Saturday, December 25, 2010

క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో చిత్రలోని వ్యాసం.. అలాగే నేను మా అమ్మాయి కలిసి చేసిన కొన్ని క్రిస్మస్ స్పెషల్ వంటకాలు...


డిసెంబర్ రాగానే ఉత్సాహం, ఆనందం, జేగంటలు, శాంటాక్లాస్, లైట్లు, కేకులు, స్టార్, బహుమతులు , కేకులు అంటూ క్రిస్మస్ సందడి మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లకు చాలా ముఖ్యమైన పండగ క్రిస్మస్. క్రిస్టమస్ అనగా క్రీస్తు జననం. యేసుక్రీస్తు ఈ లోక ప్రజలకు పాప విముక్తి కలిగించటానికి ధివి నుండి దిగివచ్చిన ప్రేమ మూర్తి. లోకరక్షకుడైన ఆ యేసుక్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25 ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. క్రైస్తవ మత స్థాపకుడు, మానవప్రేమను ప్రబోధించిన కరుణామయుడు . ఆ దేవుడి కుమారుడే లోకానికి రక్షకుడిగా ఇలలో వెలసిన ఈ పవిత్రమైన రోజును క్రిస్టియన్లు పండగలా జరుపుకుటారు. సుమారు రెండు వేల సంవత్సరాల క్రింద బెత్లెహేము నగరంలో కన్నె మరియ, యోసేఫులకు ముద్దుల బిడ్డగా ఒక పశువులపాకలో జన్మించాడు యేసు. దేవదూతలు దిగి వచ్చి ఆతని రాకను మానవాళికి తెలియచేసారు. అంతటి పవిత్రాత్మను స్మరించుకునే పండగరోజు ఈ క్రిస్మస్...

డిసెంబరు మొదలు కాగానే క్రిస్మస్ పండగ హడావిడి మొదలవుతుంది. ముందుగా ప్లమ్ కేకును తయారు చేయడానికి సన్నాహాలు మొదలు పెడతారు. తమ గృహాలు, వ్యాపార సంస్థలు, చర్చీలు శుభ్రం చేసి రంగు రంగు కాగితాలు, విద్యుత్ దీపాలు, రంగు రంగుల అలంకరణ వస్తువులతో అలంకరిస్తారు. ఈ పండగ సంబరాలలో ముఖ్యమైనది ఇంట్లో పెట్టుకునే క్రిస్మస్ చెట్టు, బయట వేలాడదీసే అందమైన కాంతులీనే నక్షత్రం. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆకాశంలో అతి ప్రకాశవంతమైన ఒక నక్షత్రం వెలిసింది. ఇది మిగతా నక్షత్రాల కన్నా భిన్నంగా ఉంది. యేసు పుట్టిన సమయంలో ప్రజలకు ఆ బాలుడి జన్మస్థానానికి దారి చూపిన ఆ తారక కు గుర్తుగా క్రీస్మస్‌ మాసం మొదలుకాగానే స్టార్‌ను ఇంటిముందు పెట్టుకుని అలంకరించుకుంటారు. అలాగే క్రిస్మస్ నాడు క్రిస్మస్ చెట్టును ఇంట్లో పెట్టి దానికి చిన్న చిన్న బంతులు, కొవ్వొత్తులు, కాగితపు పువ్వులు, జేగంటలు, బొమ్మలు మొదలైనవి వేలాడదీస్తారు. ఇక క్రిస్మస్ పండగ అనగానే అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ తాత శాంటాక్లాజ్. ఎర్రని దుస్తులతో ఈ తాత తన బగ్గీపై మంచు కొండలమీదుగా ఆకాశమార్గాన వచ్చి క్రిస్మస్ చెట్టుకు వేలాడదీసిన మేజోళ్లలో పిల్లలకోసం ఎన్నో బహుమతులు పెట్టి వెళతాడంట. దీనివెనుక ఉండే ఉద్దేశమంతా ఒక్కటే మానవుడిని, ప్రకృతిని సృష్టించిన దేవుడి ప్రేమను తెలుసుకోవడమే. క్రిస్మస్ నాడు కొవ్వొత్తులు క్రిస్మస్ ట్రీ చుట్టూ వెలిగించడం పరిపాటి.


మరి దీనిలోనూ పరమార్ధం లేకపోలేదు. అజ్ఞానాంధకారంలో అలమటిస్తున్న జగత్తులోకొనసాగే మానవాళికి వెలుగును చూపడానికి విచ్చేసిన లోకోద్ధారకుడు క్రెస్తు ' జ్ఞానజ్యోతి 'కి చిహ్నం. ఈ విషయానికి ప్రతీకయే ఈ కొవ్వొత్తుల ఆచారం.24వ తేది అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందుకే ఆ సమయంలో అందరూ కొత్తబట్టలు ధరించి , చర్చికి వెళ్లి ప్రార్ధనలు చేసి ఆ దేవకుమారుడి ప్రేమతత్వాన్ని స్మరించుకుంటారు. తర్వాత రోజు ఉదయం బంధుమిత్రులను కలిసి శుభాకాంక్షలు తెలియచేస్తారు. విందు వినోదాలు ఏర్పాటు చేస్తారు. చిన్నవారికి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ కూడా. అలాగే మత సంబంధం లేకుండా ఇరుగు పొరుగు వారికి, మిత్రులకు కేకు, మిఠాయిలు, పళ్లు మొదలైన తినుబండారాలు పంపిస్తారు.


3 వ్యాఖ్యలు:

డా.ఆచార్య ఫణీంద్ర

జ్యోతి గారు!
విశ్వ వ్యాప్త క్రైస్తవ సోదర, సోదరీమణులకు - "శాంతిదూత జన్మదిన" శుభాకాంక్షలు!
అలాగే కాస్త ఆలస్యంగా తెలిసింది ... మీకూ జన్మదిన శుభాకాంక్షలు.

జయ

Jyoti garu, I wish you a very happy merry Christmas.

జ్యోతి

ఫణీంద్రగారు, ధన్యవాదాలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008