Tuesday, December 23, 2008

చలో e-తెలుగు స్టాల్

అక్కడేదో పుస్తకాల ప్రదర్శన జరుగుతున్నట్టుందే!!! మరి పుస్తకాల మధ్యలో ఈ కంప్యూటర్ స్టాల్ ఏంటి? పైగా ఉచిత సహాయం అంటున్నారు!! దానికి దీనికి ఏంటి సంబంధం. ఏదో మాకు నచ్చిన పుస్తకాలు కొందామని వచ్చాము. తెలుగుకు కంప్యూటర్ కు ఏంటి సంబంధం . మీ చోద్యం కాకపొతే !!..

కాని తెలుగును పుస్తకాలలో , పత్రికలలో చదవడమే కాక , కంప్యూటర్లలో ఎంతో సులువుగా చదవొచ్చు, రాయొచ్చు అని ఓపికగా వివరిస్తున్నారు మన బ్లాగర్లు. దీనివలన ఎవరికీ ఒక పైసా ఆదాయం లేదు. మిగతా స్టాల్లలా ఎవరూ తమ స్వంత సైట్లు, బ్లాగులు కూడా ప్రచారం చేసుకోవడం లేదు. మరి వారు చేసే పని ఏంటి అంటే??? అక్కడకు వచ్చే తెలుగువారికి కంప్యూటర్లలో కూడా తెలుగు రాయొచ్చు చదవొచ్చు అని చెప్తున్నారు. చూపిస్తున్నారు కూడా. ఇదేం పెద్ద పనా అనుకునేవాళ్లు లేకపోలేదు. కాని దీని వెనక ఎంత కృషి ఉందో అందరికీ తెలియదు. . అంతర్జాతీయ బ్లాగర్ల దినోత్సవం నుండి జరిగిన అనూహ్య మార్పులు, ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిన పనులు శ్రీధర్ బ్లాగులో వివరించాడు. మేము అది చేసాం , ఇది చేసాం అని చెప్పుకోవడం అవసరమా అంటారా? . అవసరమే. రవిగారు రాసిన నివేదిక చదివి బాధ కలిగి నేనే శ్రీధర్ ని రోజువారి సమీక్ష ఇవ్వమన్నా. అందరికీ తెలియాలి వారు నిస్వార్ధంగా చేస్తున్న కృషి. కనీసం కొందరైనా దీనివలన స్ఫూర్తి పొందే అవకాశం ఉంది కదా. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి అది చేయాలి, ఇది చేయాలి అని మాటలు కాక ఇపుడు చేసి చూపించే తరుణం వచ్చింది.


పత్రికలలో వ్యాసం అంటే వాళ్ల సమయం బట్టి మన దగ్గర సమాచారం తీసుకుని కత్తిరించి రాస్తారు. అది జనాలకు ఎంతమేరకు వెళుతుందో తెలియదు. కాని ఇప్పుడు తెలుగు భాషాభినులకు ఈ సులువైన పద్ధతులు నేర్పాలి. ఈ కృషిలో పనిచేస్తున్న శిరీష్, తాడేపల్లి, కశ్యప్, భార్గవ్, పద్మనాభం, శ్రీనివాస,వీవెన్, కిరణ్, అరుణ, అనిల్ , మురళి. .. వీరితో మరి కొందరు కలవాలి. ఇది వారి స్వంత కార్యక్రమం కాదుగా. అందరిదీ. ముందుకు రండి. బ్లాగర్లు , చదువరులు . ప్రతిరోజూ కాకున్నా ఏదో ఒక రోజు తమకు వీలైన సమయం మన స్టాల్ లో గడపండి.

మరో ముఖ్య విషయం. గత శనివారం జరిగిన సమావేశం లో కలిసిన బ్లాగర్లందరూ , ముఖ్యంగా మహిళా బ్లాగర్లు మొదటిసారి కలిసినా చాలా సరదాగా గడిపారు. ఇలా మనమందరం కూడా కలుసుకునే మంచి సందర్భం . మిస్ కాకండి.

ప్రమదావనం సభ్యులకు గమనిక:

25 తారీఖు నాడు మనం కలుద్దామా? మన స్టాల్ దగ్గర కనీసం రెండు గంటలయినా గడపొచ్చు. అలాగే పార్టీ చేసుకుందాం. పుణ్యం , పురుషార్ధం.. రెండూ అవుతాయి. అదంతా కాదుగానీ... ఆ రోజు లేడీస్ డే గా చేసుకుంటే పోలా!!! అధ్యక్షులు చదువరిగారు ఏమనరు. అంతగా ఐతే వరూధినిగారికి చెప్పేద్దాం. ఆరోజు స్టాలుని ఆక్రమించేసుకుంటే సరి.. అప్పుడు దానికి అందం, గ్లామర్ వస్తుంది. అవిడియా బానే ఉందిగా.. :):)

అందరూ వచ్చేయండి మరి !!!


కార్యక్రమానికి తమ వంతు విరాళాలు అందించడానికి వివరాలు ఇవి..

e-తెలుగు సభ్యత్వం..
ప్రవేశ రుసుము :Rs.300
వార్షిక చందా : Rs.200
జీవిత సభ్యత్వం :Rs.2000

12 వ్యాఖ్యలు:

Anonymous

డిసెంబరు 25న స్టాలును నిర్వహించేందుకు మహిళా బ్లాగరులకిదే ఆహ్వానం. "ఒక్కర ఇద్దర, వేలూ లక్షలు ఉన్నారెందరొ బ్లామినుల్" అంటూ రండి!

నేస్తం

హమ్మయ్యా photo వేసారా.. మాలా దూరం గా ఉన్నవాళ్ళం కనీసం photo అన్నా చూసి అనందిస్తాం అండి .. వెనుక ఎర్ర చీర కత్తుకున్న వారు లక్ష్మి గారు,బ్లూ డ్రెస్ వేసుకున్నవారు పూర్ణీమాగారు వీరిద్దరి మద్యన ఉన్నవారు తాడే పల్లివారు ,(మిగిలిన ఇద్దరు వేదగారు రమణిగారేమో మరి అరుణ గారో ?) అని మీ అందరి బ్లాగ్స్ చూసి అనుకుంటున్నా.. తప్పు అయితే క్షమించాలి :)

Unknown

జ్యోతి గారు నా నివేదిక చదివాకా ఎందుకు బాధ కలిగిందో చెప్పి ఉంటే బావుండేది.ఒక సారి నా నివేదిక మళ్ళి చదవమని నా విన్నపం. నేనన్నది ఆశించినంత స్పందన జనాల్లో కని పించ లేదన్ననే గాని మనవాళ్ళు చేస్తున్న కృషిని అభిననదించనే గాని తక్కువ చేస్తూ ఏమి అనలేదే?నేను సాయంత్రం 5. 30 కే రావడం తో ఆ ప్రదర్శనకి వస్తున్న జనం , మన స్టాల్ దగ్గర దాక వచ్చి అటు ఈనాడు స్టాల్ కో టీవీ 9 స్టాల్ కో పోతున్న విషయాన్నే ప్రస్త వించాను. అదికాక ప్రదర్శన మొదలు పెట్టి రెండు రోజులే అవడం తో తక్కువగా వుండి వుండొచ్చు. జనాలు వెల్లువ లా వచ్చి మన స్టాల్ ని దర్శించి విజయవంతం చెయ్యాలన్నదే నా నివేదికలోని ఆకాంక్ష గా గమనించ గలరు.రేపు 25 న వచ్చి నేను కూడా నా వంతూ కృషి(ఈ విషయాన్నీ మీరు మొదటి సారి volenteers ని అడుగుతూ రాసినప్పుడే నేనే ముందు జవాబిచ్చా గమనించ గలరు)చేస్తానని హామీ ఇస్తూ .........

ఏకాంతపు దిలీప్

@ నేస్తం గారు
నాకెందుకో మీరు తప్పులో కాలేసారు అనిపిస్తుంది... :-)

యోగి

"జీవిత సభ్యత్వం :Rs.2000" దీని వివరాలకోసం ఎవరిని సంప్రదించాలి?

నేస్తం

దిలీప్ గారు అంతే అంటారా :(

Anonymous

యోగి: మన కోశాధికారి వెంకటరమణ గారిని సంప్రదించాలి. జీమెయిలైడీ "uvramana"

cbrao

@యోగి - The outcast: చదువరి లేక వెంకట రమణ గారిని.

జ్యోతి

నేస్తంగారు,
నిజంగానే తప్పులో కాలేసారు. తాడేపల్లిగారు పోటో తీసారుకుంటా. ఆయన ఇందులో లేరుగా. ఇక మహిళల పేర్లు ప్రమదావనంలోనే.. లేదా మమ్మల్ని కలిసినవాళ్లకే...:)

KumarN

ఇక్కడ, మహేష్ ని అందరూ కలసి, ధభీ, ధభీ మని బాదుతూ ఉండే ఒక ఫోటో ఎక్స్ పెక్ట్ చేసానే...ఏమయింది అది, దాచేసారా? :-)

చదువరి గారూ, అన్యాయం అండీ, మీరక్కడ ఉండి కూడా అలాంటి పని చేపట్టకుండా ఊరకుండిపోవడం!! :-)

సూచన: సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికైనా తగ్గితే, అది మీ ఖర్మే అని, నా మీద దండెత్తొద్దని మనవి.

విరజాజి

జ్యోతిగారూ... నేను కూడా రేపు మన స్టాల్ కి వస్తున్నాను.... మీరు ప్రత్యేకంగా ఫలానా టైం అని చేప్తే... నేను రెడీ... ప్రమదావనంలో కలవలేకపోయినా ఇలా కలవగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
--శిరీష

జ్యోతి

శిరిషగారు,
చదువరిగారు స్టాల్ ని నిర్వహించమన్నారుగా. నాలుగు గంటలవరకు వచ్చేయండి. మనవాళ్లు వస్తున్నారు.

కుమార్ గారు,
పాపం మహేష్ రాతలేగాని, మాటలు తక్కువేనండి...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008