Monday 16 August 2010

ఏందిరా భాయ్ ఈ సెల్లు లొల్లి




నమస్తే ! మీ నంబర్ ఏంటి?... ఇది ఒక వ్యక్తీ పరిచయం కాగానే అడిగే మొదటి మాట . ముందు అతని నంబర్ సేవ్ చేసుకుని తర్వాత మిగతా ముచ్చట్లు. ఇంతకూ ముందు ఐతే ఇంటికో ఫోన్ ఉండేది. దానికి కాల్ చేస్తే ఇంట్లో ఉంటే మాట్లాడతాడు లేకుంటే వచ్చాక మాట్లాడొచ్చు అని ఉండేది. కాని ఇపుడు ఏ వ్యక్తినైనా ఏ సమయంలో అయినా పట్టుకునే సులువైన మార్గం మొబైల్ ఫోన్. అవసరానికి పనికొచ్చే వస్తువుగా ప్రారంభమైన ఈ సెల్లు వాడకం ఇపుడు అత్యవసరం ఐపోయింది. ఎంతగా అంతే బాత్ రూం లోకి కూడా తీసుకెళ్తున్నారు. గుళ్ళో దేవుడికి పూజ చేసే పంతులు మంత్రాలకు మధ్యలో తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తి మధ్యలో ఫోన్ వస్తే మాట్లాడుతూనే తిరుగుతూ ఉంటాడు. అదేం భక్తో మరి? స్కూలు పిల్లలకు కూడా మొబైల్ అవసరమే అంటున్నారు కొందరు బడాబాబులు, అమ్మలు. కాలేజీ పిల్లలకైతే అన్నం లేకున్నా సెల్లు ఉంటే చాలు. ఒకటే ముచ్చట్లు. మనిషి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడానికి ఈ సాధనం కనుక్కున్నారు .కాని అది ఆ దూరాన్ని మరింత పెంచుతుంది. పక్క రూం లో, క్యాబిన్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే సులువైన మార్గం మొబైల్. నడిచి వెళ్లి అతనితో మాట్లాడే ఓపిక లేదో,సమయం లేదో, బద్ధకమో మరి..


ఈ అవసరాన్ని తమ వ్యాపార సూత్రంగా మార్చుకున్నాయి కంపీనీలు. పుట్టగొడుగుల్లా రోజుకో కొత్త మొబైల్ కంపెనీ,మాడలు. వాటికి దీటుగా రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు. ఈ వ్యాపారంలో పేరు, డబ్బు సంపాదించుకోవడానికి కొత్త ఆఫర్లు. ఒకడిని చూసి ఇంకోడు బట్టలిప్పుకుంటున్నాడు. ఈ మధ్య ఫోన్ రెట్లు, కాల్ రెట్లు ఒకరిని చూసి ఇంకొరు తగ్గించేస్తున్నారు. ఈ కాల్ రెట్లు, మెసేజుల రెట్లు ఎంతగా ప్రభావితం చేసాయంటే పనిమనుష్యులు, బిచ్చగాళ్ళు, కూరగాయల బండి వాడు కూడా సెల్ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు సెల్ లేదు అన్నవాడు పిచ్చోడు ఈరోజుల్లో. సేల్ ఫోన్ మోడల్ బట్టి అతని గౌరవం విలువ కడతారు కొందరు మహానుభావులు. ఉద్యోగాలు,వ్యాపారస్తులకు ఈ సెల్లు చాలా ఉపయోగకరమే. కాని అది ఎంతో మంది చేతుల్లో దుర్వినియోగం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో..

ఓ చిన్న జోకు..
"హలో!"
"హలో! ఇది ఫలానా కస్టమర్ కేర్. మీకే విధమైన సేవ చేయగలం?"
"హలో! నేనో కంప్లెయింట్ చేయాలి"
"చెప్పండి"
"నా నంబర్ కి కాల్ చేయకండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.మా అమ్మకు తెలిస్తే అది కాన్సిల్ చేయిస్తుంది.మీరు చేయొద్దు"
"సరే చేయం కాని. ఏ నంబర్ అండి?"
"అమ్మా! నంబర్ చెప్తే మీరు కాల్ చేస్తారు. మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది.మీరు చేయనపుడు ఆ నంబర్ ఎందుకు చెప్పాలి?"
"ఏదైనా ఆఫర్ ఉంటే కాల్ చేస్తాము, బిల్ కట్టకుంటే కాల్ చేస్తాము అంతే"
"వద్దు.. చేయొద్దు.మీరు కాల్ చేసి మా అమ్మకు కంప్లెయింట్ చేస్తే నేను మీ ఆఫీసుకు వచ్చి కంప్లెయింట్ చేస్తాను."
" సరే చేయనులెండి"
ఇలా ఒక అమాయకుడు ఇంగ్లీషులో చేసిన సెల్లు లొల్లి వినండి మరి.



ఇది వింటుంటే మన తెలుగు న్యూస్ చానెల్స్ లో యాంకరమ్మలు తెలుగు మాట్లాడడానికి బలవంతంగా పడుతున్న పాట్లు గుర్తొస్తాయి. కాదంటారా?


ఈ సందర్భంగా ఓ గీతోపదేశం కాదు కాదు.. సెల్లోపదేశం..(మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా స్టైలులో పాడుకోండి)

మత్తు వదలరా సెల్ ఫోన్ మత్తు మదలరా
ఆ మత్తులోన పడితే అడ్డంగా బుక్కవుదువురా.. //మత్తు//


జీవితమున సగభాగం ఫోన్ సోల్లుకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం బిల్లు కట్టుతకే సరిపోవు.
సెల్లుఫోన్ లేనివారు పనికిరాని మూర్ఖులు
వద్దురా అంటే చెడామడా తిడతారు ... // మత్తు //

రింగ్ టోన్స్, కాలర్ ట్యూన్స్ పిచ్చిగా వాడకురా
పాటలు వింటూ రోడ్డు మాత్రం దాతకురా (చస్తావుర్రోయ్)
బుద్ధి చెప్పడం మావంతు తప్పు తెలుసుకోవడం నీ వంతు
సెల్లు లేకున్నా నడిచే కాలం చూడు మారకుంటే నీ ఖర్మం.. //మత్తు //

( ఈ టపా రాస్తుంటే రేడియోలో ఈ పాట వచ్చింది. అప్పటికపుడు ఇలా రాసేసాను. సరదాగా.. )

11 వ్యాఖ్యలు:

మేఘన

ఇంతకి మీరు చెప్పింది మీరు పాటించారా? అంటే మీకు సెల్లు లేదా?

Saahitya Abhimaani

Good Post. But whether anybody listens! Cell phone has become a modern day malady. I belong to the rare (endangered!)species who does not carry a cell phone. When people ask my number and when I tell I do not have cell, they give such a funny expression and give a "know all" smirk imagining that I am avoiding giving my number. If we want to talk to somebody without being interrupted( even with a person next to us)is by dialing his number and start talking. Of course if that person is one of those freaks carrying more than one cell, gone is the idea of talking uninterrupted. I too shared my agony of abuse of cell phone in my blog which can be read with the help of following link:

http://saahitya-abhimaani.blogspot.com/2009/12/blog-post_15.html

Once again thanks for an eye opening article wrote with humorous tinge.

Pranav Ainavolu

ఏది అతి అయినా దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి కదండీ మరి.
బాగుంది సెల్లు లొల్లి... సెల్ మోహనరంగ! :)

ఆ.సౌమ్య

ఆ ఆడియో విని నవ్వలేక చచ్చాననుకోండి, మా ఫ్రెండ్సందరికీ వినిపించాను :)

జ్యోతి

మేఘన,
ఈ మాట అడుగుతారని చూస్తున్నాను. నాకు ఈ సెల్ అంటే అవసరమే కాని అదే జీవితం కాదు అనుకుంటాను.మా పిల్లలకు కూడా ఇంజనీరింగు ఫైనలియర్ లో సెల్ కొనిచ్చాను.అదీ తక్కువ ధరలోనే. తర్వాత ఉద్యోగాలు వచ్చాక వాళ్లే ఇంకా మంచివి కొనుక్కున్నారు.ల్యాండ్ లైన్ మాత్రం నాకే ఎందుకంటే మిగతావారికి ఎవరికి వారి సెల్ ఉందిగా. నాకు సెల్ ఉంది కాని ఎక్కువ వాడను. ఎప్పుడూ సైలెంట్ లో ఉంటుంది. నా పని తీరి ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని చూస్తాను. యాబై రూపాయలు రీచార్జ్ చేయిస్తే మూడునెల్లు వాడతాను. ఒకసారి అది ఎక్కడుంటుందో నాకే తెలీదు. అలా పడేస్తాను. బయటకు వెళితేనే అది పట్టుకెళతాను. నాకేమైనా ఐతే ఇంట్లోవాళ్లకు తెలుస్తుందని...:)

శివగారు,
మీరు చెప్పిన విషయాలన్నీ నా మనసులో ఉన్నవే కాని కాస్త సరదాగా రాద్దామని చిన్న ప్రయత్నం.
ప్రణవ్,
నేను చెప్పేది అదే. అతిసర్వత్రవర్జయేత్. నాలుగైదు రోజులక్రింద ఒక అమ్మాయి సెల్ లో పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతుంది. రైలు వచ్చి గుద్దేసింది. ఆ అమ్మాయి చనిపోయింది. మరీ అంత పిచ్చా??

సౌమ్య,
అసలు ఈ ఆడియో మా అబ్బాయి వాడి ఫ్రెండి సెల్ నుండి తెచ్చి నాకు వినిపించాడు. దీన్ని తెలుగులో రాయమన్నాడు. అసలు ఈ ఆడియోని ప్రెజంట్ చేయడానికే ఈ టపా కట్టింది. :)

వేణూశ్రీకాంత్

హ హ ఆడియో మాత్రం అదిరిందండి :)

విజయభారతి

డియర్ జ్యోతి,
సెల్ లొల్లి విని నవ్వు ఆపుకోలేక పోయాను. అది నిజంగా జరిగిన సంభాషణ లేక స్టూడెంట్స్ సరదా కోసం రికార్డు చేసిన సంభాషణా? నిజమైన సంభాషణ ఐతే కస్టమర్ కేర్ వాళ్ళు దాన్ని ఎలా లీక్ చేస్తారు ప్రైవసీ అగ్రీమెంట్ వుంటుంది కదా? దాన్ని లీక్ చేసినందుకు కస్టమర్ కేర్ మీద చర్య తీసుకోవటం లాంటివి ఏమి ఉండవా అని ఆలోచిస్తున్నాను. నా ఇంకో ఆలోచన ఏమిటి అంటే బిచ్చగాల్లు కూడా సెల్ వాడుతుంటే తెలుగు భాషలో సర్వీసు ఎందుకు చేయటం లేదు? సెల్ ఫోన్ వాడె తెలుగు జనం తక్కువేమీ కాదు కదా?
విజయ

జ్యోతి

విజయ ఇది సరదాకి చేసిన ఆడియో. నిజంగా ఉన్న అది బయటకు రాదుగా. ఇది మొబైల్ ఫోన్స్ లో తిరుగుతుంది. మా అబ్బాయి అది తెచ్చి నాకు వినిపించాడు..

పరిమళం

:) :)

భాను

audio vini navvukunnam

Unknown!!!

.. 10yrs mundhu cellphone okka luxury..nenu btech chadive rojulo..evariki cells undevi kaavu....parents..hostel security dhaggara unna phone ki chesthe..maaku mike lo announcement vachedhi..ipudu..school pillalki kooda cellphones unnai..

marketers..could have products ni..must have products laga marchestharu...needs in create chesthunnaru.. ipudu mana cell vaddu anukunte..manam venakapadipotham..anthe..prapanchame ala undhi

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008