Tuesday 20 November 2007

స్నేహం - ఒక అనుబంధం




స్నేహం ఒక బంధం. ఒక నమ్మకం . దానికి వయసు తేడా గానీ, ఆడామగా తేడాగానీ లేదు. నిజమైనా స్నేహితులు ఉండడం మన అదృష్టం. స్నేహితులు కష్టసుఖాలలో తోడుంటారు. ఎంత కఠినమైన సమస్య వచ్చినా , బాధకలిగిన , సంతోషం కలిగినా ముందుగా మనం మన స్నేహితులతో పంచుకోవాలనుకుంటాము. లేకుంటే మనస్సుకు తృప్తి కలగదు. బాధలో మన స్నేహితునితో కొద్దిసేపు మాట్లాడినా (ఏవిషయమైనా) మన బాధ యొక్క తీవ్రత కాస్త తగ్గుతుంది. సంతోషమైతే పెరుగుతుంది. మనకు చాలా టెన్షన్స్ ఉన్నప్పుడు ఒక్కసారి స్నేహితులతో మాట్లాడితే చాలు ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్నేహితుడు మనకు డబ్బు సాయం చేయనవసరంలేదు. తన మాట సాయం మాత్రమే విచిత్రాలు చేస్తుంది.

మనకు కాస్త దగ్గరైన స్నేహితులు మనల్ని మనకంటే ఎక్కువగా చదవగలరు. మనము ఏ విషయమైనా ఎంత దాచాలని ప్రయత్నించినా ఇట్టే పసిగట్టేస్తారు. మన మూడ్‌ని మార్చేస్తారు. ఏ సాయమైనా చేయడానికి వెనుకాడరు. మనచుట్టూ ఎంత మంది బంధువులున్నా, ఒక్క మంచి స్నేహితుడు లేకపోవడం చాలా లోటు. మన మంచి కోరే ఒక నిజమైన స్నేహితుడు ఉండడం నిజంగా మన అదృష్టం. ఎన్ని కోట్లున్నా ఒక మంచి స్నేహితుడు లేకుంటే వాడు బికారి అని నా అభిప్రాయం. ఆ స్నేహితుడు మనల్ని పూర్తిగా అర్ధం చేసుకుంటాడు. తప్పు చేసినా ఒప్పు చేసినా నిలదీసి అడిగే అధికారం అతనికుంటుంది. స్నేహితుల మధ్య వ్యాపార ధోరణి ఉండదు. నువ్వు నాకేం ఇచ్చావ్, నేను నీకేమివ్వాలి అనే ఆలోచన ఉండదు. ఎప్పుడూ అతనికి ఏమివ్వాలి అనే తప్ప వేరే ఊహ రాదు అస్సలు.

కాని ఈ స్నేహం కూడా పెడదారులు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న అమ్మాయిలు , అబ్బాయిలు. చదువుకున్నవారు కాబట్టి స్నేహం , ఆకర్షణ మధ్య తేడా గమనించి మసలుకోవాలి. ఈ స్నేహం అన్నది చాల విచిత్రాలు చేస్తుంది. మనిషి మనిషికి మధ్య స్నేహం అనేది తప్పక ఉండాలి. భార్యాభర్తలైనా, తల్లితండ్రులు పిల్లల మధ్యనైనా ఎవరైనా సరే స్నేహం అనేది ఎప్పటికి ఉండాలి. అప్పుడే ఒకరినొకరు అర్ధం చేసుకోగలరు, మనస్పర్ధలకు తావు ఉండదు, ఒకవేళ ఉన్నా సూటిగా మాట్లాడి తొలగించుకోవచ్చు.

నేను చెప్పిందంతా పుస్తకాలలో చదివిందో , సినిమాలలో చూసిందో కాదు, నా స్వంత అనుభవముతో తెలుసుకున్నది. నన్ను నన్నుగా గౌరవించి, ప్రోత్సహించి, బాధలో ఉన్నప్పుడు నవ్వించే మంచి స్నేహితులను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్నేహితులకు అక్క,అన్న,తమ్ముడు,పెద్ద, చిన్న అన్న తరతమ బేధాలు ఉండవు. మనం ఒక వ్యక్తిని స్నేహితుడి/రాలిగా భావించామంటే అది ఒక అనుబంధానికి ప్రారంభం చేసామన్నమాటే. ఆ అనుబంధం ఇద్దరూ ఎప్పటికి నిలబెట్టుకోవాలి.

6 వ్యాఖ్యలు:

Anonymous

meeru marinni manobhavalu raayandi.

pls use 'manalni' instead of 'mananu'.

i don't have account , so i can not login.

best regards,
jitendra

Anonymous

jyothi garu,

I am a great fan of your blog. never before, but today there are some spelling mistakes in ur blog.

WHY?

best regards,
jitendra

జ్యోతి

సారీ జితేంద్రగారు, తప్పులు సరిదిద్దాను. మళ్ళీ ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను.

రాధిక

మంచి వ్యాసం.

Anonymous

జ్యోతి గారు, మీరు చెప్పింది అక్శరాలా నిజం. నిజమైన మిత్రుడు లేనివాడి జీవితం వ్యర్ధం. నేను ఇక్కడ అమెరికా వచ్చిన కొత్తలో ఎంతో వంటరితనం అనుభవించాను. అప్పుడు కలిగిన డిప్రెషన్, నిరాశ ఇవన్ని కూడా నా మిత్రులు పోగొట్టారు. ఒక్కసారి మన ప్రియ మిత్రులతో మాట్లాడితే చాలు..బాధలు అన్ని మర్చిపోవచ్చు.

పావనీలత (Pavani Latha)

జ్యోతి గారూ...
కష్టాలలో ఉన్నప్పుడు,నేనున్నాననే ధైర్యం ఎంతో గొప్పది,ఒక్క స్నేహితుడు మాత్రమే నిస్వార్ధంగా మనకోసం ఏదయినా చేస్తాడు,ఇదంతా ఇంత చక్కగా రాసిన మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను.
మీనుంచి ఇంకా ఎన్నో "మనోభావాల"ను ఆశిస్తూ...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008