Saturday 26 July 2008

తెలుగు బ్లాగర్ల ఫ్రెషర్స్ డే...

రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు కూడలి కబుర్లలో బ్లాగర్ల ఫ్రెషర్స్ ఢే ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి జూనియర్, సీనియర్ బ్లాగర్లందరికీ ఇదే ఆహ్వానం. ఇక్కడ జూనియర్లు అంటే బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టి ఆరు నెలలు దాటనివారు, ఆ తర్వాత మీరు సీనియర్లు. ఒకే. ఇప్పటిదాకా బ్లాగింగులో రాగింగ్ జరిగింది అంటున్నారు కదా. ఇక ఫ్రెషర్స్ ఢే జరుపుకుందామా??.

ముందుగా నా మాట..

ఇక్కడ బ్లాగర్లను కొత్త పాత అని గాని, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని గాని, ఒకరిని మెచ్చుకుని ఇంకొకరిని తిట్టడం అని గాని, లేదా కొత్త వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారు. అని కాని ఎవ్వరూ అనుకోవద్దు. అలాంటి భావనలు ఎవ్వరికీ లేవు. బ్లాగులో రాసే విషయాన్ని బట్టి చదువరులు ఆ బ్లాగుకు వస్తారు, వ్యాఖ్యలు రాస్తారు. కొత్త వాళ్లకు కొంచం అలవాటు కావాలి అంటే. ఇంకా నయం. రెండేళ్ళ క్రింద నేను బ్లాగింగు మొదలెట్టినప్పుడు ఇన్ని వసతులు, సులువైన పద్ధతులు, చదువరులు లేరు. ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాము. ఇప్పటి వాళ్లకు అంతా వడ్డించిన విస్తరే. పత్రికలలో వచ్చే వ్యాసాలూ, కూడలి, కబుర్లు, సాంకేతిక సహాయం ఇలా ఎన్నో సదుపాయాలు. ఇక కొత్త వాళ్లకు ఎటువంటి సందేహమైనా, సమస్య అయినా నిస్సంకోచంగా తెలుగుబ్లాగు గుంపులో అడగవచ్చు. మీకు సమాధానం తప్పక దొరుకుతుంది. ఇక బ్లాగు ఎలా ఉండాలి. ఎలా రాయాలి అనే విషయం మీద సూర్యప్రకాశం గారు చాల విలువైన సమాచారం ఇచ్చారు.


జూనియర్లకు విజ్ఞప్తి .

కొత్తగా బ్లాగింగు మొదలెట్టిన వారందరికీ ఇదే సాదర ఆహ్వానం. కూడలి కబుర్లకి రండి. మాట్లాడుకుందాం. మీకు ఎటువంటి సందేహమైనా, లేదా సీనియర్ బ్లాగుల మీద ఎటువంటి అనుమానం ఉన్నా అడగొచ్చు. మేము అంత చెడ్డవాల్లము కాము అని మీరే తెలుసుకుంటారు. ఇక్కడా అందరూ ఒక కుటుంబం లా ఉంటున్నారు. కొత్తవాల్లైన, పాతవాల్లైనా అందరిని కలిపి ఉంచేది తెలుగు మీది అభిమానం మాత్రమే. వేరే ఎటువంటి బేధాలు లేవు..

సీనియర్లకు విజ్ఞప్తి.

రేపు సాయంత్రం మీరందరూ కూడలి కబుర్లకి వచ్చేయండి. కాస్సేపు ముచ్చట్లాడుకుందాము. కుల ప్రాతిపాదిక మీద వస్తున్నా బ్లాగులు, కాపీ బ్లాగులు, కూడలిలో కనపడాలని పదే పదే టపాలను పబ్లిష్ చేస్తున్న బ్లాగులు వీటన్నింటి గురించి చర్చింకోవచ్చు..

వేదిక : కూడలి కబుర్లు
సమయం: ఆదివారం. సాయంత్రం. ఆరు గంటలు. IST

3 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

ఈ ఫ్రెషర్స్ డే ఎన్ని నెల్లకోసారి చేస్తారు? ఎప్పటికప్పుడూ కొత్త బ్లాగులూ, బ్లాగర్లూ పుట్టుకొస్తూనే ఉంటారు గదా?

జ్యోతి

కొత్తపాళీగారు,

చూద్దాం. అవసరమనుకున్నపుడు కొత్త బ్లాగర్లు ఎక్కువైనప్పుడు , కనీసం మూడు నెల్లకో, ఆరునెల్లకో ఒకసారి ఇలా జరుపుకుందాము. కొత్తవాళ్ళకు ఎన్నో సందేహాలు ఉంటాయి కదా??

Rajendra Devarapalli

మంచి ప్రయత్నమండి,అభినందనలు.ర్యాగింగ్ చేస్తారనో/చేస్తాననో నేను రావట్లేదు :)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008