Sunday 27 June 2010

అంతర్జాలంలో అభిరుచులు - ఈనాడు


వంటకు వనితలకు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే కదా. అందరి అభిరుచులు, ఆకలి తెలిసి అన్నం పెడుతుంది అమ్మైనా, ఆలైనా.. అంతర్జాలంలో కూడా ఆహారంలో తమ అభిరుచులను చాటుతున్న వారికోసం సుజాత గారు అందించిన వ్యాసం ఈనాటి ఈనాడు వసుంధరలో .. థాంక్స్ సుజాత.. ఈ వ్యాసం కోసం వంటల గురించి రాసిన మహిళా బ్లాగులన్నీ తమ వ్యాసంలో పరిచయం చేసారు సుజాతగారు . కాని చివరి నిర్ణయం పత్రికల వాళ్ళదే కదా. మిగతావారు తప్పుగా తీసుకోవద్దు.

19 వ్యాఖ్యలు:

మాలా కుమార్

అందరికీ అభినందనలు .

Unknown

జ్యోతి పొద్దున్నే చూసాను ఈనాడులో మీ బ్లాగ్ గురించి చాల సంతోషం మీకు నా మహ్పూర్వక శుభాకాంక్షలు
Rekha
http://plantainleaf.blogspot.com/

శ్రీనివాసరాజు

ఇంట్లోనే కాదు.. బయటే కాదు.. ఇంటర్నెట్లో కూడా మేమున్నాం అని నిరూపించారు.. ఇది ఇంకా ఎందరికో ఆదర్శంకావాలని.. ఇలా వంటలే కాకుండా ఎన్నో ప్రయోగాలు చేయ్యాలని ఆశిస్తున్నాను.

అందరికీ నా అభినందనలు తెలుపుతూ

-శ్రీనివాసరాజు ఇందుకూరి

సి.ఉమాదేవి

ఈనాడు ఆదివారంకదా ఏది వండితే బాగుంటుందో అని ఆలోచించే పనిలేకుండా అంతర్జాలంలో అక్షయపాత్రను కుమ్మరించి కనువిందు చేస్తున్న వంటకాలను కమ్మగా ఎలా వండాలో తెలియచేస్తున్న వారికీ,ఇలాగే వంటల బ్లాగోగులు వివరిస్తున్న అందరికీ అభినందనలు. బ్లాగుదాత సుఖీభవ.

జ్యోతి

మాలా కుమార్, రేఖ, శ్రీనివాస్ గారు, ఉమగారు.. ధన్యవాదాలు...

swapna@kalalaprapancham

chala manchidi kani oka lotu asalina food blogs inka chala unnayi, atleast a blogs links anna pedithe bagundedi place ledanukunapudu.
nenu epudu edina vantakam kanipiste chalu fav's lo add chesukunta ala nenu collect chesina vantala blogs:

1) http://telugudanam-blog.blogspot.com/
2) http://bsuryalakshmi.blogspot.com/2009_07_01_archive.html
3) http://jyothivalaboju.blogspot.com/2009/10/blog-post_11.html
4) http://trishnaventa.blogspot.com/2009/09/blog-post_12.html
5) http://nalabhima.blogspot.com/2009/07/blog-post_29.html
6)http://everydaysuruchi.blogspot.com/2009/08/blog-post_20.html
7) http://manasvi-jaya.blogspot.com/2009/10/blog-post_10.html
8)http://sravanthivantillu.blogspot.com/2010/01/blog-post_29.html
9) http://uvratnam.blogspot.com/2010/03/blog-post.html
10) http://mssjdbhavani2009.wordpress.com/category/%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/
11) http://saisatyapriya.blogspot.com/search/label/%E0%B0%B0%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF%20%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B1%81%20.

nenu collect vatilo 3 ne vachayi anukunta :(

swapna@kalalaprapancham

ika asalu "http://telugudanam-blog.blogspot.com/" ee blog gurinchi ayithe cheppakaraledu enni vantalo baboy :)

జ్యోతి

స్వప్న , ఇవే కాక కార్తీకపున్నమిరోజు కొందరు బ్లాగర్లు వనభోజన మహోత్సవాలు నిర్వహించారుగా. ఇదిగో లింకు.
http://jyothivalaboju.blogspot.com/2009/11/blog-post_03.html

ఇక తెలుగులో వంటల బ్లాగులు ఇవి..
http://koodali.org/list/collections/cookery

కొత్త పాళీ

చాలా బావుంది. ప్రెజెంట్ చేసిన తీరు కూడా బాగుంది. అభినందనలు సుజాతగారు. వేరుశనగ గుళ్ళు అనేది మీ వాడుకా? లేక ఆయా బ్లాగరులు వాడినదేనా?
@swapna .. పైన ఉదహరించిన బ్లాగుల్లో ఈ వంటల హడావుడి ఒక పార్శ్వం మాత్రమే. అందుకనే అవి ప్రత్యేకం. వంటలకే అంకితమైన బ్లాగుల గురించి ఇక చెప్పేదేవుంది. ఐనా మీకు ఆయా వంటల బ్లాగులు బాగా నచ్చితే వాటిని సమీక్షిస్తూ మీరే ఒక వ్యాసం రాసెయ్యండి. ఏదైనా పత్రికలో వెయ్యొచ్చు.

జ్యోతి

కొత్తపాళీగారు ,
వేరుశనగ గుళ్లు అన్న పదం నేనే వాడాను. అది తప్పంటారా? రైటంటారా?? ఆ పదం ఎక్కడ పట్టుకున్నానో మరి నాకు గుర్తులేదు..

swapna@kalalaprapancham

Wow! Thanks for the link

మరువం ఉష

సుజాత గారికి ప్రత్యేక, జ్యోతి, నేస్తం, తృష్ణ, లక్ష్మి గార్లకు సముచితరీతిన అభినందనలు. వంటల వలన అలుపు రాదు, వాటికి అంతం లేదు కదా!

వేరుశెనగ గుళ్ళు అన్నది నాకు తిరుపతి ప్రాంతాల వారితో స్నేహితమయ్యాక తెలిసింది. వాళ్ళు మన పచ్చి జీడిపప్పు కూరలా ఈ గుళ్ళతో [పచ్చివైనా, వేడి నీళ్లలో నానబెట్టైనా] చక్కటి కూర చేస్తారు. వాళ్ల ద్వారాగా తెలిసిన మరికొన్ని పదాలు [తెల్లగడ్డ, ఎర్రగడ్డ == వెల్లులి, ఉల్లి; ఉద్దిపప్పు == మినప్పప్పు; మిరపపొడి== పచ్చికారం; బిరింజాకు/బిరిందాకు = పలావాకు, ఇలా చాలానే ఉన్నాయి.] అలాగే టమోటాపళ్ళు అనటం అలవాటు వాళ్ళకి.

పరిమళం

ఓ ..జ్యోతిగారు ఉదయంనుండి పేపర్ చూడలేదండి .ఇప్పుడే యధాలాపంగా పేపర్ తిరగేస్తుంటే చూశాను ...మీకు, నేస్తంగారికీ , సూర్యలక్ష్మి గారికీ , తృష్ణ గారికీ ...హృదయపూర్వక అభినందనలు !

durgeswara

abhinamdanalu

మధురవాణి

జ్యోతి గారికి, సూర్య లక్ష్మి గారికి, నేస్తం గారికి, తృష్ణ గారికీ హృదయపూర్వక అభినందనలు. ఇంత చక్కటి ఆర్టికల్ రాసినందుకు సుజాత గారికి ధన్యవాదాలు :-)

కొత్త పాళీ

@ జ్యోతి, వేరుశనగ గుళ్ళు మాట బావుంది. ఇంతకు మునుపు విన్న చదివిన గుర్తు లేదు, అందుకని కొత్తగా అనిపించింది. మావేపు వేరుశనక్కాయలు (పూర్తి కాయ), వేరుశనగ పప్పులు (పప్పుగా విడగొట్టినా, గుళ్ళుగా ఉన్నా) అంటారు. జీడిపప్పుకి కూడా, పప్పుగా విడగొట్టక ముందు జీడిగుళ్ళు అనొచ్చంటారా?

మంచు

వేరుశనగ గుళ్ళు - ప గొ లొ వాడుక పదం

చందు

chala bagaundi.....manchi saili

Hari Chandana P

Abhinandanalu :)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008