Wednesday 30 July 2008

మీ కోసం...

 
"మీ కోసం" !!!...   
ఇదేంటి! చంద్రబాబు ఎన్నికల స్టంట్ ఇక్కడికెందుకొచ్చింది అనుకుంటున్నారా? అంత సీన్ లేదండి. బ్లాగర్ల కోసమే తయారు చేయబడిన కొన్ని సదుపాయాలు గురించి నేను చెప్పాలనుకుంటున్నారు. అవి  ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితంగా మనందరి కోసం తయారు చేయబడ్డాయి. అవి మీరు ఉపయోగించుకుంటారని  మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ముఖ్యంగా కొత్తగా బ్లాగుతున్నవారికి అవసరమవుతుంది. ముందుగా కొత్తగా వచ్చినవాళ్ళందరూ తెలుగు బ్లాగు గుంపులో చేరండి. ఇందులో మీకు ఎప్పుడు ఏ సహాయం, సందేహం వచ్చినా  తప్పకుండా సమాధానం లభిస్తుంది. అలాగే అప్పుడప్పుడు ముఖ్యమైన చర్చలు కూడా జరుగుతుంటాయి. ఆ తర్వాత కూడలికబుర్లు.  ఇక్కడ బ్లాగర్లు ముచ్చట్లాడుకునే వేదిక. అలాగే అప్పుడప్పుడు ముఖ్యమైన సమావేశాలు నిర్వహింపబడతాయి.  ఇక చివరగా సాంకేతిక సహాయం. ఇక్కడ మీకు వచ్చే సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. నాకు వీలైనపుడు నేను
ఇక్కడే ఉంటాను. తెలుగుకు సంబంధించి  నేను సహాయం చేయగలను. మెయిల్ అంటే అలస్యం అవుతుంది. సో బ్లాగులు, తెలుగుకు సంబంధించి ఎటువంటి సహాయం, సమస్య ఐనా ఇక్కడికి వచ్చేయండి. ఒకే నా... ఎనీ డౌట్స్.....

7 వ్యాఖ్యలు:

రాదిక బుజ్జి

జ్యోతి గారు,

తప్పకుండా ఉపయోగించుకుంటాము మీ services ని

Ghanta Siva Rajesh

Thanks for your Support

సుజాత వేల్పూరి

జ్యోతి గారు, మీరసలు అల్టిమేట్!

Anonymous

జ్యోతక్కా,
ముందుగా మీ ప్రోత్సాహానికి నెనర్లు. నా బ్లాగుని జల్లెడ "స్త్రీ" బ్లాగుల కేటగిరీలో చేర్చాలనుకొంటున్నాను. అలా చేర్చడానికి ఏం చెయ్యాలో కాస్త చెబుతారా?

జ్యోతి

కల,,

ఇక్కడ మీ బ్లాగు చేర్చొచ్చు..

http://dir.jalleda.com/index.php?show=add&PID=79

Anonymous

అక్కా,
already నా సైటు జల్లెడలో చేర్చిఉన్నాను. కాని దానిని మహిళా బ్లాగర్ల కిందకి తీసుకు రావాలంటే ఏం చెయ్యాలి?

జ్యోతి

కల,

అది నేను చేస్తాలే. డోన్ట్ వర్రీ..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008