Monday 22 September 2008

అందరికి అన్ని వేళలా అందుబాటులో ...

నిన్నటి ఆదివారం సాయంత్రం ప్రమదావనం ఎంతో ఉత్సాహంగా మొదలైంది. అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా ఠంచనుగా టైముకి వస్తారు జ్ఞానప్రసూనగారు. నేను, సుజన, ప్రసూనగారు కుశల ప్రశ్నలు వేసుకుంటుండగానే కొత్త బ్లాగర్ లలితగారు వచ్చారు. పరిచయాలు చేసుకుండగానే సుజాత, సత్యవతి వచ్చారు. కాని ప్రమదావనం నేను ఇంత బరువు మోయలేను తల్లుల్లారా అని మొరాయించింది క్రిందటిసారిలాగానే. అంతలోనే గడ్డిపూలు సుజాత కూడా వచ్చారు. "ఈ నాటి ఆడపిల్లలను ఎలా పెంచాలి? అన్న నా ప్రశ్నకు అందరు ఉత్సాహంగా తమ అభిప్రాయాలు చెప్పసాగారు. కాని ... అదే సమస్య అందరికీ. తర్వాత రమణి, పూర్ణిమ, వరూధిని అందరూ ఇదే సమస్య ఎదుర్కొన్నారు.నాకు చిరాకేసి బయటకొచ్చేసా. తర్వాత వీవెన్‌తో మాట్లాడి కనుక్కుంటే తెలిసింది. ఆ హోస్టింగ్ వాడికి ఏదో మాయరోగం వచ్చింది. చాట్ రూంలో ముగ్గురికంటే ఎక్కువమందిని నేను మోయలేను అని మొరాయిస్తుందంట. ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నా. త్వరలో ఏదో ఒక పరిష్కారం చూడాలి.


కాని ఇలా సమస్యలు ఉన్నా కూడా మన తెలుగు మహిళా బ్లాగర్లందరు ఎప్పుడూ తమలో తాము అందుబాటులో ఉంటూ ముచ్చటించుకునేలా ఉండాలనే ఆలోచన వచ్చి ప్రమదావనం అనే గూగుల్ గుంపు మొదలెట్టాను. మన ప్రమదలందరినీ అందులో చేరుస్తాను. ఈ గుంపులో బ్లాగులు, ఆటలు, పాటలు, సినిమాలు, పుస్తకాలు, కవితలు, కథలు , కాకరకాయలు ,సీరియస్ చర్చలు ఇలా ఎన్నో విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు .. అలాగే నెలకు రెండుసార్లు సమావేశమవుదాం. ... ఈ గుంపులో కేవలం నాకు నమ్మకం కలిగిన తర్వాతనే మహిళలను చేర్చుకోవడం జరుగుతుంది. బ్లాగర్లైనా కాకున్నా .. ఎందుకంటే ఇది పూర్తిగా ఆంతరంగిక గుంపు. ..

4 వ్యాఖ్యలు:

Anonymous

మీ అలొచన చాలా బావుంది.
నిన్నటి ప్రమదావనం లో మన ఆలోచనలు పంచుకొనే అవకాసం కుదరలేదు.
కాని ఇందులో పాల్గొన్నందుకే చాలా సంతోషపడిపోయాను.
అందరూ ఎంతో ఆత్మీయంగా పలకరించారు
.ఏదైనా విషయం మీద విస్త్రుత చర్చ జరగడానికి ఎక్కడైతే వీలవుతుందో మీరే కనిపెట్టాలి.

Rajendra Devarapalli

జీటాకులో గ్రూపు చాటింగ్ సౌకర్యం ఉంది,అది ఒకసారి ఉపయోగించి చూడండి,ఈ తరహా ఇబ్బందులు అక్కడ లేకపొవచ్చు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

వ్యక్తిగత గుంపు = ఆంతరంగిక గుంపు

జ్యోతి

ధన్యవాదాలు తాడేపల్లిగారు,

నాకు ఇక్కడ సరియైన పదం దొరకలేదు. మార్చేస్తున్నాను..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008