదాలు." ఇలా ఒక మగాడి అందానికి, అతని వృత్తికి, పెళ్లి కాకపోవడానికి, గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడానికి, బిజినెస్ అభివృద్ధి కాకపోవడానికి ఆ వ్యక్తి గడ్డం చేసుకోకపోవడమే కారణం. ఆ కంపెనీ బ్లేడ్ వాడి గడ్డం గీసుకుంటేనే అందంగా ఉంటారంట. ఈ ప్రకటన రోజూ రేడియోలో వింటూ ఉంటే నాకు చిరాకేస్తుంది. మరీ ఇంత పిచ్చి ఐడియాలా.. అసలు ఈ వ్యాపార ప్రకటనలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయనిపిస్తుంది. టీవీలో కూడా కార్యక్రమాల మధ్య వ్యాపార ప్రకటనలు అనే బదులు, ప్రకటనల మధ్య కార్యక్రమాలు అనవచ్చు. నూటికో కోటికో ఒక్కటి చాలా అర్ధవంతంగా మరిచిపోలేనిదిగా ఉంటుంది. ఒక షర్ట్ కొంటే రెండు ఫ్రీ. రెండు కొంటే ఐదు తీసికెళ్లండి అనే ప్రకటనలు ఎక్కువయ్యాయి. అది చూసి చదువుకున్నవారు కూడ పరిగెత్తుతున్నారు. వాటి ధరలు, నాణ్యత పరీక్షిస్తున్నారా అంటే తక్కువే అనిపిస్తుంది. కొన్ని ప్రకటనలు చూస్తే అబ్బా!! ఎంతా బాగా చేసారు కదా అనిపిస్తుంది. కొన్ని చూస్తే కోపం, అసహనం ఒక్కోసారి ఏమనాలో కూడా తెలీదు. ప్రతి దుకాణం వాడు ఎప్పుడూ ఏదో ఒక సేల్. ఆ పండగ , ఈ పండగ అని సంవత్సరమంతా సేల్ పెడుతుంటారు.
చాలా ఏళ్ల క్రింద ప్రకటనలు తక్కువగా ఉండేవి. రేడియో , పత్రికలు తప్ప వేరే ప్రచార సాధనం లేదు. ఐనా కొన్ని కంపెనీలు, వస్తువుల ప్రకటనలు జనాల మనసునుండి చెరిగిపోకుండా ఉంటాయి.
"ఏమయింది ?" " పాప ఏడ్చింది" "ఐతే వుడ్‌వర్డ్స్ పట్టమని వాళ్ల అమ్మతో చెప్పు.నీకు నేను అదే పట్టేదాన్ని"
ఈ ప్రకటన గుర్తుంది. అమ్మమ్మ, తల్లి, కూతురు , మనవరాలు . నాలుగు తరాలను ప్రతిభింభిస్తూ ఉండే గ్రైప్ వాటర్ ప్రకటన. పసిపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఆ గ్రైప్ వాటర్ ఉండేది .. బుగ్గన వేలేసుకున్న బొద్దుగా ఉండే బాబు గుర్తున్నాడా. ఆ బాబుకు ఒక కంపెనీకి అవినాభావ సంబంధముంది. అదే మర్ఫీ. అప్పట్లో రేడియోలు కంప్యూటర్ మానిటర్ అంత, ట్రాన్సిస్టర్లు లాప్ టాప్ అంత సైజులో ఉండేవి. రేడియో అంటే మర్ఫీనే అన్నట్టుగా ఉండేది. ఇక హెచ్ఎంవి కంపెనీ. అప్పుడు సిడిలు గట్రా లేవుగా. ఎల్.పి రికార్డులే. కుక్కపిల్ల ముందు ఆ రికార్డ్ ప్లేయర్ తిరుగుతూ ఉంటుంది. అలా కొన్ని ప్రకటనల చిహ్నాలు ఇప్పటికీ గుర్తున్నాయి.. ఇక లక్స్ అంటే సినిమా తారలు మాత్రమే వాడే సబ్బు అని ఒక ముద్ర పడిపోయింది. అది వాడితే అందంగా ఐపోతారనే ఆశ పెడతారు ఆ కంపెనీ వాళ్లు. ప్రతి తల్లి తన బిడ్డ అముల్ బేబీలా ఉండాలని అనుకుంటుంది కదా.. పైన ఇచ్చినవి సుమారు నలభై ఏళ్ల క్రిందటి వ్యాపార ప్రకటనలు..
మీకు నచ్చిన , నచ్చని ప్రకటనలు ఉన్నాయా ??? నాటివి , నేటివి.. ఏవైనా???
చాలు ఇక ఈ గొడవలు.. చిలికి చిలికి గాలివానలు అయ్యాయి. బ్లాగ్ లోకం లో అల్లకల్లోలం సృష్టించాలనుకున్నవారు చాలా వరకు కృతకృత్యులు అయ్యారనుకోవచ్చు. ఐనా చల్లారింది అనుకున్న నిప్పును రావుగారు మళ్లీ ఎగదోస్తున్నారు. రావుగారికి ప్రమదావనం తరఫున, నా తరఫున ఒక అభ్యర్ధన.. ప్లీజ్ ఈ విషయాలు ఇక ప్రస్తావించొద్దు. బ్లాగులు మూసేసినా మళ్లీ తెరిచారు.ప్రమదలు అందరూ బావున్నారు. ఎవరి పని మీద వాళ్లు బిజీగా ఉన్నారు. ఇక్కడ ధూమ్, కాగడా, వారివెనక ఉన్న స్త్రీ మూర్తి ఎవరో కాని వదిలేయండి. ఎవరి పాపాన వారు పోతారు. e తెలుగు సమావేశంలో మీరు చెప్పిన విషయాలు తప్ప వేరే చర్చ జరగలేదా. అవి చెప్పండి .. అనవసరమైన విషయాలు ఎందుకు?? దానివల్ల సాధించేదేమీ లేదు... మహిళా బ్లాగర్ల మీద అంత అభిమానం ఉంటే మీ పాత టపాల్లో మా మీద రాసిన చెత్త కామెంట్లు ఎందుకుంచుకున్నారు. తీసెయలేదేంటి. ఇక నా బ్లాగులో పెట్టిన disclaimer గురించి కూడా పోస్ట్ రాయాల్సిన అవసరమేంటి ? మనం స్నేహితులమా కానే కాదు. కో బ్లాగర్స్ మాత్రమే. నావల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది నాతో డైరెక్టుగా చెప్పండి. నా మీద అపోహలు, సందేహాలు, ఆరోపణలు ఉంటే నిస్సంకోచంగా నాకు మెయిల్ చేయండి. నేను తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ విషయం ధూమ్, కాగడా బ్లాగర్లకు కూడా నా బ్లాగు ముఖంగా చెప్పాను. దయచేసి మహిళా బ్లాగర్లు, ప్రమదావనం సంగతులు వదిలేసి ఎవరి పని వారు చేసుకోండి. ప్రమదావనంలో బలవంతంగా ఎవరిని పట్టుకోలేదు. ఇష్టమున్నవాళ్లు ఉంటారు , లేని వాళ్లు వెళ్లి పోతారు. ప్రమదావనం నుండి వెళ్ళిపోయిన వారు కూడా ఈ చెత్త రాతలవల్ల బాధపడి. ఇప్పటికైనా ఆపండి. ఇంతకుముందులా ఎవరి బ్లాగులు వాళ్లు రాసుకోండి.
ఎప్పుడు కూడా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా .. అన్నట్టు కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ఉండాలి. అప్పుడే నూతనోత్సాహం కలుగుతుంది. బోర్ గా ఉంది. ఏదైనా ప్రత్యేకంగా చేద్దామర్రా అని పది రోజుల క్రింద ప్రమదావనం లో చర్చ మొదలైంది. సరే సై అంటే సై అని కొందరు మహిళా బ్లాగర్లు కలిసి ఒకే అంశంపై రాసి ఒకే రోజు టపాయిద్దాం అని నిర్ణయించడం జరిగింది. మధురమైన పాటలంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అందునా కొన్ని పాటలు చాలా చాలా ఇష్టమైనవి, మన స్మృతిలో ఎప్పటికి నిలిచిపోయేవి తప్పక ఉంటాయి. అలాంటి పాటలతో సందడి చేద్దామనుకున్నాం. దానికోసం ఏప్రిల్ 10 ఖరారు అయ్యింది. ఎవరు ఈ పాట రాస్తున్నారో , నిన్నటి వరకు తెలీదు. అయినా అందరి పాటలు విభిన్నంగా ఉన్నాయి. ఉదయం తొమ్మిది నుండి అర్ధరాత్రి వరకు వివిధ దేశాలలో ఉన్న మహిళా బ్లాగర్లు ఈ సందడిలో పాల్గొన్నారు. ఇక ఈ పాటల సందడి లోని ఆణిముత్యాలు అన్నీ ఒక్కచోట..
ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న వారందరికీ అభినందనలు.... ఈ కార్యక్రమం ఏదో సాధించాలని కాదు, ఏదో గొప్పలు చూపించుకోవాలని కాదు. అప్పుడప్పుడు ఇలా చేయడాం మాకు అలవాటే .ఇంతకూ ముందు ఒకసారి ఇలాగే చేసాము. గుర్తుండే ఉంటుంది.. వచ్చేసారి ఎపుడో .. ????
బాబుల్ కి దువాయే లేతీ జా జా తుజ్‌కో సుఖీ సంసార్ మిలే మైయ్‌కే కి కభీ నా యాద్ ఆయే ససురాల్ మే ఇత్నా ప్యార్ మిలే
బాబుల్ కి దువాయే
బీతే తేరే జీవన్ కి ఘడియాన్ ఆరామ్ కి థండీ చావ్ మే కాంటా భి న చుప్ నే పాయీ కభీ మేరి లాడ్లి తేరే పావ్ మే ఉస్ ద్వార్ సే భీ ధుఖ దూర్ రహే జిస్ ద్వార్ సే తేరా ద్వార్ మిలే
బాబుల్ కి దువాయే
నాజోన్ సే తుఝే పాలా మైనే కలియోన్ కి తరహ్ ఫూలోన్ కి తరహ బచ్పన్ మే ఝులాయా హై తుజ్‌కో బాహోన్ నె మేరీ ఝూలోన్ కి తరహ మేరే భాగ్ కి ఏయ్ నాజూక్ ఢాలి తుజే హర్ పల్ నయీ బహార్ మిలే
బాబుల్ కి దువాయే
జిస్ ఘర్ సె బంధే హై భాగ్ తెరే ఉస్ ఘర్ మే సదా తేరా రాజ్ రహే హోంటోన్ పే హసీ కి ధూప్ ఖిలే మాథే పే ఖుషీ కా తాజ్ రహే కభీ జిస్ కి జ్యోత్ న హో ఫీకీ తుఝే ఐసా రూప్ షింగార్ మిలే
బాబుల్ కి దువాయే
చిత్రం : నీల్ కమల్ గానం : రఫీ
ఆడపిల్ల ఎప్పుడూ ఆడపిల్లే. ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందని తెలిసినా, ప్రతి తల్లితండ్రి ఎంతో ప్రేమతో పెంచుతారు. చిన్నప్పటినుండి ఆ చిట్టి తల్లికి కావలసినవి కొనిచ్చి ఏ కష్టమూ రాకుండా. కాపాడుకుంటూ వస్తారు. ఆమెను తమలా కాక తమకంటే ఎక్కువ ప్రేమతో చూసుకునే అబ్బాయికోసం వెతికి వెతికి పెళ్లి చేస్తారు. ఎంతో సంతోషంగా సకల కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి, చివరకు ఆమెను అల్లుడు అతని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టి తమ కూతురిలా చూసుకొని, తప్పులుంటే మన్నించమని కన్నీళ్లతో వేడుకుంటారు. అలాంటిదే ఈ పాట. పాటలోని ప్రతి అక్షరం ప్రతి ఆడపిల్లను, ఆడపిల్లలున్న తల్లితండ్రులను కదిలిస్తుంది. మామూలుగా ఆడపిల్లకు అమ్మ దగ్గర ఎక్కువ చనువు ఉంటుంది. నాన్న దగ్గర ప్రేమ ఉన్నా, భయం కూడా ఉంటుంది. కాని ప్రతి తండ్రి, తన కూతురిని ప్రేమిస్తాడు కాని వ్యక్తపరచలేదు. ఆమెను సరైన వ్యక్తి చేతిలో పెట్టాలని ప్రయత్నిస్తాడు. అప్పగించేటపుడు కూడా ఎంతో బాధపడతాడు. అమ్మ ఏడుస్తుంది కాని నాన్న మనసులోనే ఏడుస్తాడు.
పుట్టింటి దీవెనలతో వెళ్లు తల్లీ, సుఖంగా ఉండు. పుట్టింటివారు కూడా జ్ఞాపకం రానంతగా నీకు అత్తారింట ప్రేమ దొరకాలి. కష్టాలు నీ తలుపు దాటి కూడా రాకూడదు. నిన్ను ఒక పువ్వులా నాజూగ్గా పెంచుకున్నాము. మా చేతుల్లో అల్లరుముద్దుగా చూసుకున్నాము. నీ జీవితంలో ఎప్పుడూ వసంతం ఉండాలి. నీ జీవిత భాగ్యం ఎక్కడుందో అక్కడ నీవు ఎప్పుడూ మహారాణిలా రాజ్యం చేయాలి. పెదవులపై చెరగని చిరునవ్వు ఉండాలి. .. ఇలా ఎన్నో మాటలు చెప్పి పంపిస్తారు కూతురిని. అందునా రఫీ పాడిన ఈ పాట విన్నప్రతిసారి కంట నీరొలికించక మానదు. ప్రతి పెళ్లి క్యాసెట్ లో సీతారాముల కల్యాణము చూతము రారండి అన్న పాట ఉన్నట్టే , అప్పగింతలప్పుడు ఈ పాట తప్పకుండా ఉంటుంది. పెళ్లి అయిన కూతుళ్లు, పెళ్లి కాని కూతుళ్లు, ఇంకా పసిపాపలు ఉన్న ప్రతి తల్లి తండ్రులను కదిలిస్తుంది ఈ పాట.