Sunday, January 2, 2011

మరో ముందడుగు .. రుచి


రుచి...


ఈ బ్లాగులు రాసి బోర్ కొట్టింది కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటున్న సమయంలో ఆంధ్రభూమిలో అవకాశం వచ్చింది. మీ వ్యాసాలు పంపండి చూద్దాం అన్నారు. ఎలాగు అవకాశం వచ్చింది కదా అని నేను చేసే మరో పని కూడా ఉంది. వంటలు గట్రా చేసి, షడ్రుచులులో రాస్తుంటాను. మీరు వేసుకుంటారా. ఆ వంటకాలు ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించవు ఎందుకంటే అవి చేసి ముందు మావారికే కదా పెట్టేది. ఆయన బాగుంటే నేను బాగున్నట్టే కదా. నేను బాగున్నా కనుకే ఇలా వచ్చి అడుగుతున్నాను అని హామీ ఇచ్చాను. అలా కాదుగాని ఇంకో మాట చెప్పండి . కొత్తగా ఏం చేయగలరు? అప్పుడోటి.. ఇప్పుడోటి అని కాకుండా వారం వారం ఒక ఫుల్ పేజి చేయగలరా? అన్నారు. ముందు షాక్ కొట్టింది. కళ్ల ముందు సూర్యచంద్రులతో సహా తారామండలం మొత్తం గిర్రున తిరిగింది. కాని పైకి ధైర్యంగా మొహం పెట్టి "ఓ! చేయొచ్చు. అదేమంత కష్టం" అన్నా. సరే ఐతే అన్ని పత్రికలకంటే విభిన్నంగా ఎలా చేస్తారో చేయండి అని పేజి నిర్వహణ బాధ్యత పెట్టారు. దాని ఫలితమే ఈ రుచి...

ప్రతి ఆదివారం వచ్చే ఈ రుచి ని ఆస్వాదించండి. తొంభై శాతం శాకాహారమే. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వంటకాలు పరిచయం చేయాలనుకుంటున్నాము. ఎలా అంటే ఒక Full Thali లేదా Buffet లా. మీకు నచ్చింది తీసుకోండి. ఉపయోగించుకోండి. మీరూ ఈ పేజికి మీ వంటకాలు పంపాలనుకుంటే పంపొచ్చు. ఇది ఆడవాళ్లకే కాదండోయ్.. ఆధునిక నలభీములకు కూడా .. కాని ఫోటో పంపాలి సుమా.

రుచి పేజీ, ఆంధ్రభూమి దినపత్రిక
36,సరోజిని దేవీరోడ్, సికిందరాబాద్ -3


మరో విషయం... శుభవార్త చెప్పినందుకు ఎవ్వరు కూడా నన్ను పార్టీ అడగొద్దు. ఎప్పుడు శుభవార్త చెప్పినా, చిన్న విజయమైనా విష్ చేసేసి పార్టీ ఇమ్మంటారు. కాని... చెమటోడ్చి ( మా ఇంట్లో .సి లేదు మరి) , కష్టపడి సాధిస్తానా? అయ్యో అని నాకే స్వీటో, గిఫ్టో ఇచ్చేది పొయి , ఎదురు నాకే పని పెడతామంటారు. అక్కడే నాకు మండుద్ది. ఒకోసారి అలా అడిగినవాళ్లను తిట్టాను కూడ. సో నా వర్క్ కి బోల్డు డబ్బులొచ్చి నా బ్యాంకు అకౌంట్ తిరుమల వెంకన్నలా కాకున్నా కొద్దిగా ఐనా గలగలమంటే నేనే ఇస్తాగా.. అదన్నమాట సంగతి..

23 వ్యాఖ్యలు:

మంచు

కంగ్రాట్స్ జ్యొతిగారు. మరి పార్టీ ఎప్పుడండీ :-p

kasturimuralikrishna

పార్టీ,పార్టీ,పార్టీ,పార్టీ,పార్టీ,పార్టీ................

Ennela

hearty congratulations jyoti garu,
partee meeriyyaddu...meme istaam lendi...india ki ticket konicheste chaalu...

విరిబోణి

కంగ్రాట్స్ జ్యోతి గారు , ఈ వంటలు తప్పకుండా నేను ట్రై చేస్తా :)

సుజాత వేల్పూరి

మురళీకృష్ణ గారితో గొంతు కలుపుతున్నా

SRRao

జ్యోతి గారూ !
డబుల్ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని కొత్త అవకాశాలు మీకు రావాలని కోరుకుంటున్నాను. అయితే కొత్తవెన్ని చేసినా బ్లాగు గురువుకి బ్లాగులు బోర్ కొట్టడం మాత్రం శోచనీయం.

శోభ

కంగ్రాట్స్ జ్యోతిగారూ... ఎంచక్కా చేసేయ్యండి మేమూ మీ రుచిని ఆస్వాదిస్తాం... :)

కౌటిల్య

జ్యోతి గారూ! ముందు కంగ్రాట్సులు....నేను పార్టీ అడగనులెండి....కాని ఓ సిన్న డవుటు! ఆధునిక నలభీములని మా పేరుకూడా మెన్సను చేశారు కాబట్టి అడుగుతున్నా! అక్కడ పేజీలో వంటలు చూత్తే ఏంటేంటో వెరైటీలున్నాయ్...మరి మేం వండే సాధారణ వంటలు వేస్తారా"అని...వేసేట్టైతే మా పాకవేదంలో వచ్చే ప్రతి పోస్టూ ఇచ్చేస్తాం అన్నమాట!ః)

సి.ఉమాదేవి

సురుచులను తెలిపి పాకశాస్త్రంపట్ల రుచిని పెంచే అభిరుచిని పెంచారు.Well done Jyothi keep it up.

రాధిక(నాని )

కంగ్రాట్స్ జ్యోతి గారు.నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Hemalatha

jyothi garu, congrats...

జ్యోతి

మంచు, మురళీకృష్ణ, ఎన్నెల, సుజాత,,ధాంక్స్ కాని మీరు వద్దన్నా అడిగినందుకు అస్సలు ఇవ్వనుపొండి... మీవంతు కూడా నేనే ఎంజాయ్ చేస్తాను. :)

విరిబోణి, ఉమాదేవి,శోభ, రాధిక ధన్యవాదాలండి..

రావుగారు, నిజంగానే బోర్ కొట్టిందండి. ఏదైనా కొత్తగా చేయాలని, నా రాతలను మరింత మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేర్చుకోవాలంటే చాలా ఉంది కదండి.అన్నీ కాకున్నా కొన్నైనా నేర్చుకోవాలిగా.

కౌటిల్య..
బాచిలర్స్ వంటకాలు పంపొచ్చు, కాని బ్లాగులో పెట్టనివి కావాలి. పోటో కూడా..

మాలా కుమార్

జ్యొతి గారు ,
అభినందనలండి .
కొత్త దశాబ్ధం లో ఇంకెంతో విజయాల కు ముందడుగు వేయాలని ( మమ్మలిని మర్చిపోకుండా ) మనసారా కోరుకుంటూ ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు .

వేణూశ్రీకాంత్

అభినందనలు జ్యోతి గారు.

Anonymous

Congratulations jyoti garu.

జ్యోతి

హేమలత, అను, వేణు ధాంక్స్,

మాలగారు, ధాంక్స్ అండి. భలేవారే నేనెక్కడికి పోతున్నానని మిమ్మల్ని మర్చిపోవడానికి.

శ్రీలలిత

హృదయపూర్వక అభినందనలండీ...

రుక్మిణిదేవి

jyothi gaaru ,,,happy new year... and we wish u all the best...party meme istaamu lendi..

అన్వేషి

జ్యొతిగారు! హార్ధికాభినందనలు, ఈమధ్య బ్లాగించడం కొంచెంనిదానిస్తే ఇలాంటిప్రయత్నాలేవో జరుగుతుండవచ్చని కించిత్ సందేహంకలిగింది. మీరీ క్రొత్తప్రయత్నంలోకూడ ఘనవిజయకేతనం ఎగరవేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా.

నాగప్రసాద్

జ్యోతి గారు, నేను గృహిణులకు ఒక భీభత్సమైన ఆఫర్ ఇస్తున్నాను. :-) ఈ హైడర్ బ్యాడ్‌లో మాకు వంట చేసుకునే ఓపిక అలాగే హోటల్లో తిండి భరించే కెపాసిటీ లేదు కాబట్టి, వంటను ఔట్ సోర్సింగ్ ఇద్దామనుకుంటున్నాం. మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలియజేయగలరు. చేయవలసిందల్లా, మేము ఏ రోజు చెప్పిన మెనూను ఆ రోజు చేసి, మాకు క్యారియర్‌లో మూడు పూటలా నిర్ణీత సమయంలోగా సప్లై చెయ్యాలి. రుచికరమైన, నాణ్యమైన పదార్థాలు సప్లై చెయ్యవలెను.

మేము నలుగురం ఉంటాం. నలుగురికి కలిపి నెలకు 10 వేలు ఇస్తాం (including transport charges,Taxes, VAT etc..).

సప్లై చెయ్యవలసిన ఏరియా: ఇంద్రానగర్, గచ్చిబౌళి.

Anonymous

హమ్మా.....అదా సంగతి.
ఇంతకీ మా ఇంటికెప్పుడొస్తున్నారు, నేనే మీకు పార్టీ ఇస్తాను. మీకిస్టవయినవన్నీ మీ స్వహస్తాలతో వండుకుతిందురుగాని ఎంచక్కా ఏం :)

Admin

హృదయపూర్వక అభినందనలండీ...

Anonymous

జ్యోతి గారూ

మీకు నా అభినందనలు. నూతన సంవత్సరంలో మీకు ఇంకా ఎన్నో శుభాలు కలగాలని ఆశిస్తూ ..

పద్మవల్లి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008