Sunday 17 May 2009

ఒక ఆత్మీయ స్పర్శ



అమ్మను మించి దైవమున్నదా... అందరిని కనేశక్తి అమ్మకొక్కటే ... అవతార పురుషుడైనా ఆ అమ్మకు కొడుకే..

ఇది సినిమా పాటలా ఉందా.. సినిమా పాటే... ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగుపెట్టి , అక్కడివారిని తనవారుగా చేసుకుని పిల్లలను కనిపెంచి పెద్దచేసిన అమ్మ అవసాన దశలో ఒంటరిదైతే.. పలకరించడానికి నా అంటూ ఎవరూ లేకపొతే .. ఎందుకు ఈ పిల్లలు , బంధాలు, అనుబంధాలు... ఈ పరిస్థితి అందరికీ రాదు కాని ఎవ్వరికీ రాదు అనలేము. తల్లితండ్రులను చివరివరకు దేవతల్లా చూసేవారున్నారు. తాము పెద్దవాళ్ళయ్యాక ఆ తల్లితండ్రులను పనికిరానివారిలా చూసేవారున్నారు, అలాగే చివరి దశలో ఉంది తమకు ఎటువంటి ఉపయోగం లేక అడ్డంకిగా ఉన్నా తల్లితండ్రులను వదిలేసే ప్రభుద్దులూ ఉన్నారు ఈ లోకంలో.. తమకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే ఆ తల్లితండ్రులు ముందే జాగ్రత్తపడేవారేమో.. కాని వారికి తమ పిల్లల మీద అలాంటి ఆలోచనే రాదు. ఇంటినుండి గెంతేసినా కూడా నా బిడ్డా అంటుంది తల్లి మనసు. ఇలాంటి కొందరు అనాధలైన అమ్మలకోసం ప్రమదావనం సభ్యులు తమ వంతుగా చిరు సాయం చేయడం జరిగింది.

నిన్న అంటే శనివారం 16-5-09 రోజు హైదరాబాదు BHEL నుండి పటాన్ చెరు వెళ్ళే మార్గంలో ఉన్నా బీరంగుడాలోని సాయి అనాధ ఆశ్రమానికి వెళ్ళాము. ఒక చిన్న ఇంట్లో నడుపబడుతున్న ఈ ఆశ్రమంలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.అందరూ అరవైకి పైబడినవారే. అందరికంటే పెద్దావిడకి తొంభై రెండేళ్ళు ,కళ్లు కనపడవు. అందరికంటే చురుకుగా ఉంది నాకేమంత వయసైపోయింది, ఎనభై ఆరేల్లె కదా, ఇంకా చిన్నపిల్లనే అంటుంది ఓ అమ్మ. మాకోసం ఓ పాట కూడా పాడింది. వాళ్ల కోసం ఒక నెల భోజన సామగ్రి, బట్టలు, తువాళ్ళు, చెప్పులు, సబ్బులు ఇచ్చాము. అలాగే తాగడానికి కూల్ డ్రింకులు ఇస్తే చిన్న పిల్లల్లా సంతోషించారు. నిజంగా పెద్దవయసువారు, చిన్నపిల్లలది ఒకే మనస్తత్వం అన్నది అక్షర సత్యం. ఇంతమంది తమతో మాట్లాడ్డానికి ఎక్కడేక్కడినుందో వచ్చారు అని తెలియగానే మాట రాక ఒకటికి పదిసార్లు చేతులు జోడించి దండాలు పెట్టసాగారు. అలా దండం పెడితే మేము వెళ్లిపోతాము అని ప్రేమతో బెదిరిస్తే అలాగే వెళ్లొద్దు ఇలాకూర్చోండి అని తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. మాకేం తెచ్చారు అంటే పళ్ళు, స్వీట్లు చాలా తెచ్చాము అంటే ఎంత మురిసిపోయారో.. ఆ ఆనందం ఎన్ని కొట్లిస్తే వస్తుంది.. ఎవరింటికి వెళ్ళినా అక్కడ చిన్నపిల్లలు ఉంటే ముందు మనం తినడానికి ఎం తెచ్చారా అని ఆత్రుతగా చూస్తారో, అలాగే ఈ వృద్ధ మహిళలు కూడా.. వాళ్లకు లంచ్ టైం అయినా కూడా మా అందరితో మాట్లాడాలి అని ఆకలిని కూడా పక్కనపెట్టారు. మేము తీసికెళ్ళిన వస్తువులు అందరికి సమానంగా ఇచ్చి , ఆ ఆశ్రమ నిర్వహణ ఎలా సాగుతుంది. ఏమేమి అవసరాలు ఉన్నాయో కనుక్కున్నాము.

అనాధలైన ఆ అమ్మలకు కావలసింది .. డబ్బులు కాదు.. అన్నిటికంటే వారు ఎదురు చూస్తున్నది ఒక ఆత్మీయమైన స్పర్శ కోసం. కొద్దిసేపు పక్కన కూర్చుని కబుర్లు చెప్తే చాలు. జీవితపు చరమాంకంలో వాళ్లకు అత్యవసరమైనది ఆత్మీయత. అది ఒక్కరోజైనా ఇవాలనే మా కోరిక నెరవేరింది. మళ్ళీ వస్తాము అని ప్రమాణం చేసి వచ్చాము. కాని అలా వెళుతున్నాము అని చెప్పగానే మా చేతులు పట్ట్టుకుని మంచిది బిడ్డా వెళుతున్నాము కాదు వెళ్లివస్తాము అనాలి అని కళ్ళలో నీరు తెచ్చుకున్నారు. ఒకావిడకు కళ్లు కనపడవు అయినా మా చేతులు పట్టుకుని తడిమి పరిచయం చేసుకుంది. నాకెవరూ లేరు బిడ్డా. కొడుకులు, అన్నలు, చెల్లెళ్ళు అందరూ పోయారు.నేను ఇలా ఉన్నాను.మళ్ళీ వస్తారుగా అని ఏడ్చేసింది. ఇక అక్కడి పసిపాప ఐతే మళ్ళీ వచ్చేటప్పుడు నాకేం తెస్తారు అని అడిగింది.. ఎం కావాలి పెద్దమ్మా అంటే .. కొంచం మిక్స్చర్ కావాలి అంది. సరే తప్పకుండా తీసుకోస్తాము . కాని నాకు అందరికంటే ఎక్కువ కావాలి అని మమ్మల్ని నవ్వించింది..సరే అని మాటిచ్చి .. మీరిక భోజనం చేయండి అని మేము తీసికెళ్ళిన పులిహోర, పెరుగన్నం ఇచ్చేసి , బరువెక్కిన మనసులతో తిరుగుప్రయాణం చేసాము.

ఇక తిరుగు ప్రయాణంలో మరో వృద్ధాశ్రమం సందర్శించాము. పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు నడిపించేది. అక్కడ కొద్దిసేపు గడిపి కొన్ని బట్టలు, మందులు కూడా ఇవ్వడం జరిగింది..


నా విజ్ఞప్తి..

ఈ యవ్వనం శాశ్వతం కాదు. ప్రతి వారు ముసలివారు కావాల్సిందే. తల్లితండ్రులైనా , ఎవరైనా వృద్దులైనవారిని ఆదరించండి. వారికి కావలసింది మీ ఆస్తిపాస్తులు కాదు. పట్టెడన్నం, పిడికెడు ప్రేమాభిమానాలు. అవసాన దశలో వారు ఎదురుచూసేది, అవసరమైనది, వారిని బ్రతికించేవి అవే.. మర్చిపోవద్దు..

31 వ్యాఖ్యలు:

Unknown

చాలా మంచి పని చేశారు. మానవత్వంతో ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకున్న సభ్యులందరికీ పేరుపేరునా అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు అందరికీ స్పూర్తిదాయకంగా ఉంటాయి.

Malakpet Rowdy

GREAT JOB!!!!

Kottapali

చాలా సంతోషం.
ఊరికే గాజులు తొడుక్కు కూర్చునే చేతులు కావీ ప్రమదలవి, సంఘటితమైన శక్తితో సహాయం చెయ్యగలిగిన చేతులివి అని సగర్వంగా నిరూపిస్తున్నారు.
మీ సభ్యులందర్నీ మనసారా అభినందిస్తున్నాను.

teresa

Very nice gesture!More power to pramadaavanam!
వాళ్ళతో మీ సంభాషణ కంట తడి పెట్టించింది..

శ్రీనివాస్ పప్పు

మనస్పూర్తిగా అభినందనలతో...

మరువం ఉష

మీరంతా కూడి కార్యం తలపెట్టి, అందుకు కృషి సలిపి, నలువురుకీ వినియోగపడే ఈ సేవాకర్యక్రమం జరిపినందుకు అభినందనలు. మహవృక్షమైనా అంకురంగానే ఉద్భవిస్తుంది.

సుభద్ర

manchi pani chesaru.meeru malli tappaka vellali aa mixurepotlam evvali nenu gurtu chestanu.........
keep doing my dear all pramadavanam friends.

Anonymous

జ్యోతి గారూ,

HATS OFF !!

జీడిపప్పు

Great job Jyothi gaaru!!

rishi

అలిసిన ఏ మనసుకైనాత్మీయ స్పర్స
ఎంతొ సాంత్వన..జీవిత గమనంలొ ..
అలసి వివిధ కారణాలతొ ..అక్కడ ఉన్న
వారికి మీ అత్మీయ స్పర్స ఆదర్సనీయం .
అభిననదనలు.

సుజాత వేల్పూరి

అద్భుతం!ప్రమదలందరికీ అభినందనలు!

పరిమళం

జ్యోతి గారూ,ప్రమదావనం కార్యక్రమాన్ని చక్కగా వివరించారు ,అభినందనలు .

నిషిగంధ

ఫోటోలు చూస్తుంటేనే కళ్ళ నీళ్ళు తిరిగాయి.. ఇక వారితో మీ సంభాషణ చదువుతుంటే మనసు పట్టేసినట్లైంది.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రమదలదరికీ హృదయపూర్వక అభినందనలు..

చదువరి

భేష్!

భావన

ఎంతో మంచి పని చేసేరు జ్యోతి గారు. జీవితం లో వృద్దాప్యం ఒక బాగమే కాని అది ఎప్పుడూ భయపెడుతూనే వుంటుంది. కళ్ళు చెమర్చేయి మీ అనుభవం చదువుతుంటే.. నేను ఈ బ్లాగుల లోకం లో కొత్త అనేఅనుకోవాలి మీ ప్రమద సంఘపు వివరాల కోసం చూసేను మీ బ్లాగ్ లో కనపడలేదు..?

జ్యోతి

అందరికి ధన్యవాదాలు
ఫణిబాబుగారు, జీడిపప్పుగారు,
నాకెందుకండి అభినందనలు. ఇది ప్రమదావనం సభ్యలు సమిష్టిగా నిర్వహించిన కార్యక్రమం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. నేను గుంపులో గోవిందమ్మని..
నిషిగంధ,
ఇంకా చెప్పని మాటలెన్నో ఉన్నాయి. కాస్త పక్కన కూర్చుని మాట్లాడేవాళ్లులేక ఎంత బాధపడుతున్నారో మాకు అర్దమైంది.

mahigrafix

స్పందన లేని హృదయం రాయితో సమానం. సహాయం చేయడం మానవత్వం. మనం చేసిన సహాయం అవతలి వారికి ఉపయోగపడినపుడు కలిగే ఆ సంతృప్తి అద్భుతం. అలాగని సహాయం చేయడం గొప్పతనం కాదు. సగటు మనిషి కష్టాలలో ఉన్నపుడు ఆదుకోవడం మన బాధ్యత. సమయానికి స్పందించారు. మీ ఓదార్పు వారిని ఎంతో సంతోషపరిచి ఉంటుంది. "అమ్మ! దేవతలా వచ్చింది.అమ్మ నూరేళ్లు చల్లగా ఉండాలి". అని మనసులో ఖచ్చితంగా ప్రేమతో అనుకొని ఉంటారు. మనము ఒక్క రోజు బతికైనా వందేళ్లు మన పేరును బ్రతికించాలంటారు. మీరు మరిన్ని ఇలాంటి మంచి పనులు చేసి మానవత్వపు విలువ ను కాపాడాలని కోరుకుంటున్నాను.

జ్యోతి

భావనగారు,

నాకు మెయిల్ చేయండి ప్రమదావనంలో చేరుస్తాను.
jyothivalaboju@gmail.com

లక్ష్మి

జ్యోతి గారు, చిన్న సవరణ. అందరికన్నా పెద్దావిడ వయసు తొంభై రెండేళ్ళు. కళ్ళు కనపడకపోయిన మన జ్ఞాపకాలని, మన రూపాలని స్పర్శ ద్వారా అనుభవించి, అపురూపంగా పదిలపరుచుకున్న దుర్గమ్మ.

మండుతెండలో కూడా అన్ని మూలలనుండి కూడి వచ్చి వారికి ప్రేమనూ, ఆప్యాయతనూ పంచిన ప్రమదలందరికీ జ్యోతి గారి బ్లాగు ద్వారా మనఃపూర్వక అభినందనలు తెలుపుతున్నా.

Kathi Mahesh Kumar

అభినందనలు

కొత్త పాళీ

నేనిక్కడ రాసిన వ్యాఖ్య గురించి ఎవరో తన బ్లాగులో ఇంత పొడుగు వ్యాఖ్యానం రాశారు.

సుమమాలగారూ, నేను ఆడవారిని కానీ వారు వేసుకునే గాజుల్ని కానీ ఆ గాజులు తొడుక్కునే వారి చేతుల్ని కానీ ఏమీ కించ పరచలేదు. భాషలో నుడికారాలు, జాతీయాలు అని ఉంటాయి. వాటి సొగసు, వాడుక తెలిసినవారికి నా ఆంతర్యం అర్ధమయే ఉంటుంది. తెనాలి రామకృష్ణ సినిమాలో "తెలియనివన్ని తప్పులని సభాంతరమ్మునన్ పలుకగరాదు ..." అనే పద్యం గుర్తొచ్చింది నాకైతే మీ వ్యాఖ్యానం చదివి.
తమబ్లాగులో ఇతరులు వ్యాఖ్య పెట్టకుండా చేసిన వారు పనిగట్టుకుని ఎవరో ఎక్కడో రాసిన వ్యాఖ్యల్ని గురించి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. అసలు అక్కడే సమాధానం రాసి ఉండేవాణ్ణి, వ్యాఖ్యలు అనుమతించక పోవడంతో ఇక్కడ రాయాల్సి వచ్చింది, క్షమించండి జ్యోతిగారూ.

గీతాచార్య

A realgoodactby u Jyothi garu. Coninue theseactivitiesin your own way. My hats-off to all the participants.

Bolloju Baba

జ్యోతి గారు
అభినందనలు

కొత్త పాళీ గారి కామెంటు పురుషులను ఉద్దేసించి చేసినదయితే, సుమమాల గారి వాదనకు కొంత బలం ఉండేది. అప్పుడు స్త్రీలను కించపరచినట్లు అర్ధం తీసే అవకాశం ఉంటుంది.

కానీ వారు స్త్రీలను ఉద్దేసించి చేసినది కనుక, ఆ వాక్యంలో ఏరకమైన ఆక్షేపణా కనిపించటం లేదు.

మధురవాణి

జ్యోతి గారూ, మీరు రాసిన ఆశ్రమం కబుర్లు చదివి నా కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కడి వారి ఒంటరితనాన్ని ఒక్క రోజైనా దూరం చేసి.. వారిని సంతోషపెట్టిన ప్రమదలందరూ ధన్యులు. సమయం కేటాయించి ప్రత్యక్షంగా ఈ మంచి పనిలో భాగస్వాములయినందుకు.. ప్రమదలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
ఫోటోలు కూడా చాలా బాగున్నాయి.

జ్యోతి

కొత్తపాళీగారు,
లైట్ తీసుకోండి..

ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మేము ఇచ్చిన బట్టలు నిర్వాహకులు తీసుకుంటారేమో అని వచ్చేముందు వాళ్లందరికి చెప్పా ... రేపు మళ్లీ వస్తాను,మీరు ఈ చీరలు దాచుకోకుండా కట్టుకోవాలి.. లేకపోతే మీకిచ్చినవన్నీ తీసికెళతాను. పళ్లు కూడా అని చెప్పా. అలా చేస్తే ఎన్.టి.ఆర్ సినిమాకి వెళదాం అని చెప్పా. ఎన్టీవోడి సినిమా లేకుంటే ఇంగ్లీషు సినిమా.. వాళ్లు ఒప్పుకున్నారు.. :)))

SAMEEHA

నిజంగా స్పూర్తిదాయకమైన పని. నేను కూడా ఒకసారి ఒక చానల్‌కి "హ్యుమన్ రిలేషన్స్" మీద ఒక కార్యక్రమం చెయడానికని కీసర దగ్గరొలో ఉన్న ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కధ. వెళ్ళి వచ్చాక చాలా బాధగా అనిపించింది. పైగా వెళ్ళెటప్పుడు నేనేమి పట్టుకెళ్ళలేదు. కానీ కార్యక్రమం చుసేక చాలామంది ఆ సంస్థకి సహాయం అందిస్తామని ఉత్తరాలు వ్రాస్తే వారందరికి ఓపిగ్గా అడ్రస్లు పంపించాను. ఆ తృప్తి కలిగింది.

Unknown

ఇక్కడ వ్యాఖ్య, ఇంత పొడుగు వ్యాఖ్య చదివిన తరువాత నాకు సుమమాల గారి వాదన కూడ సబబుగానె అనిసిస్తోంది. నేను కొత్తగా బ్లాగ్ రాద్దామనుకొంటున్నాను.నాకు మీరెవరో, సుమమాల ఎవరో, కొత్తపాళి ఎవరో తెలీదు.

చైతి

మీరు చెప్పింది చాలా నిజమండీ. తప్పక చేయాలి. Well done.

Murali

after long time i couldnt able to stop my tears while reading ur blog , thanks a lot, Ur right we need look in to this matter we have to support them as much as possible .

Murali

http://polychiru.blogspot.com/

Unknown

Jyothi gaaru meeku hats off andi....kallalo neellu tirigayi vallanu chusthuntey...great job...

Unknown

great job jyothi gaaru...vaallanu chusthuntey kallalo neellu tirigayi..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008