Thursday 18 December 2008

పుస్తక ప్రదర్శనలో తెలుగు వెలుగులు

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెలుగు బ్లాగులకై స్టాలుని తీసుకుంటున్నాం. వేలలో ఉన్న తెలుగు బ్లాగుల సందర్శకులని లక్షల్లోనికి పెంచే దిశగా పుస్తక ప్రదర్శలలో మన కార్యక్రమాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే, పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కవ శాతం ఉంటారు కాబట్టి.

అయితే, ఈ స్టాలు నిర్వహణకి సంబంధించి ఔత్సాహికులు కావాలి.


ప్రదర్శన నడిచినన్ని రోజలూ అంటే, రేపటినుండి ఈ నెల 28వ తేదీ వరకు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ నడపాలి. కనీసం నలుగురు ఉంటే బాగుంటుందనుకుంటున్నాం.

శని మరియు ఆదివారాలకి బానే దొరుకుతారు. కాబట్టి వారంలోని మిగతా రోజులలో అక్కడ ఉండి సందర్శకులని సంభాళిస్తే చాలు.

అన్ని రోజులూ ఒక్కరే ఉండలేరు కాబట్టి ఒక్కో రోజూ ఒక్కొక్కరూ వంతుల వారీగా చెయాల్సిరావచ్చు. మీకూ ఏయే రోజులలో వీలవుందో చెప్తూ ఇక్కడ స్పందించండి. (దీనికోసం పూట మీ కార్యాలయం నుండి సెలవు తీసుకునే దిశగా కూడా ఆలోచించండి.)

మీ సహాయం మరియు తోడ్పాటు మాకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. మీ నుండి సానుకూల స్పందనని ఆశిస్తూ...

5 వ్యాఖ్యలు:

Unknown

dec25th na nannu rasukondy.nenu sytam blog abhivruddiki samayanni kona keta ista.yenduku janalu telugu blogulu alavatu chesukoro adi chusta.

Unknown

జ్యోతి గారు, నేను ఈరోజు నుండి ఆదివారం వరకూ పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తున్నాను. ఆ తర్వాత వీలుని బట్టి స్పెండ్ చేస్తాను.

శరత్ కాలమ్

నాకూ పాలుపంచుకోవాలనే వుంది కానీ కొద్దిగా దూరంలో వున్నాను కదా :)

జ్యోతి

సంతోషం.. ఎవరికి వీలైనప్పుదు వాళ్లు వచ్చి స్టాలును చూసుకుని అడిగిన వారికి మార్గదర్శకత్వం చేస్తే చాలు. మనం ముఖంగా చెప్పాల్సింది బ్లాగుల గురించి కాదు. కంప్యూటర్లో తెలుగు ఎంత సులువుగా రాయవచ్చు, చదవొచ్చు అని తెలియజేయాలి.

గీతాచార్య

great to know.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008