Friday, July 31, 2009

టమాట ఉత్సవం ... మీకోసం


టమాట అంటే ఇష్టం లేనిదెవ్వరికి. ఎర్రగా దోరగా చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. కొందరు వండేదాక అగడమాఅంటూ అలాగే తినేస్తారు. దీనిని రామములక్కాయ అని కూడా అంటారు. దీనితో చేయని వంటకం లేదు. కూర, చారు, పప్పు, పచ్చడి, జామ్ , జ్యూసు, కెచప్, సాస్ ... ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. అప్పుడప్పుడు కాస్త ఉగ్రరూపం దాలుస్తుంది ..అసెంబ్లీ సమావేశాలలో మన రోశయ్యగారిలా. టమాట కూరగాయతో అయినా కలిపి చేయొచ్చు. ఎలా చేసినా రుచిగా ఉంటుంది. ఇక అమ్మకు దూరంగా ఉంది స్వయంపాకం చేసుకునే బ్రహ్మచారులు, బ్రహ్మచారినులు, వివిధ రకాలుగా వంట చేసుకునే ఓపిక, సమయం లేనప్పుడు టమాట చాలా సహాయంగా ఉంటుంది.


అసలు నా ఉద్దేశ్యంలో ప్రతి వంటింటిలో ఉల్లిపాయ మహారాజు, టమాట మహారాణి. రెండు ఉంటే చాలు గంపెడు కూరగాయలున్నట్టే . ఇప్పుడు కాస్త వాతావరణం చల్లబడి మంచి టమాటాలు అందుబాటైన ధరలో దొరుకుతున్నాయి. ఇక నాకు పండగే :) ... అందుకే నా సైట్ లో టమాటాల ఉత్సవం చేయాలని నిర్ణయించుకున్నాను. ఉత్సవం లేదా పండగ ( అదేదో దేశంలో టమాటో లలో పడి పొర్లాడే పండగా కాదు ) ఆగస్టు ఒకటి నుండి పదో తారీఖు వరకు జరుగుతుంది. టమాటోలు తప్ప వేరే కూరగాయలు లేకుండా అతి తక్కువ దినుసులతో , సులువుగా చేసుకోగలిగే వంటకాలు ఇస్తాను. ఎప్పటినుండో బ్రహ్మచారుల కోసం వంటకాలు ఇవ్వాలని కోరికను మన్నించడమైనది .


రోజూ ఒక్కో టమాట వంటకం మీకోసం. రేపటినుండి . షడ్రుచులు లో


అందరికీ స్వాగతం..

11 వ్యాఖ్యలు:

Vinay Chakravarthi.Gogineni

bachelor's curry ani deeniki oka peru vundandi.......

naaku curry kanna pachhi ga tinatame ishtam........

ekkuvaga raama mulkkaya ane antam memu

పరిమళం

ఓహో ...

Srujana Ramanujan

మొదలెట్టారన్నమాటమాట

ప్రియ

అక్క చేత చేయించి మీకు ఒక కాపీ పంపుతా... హిహిహి

ప్రియ

అదేదో దేశం కాదండీ... అది స్పెయిను.

మాలా కుమార్

బ్రహ్మచారులేనా ,మేము చూడొద్దా !

డా.ఆచార్య ఫణీంద్ర

పూటకు నొక వంటకము " ట
మాటల " తో చేయు విధము, మహిళా మణి ! మీ
మాటల చెప్పెదరన _ మా
నోటను నీళ్ళూరుచుండె మరి మరి కనుడో !

భావన

టమోటా రైస్ ముందు టమోటా రైస్ ముందు (అది నాకు రాదు గా మరి) బ్రహ్మ చారులకే కాదు నాలాంటి పాకశూన్యులకు కూడాను వుపయోగం...

జ్యోతి

వినయ్ గారు, టమాట బ్లహ్మచారులకే కాదు. అందరికి నచ్చే కూరగాయ.

మాలగారు,
అందరికినుగాని, స్వయంపాకం చేసుకునే వారికి వీజీగా ఉంటుందని అలా అన్నాను.

ఆచార్యగారు,
ధన్యవాదాలు మీ రాకకు, పద్యానికినీను..

భావన,
ఉంది ఉంది. టమాట రైస్ కూడా ఉంది. ఎప్పుడు అనేది సస్పెన్స్. చూస్తుండాల్సిందే. :)

శ్రీ

neninka renoldburgh lo jarige tamota utsavam emo anukunna
http://www.reynoldsburgtomatofestival.org/

మాలా కుమార్

happy friendship day

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008