Sunday 21 August 2011

నా చరణం –మీ పల్లవి (పరిమళించిన వేళ)



ఒకనాటి చల్లని సాయంకాల వేళలో మార్కెట్లో నడిచి వెళ్తున్న రామకృష్ణకు అటుగా వెళ్తున్న ఆటోలోనుండి అలనాటి మధురమైన పాట చరణం ఒకటి వినిపించింది. అతనికి వెంటనే కాలేజీ రోజులలో విన్న, ఎన్నోసార్లు పాడుకున్న ఆ పాట మదిలో కదిలింది. ఆ పాట గుర్తు చేసుకుని మళ్లీ పాడుకుందామంటే పల్లవి ఎంతకూ గుర్తు రాలేదు. ఇద్దరు ముగ్గురు స్నేహితులను అడిగినా తెలీదన్నారు. కంప్యూటర్లో పని చేసుకుంటూ నెట్‌లో కూడా వెతికాడు. ఉహూ! దొరకలేదని నిరాశపడకుండా ప్రయత్నించాడు. ఫేస్‌బుక్‌లో ఒక గ్రూపు మొదలుపెట్టి దానికి నా చరణం మీ పల్లవి అని నామకరణం చేసాడు. తనకు తెలిసిన కొద్ది మంది స్నేహితులను చేర్చి, తను విన్న చరణాన్ని పోస్ట్ చేసి ఎవరికైనా పల్లవి తెలిస్తే చెప్పండి అని అడిగాడు. వెంటనే ఒకావిడ పల్లవి చెప్పేసింది . దానికి ఎంతో సంతొషించాడాయన. ఆ పాత పాట గురించి మళ్లీ గుర్తు చేసుకోవడం వల్ల తనకు కలిగిన ఆనందాన్ని పెంచుకోవాలని ఆ గ్రూపును అలాగే కంటిన్యూ చేసాడు. అలా మొదలైన గుంపు మొదట్లో నిశ్శబ్ధంగా ఉన్నా ఒక్కరొక్కరుగా చేరుతూ నాలుగు నెలలలో వంద సభ్యులను, పదివేల పోస్టులను దాటింది. ఇందులో ఉన్నవారంతా తెలుగు పాటల అభిమానులే. సంగీత ప్రియులే అని చెప్పవచ్చు. వాళ్లు ఒక వయసుకే పరిమితం కాలేదు. కాలేజీ అమ్మాయినుండి కాలేజీ లెక్చరర్ , రచయిత్రులు, బ్లాగర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు, ఉద్యోగులు , వ్యాపారస్తులు ఉన్నారు. అనుకోకుండా కలిసిన వీరు రోజూ పాటలతో శుభోదయం చెప్పుకుని రాత్రి పన్నెండు తర్వాత గుడ్‌నైట్ అనుకుని పడుకోవడం అలవాటైంది. ఇది ఒక అందమైన , విడువలేని వ్యసనంగా తయారైంది అందరికీ. తమ ఉద్యోగ, వ్యాపారాలతో పాటు గుంపులో పాల్గోవడం అందరికీ ఒక సరదా ఉంటుంది....


ఈ చరణాలు చూసి పల్లవులను గుర్తు చేసుకోవడం, వెతకడం, దొరకకుంటే క్లూలు అడగడం.. కష్టపడి ఆ పాటను పట్టుకుని .. ఆ పాటకు సంబంధించిన తమ అనుభవాలను,అనుభూతులను పంచుకోవడం వల్ల తమ నిత్యకృత్యములలోని అలసటను, టెన్షన్‌ను మరచిపోతున్నారు. ఆనాటి మధురమైన పాటలు గుర్తు చేసుకున్నప్పుడల్లా గతంలోకి వెళ్లిపోవడం అందరికీ అనుభవమే.. ఆనాటి కాలేజీ రోజులు, బస్ స్టాపులు, స్నేహితులతో వేసుకున్న పిచ్చాపాటి... తళుక్కున మెరిసి మాయమవుతాయి... ఈ గుంపులో ఎప్పుడూ చరణాలు పల్లవులు అనే కాకుండా వారంలో ఒక రోజు అతిథి ఉంటారు.. అది ఒక నాయకుడు, నాయిక, గాయకుడు, గాయని, రచయిత, సంగీత దర్శకుడు ఎవరైనా కావొచ్చు. ఇక ఆ రోజంతా ఆ అతిథికి సంబంధించిన పాటలే మార్మోగుతాయి. మరో రోజు ఒక థీమ్ ఉంటుంది. మనసు, చందమామ, మల్లె, రామ .. ఇలా .. ఆ రోజంతా ఆ థీమ్ మీదే పాటలు ఉంటాయి. అప్పుడప్పుడు ఒక చిత్రం ఇచ్చి దానికి సంబంధించిన పాట చెప్పాలి. ఈ చిత్రాలు తయారుచేయడంలో ఎంతొ సృజనాత్మకత కనిపిస్తుంది. అది చూడగానే టక్కున ఆ పాట పల్లవి గుర్తు రావాల్సిందే. దీనికొసం ఒకే బొమ్మ కాకుండా రెండు మూడు బొమ్మలు కలిపి ఒకే చిత్రంగా తయారు చేస్తారు .. మరోసారి ఒక పదం మాత్రమే ఇస్తే దానికి సంబంధించిన పాటలు టకటకా అలా చెప్పేస్తారు. అంత వేగంగా సమాధానాలు వచ్చేస్తాయి.


అలా హాయిగా, ఉల్లాసంగా గడిచిపోతుండగా మనం కలిస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన ఆలొచన నిన్న శనివారం కార్యరూపం దాల్చింది. ఒక ఈవెంట్ అనుకున్నప్పుడు మేనేజర్ ఉండాలిగా. దానికోసం కల్యాణ్ నియమించబడ్డాడు. రెండు రోజుల ముందునుండే ఎప్పుడెప్పుడు ఈ మీటింగ్ అవుతుందా . కలుద్దామా. ఎంజాయ్ చేద్దామా అని అందరిలో ఆత్రుత. కలిసినప్పుడు మాత్రం ఎంతో ఆనందం. చిరుజల్లులు కురుస్తుండగా మద్యాహ్నం ఒకటిన్నరకల్లా అందరూ చిక్కడపల్లిలోని కళా సుబ్బారావు వేదికకు చేరుకున్నారు. ఓహ్! మీరు ప్రభాకర్ కదా? మీరు Rsn Murthy కదా?. మీరు వెంకట్.. నీ పేరేంటమ్మా? వందనా లేదా రమ్యా ?? కొందరిని ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో చూడడం వల్ల గుర్తుపట్టడం అంత కష్టమేమి కాలేదు. హైదరాబాదులో ఉన్నవారు ఇలా కలుస్తున్నారని రాలేకపోయిన సభ్యులు ఎంతో నిరాశపడ్డారు. వైజాగ్ చెందిన కవయిత్రి జగద్ధాత్రి రాసిన ఈ కవిత చూడండి..


గళం గళం కలిపి కలసి పాడుకుందాం


కలం మనం విప్పి మంచి పంచుకుందాం


పాటకు కరగని హృది ఉండదని


మాటకు మెరవని మది ఉండదని


దూరలేన్నైనా అడ్డం లేదు అనీ


చాటుదాం ఈ -లోకానికి


పల్లవులై పల్లవించి


చరణాలుగా పరవశించి


మానవులై పరిమళించి


మనమంతా ఒకటేనని


స్వర తపస్వులమనీ


సంగీత జగతికి


మనమంతా కనుపాపలమని


నా చరణం మీ పల్లవి


సమూహంగా పాడుదాం


సరదాగా పాడుదాం......

ప్రేమతో...జగతి




టీ తాగుతూ పరిచయాలు చేసుకున్నారందరూ. అర్రే! మనం రోజూ గుంపులో చూసే వ్యక్తి మనకెదురుగా ఉన్నారే అన్న ఆనందం అందరిలోనూ కనిపించినంది. కార్యక్రమం ప్రారంభించేముందు గుంపులోని సభ్యులందరికీ మాతాశ్రీ ఐన జగతికి వైజాగ్ ఫోన్ చేసి అందరం గట్టిగా హాయ్ చెప్పాము. ఫొన్‌ని మైక్ ముందు పెట్టి ఆవిడ మాటలు, ఆశీస్సులు అందరం విన్నాం. మనుష్యులు శారీరకంగా దూరంగా ఉన్నా మనసులను, మాటలను దరి చేరకుండా ఎవరాపగలరు.. అలాగే దీపిక కూడా హాయ్ చెప్పింది. తను పాల్గొనలేకపోయినందుకు ఎంతో బాధపడింది కూడా.


ముందుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం ఉష ప్రార్ధనా గీతంతో కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమ నిర్వాహకుడు, ఈవెంట్ మేనేజర్ కల్యాణ్ కొందరు పెద్దలను స్టేజీ మీదకు ఆహ్వానించి గౌరవించాడు. మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టేముందు NCMP గ్రూపులో సభ్యుడు డా. భార్గవ మృతికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించారందరూ. తర్వాత రామకృష్ణ పుక్కల్లగారు ఈ గుంపు మొదలుపెట్టడానికి గల కారణాలు, దానివలన పొందిన లాభం, సంతోషం గురించి వివరించారు. ఆ తర్వాత వందన, సాయికమల, రోసీ గౌడ్, శ్రీనివాస్ మౌళి తమ అభిప్రాయాలను , అనుభవాలను వెలిబుచ్చారు. నేనున్నాంటూ ఓ పక్కన కూర్చుని చూస్తున్న కేకును తెచ్చి ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న సభ్యులతో కేక్ కట్ చేయించి, అందరికీ అల్పాహారంతో సహా ఇవ్వడం జరిగింది. ఆ అల్పాహారాలు ఏమిటేమిటీ అంటే ..... ఆ ఒక్కటి అడగొద్దు. ఫుల్లుగా తిన్నాం. వేడి వేడిగా, చల్ల చల్లగా, హాటు హాటుగా, స్వీటు స్వీటుగా....




ఇక మిగిలింది పాటలే కదా. రెండు గుంపులుగా విడిపోయి ఒకరు చరణాలు ఇస్తే మరో గుంపు పల్లవి పాడడం. రోజూ గ్రూపులో ఇచ్చే ఒక్కలైన్ కాకుండా రాగయుక్తంగా చరణం ఇస్తుండగానే ఆ పల్లవి తెలిసిపోయేది. ఈ పాటల హడావిడిలో ప్రభాకర్‌గారు, సాయిగారు, ఉష గారు ఒకవైపు, కల్యాణ్, వెంకట్, శ్రీనివాస్ ఆనంద్, మూర్తి మరోవైపు ఎంత బాగా పాడారో. మొత్తం పాటలు పాడిస్తే బావుండేది అనిపించింది నాకైతే.. ఒకసారి వచ్చిన " ఓ చిన్నదానా !" అనే కృష్ణపాటకు మాత్రం వెంకట్, కల్యాణ్ అచ్చంగా కృష్ణలాగే వేసిన స్టెప్పులు మాత్రం అదుర్స్... కొద్దిసేపయ్యాక రామకృష్ణగారు ఇచ్చిన థీమ్ మనసు మీద కొన్ని పాటలు. ఇలా ఒకటే గోల గోలగా ఉండింది. ఆ తర్వాత చిట్టీలు, ... చివరలో ఉమ దుర్గా ప్రసాద్ వచ్చి కలిసింది. ఇంత ఉత్సాహంగా గడిచిన ఈ సమయంలో చిందులు లేకుంటే ఎలా? ఆ లోటు కల్యాణ్, వెంకట్, రోసీ తీర్చేసారు. థాంక్స్ టూ యూ అబ్బాయిలూ.. చివర్లో పాటలతో తయారు చేసిన పరీక్షా పత్రం పూర్తి చేసారు అక్కడున్న వారు. దాని ఫలితాలు ఇంకా చెప్పలేదు. RKగారు వచ్చి చెప్తారంట.. నేను తప్ప అందరూ హుషారుగా పాటలు పాడారు, నేను మాత్రం అవి వింటూ ఎంజాయ్ చేసాను. ఎందుకు పాడడమనే భయంకరమైన ప్రయోగం చేసి అందరిని బెదరగొట్టడమని సైలెంటుగా ఉన్నాను..





అవునూ! ఇంతకూ ఈ సమావేశానికి ఎవరెవరు వచ్చారో చెప్పలేదు కదా.. కల్యాణ్ కోటంరాజు, రామకృష్ణ పుక్కల్ల, ఉష, జ్యోతి రెడ్డి, Rsn మూర్తి, నేను, శ్రీనివాస్ ఆనంద్, వెంకట్, ప్రభాకర్, సాయి ప్రసాద్ నల్లూరి, వందన, రమ్య, స్వాతీ శ్రీపాద, రోసీ గౌడ్, సాయి కమల, శ్రీనివాస్ మంచికంటి, ఉమ, శ్రీనివాస్ మౌళి, స్వరూప్ మంచికంటి ... జగతి, దీపిక, జ్యోతిర్మయి మల్లా ఫోన్‌లో పలకరించారు. నేను అందరికీ బోలెడు తెలుగుపాటలు, కొన్ని కిషోర్, రఫీ పాటలు ఉన్న డివిడిలు ఇచ్చాను. శ్రీనివాస్ ఆనంద్ తను చేసి జీడిపప్పు చాక్లెట్లను తలా ఒక పాకెట్ ఇచ్చారు. శ్రీనివాస్ మంచికంటిగారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదం, ఒక అందమైన బహుమతి, లెటర్ ప్యాడ్, పెన్ను ఇచ్చారు. ప్రభాకర్ గారు ఖరీదైన పార్కర్ పెన్ ఇచ్చారు . రమ్య తను పాస్ అయ్యానని స్వీట్ ఇచ్చింది. స్వాతీ శ్రీపాద గారు తను రాసిన పుస్తకాలు కొన్ని వైజాగ్ కి పంపించారు , మాకు తర్వాత పంపిస్తామన్నారు. చివరలో "నా చరణం - మీ పల్లవి " గుంపును ప్రారంభించి ఇంతమంది సంగీత ప్రేమికులను,తెలుగు పాపి( పాటల పిచ్చోళ్లు) లను కలిపిన రామకృష్ణ పుక్కల్లగారికి చిరు సత్కారం జరిగింది. బయట వాన జోరు..లోపల పాటల హోరు అన్న రీతిగా జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పాల్గొన్నవాళ్లందరికీ మరచిపోలేని , మధురమైన అనుభూతిని కలిగించింది. రానివాళ్లకు మాత్రం నిరాశా మిగిలింది. పాపం..

27 వ్యాఖ్యలు:

Sirisha

avunu papam....mee post choosaka aa feel ekkuvayyindi..but kallaki kattinatlu anta choopinchesaru..

సుజాత వేల్పూరి

చాలా బాగుంది. ఇలాంటి గ్రూపులు బాగానే ఉంటాయి కానీ రోజుకు 48 గంటలుంటే చాలా పనులు చేయొచ్చు అనిపిస్తుంది నాకు. మీరు 24 గంటల్నే 72 గంటలుగా వాడతారు. ఇన్ని యాక్టివిటీలు మీకు ఎలా సాధ్యమో, మీ ఎనర్జీ లెవెల్స్ రహస్యం ఏమిటో నాకర్థం కాదు.

మీ అందరికీ శుభాభినందనలు

జ్యోతి

సుజాతగారు, నిజమేనండి. చాలా బ్లాగులు, బజ్జులు, ఫేస్ బుక్ గ్రూపులు ఉన్నాయి.మీలాగే 24 గంటలు సరిపోవట్లేదు. కనీసం రెండుగంటలైనా ఎక్కువ దొరికితే బావుండు అని రోజూ అనుకుంటాను. నేను ఈ ఒక్క గ్రూపులోనే ఉన్నాను. మిగతావి అన్నీ డిలీట్ చేసినా నాకిష్టమైన పాటలు కాబట్టి వదలలేకున్నాను. నా పని అయ్యాక ఈ గ్రూపులు కొద్దిసేపు గడుపుతాను.కాస్త relaxation ఉంటుంది..

prabhakar

jyothi garu,
ninnati event gurinchi meeru cheppina reethi chaala bagundi..vachina vallaki malle gurthu chesukonela...raani vaalaki kallaki kattinattuga ..superb..oka chinna savarana..exam pass ayinanduku sweets ichindi Sai Ramya Bhanu..ok

andarikee aa challani sayanthram marapu ranidi..udaanne andarikee good morning to good night daaka cheputham..kanee kalisthey ela vuntondo anna anandam..anubhuthi excelent..intha grand ga success chesina sabhulandarikee per peru naa dhanyavadalu

satya

చాలా మంచి సంగతి తెలియపరిచారండీ.దీని లింక్ ఇవ్వగలరా ప్లీజ్.

Shakthi

హేయ్ జ్యోతి పొద్దుటి నుండి టెన్షన్ తట్టుకోలేక పోతున్నానంటే నమ్ము

ఎప్పుడెప్పుడు తేపవుతుందా ఏమి రాసింటారో చదవాలి అనే ఆత్రం

పెరుగుతూనే ఉంది ఇప్పుడు నీవు పెట్టిన లింక్ చూసాక మనసు కాస్త కుదుట పడింది

నీవు రాసింది చదివిన తరువాత

నేనూ వెళ్ళింటే ఎంత బావుండు అనిపించింది

అక్కడ జరిగిన విషయాలు చాలా చక్కగా రాసావు

నిజంగా మనం పాడిన పాటల విలువ ఇంత మధురంగా ఉంటుందని

నే నమ్మలేకపోతున్నాను మధురమైన పల్లవులు..పసైదైన చరణాలతో

మీరంతా కలసి ఎంజాయ్ చేసినవి తీయని పులకింతలు..అవునా జ్యోతీ......

జ్యోతి

ప్రభాకర్ గారు సరిచేసానండి..

సత్యగారు మీరు ఇక్కడ చూడొచ్చు. అడ్మిన్ రామకృష్ణగారు.

http://www.facebook.com/groups/208808582469033/

Shakthi

హేయ్ జ్యోతి పొద్దుటి నుండి టెన్షన్ తట్టుకోలేక పోతున్నానంటే నమ్ము

ఎప్పుడెప్పుడు తేపవుతుందా ఏమి రాసింటారో చదవాలి అనే ఆత్రం

పెరుగుతూనే ఉంది ఇప్పుడు నీవు పెట్టిన లింక్ చూసాక మనసు కాస్త కుదుట పడింది

నీవు రాసింది చదివిన తరువాత

నేనూ వెళ్ళింటే ఎంత బావుండు అనిపించింది

అక్కడ జరిగిన విషయాలు చాలా చక్కగా రాసావు

నిజంగా మనం పాడిన పాటల విలువ ఇంత మధురంగా ఉంటుందని

నే నమ్మలేకపోతున్నాను మధురమైన పల్లవులు..పసైదైన చరణాలతో

మీరంతా కలసి ఎంజాయ్ చేసినవి తీయని పులకింతలు..అవునా జ్యోతీ......

జ్యోతి

శక్తి నాకు తెలుసుగా.. అందుకే రాసేసాను కాస్త సస్పెన్స్ లో పెట్టాను అందరిని అంతే.. నిజంగా ఉష, కళ్యాణ్, సాయి, ప్రభాకర్, ఆనంద్ గారు ఎంత బాగా పాడతారో.. అలా వింటూ ఉండిపోయా.నాకైతే ఒక్క పాట కూడా గుర్తురాలేదు..

srinivas anand

జ్యోతిగారు , మీరు రాసిన శీర్షిక నిజంగా మనసులు పరిమళించిన ఆ మధురక్షణాలను మళ్ళీ ఒకసారి కళ్ళముందు కదలాడేలా చేసింది.ఇది పొగడ్త కాదు. మన గుంపులోని సభ్యులందరం ఒక చోట కలుసుకోవటం ఆనందాన్ని కలిగిస్తే అక్కడ అందరం కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని అందరికీ కళ్ళకు కట్టేలా చూపించాలని మీరు పడ్డ తపన ప్రతి అక్షరంలో కనిపించింది.అందుకు మీకు అభినందనలు. ఉదయాన్నే గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ దాక మనం చెప్పుకునే కబుర్లు,పాడుకునే పాటలు, అవేంటో తెలీక అడిగే క్లూలు, ముందుగా మనమే చెప్పాలనే ఆరాటం అసలు పాటలంటే మనకున్న ఆసక్తిని , అభిరుచిని అందరికీ తెలిసేలా చేసిందీ గుంపు.మొదట్లో కాస్త బెరుగ్గా ఉండే వాళ్ళం. కాస్త పరిచయమయ్యాక ఒకరోజు ఎవరైనా రాకపోతే వెలితిగా ఫీల్ అయ్యే వాళ్ళం , అవుతున్నాం కూడా.అందరినీ చూడాలన్న కోరిక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘడియలు వస్తుంటే కాస్త ఉత్సుకత అన్నీ కలగలిపిన ఫీలింగ్స్ ఆ క్షణం వచ్చేసరికి ఆనందం అలానే ఆశ్చర్యం కూడా.అందర్నీ ఒకరినొకరు పలకరించుకుంటుంటే వీళ్ళంతా మనవాళ్ళే అన్న ఫీలింగ్. నా జీవితంలో నిజంగా ఒక మరపురాని రోజు ఇది.మీరిచ్చిన CD లో పాటలన్నీ నిజంగా ఆపాత మధురాలే! ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే. రావు గారిచ్చిన పెన్నులు, రమ్య పంచిన స్వీట్లు,ఉషాగారి పాటలు అవిడ వేసిన బొమ్మ, కళ్యాణ్ , వెంకట్, రోసీ చిందులు అలానే పలకరింపులు.MSRK ఇచ్చిన దేవుడి ప్రతిమ అమ్మవారి ప్రసాదం నిజంగా ఆ అమ్మవారు ఆశీర్వదించి పంపినట్లుగా ఉంది. RK గారి వ్యాఖ్యానం నల్లూరి మాస్టారి గానం ఆయన అందరి పట్ల చూపిన ప్రేమ ఏమిస్తే వస్తాయి చెప్పండి?ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డు కబుర్లు.కమల ,స్వరూప్,మౌళి, రమ్య & వందన పాటలకు ఇచ్చిన హుషారు కొట్టిన చప్పట్లు నిజంగా మనమంతా ఎప్పుడో ఎక్కడో ఇంతకు ముందు నుండి బాగా పరిచయమయ్యి మళ్ళీ కలుసుకున్నామన్న ఫీలింగ్. అక్కడ గడిపిన ప్రతి క్షణం ఓ మధురమైన మరపురాని క్షణంగా ఉండిపోతుంది అనడంలో సందేహమే లేదు.ఇంతమంచి గుంపును మనకందించిన RKగారిని , అలానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు కళ్యాణ్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
శ్రీనివాస్ ఆనంద్

srinivas anand

మరో విషయం కూడా చెప్పాలి ఇందాక మరిచాను. స్వాతి శ్రీపాద గారు ఎంతో చక్కగా పాటల వివరాలు అలానే పాటల సాహిత్యాన్ని కూడా పోస్ట్ చేస్తారు ఆవిడని డైరెక్ట్ కలుసుకోవడం మాట్లాడడం ఎంత సంతోషాన్ని చ్చిందో
మాటల్లో చెప్పలేను.ఉమా ఆఖర్న వచ్చినా మంచి పాటలు పాడి వినిపించింది.రమ్య పాడిన ముద్దుగారే యశోద పాట క్రిష్ణాష్టమిని ముందే తీసుకొచ్చేసింది. ఆనందంలో ఈ విషయాలు మర్చిపోయాను ఇందాకటి పోస్టులో
రాయడం. మళ్ళీ ఏమన్నా గుర్తొస్తే ఇలా రాస్తూనే ఉంటాను. ఎంత రాసినా తక్కువే అనిపిస్తోంది మరి.
శ్రీనివాస్ ఆనంద్

sai

Jyothi garu superb writing ,fine description,naa lanti ,,TELUGU CHADAVADAME ,,KASHTAMAINA vallaku kuda chadavalani pinchenta chakkaga ,katti padesi chadivincharu,,nijamga mee talent ki joharu ;,.May God bless u & our NCMP Members;,.
sai prasad.n.

venkat

జ్యోతి గారు - నిన్న మనం పంచు కున్న ఆనంద మైన సమయాన్ని కళ్ళకి కట్టి నట్టుగా మీ బ్లాగ్ లో అందరికి తెలియపరచారు ... చాల సంతోషంగా ఉంది...
one small observation - సమావేశానికి వచ్చిన వాళ్ళ list లో నా పేరు missing.. but anyways ... thanks so much for this wonderful post - with regards, venkat hemadribhotla

జ్యోతి

శ్రీనివాస్ గారు నిజంగా ఇదే అభిప్రాయం అందరి మనసుల్లో ఉంది. మీరు చెప్పేసారు ధాంక్స్,

సాయిగారు ధాంక్స్ అండి..

వెంకట్ గారు మీరు చిందులేసానని చెప్పాగాని లిస్టులో చేర్చలేదు సారీ. ఇప్పుడు కలిపేసాలెంఢి.

dhaathri

haayi haayigaa aamanai saage annatlu sagina mee patala parimalala vela nivedika chaala bagundi jyothi....manasanthaa nindipoindi.....raledanna badha nee matalaatho kallaku kattinattu varnainchadamtho theerindi...love j

venkat

జ్యోతి గారు - మీ బ్లాగ్స్ ఎంత popular అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ - నిన్నటి NCMP event గురుంచి చదివి US lo unna నా చెల్లెలు (కనక దుర్గ) ఫేస్ బుక్ లో వచ్చి అడిగింది... అన్నయ్య నువ్వేంటి కృష్ణ స్టెప్స్ ఏంటి అని - అదే మా గ్రూప్ మహిమ అని చెప్పి నవ్వుకున్నాము.... తను మీ బ్లాగ్స్ రెగ్యులర్ గా చదవడం వల్ల మన ఈవెంట్ న్యూస్ ఆల్రెడీ చదివి, పిక్స్ అన్ని చూడడం అయ్యింది... అందుకు మీకు మరొక్క మారు ధన్యవాదములు - వెంకట్.

patnaik

జ్యోతి గారు మనకి తెలిసింది చెప్పడం పెద్ద విశేషం కాదు, ఎదుటి వాళ్లకి అర్ధం అయ్యేట్టు చెప్పడం కొంచం కష్టం , కాని గుండెకి హత్తు కునేటు మాత్రమే కాదు కంటికి కట్టినట్టు రాసారు . నా లాగా రాని వాళ్లకి చాల చక్కగా అక్కడ పాల్గొన్నట్టు చెప్పారు . చెప్పే పద్ధతి ఆర్టిస్టిక్ గా వుంది, మీరు మనసు పెట్టి కన్నా అక్కడ మీరు మల్లి వున్నట్టు భావించి పోస్ట్ చేసారు . సో నైస్ . అన్నది సరి కాదు , సూపర్బ్ .

patnaik

జ్యోతి గారు మనకి తెలిసింది చెప్పడం పెద్ద విశేషం కాదు, ఎదుటి వాళ్లకి అర్ధం అయ్యేట్టు చెప్పడం కొంచం కష్టం , కాని గుండెకి హత్తు కునేటు మాత్రమే కాదు కంటికి కట్టినట్టు రాసారు . నా లాగా రాని వాళ్లకి చాల చక్కగా అక్కడ పాల్గొన్నట్టు చెప్పారు . చెప్పే పద్ధతి ఆర్టిస్టిక్ గా వుంది, మీరు మనసు పెట్టి కన్నా అక్కడ మీరు మల్లి వున్నట్టు భావించి పోస్ట్ చేసారు . సో నైస్ . అన్నది సరి కాదు , సూపర్బ్ .

శశి కళ

అబ్బ..చాల బాగున్నాయి మీ సంగతులు.నెను
అక్కడ ఉంటె బాగుండేది అని పించింది.

పుక్కళ్ళ రామకృష్ణ

జ్యోతి గారు,
కళ్ళకు కట్టినట్లు ఎంతో రమ్యంగా వ్రాసారు. "బయట వాన జోరు..లోపల పాటల హోరు" బాగా చెప్పారు. సమావేశానికి సంభందించిన విషయాలు ఆద్యంతం ఎంతో చక్కగా వివరించారు. మళ్ళీ తీరిగ్గా తరువాత కామెంట్స్ పోస్ట్ చేస్తాను.

Ennela

chaalaa baagaa wrasaaru. ilaanti group create chesina vaarikee, sabhyulakee hrudaya poorvaka abhinandanalu.

జ్యోతి

వెంకట్, జగతి, శశి, ఎన్నెల, పట్నాయక్, రామకృష్ణగారు ధన్యవాదాలు..

శ్రీనివాస రామకృష్ణ మంచికంటి

మాడం జ్యోతి గారు,మీరు చెప్పిన అన్ని విషయాలు నేను దగ్గర వుండి చూసినవే ఐనగాని మళ్లి మళ్లి చూపించారు...మీకు చాలా థాంక్స్..
నేను ఎందుకో గాని యిక్కడ చూడటం కొంత ఆలస్యము అయ్యాను,అంతా మన మంచికే అన్నట్టుగా అప్పుడు ఆలస్యము అవ్వడం వల్లనే బహుస ఆనంద్ జి మరియు కొందరు మిత్రుల కామెంట్స్అన్ని ఒకేసారి చూడగలిగాను ...నిజానికి అన్ని అంశాలు వారు చెప్పినవి ఖచ్చితమైన సత్యాలు
వారు ఎవరు స్మృసిమ్చని ఒక విషయం నేను స్పష్టం చేస్తున్నాను ...ఎవరినైనా "పాపి 'అంటే అన్నవారిపై బలే కోపం వచ్చే అవకాశముంది..అహా మీరు పాపి అంటే ఎంత అనందముగా వుందో చెప్పలేను (పాట ల పిచ్చోళ్ళు )మిగాతా వారి సంగతి నాకు తెలిదు గాని "నేను మాత్రం పెద్ద పాపిని "
ఏదో సినిమా లో "చవటాయిని నేను -నీకంటే పెద్ద చవటాయిని నేను" అని పోటి పడ్డట్టుగా ఇది చదివిన వారు "పాపి ని నేను -నీ కంటే పెద్ద పాపిని నేను" అని గాని పోటి పడితే దానికి మీరే సంతోషముగా బాద్యత వహించాలి
చాలా సంతోషము తో ముగిస్తున్నాను -Msrk.

ప్రియ

jyothi gaaru ..mee blog chala baagundi...kaani naa charanam mee pallavi link dorakatam ledu dayachesi naaku teliya chestharani asisthunnanu

Unknown

Hello jyothy gaaru

I am not able to open http://www.facebook.com/groups/208808582469033

Can you please guide me to the correct link?

Thanks
Sreedhar Ambati

Unknown

Hello andi

I tried to join in the facebook group.
But not able to. Is it closed to few members.

Thanks
Sreedhar

జ్యోతి

Sreedhar garu,

you can mail to the admin ramakrishna garu..


"ramakrishna pukkalla" ,

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008