Friday, 30 November 2007

Dec. 9th Meeting - Birds of same Feathers

Venue and Timings

Will be announced shortly. It would be a day long meeting. We request you all to mark the entire day. Incidentally this is Anti-Corruption Day.

Note: Meals and snacks will be arranged.

Participants:

Individuals and groups who are interested to spare at least two days in a month for social work activity and who, as of now, does not have one particular area to concentrate on. Most importantly who believe in co-operation and bringing our work to a next level.

Preparation:

Every participant should come up with their profile in the following details:

Name, Qualification, Employment/Designation, Email and Phone Number
Inspiration to do social work: 1 or 2 incidents or persons
Most unforgettable experiences: 1 or 2
Area of interest in social work:
Your views on likeminded groups’ forum and meeting.
If member of any groups, give the group’s name, aim, URL and any other useful information.

For groups, one person from the group should explain about the group, aim, objectives, past and current activities and future projects.

For the members of the groups who visited different orphanages, old age homes etc., please come up with all the details that you have about these institutions and their requirements and the kind of support that you expect for your efforts.

Agenda:

Introduction, Welcome/Ice-breaking Speech: 10 minutes

First Session: 1 ½ hour

To know about the interest and views of each participant with respect to social work and also of the participant groups.


Second Session: 1 ½ hour

To identify areas of common interest and to discuss on each topic in the six hat method. (All the six hats are not considered; the purpose is to let everyone on the same page when they think on an aspect.)

Third Session: 1 ½ hour

To know about different organizations and orphanages that the participants visited. (Brief description of 5 to 10 minutes about each organization)

Meanwhile we will have 10 minute breaks. We can have jokes and songs. Participants can exhibit their talent. We will be more than happy if the selections are related to the topics of discussion.

There would be a 10 min briefing from a group about human values and how we can develop the humanity in us and how we can be of good individuals.

Outcome: 1 hour


At the end of the day we should come up with a plan of action on the way we co-operate and co-ordinate with others. May be like any other formal meeting we will come up with a 10 point agreement sort of thing. In simple words, conclusion of the meeting agreed by all the participants.

Lunch Break: 1 hour

Snack Break: 15 min

Photos: 15 min

Guidelines:

Meeting should start on time.
Every participant should value the time and speak on what we are supposed to talk.
No one should object and contradict others’ views. We should be good listeners.

Possibilities:

We request participants to bring their laptops if they own one. This is to enable any of your friends who are not located in Hyderabad to participate virtually.

Expected Count:

We are expecting a minimum of 50 members and maximum of 100 members.


Request:

Please understand the urge behind organizing this meeting. Completely co-operate and confirm your participation. Own this meeting.

We can assure that every participant will be happy to meet so many likeminded people, inspiring experiences and leave with a renewed commitment and hope.

Measure of Success:

Every participant should feel happy
Pledge to continue this kind of meetings
Come up with a date for next meeting

Last but not the least:

Please confirm your participation at least by Dec. 3rd. We once again request members to co-ordinate with your groups and come up with a consolidated list from each group.

Mail to: Prasanthi, prasanthi.uppalapati@gmail.com


Disclaimer: This meeting is strictly for people who spare/willing to spare two days a month for social work.


Two requests:

1. Please be there by 9:30 am so that we can start the meeting by 10 am.
2. Please be there for the whole day. We once again request people who can commit the whole day.
3. Please bring ID card, can be your employee ID card or else Driving License, Voter ID etc.,

A slight change in the venue:

Last minute (yesterday night by 9 pm) we get to know that Taxila Meeting Hall cannot be given to us as there is some other meeting.

So we decided to meet in the Mariner Cafetaria in the same compound. I hope you all will not be bothered by the venue. Ambience is good.

Venue: Floor No 1, Mariner Cafetaria, Mariner Block, Ascendas IT PArk, Hitech City.

The building was once called Vanenburgh IT Park, the next one to Infotech Building. We will be there at the venue by 9 am.

Please contact, Raghavendra: 9908815490, if you need directions for the venue:

Waiting anxiously to meet all of you.

Thank you.

with regards,
Prasanthi.

Monday, 26 November 2007

బ్రేవ్

మంచిపొద్దుగల. అందరికీ నమస్తె చెప్తున్నా. నేనండి సరూప. చాలారోజులైంది మిమ్మల్ని పలకరించి.అందరూ బాగున్నరా? రొండు నెళ్ళనుంచి ఒకటే పండుగలు. అస్సలు తీర్తలేదు. ఏం చేయను? సరేగాని మీకొక మస్తు ముచ్చట చెప్పనీకి వచ్చిన. ఇది కార్తీక మాసం కదా. అందరూ వనభోజనాలు అని వెల్తారు కదా.అదేనండి చెట్లకిందికి పోతరు. మొన్న ఆదివారం మేము కూడా మా దగ్గరి చుట్టాలు, దోస్తులు, పిల్లలలందరిని తీసుకుని చెట్లకిందికి పోయినం.పోరలకు కూడా ఆర్నెల్ల పరీక్షలొస్తున్నాయి. ఇట్లనన్నా అందరు కలిసినట్టుంటదని అనుకుని అందరం కలిసి సోచాయించినం. నాలుగు రోజుల ముందునుండే తినే వస్తువులు చేసుకున్నమ్. మా ఆడబిడ్డ వడప్పలు, మురుకులు,పులిహోర చేసుకొస్త అంది. మా యారాలు తన కోడండ్లతో కలిసి సొజ్జపోలెలు,సన్నసేగు,రవ్వలడ్డు చేయిస్త అంది. మా మరదలు మసాలాపూరీలు,లడ్డులు చేస్తా అంది. ఇగ నేను ఆరోజు ఒంట సంగతి చూసుకుంట అన్నా. రెండు రోజులముందే అన్ని మసాలాలు, ఇస్తరాకులు,గ్లాసులు,నీళ్ళక్యానులు, గిన్నెలు,జంబుఖానాలు అన్ని తీసిపెట్టుకున్నా. ఆదివారం పొద్దుగల్ల ఏడింటివరకు అందరిని మా ఇంటికొచ్చేయమన్నాము. మొత్తం పిల్లజెల్లా అందరు కలిసి ముప్పై మందిమి ఐనం. నాలుగు కార్లు,ఒక వ్యాను మాట్లాడుకుని సామాన్లు అన్ని బండ్లల్ల ఎక్కించి ఎనిమిదికల్లా బయలుదేరినం. మా తమ్ముని దోస్తుది బగీచ ఉందంటే వెళ్ళాం చిల్కూర్ గుడికెల్లే దారిల. మధ్యలో చలేస్తుందంటే ఒక చాయ్ దుకాణంల అందరం చాయ్ తాగినం. ఇగ అన్ని బండ్లల్ల పిల్లలది ఒకటే లొల్లి, పాటలు, మాటలు. బగీచ రాగానె దిగి జల్ది జల్ది అన్ని సామాన్లు దించేసుకుని చెట్లకిందికి పోయి కూర్చున్నాం . ఆడాలందరు ఒక దిక్కు, మొగోల్లందరు ఒక దిక్కు, పిల్లలందరు ఒక దిక్కు జంబుఖానాలు పరుచుకుని కూర్చున్నరు.


ముందుగల్ల మొగోల్లకు, పోరలకు పూరీలు, ఆలుగడ్డ కూర ప్లేట్లల్ల పెట్టిచ్చి ,తెచ్చిన అప్పలు మురుకులు కూడా ఇచ్చి,నీళ్ళ క్యాను వాళ్ళముందు పెట్టేసాం. అందరం ఆడోళ్ళం కలిసి మద్యాన్నం ఒంట కోసం సామాన్లు తీసి పెట్టుకున్నం.రెండు గంటలలో మాట్లాడుకుంటూ ఒంట చేసేసినం.ఏం జేసినమో తెలుసా?? పాలకూరపప్పు,పచ్చిపులుసు,మసాలొంకాయ,బెండకాయ ఏపుడు,చింతకాయ తొక్కు,సల్లచారు బజ్జీలేసి,నిమ్మకాయ తొక్కైతే ఇంట్లకేలి తెచ్చినం, గారెలు,సాబుదాన పాయసం, పాపడాలు, ఒడియాలు . ఒంటిగంటకు అందరిని పిలిచి ఇస్తరాకులేసి అన్ని ఒడ్డించాము. అందరు నవ్వుకుంట,ముచ్చట్లాడుకుంట ఖుషీఖుషీగా తిన్నరు. వాళ్ళందరు తిన్నక మా ఆడవాళ్ళము కూర్చుని మెల్లిగా రెండుగంటలు తిన్నం మాట్లాడుకుంట. మొగోల్లేమో పత్తలాడుకుంట కూర్చున్నరు.పిల్లలేమో ఆటలాడుతూ బగీచ అంత తిరిగొచ్చిన్రు. ఇగ మెల్లిగా చీకటైతుంది. సలి మొదలైంది. ఇంటికి పోదామని అన్ని సదురుకుని నవ్వుకుంటా ఒచ్చేసినం. మల్ల ఒచ్చే ఏడాది ఇట్ల కలుస్తమేమో?

ఇది సదూతుంటే నోట్ల నీళ్ళొస్తున్నయిలే! ఇంటికెల్ళి ఒదినమ్మలకు చెప్పి చేయించుకోండి.ఇంకా లగ్గం కానివాళ్ళుంటే కొనుక్కొని తినేసి బ్రేవ్ అనండి.అంతే!!!!

త్వరగా ముసలివాళ్లం ఎందుకు అవుతామంటే...

అనుకోని సంఘటన ఒకటి జరిగింది. వెంటనే షాక్ అవుతాం. దాన్ని అంగీకరించడానికి మన మనస్సు ఒప్పుకోదు. "నాకే ఎందుకు ఇలా జరగాలి.. ఇవ్వాళ లేచిన వేళ అస్సలు బాగోలేదు.. అబ్బ ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుణ్ణు.." అని సణుక్కుంటూ ఉంటాం. ఆ సంఘటనని ఒప్పుకుని ఉన్నది ఉన్నట్లు స్వీకరించడానికి మనస్కరించదు. దాంతో మనకు తెలియకుండానే మనసులో సంఘర్షణ ప్రారంభమవుతుంది. మొక్కుబడిగా పనులు చేస్తూనే ఉంటాం మరో పక్క మైండ్ లో జరిగిన సంఘటన తాలూకు ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. దాంతో చేసే పనుల పట్ల శ్రద్ధ లోపిస్తుంది. శ్రద్ధ పెట్టని పని వ్యర్థమే అన్నది మనకు తెలిసిందే. ఇలా ఎప్పుడో జరిగిన సంఘటనలను కూడా మనం రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి "మోస్తూనే" ఉంటాం. అందుకే అత్తగారు చనిపోయినా ఆవిడి పెట్టిన కష్టాలను పనిమాలా గుర్తు తెచ్చుకుని ఆవిడని నాలుగు తిట్లు తిట్టుకుంటే తప్ప పొద్దుపోని కోడళ్ల లాంటి వాళ్లు మనకు కనిపిస్తూ ఉంటారు. అత్తాకోడళ్లు అనేది ఉదా. మాత్రమే. ఈ బాపతు జనాలు ఎంతోమంది ఉంటారు. గతించిన క్షణం 'చచ్చిన శవం'తో సమానం.శవాలను మనం ఇంట్లో కుళ్లబెట్టుకోం. కానీ శవాల్లాంటి చేదు జ్ఞాపకాలను మాత్రం జీవితాంతం మనసులో మోస్తూనే ఉంటాం. అందుకే ఎంతో ఆనందించదగ్గ సందర్భం వచ్చినా... ఆ సందర్భాన్ని హాయిగా ఎంజాయ్ చెయ్యడానికి బదులు మనసులో పేరుకుపోయిన శవాల్లాంటి పాత జ్ఞాపకాలతో సావాసం చేస్తుంటాం. దీనికి అసలైన కారణం జరిగిన సంఘటనని "జీవితాంతం ఒప్పుకోకపోవడం"! అత్త గయ్యాళి అని, గయ్యాళి వాళ్లు తిడతారు అని ఒప్పుకుంటే పోయేదానికి.. అత్తపోయినా "అది నన్ను తిడుతుందా" అంటూ జీవితాంతం మొండిగా మనసులో ఘర్షణ పడుతూనే ఉంటే బీపీలు రాక ఏం వస్తాయి?

చిన్నతనంలో ఎలాంటి బలమైన సంఘటన ఎదురైనా కొద్దిరోజుల్లో మర్చిపోయేవాళ్లం. కానీ వయస్సు పెరిగేకొద్దీ పట్టుదల కూడా పెరుగుతోంది. "ఇలాగే ఎందుకు జరగాలి, దీన్ని నేను ఒప్పుకోను. ఎలాగైనా దీన్ని మార్చి చూపిస్తా.. నా పవర్ ఏంటో చెబుతా" అంటూ మొండికేసి కూర్చుంటున్నాం. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. జరిగిన సంఘటనను ఒప్పుకుంటేనే మున్ముందు అలా జరగకుండా ఏం చెయ్యాలి అన్నది తోస్తుంది. నేను ఒప్పుకోను అని కూర్చుంటే మనసులో అశాంతి తప్ప ఏమీ మిగలదు. అందుకే వయస్సు పెరిగే కొద్దీ మన అభీష్టానికి విరుద్దంగా జరిగిన ప్రతీ సంఘటనకి సంబంధించిన బరువును మనసులో మోసుకుంటూ వస్తూ జీవశ్చవాల్లా బ్రతుకుతుంటాం. ఎంత బలమైన సంఘటన అయినా "ఒకే జరిగితే జరగనివ్వు.. ఏం చేస్తాం" అంటూ ధీమాగా కూర్చుంటే దాని తాలూకు ప్రభావం మనసుపై చాలా స్వల్పంగా ఉంటుంది. మనసు ఆ చిక్కుముడిలో ఇరుక్కుపోదు. పరిస్థితులు చక్కబడేటంత వరకూ ఓపికగా వేచి ఉంటే తర్వాతి మనం చేయవలసింది నిదానంగా చేసుకోవచ్చు. ఇది అత్యద్భుతమైన జీవిత రహస్యం.. దీనిని అర్థం చేసుకుని ప్రతీ క్షణం మీ జీవితానికి అన్వయించుకుంటూ పోతే అరవైలలోనూ ఇరవైల పడుచువాళ్లుగా జీవించవచ్చు.

- నల్లమోతు శ్రీధర్

Friday, 23 November 2007

మనసుకు సంకెళ్లు వేయకండి!

పాజిటివ్ గా చూస్తే జీవితంలో అడుగడుగునా అవకాశాలే కన్పిస్తాయి. అయితే మనలో చాలామంది కొన్ని పరిధులు గీసుకుని అదే జీవితమనుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఒక్కసారి మన ఆలోచనా విధానానికి వేసుకున్న ముసుగుని తొలగించి విశాల దృక్పధంతో ఆలోచిస్తే మన ముందు లెక్కకు మిక్కుటంగా ఉన్న అవకాశాలు గోచరిస్తాయి. ఎవరి బ్రతుకూ ఒక స్ధాయికే పరిమితం అయినది కాదు. స్థాయిని పెంచుకోవడానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తే ప్రస్తుతం మనం ఉన్న పొజిషన్ కన్నా మరింత మెరుగైన స్ధానానికి చేరుకోవడానికి మార్గాలు కన్పిస్తాయి.

"ఓ యాభైవేల జీతం వస్తే చాలు.. ఎలాంటి చీకూ చింతా లేకుండా బ్రతకవచ్చు" అని ఆలోచించేవారు తమ ఆదాయాన్ని పరోక్షంగా యాభైవేలకే పరిమితం చేసుకుంటున్నారన్నమాట. అంతకన్నా విస్తృతంగా ఎందుకు ఆలోచించకూడదు? అలాగని పగటి కలలు కనమని కాదు. మనలో అంతర్గతంగా నిభిడీకృతం అయి ఉన్న శక్తియుక్తులను గుర్తించి.. మనం ఏం చేయగలమో, ఆ చేయగలిగేది ఎంత సమర్ధవంతంగా చేయగలమో బేరీజు వేసుకుని మన శక్తియుక్తులతో చేయగలిగిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఉన్నత స్ధానం వైపు అడుగులు వేయవచ్చు. అంతే కానీ "ఈ జన్మకు ఇది చాల్లే.. ఇంత కన్నా తృప్తి ఏమి ఉంది.." అన్నట్లు ఆలోచించడం మన పరిధిని మనం కుంచింపజేసుకున్నట్లే!

ఈరోజు మీరు ఒక కంఫర్టబుల్ జోన్ గా దేన్ని ఫీల్ అవుతున్నారో దానితో సరిపెట్టుకుని నిజంగా తృప్తిగా బ్రతకగలుగుతున్నారా.. ఒక్కసారి ఆలోచించండి? అంటే మీరు తృప్తి అనుకుంటున్న ప్రస్తుత జీవితం మీకు అంతర్లీనంగా అసంతృప్తిని మిగుల్చుతోందన్నమాట. కానీ.. మరింత ఉన్నత స్ధానం కోసం కృషి చేయడం రిస్క్ గా భావించి లేదా బద్ధకించి ఇదే గొప్ప జీవితం అన్నట్లు మిమ్మల్ని మీరు కట్టిపడేసుకుంటున్నారు. ఆ సంకెళ్లని తొలగిస్తే తప్ప ఇంతకన్నా గొప్పగా మీరు బ్రతకలేదు.

- నల్లమోతు శ్రీధర్

ఫిబ్రవరి 2004 కంప్యూటర్ ఎరా నుండి

Tuesday, 20 November 2007

స్నేహం - ఒక అనుబంధం




స్నేహం ఒక బంధం. ఒక నమ్మకం . దానికి వయసు తేడా గానీ, ఆడామగా తేడాగానీ లేదు. నిజమైనా స్నేహితులు ఉండడం మన అదృష్టం. స్నేహితులు కష్టసుఖాలలో తోడుంటారు. ఎంత కఠినమైన సమస్య వచ్చినా , బాధకలిగిన , సంతోషం కలిగినా ముందుగా మనం మన స్నేహితులతో పంచుకోవాలనుకుంటాము. లేకుంటే మనస్సుకు తృప్తి కలగదు. బాధలో మన స్నేహితునితో కొద్దిసేపు మాట్లాడినా (ఏవిషయమైనా) మన బాధ యొక్క తీవ్రత కాస్త తగ్గుతుంది. సంతోషమైతే పెరుగుతుంది. మనకు చాలా టెన్షన్స్ ఉన్నప్పుడు ఒక్కసారి స్నేహితులతో మాట్లాడితే చాలు ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్నేహితుడు మనకు డబ్బు సాయం చేయనవసరంలేదు. తన మాట సాయం మాత్రమే విచిత్రాలు చేస్తుంది.

మనకు కాస్త దగ్గరైన స్నేహితులు మనల్ని మనకంటే ఎక్కువగా చదవగలరు. మనము ఏ విషయమైనా ఎంత దాచాలని ప్రయత్నించినా ఇట్టే పసిగట్టేస్తారు. మన మూడ్‌ని మార్చేస్తారు. ఏ సాయమైనా చేయడానికి వెనుకాడరు. మనచుట్టూ ఎంత మంది బంధువులున్నా, ఒక్క మంచి స్నేహితుడు లేకపోవడం చాలా లోటు. మన మంచి కోరే ఒక నిజమైన స్నేహితుడు ఉండడం నిజంగా మన అదృష్టం. ఎన్ని కోట్లున్నా ఒక మంచి స్నేహితుడు లేకుంటే వాడు బికారి అని నా అభిప్రాయం. ఆ స్నేహితుడు మనల్ని పూర్తిగా అర్ధం చేసుకుంటాడు. తప్పు చేసినా ఒప్పు చేసినా నిలదీసి అడిగే అధికారం అతనికుంటుంది. స్నేహితుల మధ్య వ్యాపార ధోరణి ఉండదు. నువ్వు నాకేం ఇచ్చావ్, నేను నీకేమివ్వాలి అనే ఆలోచన ఉండదు. ఎప్పుడూ అతనికి ఏమివ్వాలి అనే తప్ప వేరే ఊహ రాదు అస్సలు.

కాని ఈ స్నేహం కూడా పెడదారులు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న అమ్మాయిలు , అబ్బాయిలు. చదువుకున్నవారు కాబట్టి స్నేహం , ఆకర్షణ మధ్య తేడా గమనించి మసలుకోవాలి. ఈ స్నేహం అన్నది చాల విచిత్రాలు చేస్తుంది. మనిషి మనిషికి మధ్య స్నేహం అనేది తప్పక ఉండాలి. భార్యాభర్తలైనా, తల్లితండ్రులు పిల్లల మధ్యనైనా ఎవరైనా సరే స్నేహం అనేది ఎప్పటికి ఉండాలి. అప్పుడే ఒకరినొకరు అర్ధం చేసుకోగలరు, మనస్పర్ధలకు తావు ఉండదు, ఒకవేళ ఉన్నా సూటిగా మాట్లాడి తొలగించుకోవచ్చు.

నేను చెప్పిందంతా పుస్తకాలలో చదివిందో , సినిమాలలో చూసిందో కాదు, నా స్వంత అనుభవముతో తెలుసుకున్నది. నన్ను నన్నుగా గౌరవించి, ప్రోత్సహించి, బాధలో ఉన్నప్పుడు నవ్వించే మంచి స్నేహితులను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్నేహితులకు అక్క,అన్న,తమ్ముడు,పెద్ద, చిన్న అన్న తరతమ బేధాలు ఉండవు. మనం ఒక వ్యక్తిని స్నేహితుడి/రాలిగా భావించామంటే అది ఒక అనుబంధానికి ప్రారంభం చేసామన్నమాటే. ఆ అనుబంధం ఇద్దరూ ఎప్పటికి నిలబెట్టుకోవాలి.

ఏడుపుగొట్టు పద్యం

తురగా వెంకమరాజు అనే కవి ఒకసారి తాళ్ళూరులో ఒక కమ్మవారింట పెళ్ళి జరుగుతుంటే కవిసత్కారం చేస్తారని ఆశించి వెళ్తే, ఆ యజమాని "ఇప్పుడీ కవుల ఏడుపేమిమిటి? వెళ్ళు! " అని కసురుకున్నాడంట. వెంటనే తురగా కవి కోపంతో


పెండ్లి పేరంటాండ్రు పెనురంకులకు నేడ్వ

బాజా భజంత్రీలు పప్పుకేడ్వ

రాజబంధువులంత రంకు ముండల కేడ్వ

బాజారు వెలదులు పసుపుకేడ్వ

వచ్చిపోయేడి వారు వక్క లాకులకేడ్వ

గుగ్గిళ్ళకై పెండ్లి గుర్రమేడ్వ

పల్లకీ బోయీలు భత్యాలకై యేడ్వ

బలు పురోహితుడు నేబులకు నేడ్వ

హారతి రూకల కాడూబిడ్డలు నేడ్వ

కట్నంబుకై గ్రామకరణ మేడ్వ

పెద్దమగండని పెండ్లి కూతురేడ్వ

పిల్ల చిన్నదటంచు పెనిమిటేడ్వ

చాల్పుగానిన్ని యేడ్పుల సాగెఁబెండ్లి

సరస తాళ్ళూరు లోపల విరసముగను

నర పేరయ్య చేసే నీ నాటి కహాహా!

కమ్మకులమున జన్మించి ఘనులు నవ్వ !!


అని పెద్ద పద్యం చెప్పి తిట్టుకుంటూ పోయాడట. పాపం! ఆ నర్రా పేరయ్య ఎవడో? అనవసరంగా కొరివితో తల గోక్కున్నాడు.

కందర్ప కృష్ణమోహన్‍కు పుట్టినరోజు శుభాకాంక్షలు




ఆ భగవంతుడు నీకు సకల ఆయురారోగ్యాలు,విజయాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

Sunday, 18 November 2007

బ్లాగ్విషయం : స్నేహం

హలో !

ఒక్కసారి అందరూ ఇటు రండి. చావా కిరణ్ మొదలు పెట్టిన ఈ బ్లాగ్విషయం గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. మీ అందరూ పలు విషయాలపై మనసులో తట్టగానే బ్లాగులో రాసేస్తున్నారు. కాని మీ ఆలోచనలను కాస్త ఈ విషయం పై కేంద్రీకరించి రాయండి. అది అసాధ్యమేమీ కాదనుకుంటా. ప్రపంచంలో స్నేహితులు లేనివారుంటారా.. మీరు రాసే పద్యాలైనా సరే స్నేహం పై రాయండి.

స్నేహంపై మీకున్న అభిప్రాయం, మీకు తటస్థపడిన మంచి స్నేహితులు, మీకున్న మంచి లేదా చెడ్డ స్నేహితులు, మీ అనుభవాలు రాయండి. వచ్చేవారమంతా అందరం స్నేహంపై టపాలు తప్పక రాద్దాము. సరేనా!

అలోచించండి మరి... చించి చించి రాయండి త్వరగా...

Saturday, 17 November 2007

తారాలోకం




ఎంత బలీయమైన మెసేజ్‌నైనా జనం మనసుల్లోకి తీసుకువెళ్ళాలంటే సినిమాని మించిన మాధ్యమం లేదు. అయితే సినిమా రంగం తన మనుగడని నిలుపుకోవడానికి ప్రేక్షకుల్ని వెదుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పైరసీ, టెలివిజన్ చానెళ్ళ దెబ్బకి కుటుంబం మొత్తం సినిమా థియేటర్లకి తరలి వెళ్ళే సందర్భాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రంగానికి మహారాజ పోషకులు యువతే మిగిలారు నచ్చితే విసుగు లేకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించే తీరికా, ఓపికా యువతకే ఉండడంతో దాదాపు ప్రతీ సినిమా డైరెక్టరూ, నిర్మాత ఎలాగైనా యువత నాడిని పట్టుకుని కాసుల వర్షం కురిపించుకోవడానికి 'ఫార్ములాలు ' వండి వారుస్తున్నారు. అయితే తమ లక్స్యం యువతని ఆకర్షించడమే అయ్యేసరికి... యువతలో అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న అనేక భావాలకు, ఉద్వేగాలకు, ఆవేశాలకు పెద్ద పీట వేసి సినిమాలను ఎలాగైనా పండించడానికి నానా తంటాలు పడుతున్నారు.


ఈ ప్రయత్నంలోనే కొందరు దర్శకులు నైతిక విలువలు, శృంగారపు హద్దులు అతిక్రమించి అంగాంగ ప్రదర్శనలతోనైనా యువతకు గాలం వేయడానికి జూమ్ కెమేరాలకు పనిపెడుతున్నారు. అది తప్పు , ఇది ఒప్పు అని సినిమాలకు దిశానిర్దేశం చేసే పెద్దలు కరువయ్యారు. ఓ ఇరవై లక్షలు చేతిలో ఉంటే... అనుభవం, అర్హతలు ఆలోచించకుండా సినిమా నిర్మాణంలోకి దిగేస్తున్న వారెందరో? వారికి కావలసింది తాము పెట్టే పెట్టుబడికి కనీసం వడ్డీ అయినా రావడం... అందుకే మినిమమ్ గ్యారంటీ ఫార్ములాలైన శృంగార, లవ్, సెంటి్‌మెంట్‌లకు పెద్ద పీట వేస్తున్నారు. హీరోహీరోయిన్లకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చిత్రీకరించి పోస్టర్లుగా వేసి సినిమాలకు క్రేజ్‌ని సంపాదించుకునే గిమ్మిక్కులు ఇలా మొదలవుతున్నవే. వారు సాధించదలుచుకున్నది మొదటి రెండు వారాల్లో అడ్డదారులు తొక్కయినా పాపులారిటీ సాధించుకోవడం.. దానితో సినిమాకి మినిమమ్ గ్యారెంటీ ఖాయం. ఇలా సినిమా రంగం పూర్తిగా పెట్టుబడి, నిర్వహణ, రాబడి అనే ఆర్ధిక చట్రంలోనే ఇరుక్కుపోతున్న తరుణంలో విలువలతో కూడిన సినిమాలను ఆశించడం సగటు ప్రేక్షకులుగా మనకు అత్యాశేనేమో!!!


మీ నల్లమోతు శ్రీధర్

Friday, 16 November 2007

తెలుగు కవుల హృదయాలలో పెల్లుబికిన గోదావరి - 2



చిలకమర్తి లక్ష్మీనరసింహం "గౌతమీ ప్రభావం"పై భావుకత మూర్తిభవించే ఒక పద్యం వ్రాశారు.

కంకణంబులు గ్రాలఘన తరంగములపై
హొయలొప్ప నుయ్యాల లూగియూగి
చలువదుప్పటులట్టి సైతక స్థలులపై అల్హతి దాగు మూతలాడి యాడి
వడగండ్ల బోలెడు వలినీటి వెల్లువ చిరతర క్రీడల జేసిచేసి
బెరకు తీయని నీరు చన్ని దోయిట దీసి
తననోవ బలుమారు త్రావి త్రావి
బాల్యమున నీవలన సుఖపడియైకాక
ఆంధ్రకవితా లలామ నీయంతికమున
శాశ్వతమ్ముగ వసియించే సత్యమింక
భవ్య గౌతమీ నీదు ప్రభావమేమో !"


కవిత్వ స్త్రీ బాల్యంలో కెరటాలపై ఆడుకుంది చల్లని దుప్పట్ల వంటి ఇసుక మేటలపై దాగుడు మూతలాడుకుంది. వడగండ్లను పోలిన నీటివెల్లువలో ఆటలాడుకుంది. ఇలా ఇలా ఆడిపెరిగిన కవితా స్త్రీ గోదావరి చెంతనే శాశ్వతంగా ఉండిపోయిందంట అదీ గౌతమీ ప్రభావం.

రాజమండ్రి వీరేశలింగ గ్రంధాలయములో ’అభినవ భర్తృహరి చిలంబు ఆదినారాయణప్ప నాయుడుగారి పవిత్రమగు చరిత్రము’ అనే ఒక పుస్తకము 1924లో అచ్చయినది ఉంది. అందులో చిలంబుగారు 1896 పుష్కర సంధర్భంగా వ్రాసిన
"శ్రీ గోదావరీ విషయ విశేష సీసమాలిక" అనే రచన పుష్కర కవితలలో ప్రాచీనమైనది. కాశ్మీరం మొదలైన ఎన్నో ప్రాంతాలనుండి ఈ దుర్ముఖి పుష్కరానికి యాత్రికులు వచ్చారని వ్రాశారు "ధూమశకటం ములపయిమిక్కుటం బయి కోటాన కోటులు జనులు గూడి , ఎడనెడ బడిపడి యెతెంచె పొగబండ్లు " అంటూ ఏక‍ఉలం వారు పుష్కర దేవతలలో ఎవరెవరిని కలుసుకుందామనుకుంటున్నారో ఊహించి రాస్తూ.. గౌతమిని చూడడనికి బ్రహ్మదేవుడు వస్తే చూద్దామని బ్రాహ్మణులు, కుబేరుడు దేవతలతో వచ్చినప్పుడు ఇక్కడి బ్రాహ్మణులకు ఏమిస్తాడో చూద్దామని వైశ్యులు, హరిశ్చంద్రుడు వస్తే అతని సత్యవాక్కు గురించి తెలుసుకుందామని శూద్రులు, పరశురాముడు వస్తే అతని బాహుబలం గురించి తెలుసుకుందామని క్షత్రియులు (పుడమిరేడులు). ఈ విధంగా దేవతల ఆగమనం గురించి అన్ని కులాల వారూ ఎదురు చూస్తున్నారని చిలంబుగారి భావన. " ప్రదేశ ద్రవ్యబలసమాజికులు" ఉన్నారని వ్రాశారు. అంటే లోకల్ టాక్స్ కలెక్టర్లు అని అనుకోవాలి.

1915 లో తాడిమెళ్ళ వేంకటకవి నిడదవోలునుండి " గోదావరి పాటను" ప్రకటించారు. గోవింద నామాల వరుసల్లో వ్రాయబడిన ఈ పాట ప్రసిద్ధిలోకి రావల్సిన సారళ్యం, మాహాత్మ్య వివరణలు, సర్వకోణాల ఆవిష్కరణలు ఉండడంవల్ల ఈ ప్రజాకవిత్వం మరింతగా ప్రజలపాలు కావడం అవసరం.

ముక్కంటి శిరమున గోదావరీ
ముద్దులగుల్కేట గోదావరీ !
కోటి యజ్యములైన గోదావరీ
సాన్నకోటి యంశము గాదు గోదావరీ
రామకథలతోటి గోదావరీ
రంజిల్లుతున్నది గోదావరీ
పుడమిలో జనులంత గోదావరీ పుష్కరంబిని ములిగె గోదావరి
అన్ని సమయములందు గోదావరీ పాట
ఆనందవచ్చును గోదావరి.

నిజానికి ఈ గోదారి పాట ఆద్యంతమూ ఆకర్షనీయంగా ఉండి అలరిస్తుంది.

గోదారి ప్రసక్తులు,ప్రశస్తులూ శ్లోకాల్లో ఉన్నట్లే జానపద గేయాల్లోనూ లభిస్తాయి. 1944 అక్టోబరు 25 రెడ్డిరాణి సంచికలో పుట్టింటి భ్రమతో ఒక జానపద మహిళ ఇలా గేయంలో అంటుంది.


కన్నవారి మీద కలలు వచ్చాయి
పాపిష్టి గోదా పాయ్యివమ్మ
దోసకారి గోదారి దోవియ్యవమ్మ
ఆడబిడ్డనగుట అడిగితి మాట
పుణ్యశాలి గోదారి మ్రొక్కెదను నీకు
దగదగ మెరియంగ దండాలునంది
దారియ్యె గోదావరి దయయుంచవమ్మ


దీనిలో నిందాస్తుతి ఉంది.
గోదారి పయిస్తే పుట్టింటికి వెళతాననడం జానపదగాధల్లో మహత్తులకు దగ్గరగా ఉంది.

గురుదేవోపహారం అని 1941లో అచ్చయిన గ్రంధంలో వీరేశలింగ సహచరులైన జయంతి గంగన్న గోదావరి కవిత అందరికీ ఆత్మీయమైన హృదయ సన్నిహితమైన పాట అవుతుంది. పడమటి కొండల నడుమనుండి వచ్చే గోదావరి గురించి ఆయన....


మొన్న మొన్ననే ప్రాక మొదలు పెట్టినయట్టి
చిన్ని బాలిక - తల్లిచేతిలోపల నుండి
తప్పించి కొనివచ్చు చొప్పునను శృంగార
మొన్న పడవంటి కొండనుండి వెడలుదువమ్మ తల్లిగోదావరి.



గోదారి తల్లే ! ఎల్లా తల్లి అని చెప్పవచ్చు? కుమారుడు మంచివాడైనా, చెడ్డవాడైనా తల్లి ప్రేమతో పెంచుతుంది ఆదరిస్తుంది. అదే అంశాన్ని తెలియజేస్తూ..

సాధుమృగమిది, దుష్ట జంతు విదియని కాని
సాధుమానవుడు దుర్జనుడు వీడని కాని
ఇంచుకైనను చూడకిచ్చుదువు జీవనము
ఎంచునా? తన బిడ్డ మంచి చెడ్డలు జనని


ఇలా సాగుతుంది గోదారి...

1953 లో గోదారి అనూహ్యమైన వరదలతో భయపెట్టింది. గట్టు తెగింది.ప్రజకు పుట్టి మునిగింది. పంటల నష్టాలు, ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు అన్నీ అపారం. ద్విశతాదిక గ్రంధకర్త, అస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి " గోదావరీ మహాప్రళయ తాండవం" అంటూ ద్విపదలో విషాద కవితా గానం చేసారు. అందులో వరదలకు చిక్కుకున్న వారిని మన కళ్ళకు గట్టినట్టు చూపించారు.


పండి నిద్రించెడి వారు లోగిళ్ళ
నిండ వచ్చిననీట నిలువంగ లేక
వెలుపలికిం బోవ వెదకి ద్వారంబు
తెలియంగజాలక తెన్ను మిన్నెరుగ
తెలియంగ జాలక తెన్ను మిన్నెరుగ
లేక యొండెరుగని లేవడులగుచు
అమ్మోయ్ బాబోయ్ యని యర్చుకొనుచు
ముమ్మరంబయి నీరు ముంచిన యంత
కొందరు చచ్చిరి కొందరు ప్రక్కలందుండి చచ్చిరి


శ్రీపాద ముద్రతో రవీంద్ర సారస్వత సమాజానికి చెందిన కవి వంగూరి సుబ్బారావు మూడు జంటల వివాహపు ముచ్చటలో భాగంగా.. ఒక కానుకగా 'గోదావరి పెండ్లి ' అనే గీత పద్యాల చిన్న పుస్తకం ఇచ్చాడు.గోదావరి పుట్టుక, వరాన్వేషణ, వలుపు ,గోత్ర పతి హితవు, గోదావరి ప్రయాణం, తుంగభద్ర కబురు, గోదావరి పొంగు పాణిగ్రహణం శీర్షికలతో శీర్షాతాపజేసేలా కధనవల్లి కవిత చెప్పి ఒప్పించాడు.

సామాజిక స్పృహకు మారుపేరైన శ్రీ అవంత్స సోమసుందర్ 1953 వరదలకు చలించిపోయి, వజ్రాయుధం తర్వాత అంత రసవత్తరంగా వ్రాసిన కవిత అనిపించేలా గోదావరి జలప్రళయం కావ్యాన్ని కరుణ రసభరితంగ వ్రాశారు. గోదావరీ సాహిత్యంలో నిలిచి మన కళ్ళనుండి అశృజలపాతాలు పారేలా చేసే రసగుణం కలది.

ఏమమ్మా, ప్రళయమువలె పొంగి ఓ గౌతమి
ఇకనైనా దయను చూపి శాంతించవదేమి?
ప్రసవించిన పులివై నీ కన్న బిడ్డలను మమ్ముల
కోరలెత్తి మ్రింగుట ఇది ఏమన్యాయమే తల్లీ...

కర్మసాక్షితో దినమంతా పాటుపడుచు
ఇతరుల జోలి సాంటా యెరగుకుండ బ్రతుకుచు
పరువు కొరకు పడి చస్తూ పరుల కొరకు కష్టిస్తూ
గవ్వలవలె తేతలు వలె బ్రతుకుతున్న మానవులను
అయ్యయ్యో బలిగొనవేలనే? ఓ జలప్రళయ గోదావరీ


అంటూ విషాద తరంగాలలో వరదే తన కవిత్యవమైనట్లు గుండెల్ని పిండేస్తారు సోమసుందర్.

తెలుగు కవుల హృదయాలలో పెల్లుబికిన గోదావరి...1




గోదావరి వంటి పరమ ప్రాకృతికమైన రస వస్తువుకంటే కవితా రచనకు మరొకటి తగి ఉంటుందా !.. గోదావరి గంగ కన్నా ప్రాచీనమైనది. అంతటి పవిత్రమైనది.

సుదీర్ఘ ప్రవాహ ప్రయాణాలు, కొండల స్నేహపరిమళాలు సంతరించుకోవడం , కలుపుగోలుతనంతో ఉపనదుల్ని విలీనం చేసుకోవడం, అటనట అటవీ ప్రాంతవిహారాలు బహుబాషల్ని ప్రతిధ్వనించడం, ఇలా గోదావరి దర్శనీయ కోణాలు ఎన్నో. బహు సంస్కృతుల అనుపానుల పరిణామాల ప్రత్యక్ష సాక్షి గోదావరి.

చినుకులు, వానలు, కాలువలు, వాగులు, వరదలు, పచ్చపచ్చని పంటలు వీటన్నిటితో భాషలు గోదావరి తల్లికి తెలుసు. విరగబండిన వరిచేను కంకుల గాలి మొదలికల్లో గోదారి కనబడుతుంది. నిటారుగా హుషారుగా పెరిగే చెరకు గడల్లోని గోదారి మాధుర్యం తినబడుతుంది. ఫ్యాక్టరీల్లోని పంచదారకు దారులు చూపుతుంది. ఎర్ర ఎర్రని మిరప పళ్ళల్లో గోదారి - సూర్యోదయ అస్తమయ సౌందర్య విన్యాసాలను సూక్ష్మ స్వరూప విలాసాలుగా అందిగిస్తుంది.

శ్రామికులను, నాగరికులను సమభావంతో బ్రతుకుదారుల్లో సేదదీరుస్తుంది. నాశికాత్ర్యంబకంనుండి, కడలిలో కలిసేవరకు ఒక విస్తృతమైన నడక విలాసమైన నడక. ఒక చోట చల్లగా ,, ఒక చోట వేడిగా, ఒకచోట లోతుగా, ఒక చోట ఇసుకమేటలపై తట్టులోతులు. ఇటువంటి మహానదిని గురించి సంస్కృత కవులు అనేక స్తుతులతో కవితలతో సుశ్లోకలయ్యారు.

తెలుగుకవుల స్పందనల విందారగిద్దాం మరి. నన్నయగారు ఆదిపర్వంలో "దక్షిణ గంగ నావద్దయు నొప్పిన" అని ప్రసక్తి మాత్రమే చేసినప్పటికి దక్షిణ గంగ అని ప్రశస్తి తెలిపారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి విస్తృతమైనట్లు శ్రీనాధుని కాలానికి వచ్చేటప్పటికి గోదావరి విస్తృత రచనావస్తువయింది. "త్ర్యంలుకాచల శిఖరాగ్రంబునందుండి" సముద్ర పర్యంతమూ ప్రవహించిన గోదావరిని శ్రీనాథుడు రసవత్తర పద్యాలలో ప్రతిబింబింపజేస్తూ "గౌతమీగంగ లవణాబ్దిగౌగలించే" అంటూ ఆద్యంతం మనోహరంగా వర్ణిస్తాడు.

"కాశింజచ్చిన యంత వయంగారాని కైవల్యమ
క్లేశంబై నమవేద్యనాయకుని చే లీలాగతింజేరు రా
రో శీఘ్రంబున మర్తుయలారా! యను నారూపంబు
నమ్మోయునా కాశాస్పాలన గౌతమీజలధికీల్లోల స్థానముల్"


అంటూ శ్రీనాధమహాకవి తనన్పుకంఠంతొ మనుష్యులందర్నీ పాత్రోచితంగా ఆహ్వానించాడు. ఇందులో గోదారి పిలుపు తనకంఠంలో ప్రతిధ్వనించాడు.

"గోదావరి గోదావరి
గోదావరియంచు పల్కు గుణవంతులమేన్
గోదావరి తల్లి న
పాదింతు గదమ్మ భవ్య శుభంబుల్"


అంటూ నదీ మహాత్మ్యాన్ని తెలుపుతూ గోదావరి నామోచ్చారణతో పొంగి పులకించి పోయినవాడు శ్రీనాధుడు. తన కవితా మాధుర్యంతో "సప్తగోదావరీ జలముతేనె" అని రూఢిపరిచాడు. వార్ధులేడింటికిన్ వలపువనిత" అని గోదావరి మరో కోణంలోనూ చూపాడు. ఆ నకతశ్రేష్టుడైన శృంగారకవి "నేటివ్ స్పిరిట్" తో " సన్నాఫ్ ది సాయిల్"గా తన వివిధ గ్రంధాలలో శ్రీనాధుడు గౌతముని ఆబగా వర్ణించాడు.

"తెలుగుల పుణ్యపేటి" పోతన్న ఆంధ్రమహాభాగవతంలో రామాయణ కథా సంధర్భంలో దండకారుణ్యం గురించి తన శైలీ సౌందర్యంతో ఇలా వ్రాశాడు.

"పుణ్యుడు రామచంద్రుడటబోయి ముదంబున గాంచె దండకా
రణ్యము తాపసోత్తమ శరణ్యము నుద్ధత బర్హి బర్హలా
వణ్యము గౌతమీ విదులావఃకణ పర్యటన ప్రభూత
ద్గుణ్యము ఉల్లసత్తురుని కుంజవరేణ్యము నగ్రగణ్యమున్ "


గోదావరి విమల జలకణాల పర్యటనలవల్ల దండకారణ్యం సద్గుణ గణ్యమైందనడం ఒక పవిత్ర కథా సందర్భ రస స్పందన!

15 వ శతాబ్దికే చెందిన ప్రగ్గడపల్లి పోతయ్య "గోదావరి" మకుటంతో ఒక శతకమే వ్రాసినట్ట్లు కవి చరిత్రకారుల వలన తెలుస్తున్నా ఆ శతక పద్యం ఒకటే ప్రసిద్ధికి వచ్చింది.. ప్రగ్గడపల్లి " .. సురుచిరక్షోణీ పురంధ్రీ యశోధర ధమ్మిల్ల లతాంత మాలికో, భతన్వీకుచశ్రీ, హరసువ్యాసమొనాగునీదగు ప్రవాహంబొప్పు గోదావరీ ! " అనే తన పద్యంలో భూమికి గోదావరి ఒక దండగాను, ఆ భూమికి కునంపదకు విస్తృతమైన సొగసుగాను ఉగ్గడించాడు. "హంసనింశతి" లో అయ్యలరాజు నారాయణామాత్యుడు నదులు జలపాతాలపై ఏకంగా ఇరవై నాలుగు పాదాల సీసమాలికను వ్రాశాడు. అందులో "గౌతమి" ని పేర్కొన్నాడు. టేకుమళ్ళ రంగశాయి కవి తన "వాణీ విలాస వనమాలిక " గ్రంధంలో గౌతముడు, గోవుల కథను ప్రస్తావిస్తూ నాశిహిత్ర్యంబకునుండీ అంతర్వేది వరకూ ఉండే గోదావరిని దేవతలు, మునులు ప్రస్తుతిస్తూంటారన్నాడు.

ఒకానొక కాలంలో తెలుగులో నోబెల్ బహుమానం వస్తుందని ఆశించబడిన గ్రంధం భక్త చింతామణి. ఒకానొక కాలం నాటి సాహిత్యవేదికలు భక్త చింతామణి పద్యాలతో పులకరించిపోయాయి. ఆ గ్రంధకర్త, వేణీసంహార ఆ నాటక ఆంధ్రీకరణకర్త వడ్డాది సుబ్బారాయుడు భక్త చింతామణి మకుటంతోనే 1932 లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో అంగీరస గౌతమీ పుష్కరం శీర్శికతో వ్రాసిన పద్యాల్లో చరిత్ర నిక్షిప్తం చేశారు.

"భువన క్షేమ విధాయి పుష్కర జనంబుల్ వేనవేల్ గౌతమీ.
సవనంబాదిగ రాణ్మహేంద్రనగరిన్ సర్వాశలందుండి తీ
ర్తవిధుల్ సల్పి కొనంగ మూగెదరు : చోరవ్యాధి బాధాది వి
ప్లవ మాంగీరస నొందనీకు ప్రజ దేవా భక్త చింతామణీ "


అనడంలో యాత్రికులకు దొంగలబాధలు వంటివి లేకుండా చూడవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్ధించారు. పుష్కర దినాల్లో విమానాల్లో విహరించే జనం దేవతల్లా ఉన్నారని అందులోని వేరే పద్యాల్లో అంటారు. అంగీరస పుష్కరంలో బండ్లకు నిండ్లకు బాడుగ తగ్గెనని వ్రాశారు. అది విశేషమే. గోదావరి ప్రాంతాంలో నూతులలో నీళ్ళు, గోదావరి బాగా వచ్చేటప్పటికి పైకి వస్తుండడం వుంది. వసురాయకవి అందుకే దానిని ఎలా పోల్చాడో!

"తల్లియొఱదాక నూతులు
కల్లోలవతీమ తల్లి గౌతమి రాకన్ "
గోదావరిలో లాంచీ ప్రయాణాన్ని"గౌతమీ ధూమ నౌక విహారం" అని వ్రాసిన ఆ రోజులు చిత్రమైనవి! వసురాయకవి గోదావరి సంబంధంకంగా జలమాహత్మ్యంపైన వేరుగానూ ఎన్నో వ్రాసారు. స్థానిక ముద్ర ఈ రచనలపై ఎక్కువగా ఉంటుంది.


గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన వ్యాసం ఆధారంగా రాసినది......

Thursday, 15 November 2007

కలగంటి కలగంటి






మామూలుగా కలలు ఎప్పుడు వస్తాయి కాని గుర్తుండవు. చిన్నప్పుడు ఎక్కువ కలలొచ్చేవి. బహుశా బాధ్యతలు ఎక్కువ శారీరక శ్రమ లేనందువల్లనేమొ, మనసుకు పనేమీ లేక కలలుకనేది. స్కూలులో ఉన్నప్పుడూ పొద్దున్న జరిగిన చదువులు, పోట్లాటలు అన్ని నిద్రలో కలల్లో కూడా వెంటాడి కలవరింతలుగా మారేవి. మళ్ళీ ఉదయం అమ్మ చెప్పేవరకు కూడా అలా కలవరించామని తెలీదు. నాకు ఎన్నో కలలు వచ్చాయి. కాని గుర్తుపెట్టుకునేటంతగా ఏమీ లేవు. కానీ పెళ్ళి కాకముందు మాత్రం నాకు ఒకే కల ఉండేది. అది ప్రతి ఆడపిల్లకు ఉండేదే.. అప్పుడు సినిమాలు చూసి అందులోని పాత్రలు, కథలు నిజమని నమ్మేదాన్ని. మగవాళ్ళు అంటే ఎక్కువగా మద్యం తాగడం, అమ్మాయిలతో తిరగడం, విలాసాలతో భార్యను నిర్లక్ష్యం చేయడం ఇలా.నేను మనస్పూర్తిగా కన్న కల మాత్రం నాకు వచ్చే భర్త ఎక్కువ చదువుకుని ఉండాలి, కనీసం డాక్తరైనా, ఇంజనీరైనా( ఆ కాలంలో వీళ్ళిద్దరంటే చాలా గొప్ప) అయి ఉండాలి, మంచి ఉద్యోగం (ఎక్కువ అస్థి లేకపోయినా ఫర్వాలేదు నెలకు జీతమొస్తే చాలు) బజాజ్ చేతక్ స్కూటర్,కట్నం తీసుకోకూడదు, తాగుడు అమ్మాయిల అలవాటు ఉండకూడదు. ఇలా కలలు కంటూ ఉండేదాన్ని అది నిజమవుతుందనే నమ్మకం లేకున్నా. కాని అది మొత్తం అక్షరాలా నిజమైంది. అలాంటి వ్యక్తి నాకు జీవితభాగస్వామి అయ్యారు. ఇంజనీర్, స్కూటర్ ఉంది,కట్నం వద్దన్నారు,చెడు అలవాట్లు లేవు (ఇప్పటికీ కూడా, అప్పుడప్పుడు నేనే ఒకసారి మద్యం రుచి చూస్తానంటే తిట్టి, మీ పుట్టింటికెళ్ళి ఫుల్లుగా తాగేసి మొత్తం దిగాక ఇంటికి రా అంటారు. ప్చ్ ) ఇక ఆ తర్వాతి కల అంటే మా పిల్లలు మంచి( పెద్ద కంపెనీలో) ఉద్యోగాలలో సెటిల్ కావాలి, మంచి మనుష్యులుగా ఉండాలి ముందు అని. అది దాదాపు తీరినట్టే. మా పిల్లలకు కూడా నేను చెప్పేది ఇదే. పెద్ద పెద్ద కలలు కనండి కాని అవి తీర్చుకోవడం అసంభవమేమీ కాదు, వాటికోసం కష్టపడితే చాలా సులభం అని. అది వాళ్ళిద్దరూ పాటించారు. విజయులయ్యారు.


ఐతే నాకు గుర్తున్న అస్సలు మర్చిపోలేని కల ఒకటుంది. ఇప్పటికీ నా కళ్ళముందు కనిపిస్తూ ఉంది.
అదేంటంటే
..

మేము కారులో (నేను తప్ప కలలో ఎవరూ కనపడలేదు)కారులో తిరుమల కొండలపై వెళుతున్నాము. హటాత్తుగా కారు ఆగిపోయింది. అందమైన ప్రకృతి. పచ్చని చెట్లు,కొండలు, ఆహ్లాదకరమైన వాతావారణం. అలా చూస్తూ ఉంటే తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీనివాసుడు సర్వాలంకారణ భూషితుడై. వివిధ వర్ణముల పుష్పములతో కనిపించాడు. అప్పుడూ నేను ఆ స్వామి , ఆ కొండలు తప్ప ఏవీ కనపడలేదు. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్లముందే ఉంది. అస్సలు మర్చిపోలేదు,కళ్ళ ముందు నుండి చెరిగిపోలేదు.

Wednesday, 14 November 2007

సరదా ప్రహేళిక

1. నిమిషాన్ని తికమక చేసి డబ్బులు కట్టే బంధుత్వం. ఏంటది?

2. మనం ఏది కావాలన్నా ఫీ కడతాం కదా! అలాగే పెదాలకు కట్టే ఫీ ఏంటి?

3. ప్రతి ఒక్కరు వేసుకునే మాల అది. వేసుకోకుంటే మన జీవితమే వ్యర్ధం. ఏంటా మాల?

4. మినపట్టు, గోధుమ అట్టు... ఇలా ఎన్నో రకాల అట్లు మనం
తింటుంటాము. కాని మాట్లాడే అట్టు ఒకటుంది. అదేంటి?

5. పెళ్ళిళ్ళకు, పండుగలకు సెంటు వేసుకోవడం చాలామందికి
అలవాటు. కాని ఒక వ్యక్తి మాత్రం సెంటు వేసుకుని వెళితే
మాత్రం అస్సలు రానివ్వడు. ఎవరతను??

Sunday, 11 November 2007

దీప్తి కశ్యప్‍ లకు వివాహమహోత్సవ శుభాకాంక్షలు




వేద మంత్రోచ్చారణలు, పెద్దల ఆశీస్సులతో పవిత్ర వివాహ బంధంలో ఒకటవుతున్న కశ్యప్ , దీప్తిలకు మనఃపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు




Saturday, 10 November 2007

A walk to emphasize the role of blood donation

Please participate.

Time: 7 Am

Venue: People's Plaza, Necklace Road (near EAT STREET)

Event: A 1 km backward walk, followed by a 4 km forward walk.


Looking forward to see you all @ Necklace Road.


For details, contact the following persons.
Shareef - +91-9885039261
Karthik - +91-9866651177
Rohit - +91-9866478434 --




We all know that we wanted to keep this forum to share news/events/acvities of different social work groups. This is an invitation to an event organized by friends2support.org . Please participate and show your solidarity. Let us start a good practise to support the other groups and develop the notion that all of us are together.

Invitation from: friends2support.org team.

Every Step We Take... Adds A Drop of Blood to fill Ocean of Need

2nd Anniversary.

On the 14th of Nov 2007, friends2support will be celebrating its 2nd anniversary. It has been a remarkable journey so far and we have grown in leaps and bounds since making a small beginning in Guntur. Today we have close to 20,000 registered voluntary donors and we have helped save many lives but the journey has only just begun and there is lots more to do. To celebrate the occasion of our 2nd anniversary, we are planning to conduct an event on 11th Nov, a Sunday because 14th happens to be a working day.

The event: A 1 km backward walk, followed by a 4 km forward walk.
The Venue: Necklace Road
Time: 7 am

The significance:
The backward walk signifies the fact that even in the 21st century, with such advancement in the society, people are still dying due to the lack of blood in times of emergency. Moreover, a vast majority of the population are still apprehensive to donate blood fearing that it would affect their health. During the backward walk we would also be spreading an awareness of the need to donate blood through slogans and also educate people with the medical facts about blood donation through pamphlets, posters and banners.

The forward walk signifies that there is a ray of hope, a solution to this problem, being provided by friends2support. We as an organisation are providing the platform to connect the needy to the donor thus ensuring that lives are not lost due to lack of blood. Moreover, friends2support also educates people on the positives of blood donation, the number of lives one donation can save and the fact that blood donation does not harm anyone.

To make this walk a huge success, we request each of you to join us on the day to show your support to the cause. If you want to volunteer or help in anyway, do let us know.

Thanking you all,
Team friends2support.org




Thank you.

with regards,
PRASANTHI.UPPALAPATI

Friday, 9 November 2007

జీవన మాధుర్యం

ఓ విజయం ఆత్మవిశ్వాసానికి పునాది
ఓ పరాజయం ఆత్మన్యూనతకి ఆరంభం !
ఓ అవమానం ఆత్మగౌరవానికి చెంప పెట్టు
ఓ గౌరవం అణకువను నిద్రలేపుతుంది
ఓ తప్పిదం ఆత్మపరిశీలనకు దారితీస్తుంది
కొంత ప్రేమ ద్వేషాన్ని హరిస్తుంది
కొంత ఆరాధన ప్రేమని వుసి గొల్పుతుంది
ఆవేశం విజ్ఞతని మింగేస్తుంది.
అహంకారం జ్ఞానచక్షువులను అంధకారం చేస్తుంది
అందం ఆనందాన్నిస్తుంది.
శృంగారం కోరికల్ని రెచ్చగొడుతుంది
స్నేహం హితవుని కోరుతుంది
వైరం పతనాన్ని ఆశిస్తుంది
విద్య వినయాన్ని నేర్పుతుంది.
విజ్ఞానం అన్వేషించాలన్న తృష్ణ రగిలిస్తుంది
లౌక్యం వ్యవహార జ్ఞానం అందిస్తుంది
మంచితనం సమాజాన్ని చేరువ చేస్తుంది
చేతగానితనం సమాజానికి లోకువ చేస్తుంది
మానవత్వం ఆత్మీయతను పెంచుతుంది
ఆదరణ అతిథుల మనసుల్ని మైమరిపిస్తుంది
అసూయ మనల్ని దహించివేస్తుంది
స్వీయ సానుభూతి లోపాలని కప్పిపెడుతుంది.
మూర్ఖత్వం వ్యక్తిత్వాన్ని పలుచన చేస్తుంది
పట్టుదల విజయాన్ని చేరువ చేస్తుంది
మొండితనం మనల్ని ఒంటరిని చేస్తుంది
చిరునవ్వు స్నేహాన్ని కోరుతుంది
చిటపటలు విరోధానికి ఆనవాళ్ళు
భయం ఆత్మరక్షణని కోరుతుంది
ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుంది
కోరిక విచక్షణని చంపేస్తుంది
అనుమానం వాస్తవాన్ని విస్మరిస్తుంది
సంశయం అనిశ్చితని పెంచుతుంది
అత్యాశ విరోధులను పెంచుతుంది
పతనం పయనం మళ్ళీ విజయం వైపే…!

ఇదంతా జీవన చట్రం ! ప్రతీ అనుభవం ఉద్వేగాలను రగిలించేదే..
ప్రతీ అనుభవం కొన్నాళ్ళకు కాలగర్భంలో కలిసిపోయి ఉద్వేగాలను చల్లార్చేదే !

ఇన్ని వినూత్నమైన పార్శ్యాలు లేకపోతే మానవ జీవితంలో మాధుర్యమేముంటుంది?
సృష్టికర్త అద్భుతసృష్టికి మానవ జీవితాన్ని మించిన కళాఖండం ఏముంటుంది…

అందుకే జీవితాన్ని మనసారా జీవిద్దాం..

మీ
నల్లమోతు శ్రీధర్

Thursday, 8 November 2007

తెలుగు బ్లాగు వార్తలు



నమస్కారం.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వెలుగు జిలుగుల పండుగ సంధర్భంగా మీకు సమర్పిస్తున్న ప్రత్యేక వార్తలు. ఈ వార్తలు ఒకేసారి మాత్రమే ప్రసారం చెయ్యబడతాయి. ఇందులో అన్నీ నిజాలే చెప్పబడతాయి. మధ్యలో వ్యాపార ప్రకటనలు ఉండవు. అందుకే మీ పనులన్నీ తీర్చుకుని వచ్చి తీరిగ్గా కూర్చోండి. ఈ వార్తలు అచ్చమైన తెలుగులో చెప్పబడును. తెలుగును తెలుగులా, ఇంగ్లీషును ఇంగ్లీషులా మాట్లాడబడును ఎటువంటి వికార చేష్టలు లేకుండా.

ఇప్పుడూ మీకు ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన ప్రపంచం గురించి చెప్తున్నాను. అదియే బ్లాగ్ప్రపంచం. ఇక్కడ తెలుగును అభిమానించే వారే ఉంటారు. వీరు ఒక రాష్ట్రానికి కాని, నగరానికి కాని, దేశానికి కాని సంబంధించినవారు కాదు. ప్రపంచం నలుదిశలా వ్యాపించి ఉన్న తెలుగు వారు రాసే బ్లాగుల లోకం. ఇక్కడందరూ వివిధ విషయాలపై బ్లాగులు రాయుచు అంతర్జాలములో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయముతో తేనేలాంటి మన తెలుగు భాషని ఎల్లెడలా వ్యాపింపజేసి తెలుగు వెలుగులను విరజిమ్ముతున్నారు.ఈ లోకంలో తరతమ భేదాలు లేవు. వయసు, చదువు తేడాలసలే లేవు. ఉన్నదల్లా ఎవరికి తెలిసిన విషయాన్ని వారు తెలుగులో రాయడమే. ఇక్కడ ఒక విద్యార్థి నుండి ఒక విజ్ఞానవేత్తవరకు, ఒక కార్టూనిస్టు నుండి ఒక గృహిణివరకు అందరు బ్లాగేవాళ్ళే. ఇక చదివేవాళ్ళకంతులేదు. తెలుగు బ్లాగర్లందరు ఒక వింత ఒరవడి సృష్టించారు పదాల అల్లికలలో వాడుకలో..కొన్ని ఇలా ఉన్నాయి.

రాసేవాడు - బ్లాగరి
రాసేది - బ్లాగోతం
కవిత -బ్లాగ్కవిత
కథ - బ్లాక్కథ
వాగుడు - బ్లాగుడు
పటిమ - బ్లాగ్పటిమ
రాజకీయాలు - బ్లాజకీయాలు
వాగ్ధానం - బ్లాగ్ధానం
దోరణి -బ్లాగ్దోరణి

ఇలా మొత్తం బ్లాగుల ప్రపంచాన్ని బ్లాగ్మయం చేసేశారు.



ఇక ఈ బ్లాగులోకంలో వివిధ విభాగాలలో ప్రముఖమైన బ్లాగుల గురించి తెలుసుకుందాము.

ముందుగా మనకు సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ బ్లాగుల గురించి కొత్తపాళిగారు వివరిస్తారు.

నమస్కారం,

నేను సాహిత్యానికి సంబంధించిన టపాలతో మారుమ్రోగుతున్న కొన్ని తెలుగు బ్లాగుల గురించి చెప్తాను. ఈ బ్లాగులన్నీ కొత్త కొత్త పద్యాలతో, చర్చలతో కళ కళ లాడుతూ ఉన్నాయి. ఇందులో మాటలకన్నా పద్యాలే ఎక్కువగా ఆటలాడుతుంటాయి.

సాలభంజికలు
విన్నవీ కన్నవీ
సంగతులూ సంధర్భాలూ
బ్లాగేశ్వరుడు
తెలుగులో తప్పటడుగులు
వికటకవి
వాగ్విలాసము

ఇంకా చాలా ఉన్నాయి మరి. OVER TO STUDIO

ధన్యవాదాలు కొత్తపాళిగారు, ఇప్పుడు మనకు సాంకేతిక అంశాల మీద రాసే బ్లాగుల గురించి సుధాకర్ వివరిస్తారు.

నమస్కారం.

నేను వివిధ సాంకేతిక విషయాలు రాస్తున్నా బ్లాగుల గురించి చెప్తాను. ఈ బ్లాగులు రాసేవారు కంప్యూటర్ రంగంలో బాగా పరిచయం, అవగాహన ఉండి తమకు తెలిసిన , అందరికి ఉపయోగపడగాలవనే సాంకేతిక విషయాలు రాస్తున్నారు.

నల్లమోతు శ్రీధర్
వీవెనుడు టెక్కునిక్కులు
నా మదిలో
కంప్యూటర్ మాయాజాలం
శ్రీదీపిక
సీతారాం చెప్పే కంప్యూటర్ సంగతులు

OVER TO STUDIO


ధన్యవాదాలు సుధాకర్‍గారు, ఇప్పుడు హాస్యానికి సంబంధించిన ప్రముఖ బ్లాగుల గురించి విహారి గారు వివరిస్తారు.

నమస్కారం,

నేను నవ్వులుపువ్వులు పూయిస్తున్నా కొన్ని బ్లాగులగురించి చెప్తాను.

తెలుగు కార్టూనులు
రెండు రెళ్ళు ఆరు
విహారి
ప్రసాదం

ఇప్పటికి ఇంతే … OVER TO STUDIO


ధన్యవాదాలు విహారి గారు, ఇప్పుడు తెలుగు బ్లాగులోకంలో ఉన్న కొందరు రచయితల గురించి మనకు విజయ్ కుమార్ గారు చెప్తారు.

నమస్కారమండి.

గత కొద్ది కాలంగా పత్రికలలో విరివిగా రాస్తున్న ప్రముఖ రచయితలు బ్లాగులోకంలో అడుగుపెట్టు రచనలు చేసి అంతర్జాలంలో కూడా పేరు సంపాదించుకున్నారు. వారి బ్లాగులు చూద్దామా.

సృజన అనుసృజన
అభినయని
జాన్‍హైడ్ కనుమూరి
రోహిణీప్రసాద్
నా ప్రపంచం
దార్ల

OVER TO STUDIO

ధన్యవాదాలు విజయ్‍కుమార్‍గారు. ఇప్పుడు మనకు సినిమాలగురించి రాసే బ్లాగుల గురించి వెంకట్‍గారు చెప్తారు.

నమస్కారం, మీకు సినిమాల గురించి సమగ్ర విశ్లేషణను అందించే కొన్ని బ్లాగులు..

24 ఫ్రేములు, 64 కళలు
సంభవామి యుగే యుగే
రేగోడియాలు. సినిమాలు
సౌమ్య

OVER TO STUDIO

ధన్యవాదాలు వెంకట్‍గారు, ఇప్పుడు పాటల బ్లాగులగురించి పవన్ కుమార్ (విహారి) వివరిస్తారు.

నమస్కారం. తెలుగులో మధురమైన పాటల బ్లాగులు ఉన్నాయి. అవి చూద్దామా.

సత్యం శివం సుందరం
ఆణిముత్యాలు
లలితగీతాలు
గీతలహరి

OVER TO STUDIO

ధన్యవాదాలు విహారి..ఇప్పుడు వంటల బ్లాగులు గురించి రమగారు చెప్తారు.


రుచులు
షడ్రుచులు
ఆంధ్రాకిచెన్
అన్నపూర్ణ


OVER TO STUDIO

ధన్యవాదాలు రమగారు. ఇప్పుడూ భక్తి సమాచారానందిచ్చే బ్లాగులగురించి మురళీకృష్ణగారు చెప్తారు.

నమస్కారం . భక్తి సమాచారాన్ని ఇచ్చే బ్లాగులు ఇవి..

అన్నమయ్య సంకీర్తనలు
పోతన భాగవతము
తెలుగు బైబిలు
త్యాగరాజు కీర్తనలు
భక్తిగీతాలు
భజన కీర్తనలు

OVER TO STUDIO

ధన్యవాదములు . ఇప్పుడు మనకు ఫోటో బ్లాగుల గురించి చేతన వివరిస్తారు.

నమస్కారం. మంచి మంచి అందమైన , అద్భుతమైన ఫోటోలను మనకు అందించే బ్లాగులు ఇవి

విజ్యుయల్ ఓడ్
పవన్‍గాడి ప్రపంచం
బొమ్మ
బొమ్మలకొలువు
చిత్రవిచిత్రాలు

ఇంకా మరికొన్ని ఫోటో బ్లాగులు ఉన్నాయి

ధన్యవాదాలు చేతన. ఇప్పుడు మనకు కవితల బ్లాగులను గురించి రాధిక వివరిస్తారు.

నమస్కారం . నేను మనస్సుకు హత్తుకునే , అందమైన స్పూర్తిదాయకమైన కవితల బ్లాగుల గురించి చెప్తాను.

కల్హర
అలలపై కలల తీగ
స్నేహమా
కవితా ఓ కవితా
కవిత్వం


OVER TO STUDIO

ధన్యవాదాలు. ఇప్పుడు రాజకీయ సమాచారం, ప్రతిరోజు జరిగే రాజకీయ పరిణామాల గురించి విస్తృతంగా చర్చించే బ్లాగులు తెలుసుకుందాం.

గుండె చప్పుడు
చదువరి
జాబిల్లి

ఇక చివరిగా ఆంధ్రమాత గోంగూర నుండి అమెరికా రాజకీయాల వరకు అన్ని విషయాలు రాసే ప్రముఖ బ్లాగులగురించి చావా కిరణ్ వివరిస్తారు.

నమస్కారం. అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ , కాదేదీ కవితకనర్హం అన్నట్టుగా బ్లాగడానికి అనర్హం కాని విషయమే లేదు. బాం బ్లాస్ట్ ఐనా బండి మీది మిర్చీబజ్జీ ఐనా, కారు అమ్మకమైనా కాలేజీ కబుర్లైనా. ఇలా ప్రతీ విషయం మీదా బ్లాగేస్తారు మనవాళ్ళు

సత్యశోధన
మ్యూసింగ్స్
వెంకటరమణ
కొత్తపాళి
సరిగమలునా సోది
శోధన
అంతరంగం
ఓనమాలు
కలగూరగంప
గోదావరి
జానుతెనుగు సొగసులు
నాబ్లాగు నాసోది నా నస
పూతరేక్స్
అమెరికా నుండి ఒక ఉత్తరం ముక్క
దీప్తిధార
నేనుసైతం
వసుంధర
శ్రీకృష్ణదేవరాయలు
హరివిల్లు
నువ్వుశెట్టి బ్రదర్స్
అవీ ఇవీ
జ్యోతి
తెలుగుదనం
మరమరాలు
నాలోనేను
ఇది కథ కాదు
దిల్ సే
మనిషి
చెప్పాలని ఉంది
మనసులోని మాట



సాధ్యమైనంత మేరకు ఈ బ్లాగుల సమాచారం సమీకరించడమైనది. దీనికి రెట్టింపు బ్లాగులు ఉన్నాయి. అవి మరోసారి చూద్దాం. ఇక సెలవు.


మరొక్కమారు అందరికీ దివ్య దీపావళి శుభాకాంక్షలు

జ్యోతి వలబోజు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008