Thursday 10 June 2010

క్రేజీ కాంబినేషన్స్ - 2




అన్నం, పప్పు, వేపుళ్ళు, పులుసులు, ఖుర్మాలు, పచ్చళ్ళు .. ఇలా వంటకాలలో ఎన్నో రకాలు . అప్పుడప్పుడు బోర్ కొడితే ఒకదానికొకటి రీమిక్స్ చేసేస్తాను. అది అలా చేయడం తప్పు కదా . అలా ఉండదు కదా? అలా చేయకూడదేమో. ఈ కూర ఇలాగే చేయాలి , ఆ వేపుడు అలా తినాలి అని ఎన్నో లెక్కలు చెప్తారు.కాని తినేది మనము. మనకు ఇష్టమైనట్టు తినాలి కాని దానికి రూలేంటి అంటాను నేను. చెత్త బుట్టలో పడేసేట్టు ఉండకుంటే చాలు మనం చేసే కాంబినేషన్స్. ఏమంటారు ?? ఇదంతా ఎందుకు చెప్తున్న అంటారా?? ఇంతకు ముందు అంటే రెండేళ్ళ క్రింద రాసిన టపా ఒకటుంది. అందులో ఎన్ని రకాల క్రేజీ కాంబినేషన్సో మీరే చూడండి.

మరి మీ క్రేజీ కాంబినేషన్స్ ఉంటే మాతో పంచుకుంటారా. ఐతే కానివ్వండి .. ఆలస్యమెందుకు??

12 వ్యాఖ్యలు:

sravya

ఏదైనా(ఉప్పు చెక్కలు,కారప్పూస,ఇడ్లి,దోస,సమొసా,చికెన్ బిర్యాని,నూడుల్స్...) - ఆవకాయతో
గారెలు - చికెన్ పులుసు
చారు అన్నం - ముద్ద పప్పు
వట్టి నెయ్యి అన్నం
పూరి,చపాతి లొ చక్కెర వేసుకొని రౌండ్స్ గా చుట్టుకొని తినడం
బ్రేడ్ టోస్ట్ చెసి మధ్యలొ వేపుళ్లు పెట్టుకొని తినడం

ఆ.సౌమ్య

నేను కొన్ని ట్రై చేస్తూ ఉంటాను.
వేడి అన్నంలో గోగూర పచ్చడి కలుపుకుని, దాన్లో కాస్త పప్పు కలుపుకోవడం. అలాగే పచ్చవకాయలోనూ పప్పు కలుపుకోవడం.

పెరుగులో కందిగుండ

బ్రెడ్ మధ్యలో గోంగూర పచ్చడి పెట్టుకుని సేండ్ విచ్ లాగ తినడం

వేడి అన్నలో కొబ్బరి పచ్చడి కలుపి దాన్లో దాన్లో చారు కలుపుకోవడం

అన్నంలో బెండకాయ వేపుడు, కొబ్బరి పచ్చడి మిక్సింగ్

అన్నంలో బంగాళదుంపవేపుడు, ఆవకాయ మిక్సింగ్

నిలవ టమాటా పచ్చడిలో నువ్వులపొడి కలుపుకోవడం

కందిగుండలో బెల్లం ఆవకాయ (ఎండావకాయ) కలుపుకోవడం

పాలల్లో పూరీలు, పంచదార వేసుకుని కాసేపు నానబెట్టి తినడం

పెరుగన్నంలో అరటిపండు నంచుకోవడం. అదీ కంచం అంచుని కత్తిగా ఉపయోగించి, అరటిపండుని గుండ్రని ముక్కల్లా కోసి పెరుగన్నంలో అద్దుకోవడం.

పెరుగన్నంలో మామిడిపండు రసం పిండుకుని తినడం

మజ్జిగాన్నంలో బెల్లం నంచుకోవడం

యూనువర్సిటీ హాస్టల్ లో ఉన్నప్పుడైతే భోజనం బాగాలేకపోతే కూర, పచ్చడి, పెరుగు అన్నీ కలిపేసుకుని లేదా రెండు రెండు కాంబినేషన్లు ట్రై చేసి తింటూ ఉండేదాన్ని. ఈ కాంబినేషన్లు మంచి రుచినిచ్చేవి.

Unknown

hahaha..super..!!!
mee patha post lo avayakaya mudda chusi tinalanipistondi..
na noru ippude pusi asalu avakaya kadu kada aratipandu kuda tinaleka potunnnaaa...
elaaa??? :(

సుజాత వేల్పూరి

మళ్ళీ మొదలైందా? హ హ హ ! కానివ్వండి!

జ్యోతి

సుజాతగారు,

అసలే ఆవకాయ సీజన్, పైగా షడ్రుచుల వార్షికోత్సవం. నన్ను ఈ టపా మళ్లీ మొదలెట్టించాయి.. మరికొన్ని కాంబినేషన్లు తెలుసుకోవచ్చనే స్వార్ధం కూడా కావొచ్చు.. :))

Padmarpita

నేనైతే.....ఉప్మాలో పంచదార, ఆవకాయ నంజుకుని తింటాను.
అన్నంలో ఆవకాయ, కారంబూంది అండ్ పెరుగు.

ఆ.సౌమ్య

ఇంకా కొన్ని మరచిపోయా.
కందుగుండ, లేదా టమటా పచ్చడిలో పెరుగు కలుపుకుని అట్లలో నంచుకు తినడం,
పెసరపప్పు పచ్చడిలో ఇంగువనూనె,
వేడి వేడి ఆవకాయ అన్నంలో వెన్న లేదా మీగడ అదీ లేకపోతే కమ్మటి గడ్డ పెరుగు కలుపుకుని తినడం,
అట్లలో తిమ్మనం నంచుకు తినడం,
గారెలు, పరవాణ్ణంలో ముంచుకు తినడం,
బూర్లకి బొక్క పెట్టి ఓ బొట్టు నెయ్యి వేసుకుని తినడం,
కారపు బూంది పెరుగులో కలుపుకుని తినడం,
అన్నంలో ఆవకూర కలుపుకుని అందులో పప్పులుసు లేదా సాంబార్ కలుపుకుని తినడం,
పప్పులుసు లేదా సాంబార్ లో నువ్వులగుండ కలుపుకుని తినడం.

Dr.Tekumalla Venkatappaiah

క్రేజీ కాంబినేషన్లు చాలా బాగున్నయి. నేనూ ప్రయత్నిస్తాను. మరి చింతకాయ పచ్చడి అన్నం లో ఒక స్పూను గట్టి పెరుగు వెసుకుని కలుపుకుని చూడండి. ఎంత రుచి వస్తుందో... అలాగే దాంట్లో కాచిన వంట నూనె కూడా ఒక స్పూన్ వెసుకోడం మరచిపోకండి. టేకుమళ్ళ వెంకటప్పయ్య.

ప్రణీత స్వాతి

కంది పచ్చడి + మజ్జిగ పులుసు..
పెరుగన్నం + కొత్తావకాయ్
పెరుగన్నం + మాగాయ్
చింతకాయ పచ్చడి + దోసకాయ పప్పు
ఆవకాయ్ + కంది పొడి
నువ్వుల పొడి + చారు
పులిహోర + పెరుగు
గారెలు + ఆవకాయ్
ముద్దపప్పు + కొత్తావకాయ్ + నెయ్యి + మజ్జిగ పులుసు
కాకరకాయ్ వేపుడు + పెరుగన్నం
పెరుగన్నం + చేమ దుంపల పిండిమిరియం (తమిళుల వంటకం)
చింతకాయ్ పచ్చడి + ఆవకాయ్
పెరుగన్నం + చల్ల మిరపకాయలు
పెరుగన్నం + అప్పడాలు
పెరుగన్నం + మామిడి పండు / అరటి పండు

స్వర్ణమల్లిక

జ్యోతి గారు, నేను కూడా వెరైటీ ప్రయత్నిస్తూ ఉంటానండి.

కందిపొడి / కందిపచ్చడి + ఆవకాయ
ఏదైనా పులుసు కూర + సెనగ పాటోలి
గోంగూర పచ్చడి + వెన్న ముద్ద + వేడి వేడి అన్నం
సాంబారు/చారు/పప్పుచారు/పులుసు + బెండకాయ డీప్ ఫ్రై
ముద్దపప్పు + గోంగూర పచ్చడి / గోంగూర పులుసు + నెయ్యి
ఇంకా వంకాయ పచ్చి పులుసు + వడియాలు + కంది పచ్చడి
దోసెలు / గారెలు + ఆవపెట్టిన పెరుగు పచ్చడి

స్వర్ణమల్లిక

ఇంకా ఉన్నాయి....

పులుసు/పప్పుచారు/మజ్జిగ పులుసు + గారెలు నానబెట్టి తింటే భలేగా ఉంటాయి.

అప్పడాలు వేయించి చిన్న చిన్న ముక్కలుగా తుంచి... టమేటా + ఉల్లిపాయ + కొత్తిమీర సన్నగా తరిగి కలిపుకుని తింటే సూపర్..

ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగి కారం బూందీ / మిక్చర్ ను కలిపి టమేట రౌండ్ గా కట్ చేసి ఆ ముక్కలపై పైన పెట్టుకుని తింటే బాగుంటుంది.

Vinay Datta

I like to eat pulihora, either tamarind or lemon, with vankaya koora or aakukoora pappu.

I tease my sister that I've not seen anybody other than her who eats pappu annam with koora.

She retorts saying that She hasn't seen anybody other than me who eats 'holiga' (bobbattu) with aavakaaya. Yes, I did that earlier because I usually don't like sweets. I had to eat because my mother forced me to eat.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008