Monday 2 November 2009

బ్లాగ్వనంలో వనభోజనాలు - క్యాప్సికం మసాలా కూర

కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్లాగ్వనభోజనాలకు స్వాగతం.. సుస్వాగతం..






కావలసిన వస్తువులు

క్యాప్సికం - 250
ఉల్లిపాయ - 1
పసుపు - 1/4 tsp
కారం పొడి - 1tsp
ఉప్ప్పు -తగినంత
కొబ్బరి పొడి - 2 tbsp
నువ్వుల పొడి - 2 tsp
జీలకర్ర పొడి - 1 tsp
మెంతి పొడి - 1/2 tsp
చింతపండు పులుసు - 1/4 cup
అల్లం వెల్లుల్లి ముద్ద -1 tsp
కరివేపాకు -రెండు రెబ్బలు
నూనె - 5

క్యాప్సికం అంగుళం సైజులో ముక్కలుగ కట్ చేసి పెట్టుకోవాలి. నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేశి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అల్లం వెల్లులి ముద్ద, కరివేపాకు. పసుపు వేసి కొద్దిగా వేపి క్యాప్సికం ముక్కలు,కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టి నిదానంగా మగ్గనివ్వాలి. క్యాప్సికం ముక్కలు మెత్తబడ్డాక చింతపండు పులుసు , కొబ్బరి, నువ్వులు, జీలకర్ర, మెంథి పొడులు వేసి కలిపి కప్పు నీళ్లుపోసి నూనె తేలేవరకు ఉడికించి దింపేయాలి. ఈ కూర బయట పెట్టినా రెండురోజులు నిలవ ఉంటుంది. ఉప్పు,నూనె సరిగ్గా ఉంటే. ఈ కూర అన్నం, రొట్టెలకు బాగుంటుంది.

ఒక్కటే కూరా?? అబ్బే !! అస్సలు బాలేదంటారా??? అవును కదా!!!




సరే మీ కోసం కొన్ని టమాట వంటకాలు నిన్నటి సాక్షిలో ప్రచురించబడినవి. ఇవి ఇక్కడ చదువుకోండి మరి..


చివరిగా ఒక ముఖ్యవిషయం ::

ఇది నేను చెప్పాల్సిన మాట కాదు. రోజు వంట చేయడమంటే విసుగ్గా ఉంది. పడుకునేటప్పుడు పొద్దున టిఫిన్ కి ఏం చేయాలి, మళ్లీ మధ్యాహ్నం లంచ్ కి ఏం వండాలి. కాస్త తీరిక దొరికిన తర్వాత రాత్రి భోజనం గురించి ఆలోచనలు. ఆడవాళ్లకు మాత్రమే ఈ టెన్షన్. మగవాళ్లు హాయిగా వండింది తింటారు. ఒక్కరోజు నువ్వు కూర్చో. నేను చేసిపెడతా అనరుగా. అందుకే ఒక్కోసారి నాకు మహా కోపం వచ్చేస్తుంది. ఆడవాళ్లు వంట చేయాలి అన్నవాడిని ట్యాంక్ బండ్ కంపు నీళ్లలోకి తాడు కట్టి వేలాడదీయాలి అని. అస్సలు ఈ ఆకలి అనేది లేకుంటే ఎంత బాగుంటుంది..:) మావారికి సాక్షిలో నా వంటకాలు పడ్డాయి అంటే ,నీకేం వచ్చు. మిగతావాళ్లు ,ఆ టీవీ,పత్రికలవాళ్లు ఇంతకంటే అద్వాన్నమైన తిండి తింటారేమో? అందుకే నీ వంటలు అంతగా నచ్చుతున్నాయి అని వాదించసాగారు. ఆ కోపంలో కాపీ కాస్తూ టీపొడి వేసా.. :))) మొగుళ్లంతే!! మన టాలెంటు అస్సలు గుర్తించరు!! ఎప్పుడు మారతారో? ఏమో ?

29 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్

ఇక వడ్డించండి మరి! మేము సిద్ధం

భాస్కర రామిరెడ్డి

:)

ఏంటండీ కట్టగట్టుకొని అందరూ ఆడవాళ్ళూ--వంటకాలూ అని మొదలెట్టారు. వంటలో ఇన్ని చేతులు పడితే తినాలంటే కష్టం కదండీ.

నేస్తం

ఇంక లాభం లేదు మీ వంటలు అన్నీ ఎక్కడన్నా రాసుకోవాలి. లేదా సేవ్ చేయాలి .. రేపే మొదలు పెడతా

సుభద్ర

జ్యోతిగారు,
ఊ మ్ మ్మ్మ్ యామీ!!!!
అ౦తా మాట అన్నారా మిమ్మల్ని........హూ ఇక క్షమి౦చక౦డి..క్షక్ష సాది౦పు రెసీపిలు కొన్ని ఉన్నాయి..మీకు ప౦పుతా!!!అవి మాత్ర౦ డైని౦గ్ టేబుల్ మీద ఉ౦చి మీరు బోజన౦ ము౦దుగా వ౦టి౦ట్లో కానిచ్చేయ౦డి.
భళే భళే లాస్ట్ పేరా !తాళ్ళ ఖర్చు పుర్తిగా నేను భరిస్తా అద్యక్షా.........

రవి

ఓ గుండిగ కాప్సికం కర్రీ, రెండు డజన్ల పుల్కాలు ఇప్పటికిప్పుడే తినెయ్యాలనిపిస్తూంది.

భావన

అబ్బ రవి గారి మాటే నాది..... జ్యోతీ... ఓ గుండిగ కాప్సికం కర్రీ, రెండు డజన్ల పుల్కాలు ప్లీజ్

భా.రా.రే: ఇంకా అర్ధం కాలేదా. ఈ రోజు కార్తిక పౌర్ణమి వన భోజనాలన్నమాట. జ్యోతి అన్నట్లు .. మేము చేస్తాము బాగా మెక్కండీ.. ఏమైనా మాట తేడా రావాలి తిన్నాక ఇది బాలేదు అది బాలేదు అని.. తరువాత మా సుభద్ర తాళ్ళ ఖర్చు కూడా స్పాన్సర్ చేస్తానంది జజ్జనకడి జనారే జణకు జన జనారే.. కిలోల కిలోల పులిహోరే ;-)

శేఖర్ పెద్దగోపు

ఇక్కడ నేను చెయ్యి నాకేసుకుంటున్నాను....ప్లీజ్ మరికాస్త వడ్డించరూ!!! :)

sunita

నేను చింతపండు పులుసు బదులు టోమాటోలు వేస్తాను. మిగిలిన రెసిపీ మీరు చేసినట్లే.

సిరిసిరిమువ్వ

అసలు కన్నా మీ కొసరు ముఖ్య విషయం నాకు బాగా నచ్చింది;)

Gulabi

Jyothi garu..e curry chala bavundi..nenu try chesta..annattu..me karthika bhojanalu specials chusi naku kuda oka blog start cheyalani anipinchi start chesesa..gulabipuvvu.blogspot.com..dayachesi deenini kudali ela pettalo cheppagalaru

జ్యోతి

Gulabi గారు,
చాలా సంతోషం..support@koodali.org కి మీ బ్లాగు అడ్రస్ ఇస్తూ మెయిల్ పెట్టండి..

జ్యోతి

రెండు రోజుల ముందు చెప్పినా ఒక్క పురుష బ్లాగర్ వంట వచ్చు అని ధైర్యంగా చెప్పలేదు,రాయలేదు. అదన్నమాట సంగతి.వంకలు పెట్టమంటే మాత్రం రెడీ..

భావన,
భాస్కర్ గారిని పాపం మరీ అలా భయపెట్టేస్తావేంటి?అవునూ ఈ పులిహోర గోలేంటి? అమ్మాయిలందరూ ఇలా వాయించేస్తున్నారు???

జయ

జ్యోతి గారు, అబ్బ..కాప్సికం కూర .. చూస్తుంటేనే భలేగుంది. ఆ కూర మొత్తం మీరే తినేయండి. మీ వారికి అస్సలు పెట్టద్దు గాక పెట్టొద్దు. సరేనా!

మాలా కుమార్

అమ్మయ్య , వెజిటేరియన్ వంట పెట్టారుకదా , థాంకు . బాగుంది మీ కాప్సికం మసాలాకూర .

కొత్త పాళీ

ఓయబ్బో, యీమాత్రం దానికి పురుషబ్లాగర్లు కావల్సొచ్చారా? మేము చేసేదేదో సైలెంటుగా చేసేస్తాం .. మీలాగా గొప్పలు చెప్పుకోం!!!

భావన

జ్యోతి, వూరుకో జ్యోతి, ఇంక నీ అండ చూసుకుని భా.రా.రే మరీ అమయకం గా అవునండి అంటూ వస్తారు ఇప్పుడూ. ఓ పులిహోర గోల తెలియదా ఇది చదువు.
http://chiruspandana.blogspot.com/2009/09/blog-post_21.html

భావన

కొత్త పాళి గారు సైలెంట్ గా చేసేస్తారా, మీరు చేసేక మేము సైలెంట్ గా పారేస్తామా పర్లేదు లే నిజం ఒప్పుకోండీ.. అదుగో జ్యోతి నేను చూసే సా మనం లేము అనుకుని తల నెమ్మది గా వూపేసేరు.. ఇంకా మాట మార్చినా మేము ఒప్పుకోము ఒప్పుకోము.

జ్యోతి

కొత్తపాళీగారు,

భలే కవరింగ్ ఇచ్చారే!!! అసలు వస్తేగా చేయడానికి సైలెంటుగా ఐనా, చప్పుడు చేస్తూ ఐనా. మేము ఇలా మాటలు చెప్పం. చేసి చూపిస్తాం . చూపించాము కూడా. అందరి ఫోటోలు స్వంతమే..హన్నా!!

psm.lakshmi

బాగుంది జ్యోతీ. వేరే కామెంటు రాశా. పోస్టు కాలేదు. ఇది టెస్టింగ్.
psmlakshmi

రవి

కొత్తపాళీ జిందాబాద్!

జ్యోతక్కా, ఫోటోలు బాగున్నంత మాత్రాన, మహిళలు నలభీములకు సాటి రాలేరు! (భీమత్వం - తినడంలో, వండడంలోకూడా)

తృష్ణ

ఇప్పుడే వచ్చానండి నేను (లేట్ కమ్మర్ ని)....బాగుందండీ...టమోటొలది పుస్తకంలో పడ్డప్పుడు చూసానండీ.

భమిడిపాటి సూర్యలక్ష్మి

ఇంతకీ మా జున్ను రుచి చూసారా లేదా?

భాస్కర రామిరెడ్డి

జ్యోతక్కా, వీళ్లందరూ చూడండి నన్ను పులిహోరకలపమంటున్నారు. నాకు రాదంటే వినరే. మీరే నేర్పించాలి మరి :)

జ్యోతి

ఏంటి రవి..కొత్తపాళీగారికి జై అంటున్నావు..నలభీములైనా, స్టార్ హోటల్ ముఖ్య వంటగాడైనా(షెఫ్) ఇంటికొచ్చు భార్య చేతివంటే తింటాడు.:)

జ్యోతి

భాస్కర్ గారు,

సరే మీకు పులిహోర ఎలా చేయాలో నేను నేర్పిస్తాను.షడ్రుచుల మీద ఆన..

భావన

వేసేడు కదా ఈ పిల్లాడు మీకు టోపి, నేను గుండిగల పులిహోర కలిపేస్తానని తెగ చెప్పి నీ దగ్గర అమాయకం గా తెలియదంటే నువ్వేమిటి జ్యోతి అలా పడి పోయావు.

భాస్కర రామిరెడ్డి

ఇద్దో అమ్మాయ్ ఓ భావనా, మా జ్యోతక్క ఏదో దయతలచి నాకు పులిహోర నేర్పిస్తానంటే, నీకెందుకమ్మా అంత వులుకు? :)

శ్రీలలిత

కాప్సికం కూర చాలాబాగుంది. ఏమైనా మిరపకాయ రుచే వేరు. మంచి కూర చెప్పారు వనభోజనాలకి.

వేణూశ్రీకాంత్

బాగుందండీ.. ఇది నాకు ఇష్టమైన కూరల్లో ఒకటి. పక్కా రెసిపి ఇచ్చినందుకు ధన్యవాదాలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008