Tuesday, June 3, 2008

చెత్త నా కొడుకులకు చాకిరేవు ...

నొప్పింపక తానొవ్వక అన్నరీతిగా మన తెలుగు బ్లాగర్లు తమ వృత్తిధర్మంతో పాటు తమకు తోచిందేదో బ్లాగుతున్నారు.కాని తెలుగు చూడడం తప్ప చదవడం, రాయడం రాని వెధవలు మన బ్లాగులలో చెత్త ప్రకటనలు ఇస్తున్నారు. ఈ మధ్య సాక్షి బ్లాగులో చైనాబాషలో ప్రకటనలు వచ్చాయి. నాకు అర్ధం కాని విషయమేమిటంటే ఈ చైనావాడికి ఈ తెలుగు అస్సలు అర్ధంకాదు. ఎన్నిసార్లు వ్యాఖ్యలు తీసేసినా మళ్ళీ ఇస్తున్నాడు . అంటే ఎవడో తెలుగువాడే ఇస్తున్నాడేమో అని నా అనుమానం.సాక్షి బ్లాగరు మురళీకృష్ణగారని నేను గుంపులో చెప్పగానే వాడు మొదటిసారిగా నా బ్లాగులో కాలెట్టాడు.ఇక నాకు చిర్రెత్తుకొచ్చింది. అందుకే జంధ్యాల గారి స్టైలులో వాడికి చాకిరేవు పెట్టాలని డిసైడ్ ఐపోయా. శ్రీధర్ సైటు హ్యాక్ చేసినప్పుడు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదు వాడికి.

జై జంధ్యాల గారు!!!!!!!!!!

మన తెలుగు బ్లాగులలో చెత్త కామెంట్లు,ప్రకటనలు,వైరస్ లింకులు ఇస్తున్న చెత్తనాకొడుకులందరికి వర్తిస్తాయని సవినయంగా మనవి చేసుకుంటున్నా.

ఒరే గ్రాఫీ


మహాపాపి, కురూపి


నిను చూడంగనే వచ్చు హైలెవల్ బీపి


ముండమోపి, జిరాఫీ


నిన్ను తెగ్గోస్తే లోకానికే పిచ్చ హ్యాపీ


అంగచండాలుడా పంక బదిరాంధుడా


పరమ పాపిష్ట, నికృష్ట, దుష్టాత్ముడా


నీ నీచ రూపంబు చూడంగ పాపంబు


నీ కంఠ నాళంబు కక్కూసు గొట్టంబు


నీ కళ్ళలో కుళ్ళు, నీ బుర్రలో బురద


నీ పల్కులే చెత్త, నీ జన్మ డ్రైనేజీ


నువ్వో దగుల్బాజీ ఏబ్రాసీ, చప్రాసీ, సన్నాసివి


అశుద్ధ స్వరూప, అబద్ధ ప్రలాప


పింగు బొంగైన పింజారిగా


కొక్కేట బచ్చా, కొవ్వెక్కిన లుచ్చా


పగిలేను నీ పుచ్చ, తీరేను నా కచ్చ


నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చ, నిక్కచ్చిగా


బ్రష్టాతి బ్రష్ట,పదాకష్ట కేలాగు


దుష్టత్వమందున్ ముదనష్టపొడా త్రాష్టుడా


ముష్టు ముష్టోడి అంకుష్టముగా


వృద్ధ క్షయరోగి ఉచ్చిష్టమా


ఒరే పళ్ళ పిచ్చి అరే చిల్లి గోచీ


నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను, పెన్ టచ్చిగా, పెంటచ్చిగా


ఒరే పాచి మొహమా, నడుస్తున్న శవమా


వేడి ఇడ్లీలు పారేయించు సద్ది సాంబారు తెగతాగు సోంబేరిగా


పెద్ద ఇడియెట్టువి చద్ది పెసరట్టువి


పిచ్చి టేస్టున్న సాడిస్టువి,


గజ్జి పాతాళ మరుగుజ్జువి


ఉచ్చ నీచాలు లేనట్టి రాస్కేలువి, ఏలువే..


ఒరే అక్కుపక్షి, నిరక్షర కుక్షి


కుంకాక్షి, ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా


నువ్వు చుంచెలుక గొద్దెవి


రాబందు రెట్టవి, బొద్దింక కేశానివి


సీంపంది మూతివి, గబ్బిలం తోకవి


ఏకాకి కాకీకవి, న్యూసెన్సు డాకీవి,


నోసెన్సు మంకీవి, కుడితిలో చిట్టెలుకవి


మున్సిపాలిటీ పందికిన్ మూత్రపిండానివి


ఎద్దు మొండానివి, సృష్టి మొత్తంబులో శుంఠవి


ఒరే పేడతట్ట, అరే చెత్తబుట్ట


ఒరే గడ్డిపోచ, అరే దారపీచ


ఒరే తుప్పుమేక, అరే పందితోక


ఒరే వానపాము, ఇలా తొక్కుతాము


ఒరే గౌడుగేదే, ఇదే బడితపూజ


సెంటిమెంటన్నదేలేని ప్రెంటాసురా


చావరా బోడివెధవ


చావరా అంట్లవెధవ


చావరా నెలతక్కువ వెధవ


వెధవన్నర వెధవ, ముప్పావు వెధవ, పరిపూర్ణ వెధవ


చావర , చావరా , చావరా ... చావు...........


తూ...

19 వ్యాఖ్యలు:

KK

శివ..శివా...తిట్లు చాలా బాగున్నాయంటే బాగుండదేమో, కాని చాలా బాగున్నాయి. ఇవన్నీ పడాల్సిన వాళ్ళ చెవిలో పడాలని కోరిక. ఇంత మంచి తిట్లు విన్నాక చెవి తుప్పు వదిలిపోయింది.

teresa

You rock! :)

SD

మీకు చెప్పేటంతటి వాణ్ణి కాను కానీ....

ఎవడో ఒకడు స్టేండర్డ్ పడగొట్టుకుని లో లెవెల్లోకి వెళ్ళిపోయాడనుకోండి, వాణ్ణి అసహ్యించుకోవడానికీ, తిట్టడానికీ మీరు కూడా ఆ లెవెల్లోకి పోవక్కర్లేదు. పెద్ద లెవెల్లో అయ్యేయెస్ ఆఫీసర్లూ, బాగా పేరున్న మంత్రులూ (పి.వి. నరసింహా రావు టైపు.. ఇప్పుడున్న వాళ్ళు కాదు) ఎప్పుడూ ఇలాంటి బాష వాడకుండా అవతలి వాళ్ళని ఎముకల్లో సున్నం లేకుండా కొడుతూ ఉంటారు. గమనించారా?

యామజాల సుధాకర్

మీ వెరైటీ తిట్ల దండకం చాలా బాగుందండి.

kasturimuralikrishna

జ్యోతి గారూ,

పేరులో సామ్యం వుందని నన్నూ తిట్టేయకండి.మీ తిట్లు చాలా సృజనాత్మకంగా వున్నా,ఎందుకో మీ నుంచి ఇవి ఊహించలేదు.విశ్వనాథ్ చవక బారు సినిమా తీస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తోంది.ఎదుటి వాడి స్థాయికి మనం దిగజారటం కూడా ఒక రకంగా వాడి విజయమేనని గమనించండి. కానీ,మీ అత్యంత సృజనాత్మకమూ,హాస్య స్ఫోరకమూ అయిన తిట్ల దండకానికి జోహార్లు.మరోసారి ఇలాంటి అవసరం రాకూడదని ప్రార్ధిస్తున్నాను ఆ మురళీ కృష్ణుని.

Naveen Garla

ఈ జంధ్యాల తిట్ల దండకం కోసం ఇంటర్నెట్‌లో ఓ సారి వెతికాను. దొరకలేదు. సంజయ్ అని నా జూనియర్ ఒకతను వెరైటీ తిట్లు తిట్టే వాడు

జ్యోతి

బండిసున్నాగారు.
పర్లేదండి.బ్లాగర్ల కష్టాలు మీకు తెలీవు. అందంగా ఇల్లు కట్టుకుని దానికి గేటు పెట్టి,కుక్కను కాపలా పెట్టుకున్నట్టు. మేము మా బ్లాగింటిని కాపాడుకోవాల్సి వస్తుంది. మురళీకృష్ణ కూనపరెడ్డిగారు తమ ఉద్యోగ నిర్వహణలో తన బ్లాగులో టపాలు కూడా రాయలేకున్నారు. కాని ఈ చైనా ప్రకటనల వ్యాఖ్యలు క్రమం తప్పకవస్తున్నాయి. అలాగే శ్రీధర్ సాంకేతిక బ్లాగులో రోజు ఎన్ని వైరస్ లింకులు వస్తున్నాయో అడగండి. నేను ఒకసారి ఆ లింకు ఓపెన్ చేస్తే నా సిస్టమ్ హ్యాంగ్ అయింది. మొత్తంఫార్మాట్ చేయాల్సి వచ్చింది.ఎంత కోపం, చిరాకు వస్తుంది చెప్పండి. ఐనా నేను ఇంత ఘోరంగా తిట్టనులెండి. ఇది జంధ్యాలగారి సినిమాలోనివి. ఊరికే సరదాకి రాసాను ఆ పాట వింటూ.

కస్తూరి మురళీకృష్ణగారు,
మిమ్మల్ని ఎందుకు తిడతానండి బాబు. ఇవన్నీ జంధ్యాలగారి సినిమా ష్.. గప్‍చుప్ సినిమాలోవి. ఆ పాట వింటూ నేను రాసాను. నేను చెప్పింది సాక్షి బ్లాగుకర్త మురలీకృష్ణ కూనపరెడ్డిగారు.

Siva

మీ బ్లాగులో వచ్చే scrolling, కింద మీ ఈ టపాకి పెట్టిన heading పోల్చి చూస్తే ఎలాగో అనిపిస్తుంది. తప్పో ఒప్పో నేను చెప్పనుకానీ, నాకు మటుకు ఇలాంటి పదప్రయోగాలు చాలా ఎబ్బెట్టుగా, చవకబారుగా ఉంటాయి.

You can enable word verification or comment moderation. Another optionis to report that blogger as spam

Kathi Mahesh Kumar

బాగుందండీ దండకం,ఇవి సరైన చెవులని చేరాలని నేనూ ప్రార్థిస్తున్నా. ఎంతైనా జంధ్యాల, జంధ్యాలే!ఈ పదప్రయోగాల్ని కూడా చవకబారనే నిరక్షర కుక్షులు కూడా ఉన్నారన్నమాట. వీరికి ఇ.వి.వి.సత్యనారాయణ సినిమాలు చూపించాలి.

Naveen Garla

>> ఈ పదప్రయోగాల్ని కూడా చవకబారనే నిరక్షర కుక్షులు కూడా ఉన్నారన్నమాట. వీరికి ఇ.వి.వి.సత్యనారాయణ సినిమాలు చూపించాలి.

సదరు 'చవక'బారు ఇ.వి.వి సినిమాలే కదండీ థియేటర్లలో నవ్వుల్ని, నిర్మాతలకు కాసుల్ని కురిపించి మినిమమ్ గ్యారెంటీ దర్శకుడిగా నిలబెట్టింది. అతని శైలి గురించి మాట్లాడను కానీ, మంచి సృజనాత్మకత కలిగిన దర్శకుడు. ఓ మోస్తరు కామెడీ పండించడమే కష్టం... అలాంటిది పేర్ల దగ్గర నుండి నుండి శుభం కార్డు వరకు నవ్వించడమంటే సామాన్యమైన ప్రతిభ కాదు. ఇతను పెద్ద హీరోలకు దర్శకత్వం వహించవలసి రావడమే తప్పైపోయింది....

Siva

@ కాంతి కుమార్ గారు: తప్పైతే మన్నించండి. నాకు తెలుగులో అంత పాండిత్యం లేదు. టపా "title" లో వాడిన పదాలగురించే నేను మాట్లాడాను. నాబోటి నిరక్షర కుక్షికి అది ఎబ్బెట్టుగా అనిపించింది, చెప్పాను, అంతే. మీబోటి భాషాప్రావీణ్యులతో వాదించే అర్హత నాకు లేదనుకుంటాను.

Kathi Mahesh Kumar

అయ్యో! నా కామెంటుతో ఇక్కడ రణాలూ,క్షమలూ మొదలౌతున్నట్టున్నాయే.

@నవీన్ గారూ,ఇ.వీ.వీ ‘చెవిలోపువ్వు’కీ ’ఆ ఒక్కటీ అడక్కు’కీ చాలా తేడా ఉందనిమాత్రమే ఇక్కడ సూచించాను సార్.తను హాస్యాన్ని అపహాస్యం చెయ్యకున్నా(ఎంతైనా జంధ్యాల శ్శిష్యుడు కూడానూ), కాస్త అశ్లీలాన్ని చేర్చిన పాపం కాస్త ఇతడికి దక్కుతుందని గమనించగలరు.అందుకే అలా కామెంటా.

@శివ గారూ,ఏదో తిట్లదండకం చదివిన ఆవేశంలో ఆ పద ప్రయోగం చేశానేగానీ మిమ్మల్ని కించపరచాలనీ కాదు,నేనో పెద్ద భాషా పండితుడ్ననీ కాదు.ఇక టైటిల్ గురించంటారా...బూతు మాటంటే గానీ ఆ ‘కసి’ రాదని జ్యోతిగారు వాడిఉండవచ్చు.ఎంత కోపముండి వాడారో పాపం!
plaese visit www.parnashaala.blogspot.com

venkat

mam enti ala tittesaru nneu navvu apukoleka poya

కొత్త పాళీ

ఇది నిజంగా తిట్ల "దండకమే"! ఏ సినిమా ఇది?

Bolloju Baba

జంధ్యాల అనే వజ్రం యొక్క వేన వేల పార్శ్వాలలో, ఒక పార్శ్వం విసిరిన కాంతిపుంజాన్ని అందించారు. ఈ రూపంలో ఆయనను పది మంది స్మరించుకోవటం, ఆయనకు అర్పించే మరో చిరునివాళే.

బొల్లోజు బాబా

చైతన్య.ఎస్

చాల బాగ తిట్టారు . ఇన్ని తిట్ట్లు తిన్న మనిషి అన్నవాడు ఎవడు బతికి బత్త కట్టడు అని నా అభిప్రాయం. ఒకడికి ఒకసారి చెప్తె అర్థం కాక పొతే ఎమి చెస్తాం వాడి స్థాయికి దిగి తిట్టక తప్పదు. ఇందులొ తప్పువుంది అని నెను అనుకోను.

Unknown

first time chala baga navvukunna....

అన్వేషి

జ్యోతిగారు! ఈదండకం అద్భుతం. కాకపోతే మీటపా Heading లో "నా" బదులుగా "గాడిద" అని వాడి ఉంటే సరిపోయేది. "నా" ప్రయోగంతో ఆ పదప్రయోగం మీకు "బూమరాంగ్" కాలేదా! {మీరువాడిన పదం పురుషులు వాడితే తిట్టు కానీ స్త్రీలు వాడితే కాదు ఒక్కసారి ఆలోచించండి} మీటపా నేను ఇప్పుడే చూసాను. వీలుంటే Heading మార్చండి.
ఇంతకన్నావివరిస్తే నామీదకూడా మరోదండకం వ్రాస్తారు

జ్యోతి

అన్వేషిగారు,

ఇది సరదాకు రాసిన టపా అండి. మీ సూచనా బావుంది కాని ఎవరూ దానిని అంత సీరియస్ గా తీసుకోలేదనుకుంటా.. రెండేళ్ల క్రిందటి టపాను ఇప్పుడు మార్చడం ఎందుకులెండీ..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008