Saturday 29 December 2007

నాకు నచ్చిన పాట...

చౌద్వీన్ కా చాంద్


నాకు చిన్నప్పటినుండి పాటలు ఇష్టమే.కాని ప్రత్యేకంగా ఒకటని లేదు. కాని ఇంటర్‌లో ఉండగా నా స్నేహితురాలు రఫీ పాటల క్యాసెట్ ఇచ్చింది వినమని. ఈ పాట వినగానే ఎందుకో చాలా నచ్చింది. సంగీతం కానీ, సాహిత్యం కానీ మనసుకు హత్తుకున్నాయి. అందులో పదాలు అర్ధం కాకున్నా చాలా మంచి సాహిత్యం అని అప్పుడే అనుకున్నా. తర్వాత మా నాన్నతో చెప్పి రఫీ పాటల క్యాసెట్ తెప్పించుకుని వినేదాన్ని.అప్పట్లో LP రికార్డులు ఎక్కువ. అలా రఫీ పాటలంటే చెవి కోసుకునేదాన్ని అప్పటినుండీ. ఎవరిదగ్గరున్నా తెచ్చుకుని రికార్డ్ చేసుకోవడం. కాని ఈ పాట మాత్రం నాకు ప్రాణం. నిజంగా ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో వహీదా ఎంత అందంగా, ముద్దుగా ఉందో.

చౌద్వీన్ కా చాంద్ హో, యా ఆఫ్తాబ్ హో
జో భి హో తుమ్ ఖుదా కి కసం, లాజవాబ్ హో - 2

జుల్ఫే హై జైసె కాంధో పె బాదల్ ఝుకే హుయే
ఆంఖేన్ హైన్ జైసె మెకే ప్యాలే భరె హుయే
మస్తి హై జిస్‌మె ప్యార్ కి తుం వో షరాబ్ హో
చౌద్వీన్ కా చాంద్ హో ...

చెహ్రా హై జైసే ఝీల్ మే ఖిల్తా హువా కన్వల్
యా జిందగి కే సాజ్ పె చేడీ హుయీ ఘజల్
జానే బహార్ తుమ్ కిసి షాయర్ కా ఖ్వాబ్ హో
చౌద్వీన్ ఖా చాంద్ హో ...

హోఠొన్ పే ఖేల్‌తీ హైన్ తబస్సుమ్ కి బిజ్లియాన్
సజ్‌దే తుమ్హారి రాహ్ మె కర్‌తీ హైన్ ఖైకషాన్
దునియా-ఏ-హుస్నో-ఇష్క్ కి తుమ్ హీ షబాబ్ హో
చౌద్వీన్ కా చాంద్ హో ...



4 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

"సాహిత్యం కానీ మనసుకు హత్తుకున్నాయి" అని చదివి మీకు ఉర్దూ బాగా వచ్చేమో అనుకున్నా.
తీరా .. తరువాతి వాక్యంలోనే ..
"పదాలు అర్ధం కాకున్నా చాలా మంచి సాహిత్యం అని అప్పుడే అనుకున్నా"
అంటే?? సాహిత్యం అర్ధం కాకపోయినా సంగీతం వల్లనో, గాయకుల గొంతు మార్దవం వల్లనో, ఆయా గాయకుల మీది అభిమానం వల్లనో పాట నచ్చిండనుకోవచ్చు .. కానీ పదాలు అర్ధం కాకుండా మంచి సాహిత్యం అని ఎలా అనిపిస్తుంది?
వింటున్నాం గదా అని మరీ ఇలా చెవుల్లో పూలు పెడితే ఎలా?

జ్యోతి

ఎవరి చెవుల్లోనో పూవులు పెట్టల్సిన ఖర్మ నాకేంటండి. ఇంచక్కా నా తల్లోనే పెట్టుకుంటాగాని. ఐనా ఒక పాట బాగా నచ్చిందని గాయకుడి స్వరమాధుర్యుం, సాంగీతం,సాహిత్యం మొదలైనవి క్షుణ్ణంగా తెలుసుకుని మరీ చెప్పాలా కొత్తపాళిగారు.అవును అందులో కొన్ని ఉర్దూ పదాల అర్ధాలు తెలీవు. ఐనా ఈ పాట సాహిత్యం నేను ఆ పాట వింటూ రాసింది.

కొత్త పాళీ

తల్లో కాపోతే కొప్పులో పెట్టుకోండి .. మరీ ముచ్చటైతే పూలజడేయించుకోండి .. మాదేం పోయింది? మీరు పాట సాహిత్యం రాసినందుకు నేనేమనలా. అందులో తప్పులెదకటానికి ముందు నాకు ఉర్దూ వచ్చి ఛస్తేగా? నేను అన్నదల్లా పదాలు అర్ధం కాకుండా మంచి సాహిత్యం (మంఛి పాట కాదు, మంచి సాహిత్యం) అని ఎలా అర్ధమయ్యింది?

కొత్త పాళీ

ఓహో ..కోకిలకి చిలకసాక్ష్యమా? బాగుంది :)
అయ్యా "చిలక"పాటి గారు, I heard Rafi, I heard Kokila. Believe me, Rafi ain't no Kokila!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008