Wednesday, February 11, 2009

శ్రీవారి విచిత్ర అలవాట్లు


కొద్ది రోజుల క్రింద ఒక వ్యక్తి భార్యల మీద చేసిన రీసెర్చి గురించి చెప్పాను కదా. అలాగే భర్తల విచిత్ర అలవాట్ల గురించి కొందరి మహిళల ఇక్కట్లు ఇలా ఉన్నాయి. ఇది 20 నుండి 60 సంవత్సరాల శ్రీమతుల రిసెర్చ్ తర్వాత చేసిన కంప్లైంట్లు. ఇందులో ఎవరెవరి అలవాట్లు ఇలా ఉంటాయో నిజాయితీగా ఒప్పుకోండి. ఇది నేను బ్లాగ్లోకంలో కొచ్చిన కొత్తలో రాసిన టపా..

భార్యలలో కొందరు తమ భర్త విచిత్రమైన అలవాటును చూసి సందిగ్ధంలో పడుతూ ఉంటారు.ఒక్కోసారి భార్య అతని అలవాట్లకు ముగ్ధురాలు అయిపోతే ఒక్కోసారి తల గోడకేసి బాదుకుందామా అనిపిస్తుంది. కొందరు భర్తల కొన్ని విచిత్రమైన ఈ అలవాట్లు ఎలా ఉంటాయో చూద్దాం.


*


పెళ్ళి, పుట్టిన రోజు సంధర్భంగా విష్ చేయ్యడం మర్చిపోతారు.


*


తడి టవల్‌ని బెడ్‌పైనే వదిలేస్తారు అందులో వారికి తప్పేమి కనిపించదు.


*


ఇతరుల భార్యలలో అన్ని మంచి లక్షణాలే కనిపిస్తాయి. తన భార్య అంటే మాత్రం అలుసు.


*


భార్య ఇచ్చిన మంచి సలహా అందరి ముందు ఒప్పుకోవాలంటే వెనకముందు అవుతారు. కారణం అందరూ తనని ‘ భార్యాదాసుడు ‘అంటారేమో అని భయం.


*


పిల్లల్లో ఉన్న ప్రతి మంచికి తమను తాము పొగుడుకుంటారు. అదే చెడు అయితే అది భార్య నెత్తిన రుద్దుతారు.


*


భార్య పుట్టింటి వారు ఇంటికి వస్తే ‘ ఎన్ని రోజులు తిష్ట వేస్తారు ‘ అని అడుగుతారు.


*


భార్యతో ఎప్పుడైనా బజారుకు వెళితే తను భార్యకు ఎదో ఫేవర్ చేస్తునట్టు ముఖం పెడతారు లేదా శిక్ష అనుభవిస్తునట్టు ఫీలవుతారు.


*


60 ఏళ్ళ వయసులో కూడా ఇతరులు తమని ప్రేమించేలా మార్చుకోలేరు. పైగా భార్య మాత్రం ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడితే మాత్రం సహించలేరు.


*


తమ సరదాల కోసం వేల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ భార్య బ్యూటీ పార్లర్ విషయం వస్తే మాత్రం డబ్బులు వృధా చెయ్యడం మంచిపని కాదు అని ఉపన్యాసాలు ఇస్తారు.


*


సాధారణంగా పురుషులు తమ స్వంత ఇంట్లోనే గెస్టుల్లా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఏ వస్తువు,సామాను ఉందో తెలియదు. తమ నిత్యావసర వస్తువులైన షేవింగ్ మెటీరియల్, హండ్ కర్చీఫ్, సాక్సులు, పెన్ను, టై లాంటి వాటికి కూడా భార్యపై ఆధారపడతారు.


*


రాత్రి చంటిపిల్లాడు పక్క తడిపి ఏడుసుండడం తెలిసీ నాపీ మర్చడం తమ పని కాదనుకుంటారు. అలిసిపోయి నిద్రపోతున్న భార్యను లేపడం మాత్రం తమ కర్తవ్యం అనుకుంటారు.


*


పరాయి స్త్రీలు తమను పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతారు,అదే తమ భార్యలను ఎవరు పొగడొద్దు.


*


భార్యతో జుట్టుకు రంగు వేయించుకోవడం, తలకి నూనె రాయించుకోవడం, ఒంటికి మర్ధన చేయించుకోవడం తమ జన్మహక్కుగా భావిస్తారు. భార్యకు నిజంగా తలనొప్పి వస్తే తలకు బామ్ రాయడానికి మాత్రం వారి అహం అడ్డు వస్తుంది. పైగా టీ తాగు తగ్గిపోతుంది నాక్కూడా ఓ కప్పు ఇవ్వు అంటారు.


*


ఈ రోజు వంట చేసే మూడ్ లేదని భాయ అంటే భర్త వెంటనే ‘ మటాన్ పులావ్,టమాట పప్పు, నాలుకు చపాతీలు, గోంగూర పచ్చడి, కొంచెం సలాడ్ మాత్రం చేయి చాలు, ఈరోజు వీటితో సరిపెట్టుకుందాము. అంటాడు.


*


భార్య పుట్టింటి వాళ్ళు వస్తే మనసు విప్పి మాట్లాడరు. కాని భార్య మాత్రం అత్తింటి వాళ్ళు వచ్చినప్పుడు పువ్వులాగా వికసించిన ముఖంతో అతిథి సత్కారాలలో మునిగిపోవాలి అని ఆశిస్తారు.


*


దిగులుగా ఉన్న భర్త ముఖం చూసి భార్య ‘ ఆఫీస్‌లో ఎదైన టెన్షనా ‘ అని అడిగితే ‘ నీకు అర్ధం కాదులే ‘ అని అంటారు. ఇలా అన్నారు కదా అని ఇంకొకసారి అడగకుండా ఉంటే ‘నేనెందుకిలా ఉన్నాను అన్ని నీకు కొంచెం కూడా పట్టదు ‘ అని అంటారు.ప్చ్ ...

16 వ్యాఖ్యలు:

Vinay Chakravarthi.Gogineni
This comment has been removed by the author.
నేస్తం

*


పెళ్ళి, పుట్టిన రోజు సంధర్భంగా విష్ చేయ్యడం మర్చిపోతారు.


*


తడి టవల్‌ని బెడ్‌పైనే వదిలేస్తారు అందులో వారికి తప్పేమి కనిపించదు.


*


ఇతరుల భార్యలలో అన్ని మంచి లక్షణాలే కనిపిస్తాయి. తన భార్య అంటే మాత్రం అలుసు.

సాధారణంగా పురుషులు తమ స్వంత ఇంట్లోనే గెస్టుల్లా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఏ వస్తువు,సామాను ఉందో తెలియదు. తమ నిత్యావసర వస్తువులైన షేవింగ్
మెటీరియల్, హండ్ కర్చీఫ్, సాక్సులు, పెన్ను, టై లాంటి వాటికి కూడా భార్యపై ఆధారపడతారు.


జ్యోతి గారు మా ఇంటి కొచ్చి చూసారా ఎప్పుడైనా???? (doubt వస్తుంది నాకు)

చింతా రామ కృష్ణా రావు.

జ్యోతిగారూ!
శ్రీవారి విచిత్ర అలవాట్లు శీర్షికతో మీరలా యదార్థాల్ని చెప్పెస్తారని వూహించక మీ బ్లాగులోనివన్నీ నాశ్రీమతికి చూపించెద్దా మనుకొన్నాను. ఇంకా నయం. ముందుగా నేను చదివాను కాబట్టి ఆ ప్రయత్నం విరమించుకొన్నాన్ను.

సరదా కన్నానండోయ్.
చాలా మట్టుకు మీరన్నవి నిజమే కానీ ..........!

చాలా చక్కగా వ్రాశారు.
మా గృహిణి చూచి మీ సామాజిక స్పృహకి చాలా ఆశ్చర్యపోయారు.
అభినందనలు తెలియ జేయమన్నారు.
నేనుకూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను.

Anonymous

"భార్య మాత్రం ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడితే మాత్రం సహించలేరు."

except that, other things have no issues.

అశోక్ చౌదరి

"తడి టవల్‌ని బెడ్‌పైనే వదిలేస్తారు అందులో వారికి తప్పేమి కనిపించదు." అవును కదా? :-)

సుభద్ర

adirindi,
indulo 4points tappa anni maa aayana chestaru.
meeru nijam gaa super andi jyothigaru.

శ్రీనివాస్

:o పెళ్ళైతే ఇవన్ని చెయ్యాలన్న మాట .....హమ్ ట్రై చేస్తా

మోహన

తడి టవల్‌ని బెడ్‌పైనే వదిలేస్తారు అందులో వారికి తప్పేమి కనిపించదు.

hahaha.. Super list..

పరిమళం

జ్యోతి గారూ !"తడి టవల్‌ని బెడ్‌పైనే వదిలేస్తారు"ఇదొక్కటి తప్ప మిగతావేం మా శ్రీవారికి లేకపోవడం అదృష్టమే కాని అది కూడా లేకపోతె ......

One Stop resource for Bahki

ఎం చేస్తాం ఖండిస్తాం

RG

తడి టవల్ ని మంచం మీదే వదిలేస్తే తప్పేంటి ? సాయంత్రానికి ఎలాగూ ఆరిపోతుంది కదా! ఇష్యూ లేని చోట కూడా ఇష్యూ క్రియేట్ చెయ్యడం శ్రీమతుల విచిత్ర అలవాట్లు (BTW, Im not married yet :))

Unknown

Please read "Men from Mars and Women from Venus" once and then you may even think to delete this post....

Lethargic Intellect

ఏమిటండి ఈ బ్లాగు? మా ఆవిడ ఇది చదివి తిరుగుబాటు చేస్తోంది :-)

అన్వేషి

చాలా బాగా చెప్పారు!
(ఇదేవిషయం మీభార్య చెబితే మెచ్చుకుంటారా అని నామెడకు చుట్టరుగదా?)

Anonymous

మీరు జనరలైజ్ చేసి ఇలా రాయడం బాగాలేదు !! భార్య ల డిసిప్లిన్ వల్ల బాగుపడి సంసారాలు చెస్తున్నవాళ్ళుకూడా ఉన్నారు !!!

Unknown

jyothi garu

chala bagha parisodhana chesaru

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008