Wednesday 3 September 2008

దండాలయ్యా ఉండ్రాలయ్యా!!



నిండుగ మా ఇంట కొలువైన గణనాధుడు ..



కొండంత దేవుడికి కాసింత పత్రి.(నాకు తెలిసినవి - బిల్వపత్రం,గరిక, ఉత్తరేణి, మామిడి ఆకు, తులసి, గన్నేరు, దానిమ్మ,వావిలాకు, జాజి ఆకు,, జమ్మి, జిల్లేడు ఆకు, వెలగకాయ,సీతాఫలము, మారేడు కాయ).


మహానివేదన : చింతకాయ పులిహోర, దధ్యోజనం,పరమాన్నం, పెసలు,తాలికల పాయసం, పుట్నాలపప్పు లడ్డూలు, ఉండ్రాళ్ళు.

11 వ్యాఖ్యలు:

విహారి(KBL)

మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

Shiva Bandaru

బావున్నాయి . చవితి శుభాకాంక్షలు

చిలమకూరు విజయమోహన్

వినాయక చవితి శుభాకాంక్షలు

Purnima

మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

వికటకవి

వినాయక చవితి శుభాకాంక్షలు. తాలికల పాయసం అంటే?

జ్యోతి

తాలికలు అంటే నూడుల్స్ లాంటివి. గోధుమపిండిని చపాతీ పిండిలా తడిపి దానితో నూడుల్స్‌లా చేసుకుని వాటిని నీటిలో కాని, పాలలో కాని ఉడికించి చక్కెర లేదా బెల్లం వేసి ఉడికిస్తారు. మా చిన్నప్పుడు సేమ్యాకూడా తెలీదు. ఎండాకాలంలో మరపట్టించిన గోధుమ పిండితో ఇంట్లోనే చెసుకునేవాళ్ళం.దానికోసం ఒక చిన్న మిషనులాంటిది ఉంటుంది. దానితో సేమ్యా లేదా సేవెలు చేసుకుని ఎండబెట్టేది. కావలసినప్పుడు వండుకోవచ్చు.

చదువరి

వీటిని మేం పాలతాలికలు అంటాం. (పిల్లకాయలు) పాముల పాశం అనీ అంటారు.

సుజాత వేల్పూరి

అవును, మేమూ వీటిని పాలతాలికలు అనే అంటాము. బియ్యప్పిండితో చేస్తారు ఇవి మా వైపు. మా ఇంట్లో కాదు గానీ మా స్నేహితుల ఇళ్ళల్లో తిని 'భలే ఉన్నాయి, చెయ్యమ్మా ' అంటే మా అమ్మ 'ఇవి మనం చేసుకోము,' అని దానికి కూడా 'టాగు ' తగిలించేది. ఒకసారి లక్ష్మీ పార్వతి గారు(మిసెస్ ఎన్ టీ ఆర్) చేస్తే తిన్నాము వాళ్ళింట్లో!

వికటకవి

సుజాత గారు,

చేతులు కాల్చుకున్న అనుభవంతో అడుగుతున్నా. బియ్యప్పిండితో అసంభవమేమో? ఆ పిండికి అంత జిగురెక్కడిది? ఏ మైదాపిండో, గోధుమపిండో కలపాల్సిందే.

దైవానిక

అవును మా అమ్మ కూడా బియ్యపుపిండితోటే చేస్తుంది పాముల పాయసం. సూపర్ గా ఉంటుంది.

సుజాత వేల్పూరి

వికట కవి గారు, ఆలస్యంగా చూసాను మీ వ్యాఖ్య!
చేతులు కాల్చుకునే అలవాటు ఉందన్నారు కాబట్టి అడుగుతున్నాను, "ఉప్పటం" అనే మాట తెలుసా? నీళ్ళు మరుగుతున్నపుడు దాంట్లో బియ్యప్పిండిని నెమ్మదిగా పోస్తూ, కలిపి ముద్దగా అయ్యక, ఆరబెట్టి, ఆ తర్వాత దానితో తాలికలు చేస్తే గోధుమ పిండితో చేసినట్టే , వస్తాయి. పాలలో వెస్తే విరగవుం కరగవు.(ఇలా బియ్యపు పిండిని వేడి నీళ్లలో కలపడాన్ని ఉప్పటం అంటారు)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008