Thursday, December 10, 2009

ప్రపంచ తెలుగు బ్లాగర్ల సమావేశంప్రతి సంవత్సరం డిసెంబరు నెల రెండవ ఆదివారం తెలుగు బ్లాగర్ల దినోత్సవం గా జరుపుకుంటున్నాము. హైదరాబాదులో ఉన్నవారు ఈ ఆదివారం జరిగే సమావేశంలో పాల్గొనవచ్చు. కాని దేశ విదేశాల్లో ఉన్న ఇతర బ్లాగర్లు కలవడం ఎలా అనే దానికి ఒక పరిష్కారం ఉంది. అదే ఆన్ లైన్ సమావేశం. కూడలి కబుర్ల గదిలో. ఎల్లుండి శనివారం 12.12.2009 రోజు ఈ సమావేశం నిర్వహించబడుతుంది. తెలుగు బ్లాగు రాసే ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం. రండి. కొత్త , పాత అనే తేడా లేకుండా కాస్సేపు ముచ్చటించుకుందాం. చర్చించుకుందాం. సందేహాలు తీర్చుకుందాం. అందరికీ ఇదే సాదర ఆహ్వానం.


వేదిక : కూడలి కబుర్లు - http://chat.koodali.org/
తేది : శనివారం 12.12.2009
సమయం : సాయంత్రం ఆరు గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం )

18 వ్యాఖ్యలు:

Ravi

ఈ సారి సమావేశం కూడా కృష్ణకాంత్ పార్క్ లోనేనా?
ఈ తెలుగు సభ్యులే కానవసరం లేదు కదా?

Srujana Ramanujan

Last vachhaanu kadaa

జ్యోతి

రవిగారు,
ఈ ఆదివారం జరిగేది బ్లాగర్ల సమావేశం. e తెలుగు సమావేశం కాదు.తెలుగు బ్లాగులు రాసేవాళ్లు, చదివేవాళ్లు హజరు కావొచ్చు.

Sujata M

I wish the meeting success. I think 12/12 is a special day. Zee TV lo mega final undi.. ma oorlo chala meetinglu unnayi. aadhyaatmika, saamskritika samaaveaSaaloo unnaayi. busy day.

uma blog

eppudu blogers samaavesam hyd lo ne jarugutundaa ....Banagalore lo jarugutundaa eppudynaa

జ్యోతి

ఉమగారు,

బెంగుళూరులో కూడా తెలుగు బ్లాగర్లు ఉన్నారు. ఒకటి రెండుసార్లు సమావేశమయ్యారు కూడా. ఇప్పుడు కూడా బెంగుళూరు బ్లాగర్లు సమావేశం ఏర్పాటు చేసుకొవచ్చు.

Anonymous

ఆహ్వానానికి ధన్యవాదాలు. ఇది కేవలం ఆన్‌లైన్‌కే పరిమితమా.. లేక బహిరంగ సమావేశమేమైనా ఉందా..
రవిగారు.. కృష్ణకాంత్ పార్క్‌లోనా అని అడిగారు.. దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ కామెంట్ కైనా జవాబు ఇస్తారని ఆశిస్తున్నాను..
-సతీష్, www.24gantalu.co.cc
న్యూస్ కోసం తప్పక చూడండి

జ్యోతి

ఇది ఆన్ లైన్ సమావేశం. ఆదివారం జరిగేది బహిరంగ సమావేశం హైదరాబాదు కృష్ణకాంత్ పార్క్ లో..

శ్రీ

బ్లాగర్ల సమావేశం 14 అన్నారే? అది 12 కి మార్చారా?

జ్యోతి

శ్రీ,

లింకులో ఇచ్చింది గత సంవత్సరపు బ్లాగర్ల దినోత్సవం. ఈసారి రెంఢవ ఆదివారం డిసెంబర్ 13 అవుతుంది. 12న జరిగేది అన్ లైన్ సమావేశం.

swapna@kalalaprapancham

mari sunday krishnakanth park annaru, time epudu?

శ్రీ

ఓ...నేను 14 ఉదయం హైదరాబాదుకి వస్తున్నా

బ్లాగర్లని బుక్ స్టాలులో కలుస్తాను

Anonymous

జ్యోతి గారూ,
నేను క్రొత్త బ్లాగర్ ని. మన తెలుగు బ్లాగరుల సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకోవచ్చా. కృష్ణ కాంత్ పార్క్ లో సమావేశం ఎన్ని గంటలకి?
రాజన్
http://naagola.wordpress.com/

జ్యోతి

ఆదివారం సాయంత్రం 3 గంటలకు.కృష్ణకాంత్ పార్క్.యూసుప్ గుడా.హైదరాబాదు

సి.బి.రావు : 94934 04866
వీవెన్: 98664 95967

పరుచూరి వంశీ కృష్ణ .

విజయవంతం కావాలని ఆశిస్తున్నాను
నాదొక చిన్న సందేహం బ్లాగ్ కి తెలుగు పదం ఏమైనా ఉందా ?

Unknown

బ్లాగ్ అనే ఆంగ్ల పదానికి ఈ క్రింది వాటిల్లో ఏ అర్థం సరిగ్గా సరిపోతుందో చూడండి. మీకు తోచిన ఇతర అర్థాలు కూడా వ్రాయండి.
అద్దం
తెర
యవనిక
మనసు
అన్నది-విన్నది
అనుకోలు-వినుకోలు
బాగోగు

Rajasekharuni Vijay Sharma

ధన్య వాదాలు జ్యోతి గారు. మీ వల్లే ఈ రోజు మన బ్లాగర్లు కొందరితో కబుర్లాడ ( చాట్ చెయ్య ) గలిగాను. రేపు కూడా కలుస్తాను.

జ్యోతి

నిన్న ప్రపంచ తెలుగు బ్లాగర్ల సమావేశం చాలా ఘనంగా జరిగింది. ముప్పైకి పైగా బ్లాగర్లు హాజరయ్యారు. చాలా మంది కొత్తవాళ్లే. ఐదు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి పదకొండు వరకు కొనసాగింది. ఏడాదికొక్కసారి కాక ప్రతినెల జరగాలని కొందరు బ్లాగర్ల ఉవాచ. దానిదేముంది. తప్పకుండా జరుపుకోవచ్చు. మీరే నిర్ణయించండి.. ఇక ఈ సమావేశ నివేదిక నేను ఇవ్వలేను. పాల్గొన్న బ్లాగర్లు మీ అనుభూతులు, పరిచయాలు, సలహాలు,ముచ్చట్లు పంచుకోండి. ఇక్కడైనా సరే , మీ బ్లాగైనా సరే..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008