Wednesday, June 17, 2009

నన్నుబ్రతికించండి... ఊపిరినివ్వండి..


దేవుడు ప్రతి ఒక్కరికి నిర్ణీతమైన జీవన పరిమాణం, ఆయుస్సు ఇస్తాదంటారు. కాని ఈ చిన్నారి చైతన్య ప్రతి క్షణం మృత్యువుకు చేరువవుతున్నాడు. అతనిని మృత్యువుకు అందనీయకుండా ఆ బాబు మేనమామ తలకు మించిన భారమైనా అష్టకష్టాలు పడి, పరిస్థితులతో పోరాడుతున్నాడు. ఈ విషయం తెలిసి సహాయం చేయాలనుకున్న ప్రమదావనం సభ్యుల కోరిక మేరకు గీతాచార్య స్వయంగా ఆ బాబు ఇంటికి వెళ్లి కనుక్కున్న వివరాలు ఇవి.

ఆ పిల్ల వాడికి ఉన్న వ్యాధి థలసీమియా మేజర్. రక్త హీనత, హిమోగ్లోబిన్ లోపమ్ మొదలైనవి ప్రాథమిక లక్షణాలు.
తెలిసిన డాక్టర్ వద్ద నుంచీ సేకరించిన వివరాల ప్రకారం ఈ వ్యాధి వివరాలు...

ఎర్ర రక్తకణాల హీనత వల్ల కలిగే అతి దారుణమైన ఫలితమే ఈ వ్యాధి. Mean corpuscular volume in blood కనుక 75% కన్న తక్కువగా ఉంటే ఈ వ్యాధి కారకులు గా పరిగణించ వచ్చు. అలాంటి వారికి పుట్టే బిడ్డలకి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం చాలా ఎక్కువ. (ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది).

కనీసం మూడు వారాలకి ఒకసారి రక్తం ఎక్కించాలట. మళ్ళా దాని వల్ల ఎక్కువైన ఇనుము ధాతువుని తీసివేయటానికి 12 గం|| పాటూ చీలేషన్ థెరపీ చేయవలసి ఉంటుంది. ఇలా మూడు వారాలకి ఒకసారి రక్తం ఎక్కించవలసి రావటం ఖర్చుతో కూడుకున్నదే కాక ఆ వ్యాధిగ్రస్తునికి మానసిక వేదన కూడా. (దీనికయ్యే ఖర్చు కనీసం 8000-10000)

వీరిలో ఎర్ర రక్త కణాలు సాధారణమైన ఆరోగ్యవంతునికన్నా తక్కువ సైజులో ఉంటాయి.

దీని వల్ల కలిగే ఇతర పరిణామాలు...

ఆస్టియోపోరిస్, గుండె ఎండోక్రైన్ సమస్యలు, హైపటైటిస్ బీ, సీ, HIV మొదలైన వ్యాధులు తేలికగా సంక్రమించటం.

Bone marrow (ఎముక మూలుగ) operation మాత్రమే ఈ వ్యాధికి ఉన్న ఏకైక శాశ్వత చికిత్స. దీనికయ్యే ఖర్చు... సుమారుగా 15,00,౦౦౦

ఈ కుర్రాడికి వాళ్ళ చెల్లి మూలుగ సరిపోయిందట. ఇప్పటివరకూ దాదాపూ, ఎనిమిది లక్షలు సమకూరాయట. డిసెంబరులో ఆపరేషన్ చేయాలని డక్టర్లు చెప్పారట.


చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది. మన రాష్ట్రం లో సుమారు 900 మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

ఇప్పటివరకు ప్రమదావనం సభ్యులు సేకరించిన సొమ్ము ఆరువేలు. కాని ఈ బాబుకు ప్రాణదానం చేయడానికి అది సరిపోదు.
బ్లాగర్లు, చదువరులందరికి నా విన్నపము .. బాబుకు బ్రతికే అవకాశమివ్వండి.అతను హాయిగా ఆడుతూ పాడుతూ తిరగాలని బాబు మేనమామ విధితో చేస్తున్న పోరాటానికి చేయూత నివ్వండి. మీవంతు సహాయం అందించండి. వివరాలు మీ స్నేహితులకు, తెలిసినవాళ్ళకు తెలియచేయండి. నీటిబొట్లు కలిస్తేనే సముద్రమయ్యేది .. మనమందరం కలిస్తే చిన్నపాటి సహాయం చేయలేమా.

మరి కొన్ని వివరాలకు చూడండి..

విరాళాలు పంపవలసిన చిరునామా:8 వ్యాఖ్యలు:

గీతాచార్య

కాస్త లో"కఙ్ఞానం ఉండి, నలుగురినీ కలిసి చెప్పుకోగలిగిన నాకే ఇంత ఇబ్బందిగా ఉంటే, మరి ఏ సౌకర్యాలూ లేని వాళ్ళ పరిస్థితిని చూస్తుంటేనే నాకు భయంా ఉంది." అన్న ఆదినారాయణగారి (పిల్లాడి మేనమామ)మాటలు అక్షర సత్యాలు.

వీలున్నంత మంది సహాయం చేసి చికిత్సని వేగవంతం చేస్తే రాష్ట్రం లో ఉన్న మిగతా వారి వివరాలు సేకరించి వీలైనంత మందిని ఈ వ్యాధి నుంచీ రక్షించాలని నా ప్రయత్నం. Probably ambitious. But not impossible.

Malakpet Rowdy

Prasanthi (T-MAD) works closely with a Thalassemia foundation and she can be of a lot of help. If you get in touch with her could you please ask her to contact Ratan Kumar Singh? We do have some money in our SHiFT account and I think something can be contributed towards this. I will be contacting him too.

గీతాచార్య

Very nice of u. Will u plz give more info, and how to contact her?

Malakpet Rowdy

Jyoti has her contact details I guess ( I have seen a section of her blog dedicated to Prashanti). Otherwise just send me a mail at bharadwaja@yahoo.com and I shall send you her email id. ( Dont want to display that in public)

Even faster, send a mail to ratanks@carehospitals.com and refer my name. I will also try to contact him ASAP - He has Prasanthi's latest details.

జ్యోతి

I will contact prashanthi today...

సుజాత వేల్పూరి

హృదయం ద్రవించేలా ఉందండీ! పూర్తిగా వికసించకుండానే వాడిపోతుందేమో ఆ చిన్ని పువ్వు అని ఒక పక్క భయమేస్తున్నా, ఇంతమంది ఉన్నాం, తలా ఒక చెయ్యి వేసి దానికింత ప్రాణవాయువు అందించలేమా అని ధైర్యంగా కూడా ఉంది. ప్రశాంతితో మాట్లాడారా? ఏ విషయమూ మెయిల్ చేయండి.నేను చేయాలనుకున్న సహాయం నేను చేస్తాను.

శ్రుతి

జ్యోతి గారు,
బ్లాగ్స్ ద్వారా ఇలా కూడా సహాయం చేయవచ్చని మీ ద్వారానే తెలిసింది. నా వంతు సహాయం నేను చేస్తాను. మీరిచ్చిన నంబర్స్ కు ఫోనె చేశాను. I got their account number.

Thanks for the information.

జ్యోతి

రౌడిగారు, మీ సహకారానికి ధన్యవాదాలు.

సుజాతగారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రశాంతితో మాట్లాడాను అలాగే సహాయ వారితో కూడా టచ్ లో ఉన్నాను, గీతాచార్య కూడా ఈ పనిలోనే ఉన్నారు.

శ్రుతిగారు , మీకు నమస్సుమాంజలి.. మహిళా బ్లాగర్లు గత కొద్దికాలంగా సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారండి..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008