Wednesday, November 18, 2009

పేట రౌడీకి పుట్టినరోజు ఇనాం..

ఇయాల మీకో చిన్నకథ చెప్పాలే . మా పేటలో అదే బస్తీలో ఒక రౌడీ ఉన్నడు. చిన్నగున్నపటినుండి అన్నీ రౌడీ ఎశాలే. ఏదో ఒక లొల్లి జేసుడు ఇంట్ల తన్నులు తినుడు. కాని మస్తు సదివేటోడు. సదూకుంటప్పుడు పోరీలను మస్తు సతాయిస్తుండే. పెళ్లైనంక అన్ని తగ్గినయ్. ఇయాల ఆ రౌడీ పుట్టినదినమని గప్పుడెప్పుడో అన్నట్టు యాదికొచ్సింది.. గీ మధ్య ఈ రౌడీ ఏం జేస్తుండో తెలుసా? చికెన్ బిరియానిల చింతకాయ తొక్కు కలుపుకుంటే ఎట్టా ఉంటది?.  బాలేగదా!! గట్ల పాటలు, మాటలు, బొమ్మలు అన్నీ కలిపి అందరినీ హైరాన్ చేస్తుండులే. అది చూసి నవ్వుకోనోళ్లు  ఉన్నరంటరా? అందుకే గిట్ల అందిరిని  దిల్ ఖుష్ చేస్తున్న మలక్ పేట రౌడీకి ఇగ ఏదైనా ఇనాం ఇయాలే గదా అని ఇది డిసైడ్ జేసినన్నట్టు.
Bharadwaj.. Many Happy Returns of the Day...

Thanku and Sorry ( you know why?) hehehe...

52 వ్యాఖ్యలు:

Malakpet Rowdy

COOL ONE! Thanks a LOT!!!!!

Malakpet Rowdy

But I am surprised you remember it!

చిలమకూరు విజయమోహన్

ముందుగా రౌడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.అయినా మీరేంటండి రౌడీగారికి ఓ నాలుగు కత్తులు,ఓ బకెట్టు నిండా కడప బాంబులు సమర్పించుకోవాలిగానీ ఇలా పాటలూ,నృత్యాలు బహుమతిగా ఇస్తే ఎలాగండి! :)

పరుచూరి వంశీ కృష్ణ .

rowdy gariki janma dina subhaakankshalu..

Malakpet Rowdy

Thanks Vijayamohan garu and Vamsi garu!

Malakpet Rowdy

అన్నట్టు నేను సతాయించింది మామూలు పోరిలని కాదు - రేడికల్ ఫెమినిష్టు పోరీలని!

మంచు

Hi Malak - జన్మదిన శుభాకాంక్షలు

గీతాచార్య

అన్నట్టు నేను సతాయించింది మామూలు పోరిలని కాదు - రేడికల్ ఫెమినిష్టు పోరీలని!

LOL brother LOL.

Very HAPPY birthday

భాస్కర రామిరెడ్డి

ఇనాములు మీరవ్వండి, శుభాకాంక్షలు మేము చెపుతాము.
రౌడీ గారు ఓ ఎర్ర రిబ్బను తలకు కట్టి, ఓ ఎర్ర నిలువు బొట్టుపెట్టి,రెండు చొక్కాగుండీలూడదీసి, బుర్రమీసమేసుకోని, కేక్ ను కత్తితో కసుక్కున పొడిచి మనందరకీ ఓ ముక్క ఇస్తాడేమో చూద్దాం.

భరద్వాజ్, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

విశ్వ ప్రేమికుడు

మలక్ పేట రౌడీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

cbrao

"అన్నట్టు నేను సతాయించింది మామూలు పోరిలని కాదు - రేడికల్ ఫెమినిష్టు పోరీలని!" -ఎవరు వీరు? వీళ్ల సిద్ధాంతాలేమిటి?

భావన

భరద్వాజ్, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

భావన

జ్యోతి, బలే చేసేవే మన రౌడీ గారికి శుభాకాంక్షల వీడియో..

Malakpet Rowdy

మంచుపల్లకి, గీతాచార్య, భారారె, విశ్వ ప్రేమికుడు, భావన

ధన్యవాదాలు అందరికీ.

భారారే - కేక్ చాన్సు లేదు - నేను గుడ్లు తినను.. కానీ హాట్ బ్రెడ్స్ నుండి ఎగ్-లెస్ కేక్ పంపిస్తే మాత్రం రెడీ :))

రావు గారూ,

వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు.

ఈ విషయంలో స్త్రీలని 4 రకాలుగా విభజించచ్చు.

1. మామూలు స్త్రీలు - చీళ్ళతో ఎవరికీ పేచి ఉండదు
2. ఫెమినిష్టులు ( ఫెమినిష్టులు అనేకన్నా మహిళా హక్కుల కార్యకర్తలంటే ఉచితంగా ఉంటుంది) - వీళ్ళు సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలని వ్యతిరేకిస్తారు - వీళ్ళతో కూడా సాధారణ జనాలకి పేచి ఉండదు.
3. పురుషవాదులు - స్త్రీ జన్మనెత్తిందే పురుషుడికి సేవలు చెయ్యడానికనే బాపతు - నిజంగా చిరాకేస్తుంది వీళ్లని చూస్తే
4. ఇక నాలుగవరకం - నిజంగా చిర్రెతుకొచ్చేలా చేసే రకం - రేడికల్ ఫెమినిష్టులు - ప్రపంచంలో స్త్రీల కష్టాలన్నిటికీ కారణం పురుషుడే అని తేల్చేసే రకం - పురుష ద్వేషుల గుంపన్నమాట - "మా పక్కింటమ్మాయి నెల తప్పినా, పరీక్ష తప్పినా దానికి కారణం పురుషుడైన శ్రీరాముడు సీతాదేవి చేత త్రేతాయుగంలో అగ్ని ప్రవేశం చేయించడమే - పురుషులందరూ పురుగులు" అని ఆడిపోసుకునే రకాలు. వాళ్ళ సిధ్ధాంతం - "అరిటాకు ముల్లు మీద పడ్డా, ముల్లు అరిటాకు మీద పడ్డా, అసలు అరిటాకు దగ్గరకే ముల్లు రాకునా, జనాలు తిట్టాల్సింది ముల్లునే"

As some wisecrack said ...

If a man looks at them, then he is not a Gentleman
If he doesn't then he is not a man :))

మైత్రేయి

భరద్వాజ్ గారు, పుట్టిన రోజు శుభాకాంక్షలు..

Malakpet Rowdy

Thanks Maitryi garu

మాలా కుమార్

భరద్వాజ్ గారు ,
జన్మదిన శుభాకాంక్షలు .

భావన

రౌడీ గారు నేను బోస్టన్ నుంచి మీకు ఎగ్గ్ లెస్స్ కేక్ హాట్ బ్రెడ్స్ దే కావాలా పంపుతాను లే.. మరి మా వూరు నుంచి మీ వూరొచ్చే సరికి ఎలా వుంటుందో ఏమో. భా రా రే మీ వూరి హాట్ బ్రెడ్స్ లో పార్ధ వుంటాడు ఆయనకు నా పేరు చెప్పి ఒక కేక్ పంపమని చెప్పండి మన రౌడీ గారి పేరు మీద.

Malakpet Rowdy

Thanks Malakumar garu

Sure Bhavana garu, either (or both) would do!

amma odi

మలక్ పేట రౌడి,

ఇలాగే రౌడి వేషాలు వేస్తూ, కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లు నాయనా!

Bhardwaj Velamakanni

Thanks Adilakshmi garu. With your support, I can!

మంచు

భావన్ గారు.. నేను బొస్టన్ నుండి డాలస్ వెలుతున్నా.. ఆ కేకేదొ నాకిస్తే ఒ అడుగు అటేసి మలక్ కి అందజెస్తా.. వీకెండ్ వరకు మిగిలి వుంటే :-) ..

పరిమళం

భరద్వాజ్ గారు , పుట్టినరోజు శుభాకాంక్షలు !

కొత్త పాళీ

ha ha
Good one. you shd have changed the video at "monikaaaa oh my ..." bit.
Happy b'day, Rowdy!

పరిమళం

భరద్వాజ్ గారు , పుట్టినరోజు శుభాకాంక్షలు !

వేణూశ్రీకాంత్

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భరద్వాజ్ గారు.

జ్యోతి గారు వీడియో అదుర్స్ :-)

Anonymous

ర్ర...ర్ర...ర్రవిడీగారికి జ్జ..జ్జ...జ్జన్మదిన శ్సు...శ్సు...భాకాంక్షలండీ. (అబ్బే నత్తికాదండి.....భయంతో వణికిపోతూ చెప్పానన్నమాటండి )

duppalaravi

మలక్ పేట రౌడీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

భావన

మంచు పల్లకి గారు: ఐతే woburn లో హాట్ బ్రెడ్స్ కు వెళ్ళి ఉమా మేడం చెప్పిందని చెప్పి ఎగ్గ్ లెస్స్ pineapple ఎగ్గ్ లెస్స్ black Forest తీసుకు వెళ్ళి రౌడి గారికి మీ పేరు నా పేరు చెప్పి అహ వద్దులే మన బ్లాగర్లందరి తరపునా ఇచ్చేయండి. :-)
డల్లాస్ హాట్ బ్రెడ్స్ లో కూడా ఎగ్గ్ లెస్స్ బాగుంటుందేమో కదా.. కాని నాకెవ్వరు తెలియదే అక్కడ.. :-(

లలితా : కేక... ;-)

శ్రీనివాస్

శాంతి చౌదరి గారికి ....... పుష్కరాల్లో తపిపోయిన మీ తమ్ముడు శ్రీనివాస్ తెలియచేసుకుంటున్న పుట్టిన రోజు శుభాకాంక్షలు

మేధ

అసలే పేట రౌడీ గారట! శుభాకాంక్షలు చెప్పకపోతే లేనిపోని తంటా ఏమో!!
Just Kidding :)

జన్మదిన శుభాకాంక్షలు భరద్వాజ్ గారు!!!

సుభద్ర

రౌడిగారు,
పుట్టినరోజు శుభాకా౦క్షలు....
భావనగారు ప౦పగా,మ౦చిపల్లకి గారు తెచ్చిన కేకు నా పార్శిల్ నాకు అ౦దుతు౦ది కదా!!!!మర్చిపోక౦డోయ్ అ౦తా కలిసి.....చాకు తో కోసినా,కత్తి తో పోడిచినా,బా౦బు పెట్టి పేల్చిన నాకు ఓకే సరేనా....
జ్యోతిగారు,
సూపర్ గా రిమిక్సి చేశారు..హలో ప్రె౦డ్స్ అ౦తా ఒక ఓఓఓ వేసుకో౦డీ రడీ నా!!!..జ్యోతిగారికి దూమ్ తఢకా దూమ్ ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ..

sunita

భరద్వాజ్ గారు,
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

జాహ్నవి

భరద్వాజ్ గారు,
జన్మదిన శుభాకాంక్షలు.

నేస్తం

జన్మదిన శుభాకాంక్షలు :)

శ్రీలలిత

మలక్ పేట రౌడీ గారికి,
జజ్జనక జనక... పుట్టినరోజు శుభాకాంక్షలు..

Malakpet Rowdy

Thanks a lot

Parimalam
Kottapaali
Venu Srikant
Lalita
Duppala Ravi
Sreenivas
Medha
Subhadra
Sunita
Jahnavi
Nestam
Srilalita


This is really a surprise

kiranmayi

ఇది ఎవరి బ్లాగ్? అహ, అసలు ఇది ఎవరి బ్లాగ్ అని అడుగుతున్నా? జ్యోతి బ్లాగ్. అవునా? అలాంటప్పుడు రౌడీ గారు ఎందుకు సమాధానాలు చెప్తున్నారు? ఈ హక్కు ఆయనకీ ఎవరిచ్చారు?

(whisper) ఆయనది మా ఊరు కాదు కాదా? అందుకని నా ఇంట్లోనించి నేను ఇష్టం వచ్చినట్టు మాట్టాడెస్తా. అదీ సంగతి.

Happy Birthday Bharadwaj.
మీ ఆవిడ మీరు పోరిలని సతాయించే టైపు అని చెప్పలేదే?

జ్యోతి
"monica.... " బిట్ కి మస్తు classical పాటలు పాడేటొల్ల వీడియొ పెట్టనుండే. మస్త్ ఉంటుండే. గది సరే గాని, గీ వీడియొలు చేసుడు ఎప్పడిసంది చేస్తున్నరు. వంటలు చేసుడే వచ్చనుకున్నం. వీడియొ లు కూడా చేస్తారా? మాకు తెల్వనే తెల్వద్.

శ్రీనివాస్ పప్పు

అరే రౌడీ ఖేల్ ఖతం,దుకాణ్ బంద్ చేయ్ బిడ్డా(హ్హహ్హహ్హ)...
అందుకో నా హృదయపూర్వక శుభాకాంక్షలు నీ పుట్టినరోజున,ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ...
పప్పు రౌడీ...

జ్యోతి

కిరణ్,,

ఇది నా బ్లాగైనా పార్టీ భరధ్యాజ్ ది కాబట్టి అతనే జవాబులు చెప్పాలి. అందుకే నేను మోడరేషన్ కూడా పెట్టలేదు. పెళ్లికాకముందు పోరీలను సతాయిస్తుండే కాని పెళ్లాం చేతిలో ఆ పప్పులు ఉడుకుతాయా?మనకు తెలీనీ కధలా చెప్పండి?:)

ఇగ ఈ వీడియోల సంగతికొస్తే.. గీ మధ్యనే ఈ రౌడీతోనే మిక్సింగ్ నేర్చుకున్నలే. ఎట్లుందంటవ్. ఇంకా షురూలనే ఉన్న కదా? మా ఇంట్ల రోజు ఎన్ని రీమిక్సులు అనుకున్నవ్? గదే ఇక్కడ జేస్తున్న ఈ కంప్యూటర్ పెట్టితో? అంతా మన చేతి పనే కదా? వంటైనా, వీడీయోలైనా??

కొండముది సాయికిరణ్ కుమార్

Hi Malak - Many Many Happy Returns of the Day.
May God Bless with you Peace and Prosperity.
W/Regards - Saikiran

ఓ బ్రమ్మీ

అరేయ్ .. ఎవుడ్రా ఈడు!! గిదేందో పుట్టిన రోజంట.. పదండ్రి ఓ లుక్కేసుకొద్దాం..

ఒరేయ్ రౌడీ భరద్వాజ్.. ఏం జేస్జున్నావ్.. ఏందిరా.. పార్టీ జేసుకుంటున్నావ్.. సరేగానీ, ఓ రెండు బాటిల్స్ గిటు పంపు.. ఏందీ.. ఆడేడో గూచున్ని రుబాబ్ జేస్తున్నావంట. కొడకా!! నా సంగతి నీకెరుకలే.. నేను గాని ఒక్క వీల గానీ ఏసిన్నో.. వందేళ్ళు బతుతావ్ బిడ్డా.. ఏంది ఏసేదా.. అహ ఏసేదా .. ఎయ్యమంటావా.. సెప్పు ఏసేదా..

చెల్ తీయ్.. ఏదో మంచి మూడ్లో ఉన్నట్టున్నావ్.. మంచి గుండు.. మన ఇలాకాలోకి ఎవ్వురొచ్చినా నా పేరు సెప్పు. గంతే మల్లా.. ఏంది ఇష్ చెయ్యలేదంటునావ్.. పోరాబాయ్ పో.. మస్త్ గా కుసీ సేసుకో..

నలుగుర్ని మంచిగా సూత్తూ వందేల్లు సుకంగా ఉండ్రా బాయ్..

Malakpet Rowdy

hehe LOL

Thanks Kiranmayi, Srinivas, Saikiran & chakravarti

ఓ బ్రమ్మీ

ఏమిందారా!! గీడు ఆల్లకు అల్లకు మంచిగా సమాదానం ఇత్తాండు .. మనకేంది, ఉత్త నవ్వు పడేశిండు.. దీంన్ తడి పోచమ్మ గుడి, నన్నాపకండెహె.. కొడుకుని తల్చుకుని ఒక్క వీల వేశానంటే వందేళ్ళు బతికి సత్తాడు.. నాయాల్ది ఏటనుకుంటున్నాడో..

మరియాదగా ఏదోటి చెప్పాను లేదా ఏదో ఒక కెలుకుడు కెలమను లేదంటే, ఈడ వీల వేశనంటేనా వరం ఆడ తగులుద్ది..

తంబీ!! సెప్పింది సమజ్జయిందా.. లేక నేనే రావాల్నా.. ఏటంటావ్??

Malakpet Rowdy

LOL LOL

ఓ బ్రమ్మీ

కొడకా .. ఏందిరా .. సిన్న సిన్న ఇస్మైల్స్ ఇస్తాండావ్.. గిదిగో ఈడ అప్పుడే బేస్తోరం వచ్చేసింది, గాబట్టి వదిలేస్తుండా.. పో..

మంచిగా ఎంజాయ్ సేసుకో.. మల్లీ పాలి సూసుకుందారి, నీ పతాపమో నా పతాపమో..

Bhardwaj Velamakanni

వామ్మో ఈయన నాకన్నా పెద్ద రౌడీలా ఉన్నాడే?

జ్యోతి

మరే.. గీయన బేగంపేట రౌడీ. ఇంటిపక్కనే పోశమ్మ గుడి.ఇగ ఎప్పుడంటే అప్పుడు సుక్కేసుకున్నా, ఏసుకోకపోయినా శిగమొస్తది. ఈ ఇద్దరు రౌడీలు ఏంజేస్తరో మాకు తెల్వద్...

కొత్త పాళీ

@చక్రవర్తి .. అన్ని యాసలు కలిపి పచ్చడి నూరేశారుగా? :)

Malakpet Rowdy

50వ కామెంట్ నాదే నాదే నాదే!

కెక్యూబ్ వర్మ

Sorry for the late. Many happy returns of the Day. తెలుగు బ్లాగ్స్ లో ఇప్పుడే చూసాను. ఆలస్యానికి మన్నించు మిత్రమా..

Malakpet Rowdy

Thanks Varma garu.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008