Monday 14 December 2009

వెచ్చదనపు స్పర్శ - ప్రమదావనం

అసలే చలికాలం. బాగా చలిగా ఉంది. స్వెట్టర్ వేసుకోవడం మర్చిపోవద్దు. చలికి బయట తిరగొద్దు. ఉలెన్ బ్లాంకెట్ కప్పుకోండి. చెవులలో దూది పెట్టుకోండి. మఫ్లర్ కట్టుకోండి.. ఇలా ప్రతి ఇంట , ప్రతి చోట ఈ కాలంలో వినిపించే, పాటించక తప్పని మాటలు కూడా.


కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి అవసరం. కాని ఎందరో అభాగ్యులకు ఇది అందని ఫలమే.. కూడు ఎలాగో దొరికినా, గూడు లేకున్నా ఎక్కడ కాసింత జాగా దొరికితే పడుకుంటారు.. కాని గజ గజ వణికించే చలిలో దుప్పటి లేకుండా పడుకునే వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తారు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యాన్ని చూసి, చలించి, వారికి ఇతోదికంగా సహాయం చెయాలని ప్రమదావనం సంకల్పించింది. ఐతె ఎవరు వారు? ఎచటి వారు? అనే వివరాలు అడగకుండా, చెప్పకుండా నిశ్శబ్దంగా సహాయం చేయాలని నిర్ణయించాము. పదివేల విలువైన ఉలెన్ రగ్గులు కొని నిన్న అంటే ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆదివారం ఉదయం నేను , మా అబ్బాయి , వాడి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. ఉదయం మూడుగంటలకు బయలుదేరి ఫుట్ పాత్ ల మీద, దుకాణాల ముందు చలికి ముడుచుకుని పడుకున్నవారికి నిద్రాభంగం కలగకుండా దుప్పట్లు కప్పేసి వచ్చేసాము. ఒకటి రెండు చోట్ల మాత్రం కొందరు మేల్కొన్నారు. ఈ దుప్పట్ల ఎవరికి బడితే వాళ్లకి ఇవ్వలేదు. ఎక్కువగా ముసలివాళ్లు, పిల్లలు, ఆడవాళ్లకే ప్రాధాన్యం ఇచ్చాం. చాలా మంది కనీసం కప్పుకోవడానికి బట్ట లేక ప్యాకింగ్ చేసే ప్లాస్తిక్ సంచుల దుప్పటి కప్పుకున్నారు. మూడు నాలుగు చోట్ల హటాత్తుగా వెచ్చగా అనిపించిందేమో రగ్గు కప్పగానే భయంతో గబుక్కుని లేచారు. మళ్లీ పడుకున్నారు. చాలా మందికి తమకు రగ్గులు ఎవరు కప్పారో కూడా తెలీదు. మేము శబ్దం లేకుండా వెళ్లిపోయాము మరి.. ఈ కార్యక్రమం కోసం సుమారు ఇరవై కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది. హిమాయత్ నగర్, నెక్లేస్ రోడ్, సోమాజీగుడా, బేగంపేట్, అమీర్ పేట్, పంజగుట్ట, ఎస్.ఆర్.నగర్, మాసబ్ ట్యాంక్, మెహదీ పట్నం, ఆసిఫ్ నగర్, లంగర్ హౌజ్, ఖైరతాబాద్, చింతల్ బస్తీ, బషీర్ బాగ్.. ఇలా తిరిగి తెల్లవారుతుండగా ఆరుగంటలకు ఇంటికి తిరిగి వచ్చేసాం. అదేంటో !! అంత పొద్దున్నే లేచి అన్ని గంటలు బయట తిరిగినా బాధించని చలి , ఇంటికి రాగనే నేనున్నానంటూ కమ్మేసింది. :)

నేను గమనించిన మరో ముఖ్యవిషయం ఏంటంటే???ఇన్ని గంటలు తిరిగాము, ఇంతమందికి (సుమారు ఎనబై ఐదు) రగ్గులు కప్పి వెళ్లిపోయాము. ఒక్క పోలీసు కనబడలేదు., అడ్డగించలేదు. ఇలా తసమదీయులు బాంబులు గట్రా సులభంగా పెట్టే చాన్స్ ఉందికదా?? లేక మా మొహాలకు అంత సీన్ లేదనుకున్నారా? అప్పటికి మావారు భయపెట్టారు. వాతావరణం బాలేదు. తీవ్రవాదులనుకుంటారేమో . జాగ్రత్త! అడ్రస్ అడిగితే నా కార్డు ఇవ్వు అని ఇచ్చారు. దాని అవసరం పడలేదులెండి..

వితరణ నాదైనా. సంకల్పం ప్రమదావనం సభ్యులదే .. జయహో ప్రమదావనం.

48 వ్యాఖ్యలు:

ఓ బ్రమ్మీ

మంచి పని చేశారు. ఇలాగే పది కాలాల పాటు సంఘానికి మీకు చేతనైనంత సాయం చేస్తూ ఉండండి

నిషిగంధ

Amazing gesture!!
జ్యోతి గారు, అన్ని దుప్పట్లు కొనడం ఒక ఎత్తైతే అలా తెల్లవారుఝామున నిశ్శబ్దంగా కప్పిరావడం ఇంకో ఎత్తు!! మీకూ, మీ అబ్బాయికీ, తన స్నేహితులకూ ప్రత్యేక కృతజ్ఞతలు!!

మధురవాణి

చాలా చాలా చాలా మంచి పని చేసారు జ్యోతి గారూ.. పొద్దున్నే మెలకువ వచ్చాక చూసుకున్నవారు క్రిస్మస్ తాత వచ్చి ఇచ్చాడనుకుంటారేమో :) :)
జయహో జ్యోతి గారూ.. జయహో ప్రమదావనం.!!

శ్రీనివాస్

జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం
జైయహో ప్రమదావనం జైయహో ప్రమదావనం

శేఖర్ పెద్దగోపు

జ్యోతి గారు, ప్రమదావనం సభ్యులందరికీ, మీకు హేట్సాఫ్...అలాగే మీ అబ్బాయి, తన స్నేహితులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయండి.

హను

జ్యోతి గారు మంచి పని చేశారు.
మీ అబ్బాయికీ, తన స్నేహితులకూ ప్రత్యేక కృతజ్ఞతలు!!

psm.lakshmi

మొత్తానికి అనుకున్నది సాధించారు. బ్రేవో. రెస్ట్ అయిపోయిందిగా. నెక్స్ట్ ఏమిటి
psmlakshmi

వేణూశ్రీకాంత్

అద్భుతం జ్యోతిగారు, చాలా మంచిపనిచేశారు. అంత తెల్లవారుఝామున ఇరవై కిలోమీటర్లు తిరగడం నా ఊహకు కూడ ఆందని విషయం. మీకు మీ అబ్బాయి కి అతని మితృలకు, ప్రమదావన సభ్యులకు.. పాల్గొన్న అందరికీ అభినందనలు.

శ్రీలలిత

జ్యోతీగారూ,
ఆదర్శాలు అందరికీ ఉంటాయి. కాని ఆచరించే వారే మహాత్ములవుతారు. మిమ్మల్ని, మీ అబ్బాయినీ, అతని స్నేహితులనీ ఎంత అభినందించినా తక్కువే. ఆ భగవంతుడు మిమ్మల్ని సదా సంరక్షించుగాక.

సిరిసిరిమువ్వ

మొత్తానికి అనుకున్నది చేసారు. మీ అబ్బాయికి తన స్నేహితులకి ప్రమదావనం తరుపున కృతజ్ఞతలు తెలియచేయండి.

పరిమళం

జ్యోతిగారు , చాలా మంచిపని ! తెల్లవారు ఝామున ..అలా ..ఆ డేరింగ్ మీకే సాధ్యం ! హాట్సాఫ్ టు యు !మీకు హెల్ప్ చేసినవారికీ ..మిమ్మల్ని ముందు భయపెట్టినా తర్వాత ప్రోత్సహించిన మీ శ్రీవారికీ కృతజ్ఞతలు .

భావన

Wonderful Job Jyothi. శ్రీ లలిత గారన్నట్లు ఆడర్శాలు అందరికి వుంటాయి ఆచరించేది కొందరే. మీకు మీ అబ్బాయి కి, అబ్బాయి స్నేహితులకు నా మనః పూర్వక అభినందనలు. 3 గంటలకు లేచి నగర వీధులలో తిరిగేరా. hats off jyothi.

Rani

awsome work.
good job everyone.

Hima bindu

అభినందనలు మీకు మరియు సభ్యులందరికీ .

Unknown

చాలా మంచి పని చేసారు. మీ అందరికీ నా అభినందనలు.

keshav

excellent andi... me blog chala baga design chesaru... keep it up...

Ravi

ఏమని చెప్పాలి!!. కంటి నిండా నీరు కమ్మేసినపుడు నా మెదడు మొద్దుబారిపోతుంది. దృష్టి మందగిస్తుంది. శరీరం జలదరిస్తుంది. కాస్త తేరుకుని ఈ నాలుగు మాటలు రాస్తున్నాను. great deed. ఈ పనికి సహకరించిన వారందరికీ హృదయ పూర్వక అభినందనలు.

జయ

చాలా మంచిపని చేసారు జ్యోతి గారు. కోరిక ఉండంగానే కాదు. ఆ విధంగా సేవ చేయగలిగే అవకాశం కూడా కలగాలి. ఈ రోజుల్లో అంత ధైర్యం చేసిన మీ బృందమంతటికి నా హ్రుదయపూర్వక జోహారులు. అభినందనలు.

cbrao

ఇన్నాళ్లూ క్రిస్మస్ తాతే అనుకున్నా ఇలా బహుమతులిచ్చే క్రిస్మస్ నానమ్మ కూడ ఉందని ఈ రోజే తెలుసుకున్నా. జ్యోతికి ప్రమదావనంకు హృదయపూర్వక అభినందనలు.

Ramani Rao

awsome work.
good job everyone.

swapna@kalalaprapancham

gr8 work.
asalu pramadaavanam enti?
nenu ipudu dinni wrong ga chaduvthanu. what is the meaning of this "pramadaavanam"

మాగంటి వంశీ మోహన్

భలేటోళ్ళండి బాబూ! మీ కార్పొరేటర్నో మీ ఇలాకాలో పేరున్న రాజకీయ నాయకుణ్ణో పట్టుకుని / లాక్కుని ఆ చలిలో ఈడ్చుకు పోకపోయారు. మాంచి కవరేజీ వచ్చేది ప్రమదావనంకి. ఆ పైన మీకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఫ్రీగా దొరికేది. దూరేసినతర్వాత ఏముంది - బోల్డంతమందికి కంబళ్ళు, తింటానికి కపోతాలూ దొరికేవి..ప్చ్ ..మాంచి చాన్సు పోగొట్టుకున్నారే. :)

ఏదేమైనా దాక్కుని చేసిన పనికి అభినందనలు. మీకూ, మీ కుటుంబానికి, చలిలో వణికినవారికి....అందరూ ఇలాగుంటే దేశంలో దరిద్రమూ, చలీ రెండూ వుండవు.

Kalpana Rentala

జ్యోతి,

ఆదర్శాలు వల్లించేవాళ్ళ జాబితాలో కాకుండా ఆచరించేవాళ్ళల్లో ఒకరైనందుకు మీకు,మరీ ముఖ్యంగా మీ అబ్బాయికి,అతని స్నేహితులకు అభినందన చందనాలు.

కల్పనారెంటాల

karthik

gr8 work jyothakka..

శివరంజని

hats off jyothakka మీకూ, మీ అబ్బాయికీ, తన స్నేహితులకూ !!

జ్యోతి

స్పందించిన వారందరికి ధన్యవాదాలు.

కాని చల్లటి వాతావరణంలో అన్నమయ్యపాటలు వింటూ ఖాళీ రోడ్ల మీద తిరగడం భలే ఉండింది.

స్వప్నగారు,
ప్రమదావనం అనేది మహిళా బ్లాగర్ల గ్రూపు. ఇందులో సభ్యులు అఫ్పుడప్పుడు ఇలా సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది ఐదో కార్యక్రమం.


వంశీగారు,

భలేవారండి. మంచిపనికి రాజకీయ నాయకులా? వాళ్ల మాటెత్తితేనే చిర్రెత్తుతుంది. నాకే అధికారముంటే "ఆపరేషన్ దుర్యోధన" తప్పదు.

విజయభారతి

adbutham jyothi garu saraina time lo saraina seva hats off

Kathi Mahesh Kumar

అభినందనలు.

sunita

అభినందనలు.

శ్రీనివాస్ పప్పు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా మన:పూర్వక అభినందనలు.

One Stop resource for Bahki

అంత తెల్లవారుఝామున ఇరవై కిలోమీటర్లు తిరగడం ... మేము కూడా TMAD.org తరుపున ౨౦౦౬ లో ఇలాగే పంచాము, ఒక సారి నేను బస్సు కోసము ఎదురుచూస్తూ పడుకొన్న ఒక సాధారణ వ్యక్తికి కూడా దుప్పటి కప్పితే అతను చాల నోచ్చుకొన్నాడు ! :(

Poodoori Raji Reddy

GOOD!

శిశిర

నమస్కారం జ్యోతి గారు. చాలా మంచి పని చేశారు. మీకు, మీ అబ్బాయికి, అతని స్నేహితులకు అభినందనలు.

mahipal

Jyothi garu,
appiciate your efforts.me karuna hrudyaniki andhukondi na abinadhanalu...
Nenu mee Pramadhavanam lo cherudhamante janmatha shadhyam kademo... emina exmptions isthe i am ready to join.

Srujana Ramanujan

Claps :-)

జ్యోతి

Mahipal గారు,

అస్సలే వీలు కాదండి. ఇది మహిళా బ్లాగర్లు ఆంతరంగిక గ్రూపు. సహాయ కార్యక్రమాలకు మీవంతు ఇస్తానంటే కాదనం. ఇలా బయటివారు, పురుష బ్లాగర్లు కూడా ప్రమదావనం సహాయ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు. ఇస్తున్నారు. మేము స్వచ్చందంగా విరాళాలు కూడబెడతాము. ఎవ్వరిని ఇవ్వమని అడగము, ఇస్తానంటే కాదనము..

skarutur

Good Job!!!

kaartoon.wordpress.com

వెచ్చదనపు స్పర్శ చదివాక ఇంట్లో వున్న నాకు వెన్నులో
చలేసింది. హాయిగా తలుపులేసుకొని రగ్గు కప్పుకున్నమనకు
అదేమిటో నిద్ర పట్టదు.పాపం ఎంతో మంది అలా కటిక నేల
మీద పడుకొని వణుకుతూనే నిద్ర పోతున్నారంటే మనసు
అదోలా ఐపోతుంది.మీ కృషి అభినందనీయం.ఒక్క పోలీసు
కనబడలేదని మీరన్న మాట మన రక్షణ నిర్వహణ ఎలా
వుందో తెలుస్తున్నది.ఏది ఏమైనా మీరు పిల్లలతో చేసిన ఈ
మంచి పనికి మరో సారి మీ ప్రమదావానాన్ని అభినందిస్తూ..
(సు)రెఖాచిత్రం

Unknown

Hello aunty, iam feelin sad that i cudn't be there in hyd. But the work u have done was excellent....Appreciate all u people!!!!!!

మరువం ఉష

Good job జ్యోతి. One deed to inspire many.

సుజాత వేల్పూరి

Excellent job! Congrats to you, Chaitanya, and his friend.

జ్యోతి

అందరికి ధన్యవాదాలు. ఇధి నా ఒక్కదాని సంకల్పం కాదు, ప్రమదావనం ది. ఒక్కోసారి ఒక్కొక్కరు భాధ్యత తీసుకుంటారు. ఈసారి నేను . వచ్చేసారి ఇంకొకరు.అంతే...

కథా మంజరి

చెప్పడానికి మాటలు రావడం లేదు ...మనసు ద్రవించి పోయింది ! ... నిజం ... ఆదర్శాలు వల్లించడం కన్నా, ఆచరించడం చాలా అవసరం ...
ఆ పని మీరు, ప్రమదావనం మిత్రులు చేసారు ...
మీరు గమనించారో , లేదో , కాని ...
సరిగ్గా మీరు ఈ సత్కార్యం చేస్తున్న సమయంలోనే కొందరు
మూర్ఖ శిఖామణులు ఈ దేశంలోనే, ఈ గడ్డమీదే ...చలికి ముడుచుకు పోయి దిక్కు లేక రోడ్ల ప్రక్క నిద్రిస్తున్న అభాగ్యుల మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసి. విసరీతంగా కొట్టారు ... ( కారణాలు ఏమైతేనేం ) టీబీలో చూసాను ...
సుమారు అదే సమయంలో మన భాగ్య నగరం వీధుల్లో మానవత్వం పరిమళించడం .. మున్ముందు ఎందరికో మార్గ దర్శకం కావాలి ...

jeevani

మీ అందరికి హృదయపూర్వక అభినందనలు !

ఆ.సౌమ్య

మనసు కదిలించే పని చేసారండీ.....జయహో ప్రమదావనం !

kalyan

super andi jyothi garu, mee laaga cheyyataniki try cheesthanu nenu kooda

Jyothi reddy

meeeku padabhivandanam ammaaa.....meelaanti vaallu padhi kaalaalu challaga undaali.....jyothi reddy from phoenix,az...

vasantham

చాల మంచి పని చేసారు,నిశ్శబ్దం గా చేసారు. పాల్గొన్న వారికి ,ప్రమదావనం సభ్యులకి, అభినందనలు. ఇన్నేళ్ళు అయినా ,మనకి స్వాతంత్ర్యం వచ్చి, ఇంక ఇలాగ వీధిలో, రోడ్డు మీద పడుకునే వాళ్ళు ఉన్నారు అంటే,అది మన దేశ దుర్భాగ్యం.అన్నిటికి, ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురు చూడడం కూడా వృధా ఏ..మనకి తోచినది మనం చేయడమే..అన్న సదుద్దేశం మీది. ఇంకా ,మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయగిగే శక్తి మీకు రావాలని ప్రార్ధిస్తూ..
వసంతం.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008