Thursday 5 June 2008

తెలుగు బ్లాగర్ల సమావేశం




ఈ నెల 15 వ తేదీన హైదరాబాదులో బత్తీబంద్ నిర్వహించాలనే ప్రయత్నం మీకు తెలిసినదే. ఇది ఊరికే గంట సేపు లైట్లు ఆర్పెయ్యడం మాత్రమే కాదు, ప్రజలలో గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ సమస్యలు, సస్టేనబుల్ లివింగ్ మొదలైన పరస్పర సంబంధిత విషయాల గురించి కొద్దిగానైనా అవగాహన కల్పించాలనీ, ఆలోచింపచెయ్యాలనీ దీని ముఖ్య ఉద్దేశం.

బత్తిబంద్ బ్లాగు లో గత నెల రోజులుగా రోజుకొకరు చొప్పున క్రమం తప్పకుండా మన బ్లాగర్లు తమ ఆలోచనల్ని పంచుకుంటున్నారు, వ్యాసాలు, కవితలు, అనుభవాలు రాస్తూ.

దానికి తోడుగా, బత్తీబంద్ నిర్వహణకి ముందు, ఒక పూట మనందరం ఒకచోట చేరి కాసేపు దీన్ని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. పది మందిమి కూడలి కబుర్ల లో కలిస్తే .. మీ మీ ఆలోచనల్నీ, మీకు తెలిసిన విషయాల్ని ఇతరులతో పంచుకోవచ్చు. మనకి తెలియని విషయాలు తెలిసిన వాళ్ళు చెబితే వినొచ్చు. బ్లాగుల్లో మాటలే కాక మన జీవితాల్లో చిన్ని చిన్ని మార్పులు చేసుకుంటూ, చేతల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలమో మాట్లాడుకుందాం.

రోజు : శనివారం 7-6-08
సమయం : సాయంత్రం 7 గంటలకు ( IST )
స్థలం : కూడలి కబుర్లు ( chat.koodali.org )

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008