Thursday 31 July 2008

పాపం పసివాడు !!!!!!!!!

అదేంటో గాని చిన్నప్పటినుండి అల్లరి చేసి ఎరుగను. ఇంట్లో ఒక్కదాన్నే ఆడపిల్లను, పెద్దదాన్ని. ఎవరితో పోట్లాడేది? అల్లరి చేసేది.? అడక్కుండానే అమ్మ అన్నీ కొనిపెట్టేది. ఐనా ఆడపిల్లకు చిన్నప్పుడు కావల్సినవి ఏవుంటాయి. కొత్త కొత్త డ్రెస్సులు ( అవి అమ్మ తనే కుట్టేది.,నాన్న కొనేవాడు, మా తామ్ముళ్ళు కుళ్ళుకునేవారు). వాటికి మ్యాచింగ్ రిబ్బన్లు, గాజులు , బొట్లు ( అప్పట్లో స్టిక్కర్లు లేవు). ఇక చదివింది మొత్తం L.K.G నుంది డిగ్రీ వరకు అచ్చంగా ఆడపిల్లల స్కూలు, కాలేజీలలోనే. ఇక ఎవరిని ఏడిపించే అవకాశం రాలేదు. ఇంటిదగ్గర కూడ ఫ్రెండ్స్ లేరు, అబ్బాయిలను కాని , అమ్మాయిలను కాని అస్సలు ఏడ్పించే పని పడలేదు. అసలు సంగతి అంటే నేను కాస్త నిదానంగా ఉండేదాన్ని. ఎవ్వరితో ఎక్కువ కలిసేదాన్ని కాదు. కాని గత సంవత్సరం ఒక అబ్బాయిని తెగ అల్లరి పెట్టాను.


ఇది మస్తీ గ్రూపులో జరిగిన సంఘటన. అది నేను చేరిన కొత్తలో జరిగింది. నా నిజమైన వివరాలు ఒక్క గ్రూపు ఓనర్‌కి, ఒక అమ్మాయికి మాత్రమే తెలుసు. గుంపులో నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఎదో ఒక ఆట, చర్చ మొదలు పెట్టేదాన్ని. అప్పుడప్పుడు వంటకాలు పంపించడం గట్రా. సమయంలో ఒక అబ్బాయి చేరాడు. సిక్కు అబ్బాయి. ఎప్పుడు కూడా అమ్మాయిలను తెగ సతాయించేవాడు. నేను పంపిన మెయిల్స్ మీద కూడా ఎదో ఒక కామెంట్ చేసి కోపం తెప్పించేవాడు.నాకు ఆ అబ్బాయికి తరచూ గొడవ జరిగేది. అతడు తనకు తానే చాలా గొప్ప అనుకునేవాడు. అలా ఒక రోజు బ్లాగ్ విషయం లా గుంపులో ఒక చర్చ మొదలు పెట్టాను. మీరు చేసిన అల్లరి చెప్పండి అని. ఒక్కొక్కరు చెప్తున్నారు . అప్పుడు నాకో ఐడియా వచ్చింది. వెంటనే ఒక మెయిల్ చెసా." ఇంతవరకు నేను గుంపులో చెప్పిన వివరాలు తప్పు. నేను అమ్మను కాదు అమ్మాయిని, నా వయసు తప్పు చెప్పాను. నేను M.B.A చదువుతున్నాను. కావాలని గుంపులో అల్లరి చేసాను. ఎవ్వరిని మోసం చేయాలని కాదు " అని కాస్త గ్యాస్ కొట్టాను. అలాగే గుంపు ఓనర్‌కి ,నా గురించి తెలిసిన ఒకరిద్దరికి చెప్పాను, నా గురించి నిజం అస్సలు చెప్పొద్దు . సిక్కు అబ్బాయి తప్పకుండా సమాధానం ఇస్తాడని తెలుసు.


అలా అబ్బాయిని రెండు రోజులు ముప్పు తిప్పలు పెట్టాను. ఇంత అల్లరి చేస్తున్నాను, చురుకుగా ఉన్నాను. నేను కాలేజీ అమ్మాయినే అనుకుంటున్నాడు. అందుకే ఎప్పుడూ సతాయించేవాడు. ఒకసారి అతనికి కాల్ చేయమని నంబర్ కూడా ఇచ్చాడు. కాని నేను మెసేజ్ చేసాను. వెంటనే అతను కాల్ చేసాడు. అప్పుడు కూడా అతడిని కొంచం సతాయించాను.. నిజం చెప్పీ చెప్పకుండా. అవతల అతని అవస్థ తలుచుకుంటేనే చచ్చే నవ్వొచ్చేది. లేకపొతే నన్ను సతాయిస్తాడా? కాని మూడో రోజు గ్రూపు ఓనర్ ఆగలేక నిజం చెప్పేసాడు. సరే అని నేను ఒప్పుకున్నా. ఐనా అబ్బాయి నమ్మలేదు. అప్పుడు నేను అతడికి నేను,మా అమ్మాయితో ఉన్న ఫోటో పంపించా.అప్పుడు కాని నమ్మలేదు .నేను పెద్దావిడను అని. ఇదంతా మా పిల్లలకు కూడా తెలుసు. మా అమ్మాయి కూడా నా ఐడి తో అతడితో మాట్లాది కొద్ది సేపు ఆటాడించింది. నాకంటే చిన్నవాడైనా అతడు ఇప్పుడు అతను నాకు మంచి మిత్రుడు అయ్యాడు. ఎప్పుడు మాట్లాడినా డార్లింగ్ అంటాడు.


కాని ఎంత మంచి ఫ్రెండ్ ఐనా కూడా మళ్ళీ నా చేతిలో బోల్తా పడ్డాడు. అతని పుట్టినరోజు కి కాస్త స్పెషల్ గా ఏదైనా చేద్దామని, ఒక ప్లాన్ వేసా. వారం ముందు ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టా. అసలే అబ్బాయి ఖతర్నాక్. తొందరగా ఏదీ నమ్మడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి అందుకే మస్తీ గ్రూపు కోసం మారు పేరుతో ఉన్న మరో మెయిల్ ఐడితో అతనికి కాస్త మస్కా కొట్టసాగాను. ఇంకో ముగ్గురు సభ్యులకు కూడా ప్లాన్ చెప్పి, కాస్త మసాలా కలపమని చెప్పాను. అంతే ఇంకేముంది. వాళ్ళు తమ వంతు మసాలా కలిపి వాతావరణాన్ని మరింత రసవత్తరంగా చేసారు. ఒకేసారి నా అసలు ఐడి, మారు పేరుతో ఉన్న ఐడి, రెండింటితో అతడిని తికమక పెట్టేసా. పాపం పసివాడు. ఏది అర్ధం కాలేదు. చివర్లో మారుపేరుతో ఉన్న అమ్మాయి ఐడిలో అబ్బాయిని ఇష్టపడుతున్నట్టు హింట్ ఇచ్చా. అంథే అబ్బాయి, కలుద్దాము అన్నాడు. నేనన్నా. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ .బయటకు రాలేను అన్నా. ఫోన్ చేస్తా అని అతని నంబర్ తీసుకున్నా. నిజమని నమ్మేసాడు. కాని నా మీద అస్సలు అనుమానం రాలేదు. ఇక అతడి పుట్టిన రోజు నాటికి ఒక అందమైన పవర్‌పాయింట్ తయారు చేసి ఇచ్చాను. అలాగే ఐడి నాదే అని చెప్పా. నిజంగా ఫ్లాట్ ఐపోయాడు. నిక్కచ్చిగా, చాలా దురుసుగా ఉండే అబ్బాయిని బకరా ని చేసే ధైర్యం . ఆలోచన నాకే ఉందని ఒప్పుకున్నాడు. ఎందుకు నన్ను సతాయిస్తావు పనేమి లేదా . అని మొత్తుకున్నాడు. ఇప్పటికీ సంఘటన గుర్తుకొస్తే మా గ్రూపు వాళ్ళు నవ్వుకుంటారు.


ఇంతకంటె ఎక్కువ ఎవ్వరినీ అల్లరి చేయలేదు. అబ్బాయి కూడా నన్ను అనవసరంగా సతాయించాడు. తనకు తానే గొప్ప అనుకున్నాడు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది.


అవునూ మన బ్లాగ్‌వీరులకు అల్లరి చేసే టాలెంట్ లేనట్టుంది. ఇంతవరకు ఒక్క అబ్బాయి కూడా విషయం మీద రాయలేదు. ఏంటబ్బా సంగతి???



10 వ్యాఖ్యలు:

మీనాక్షి

అమ్మో జ్యోతి గారు ఇంతా చేసి అలా అంటారా..
మొత్తానికి మీరు తక్కువ కాదని నిరూపించారు.. :)
మురలి గారు రాసారండి ఈ విషయం పై టపా..

cbrao

అబ్బాయిలకు అల్లరవుతామని భయమేమో! అందుకే రాయటం లేదేమో!

సుజాత వేల్పూరి

జ్యోతి గారు, మీరింత అల్లరి జ్యోతిగారా! అమ్మో!
అబ్బాయిల గురించి నేనూ అదే ఆలోచిస్తున్నాను!

Niranjan Pulipati

బాగుంది :)
అబ్బాయిలకి వాళ్ళు చేసిన అల్లరి చెప్పాలంటే కాస్తా మొహమాటం లెండి .. :)) నాకు మాత్రం అలాంటి మొహమాటాలు లేవు.. ఈ రోజు రాస్తా నా అల్లరి టపా

Rajendra Devarapalli

మీనాక్షి ...:(

మిగిలినవారికి...:)

krishna rao jallipalli

చాలా మంది చేసీ ఉంటారు ... కాని మీ అంత ధైర్యం గా టపా లో పెట్టలేరు. anyway. adurssssss

ఏకాంతపు దిలీప్

ఎంటండీ రావు గారు అలా అంటారు... మనం మొదలుపెడితే వీళ్ళు ఆపగలరా? :-)

బేసిగ్గా అబ్బాయిలకి అల్లరి అంటే చేతల్లోనే సరదా, రాతల్లో కాదు ;-)

Anonymous

అల్లరి కి చిన్నా పెద్దా లేదు కదా. అయినా అబ్బాయి లు అల్లరి చెయ్యరా? ఏంటంత మాటన్నారు. నేను కూడా ఏదో రాసానండి. చూడండి

Kranthi M

అల్లరి చెయ్యాలి కానీ రాయకూడద౦డి.కొన్ని అల్లర్లు ఇ౦కా మా ఫ్రె౦డ్స్ కి తెలీనివి ఉన్నాయి.మీకు ఇక్కడ చెప్తే అక్కడ నన్ను కుమ్మేస్తారు.
అయినా ఏ౦ట౦డి ఇష్ట౦ అని చెప్పి అల్లరి చేసారా?పాప౦ Sensitive పిల్లొడు అయితే ఈ పాటికి మీ దెబ్బకి దేవదాసు అయిపోయేవాడేమో?మేము మ౦చిగా మాట్లాడిథేనే ఎదోగా చూస్తారు చాలా మ౦ది అమ్మయిలు.కానీ మీరు కూడా అలా చేస్తారని చెప్పేసారోచ్... ఇక ఎవరైనా అమ్మాయిలు అనుమాన౦గా చూస్తే మొదట మీ టపానే చూపిస్తాను.:)

Anonymous

దీనికి టైటిల్ : అనగనగా ఓ గడుసమ్మాయి పాపం పసోడు
టాగ్ : అల్లరే అల్లరి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008