Monday 29 December 2008

సేవను పంచుకుందామా???


ప్రతి ఇంట్లో మనం వాడని బట్టలు ఎన్నో ఉంటాయి. పిల్లలవి, పెద్దలవి.. మన చుట్టాల్లో ఎవరినైనా అడిగితే నిష్టూరాలు. తొడిగి పనికిరాని బట్టలు ఇచ్చారు , కొత్తవి ఇస్తే వాళ్ల సొమ్మేం పోయింది అంటారు. స్టీలు సామాన్లవాడికి వేద్దామంటే ఐదు మంచి ఫ్యాంటు షరతులు ఇస్తే ఒక పప్పు గరిట ఇస్తాడు. వాళ్ళకీ జరీచీరలు కావాలంటారు. మంచి విలువైన బట్టలు అలా ఇవ్వబుద్ధి కాదు. కాస్త చిన్నవైనా పిల్లలు వేసుకోరు. ఖరీదైన బట్టలు . ఎం చేయాలో తోచదు. నాదే ఇదే సమస్య. ప్రశాంతిని అడిగితే ఎవరైనా అవసరమున్నవాళ్ళకి ఇవ్వొచ్చు అంది. మూడు రోజుల క్రింద సాక్షి పత్రికలో వచ్చిన వ్యాసం
" ప్రేమను తొడిగించండి" చూసి సంతోషం కలిగింది.

ప్రతి సంవత్సరం డిసెంబర్ ౩౧ న "షేర్ ఏ సర్వీస్" అనే సంస్థ "వస్త్రదానదినోత్సవం" జరుపుతోంది. పాట బట్టలు సేకరించి అవసరమైనవారికి పంచుతుంది. మనం చేయవలసిందల్లా శుభ్రమైన పాత బట్టలు మూటకట్టి వాళ్లకు ఇవ్వడమే. నేను ఇవాళ మా ఇంట్లో ఉన్నా పాత వస్త్రాలు తీసికెళ్ళి ఇందిరా పార్క్ రోడ్డులో రామకృష్ణ మఠం దగ్గర ఉన్న ఎమెరాల్డ్ స్వీట్ షాప్ లో ( ఈ షాపు గురించి గతంలో ఎవరో బ్లాగినట్టు గుర్తు ) ఇచ్చాను. మీరు మీ వంతు సాయం చేయండి.. మనకు పనికిరానివి, ఎందరికో ఒంటిని కప్పుతుంది. మీరు కూడా మీ ఇంటికి దగ్గర ఉన్నా కలెక్షన్ పాయింటుకు వెళ్లి ఇవ్వండి. క్రింది నంబరుకు ఫోన్ చేస్తే మీ ఇంటికి దగ్గరలో ఉన్నా కలెక్షన్ పాయింట్ చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం కాల్ చేయండి.


షేర్ ఏ సర్వీస్
మెయిల్ : info@shareaservice.com
ఫోన్ : 040-27807425, 30481424

2 వ్యాఖ్యలు:

శరత్ కాలమ్

బట్టలే కాదు - మనకు పనికిరానివి ఎన్నో ఇతరులకి పనికివస్తుంటాయి. మేము ఎన్నో మంచి మంచి వస్తువులు మాకు పనికిరాక వృధాగా పారవేసిన సందర్భాలు చాలా వున్నాయి. అప్పుడు విచారం అనిపిస్తుంది. అందుకే ఉచితం అని మనము ఉపయోగించనివాటిని వేటినయినా అందరూ ప్రకటించుకునేవిధంగా బ్లాగ్ మొదలెడదామనుకున్నా కానీ స్పందన వుండదేమోనని మానుకున్నా. లోగిలి లొ ఒక గుంపు అయితే మొదలెడతాను.

Siri

శరత్ గారు, http://www.freecycle.org/ మీరు ఒక్కసారి చూడండి. మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో.

snehamolakatalla.wordpress.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008