Monday, December 22, 2014

Happy Birthday to Me , Myself...Jyothiకొన్నేళ్ల క్రితం నేనేంటో , నాకేం వచ్చో, నేనేం చేయగలనో తెలీదు. అసలు నేనేమైనా చేయగలను, సాధించగలను అని ఎప్పుడూ అనుకోలేదు. కనీసం డిగ్రీ పూర్తి చేయలేదు. మరీ జీనియస్ కాదు. పెద్దవాళ్లెవరూ తెలీదు.స్నేహితులు లేరు..  సరే.. వంట చేసుకోవడం, ఇల్లు సర్దుకోవడం. భర్త, పిల్లలను సరిగా చూసుకోవడం. వారికి కావలసినవి అమర్చడం.. బంధువులను ఆదరించడం.. ఇవి చేస్తే చాలులే అంటూ గడిపేసిన జీవితం నేడు పూర్తిగా తిరగబడింది. ఆత్మీయ మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఒక రచయిత్రి, ఎడిటర్, పబ్లిషర్ గా మంచి పేరు లభించింది.  ఈ పుట్టినరోజుకు నాకు నేను ఇచ్చుకున్న గొప్ప బహుమతి  హైదరాబాదు బుక్ ఫెయిర్ లో మరికొందరు ప్రముఖ మహిళా రచయిత్రులతో కలిసి స్టాల్ పెట్టడం. అది కూడా గొప్ప విజయం సాధిస్తోంది. ప్రశంసలు వస్తున్నాయి.. ఇప్పుడు సంతృప్తిగా ఉంది. నేను కూడా ఏదో చేయగలను, చేసాను అని..

నా గురించి పూర్తిగా కాకున్నా చాలా తెలుసుకున్న ఒక ఆత్మీయ సొదరి చేసిన ఈ కార్డ్ కంటే అందమైనది నేను చేయలేను.. అందుకే అదే మీకోసం.
16 వ్యాఖ్యలు:

Unknown

Happy Birthday, Jyothi garu! Have a wonderful day! Card chaala bagundhi.

శ్యామలీయం

జ్యోతిగారూ,
మీకు జన్మదినశుభాకాంక్షలు
తాడిగడప శ్యామలరావు

Zilebi


శుభాకాంక్ష లండోయ్ !

అంతే గాక బుక్ ఫెయిర్ లో మిమ్మల్ని కలవడం కూడా ఒక మంచి మొమెంట్ !!


జిలేబి

జ్యోతి

అందరికీ ధన్యవాదాలు.


జిలేబిగారు..

మీరు నన్ను కలిసారా? చాలా అన్యాయం కదా ఇలా అనామకంగా కలవడం..
ఐనా మీరే నన్ను కలిసారని ఎలా నమ్మడం. ఊరికేనే అంటున్నారేమో..

శ్యామలీయం

జ్యోతిగారూ, జిలేబీగారు తమనితాము గుప్తపరిచయం చేసుకోవటం అన్యాయం.
తాను హైదరాబాదులో ఉంటున్నారో లేదా హైదరాబాదు వచ్చారో కాని జిలేబీగారు ఆ విషయాన్ని మనకు తెలియకుండా ఉంచటం ఇంకా అన్యాయం.
ఇంకా ఇంకా అన్యాయం కూడా ఏమన్నా ఉందా అని బుఱ్ఱ గోక్కుంటున్నాను!

Anonymous

జ్యోతిగారికి,
జన్మ దిన శుభకామనలు. మీరిలాగే ఆనందంగా మరెన్నో జన్మ దినాలు జరుపుకోవాలని ఆకాంక్ష.

"శతంజీవ శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి.....
శతం దీర్ఘమాయుః"

దీర్ఘ సుమంగళీ భవ.
దీర్ఘాయుష్మాన్భవ.

జిలేబిగారు అలా అందరిని బుట్టలో వేస్తూ ఉంటారంతే.....

విన్నకోట నరసింహా రావు

చెక్కు మీద సంతకం చెయ్యకుండా, అదేమంటే గుప్తదానం అంటారు. అలా వుంది జిలేబీ గారి వరస :)

జ్యోతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కార్డ్ బాగుంది.

Jai Gottimukkala

Many more happy returns of the day :)

dokka srinivasu

Jyoti garu

Many many happy returns of the day. Jyoti garu congrats for your achievement as you are turned as a writer and publisher and also arranged one stall in Hyderabad Book Fair. Jyoti garu i hope you are reaching many more heights.

Jyoti garu you blog is simply superb and you are covering wide range topics and also telugu literature. Thanks for creating such a great blog.

Jyoti garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.

http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

Jyoti garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your inspirational and valuable comment.

వేణూశ్రీకాంత్

పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతి గారు :-)

Anonymous

many happy returns of the day....

Padmarpita

Many More Happy Returns Of The Day Jyotigaru.

లక్ష్మీ'స్ మయూఖ
This comment has been removed by the author.
hari.S.babu

ఈ జ్యొతి కలకాలం వెలుగు గాక!
-హరికాలం.

sarma

జ్యోతిగారు,
జిలేబిగారు మిమ్మల్ని హైదరాదులో కలిసి ఉంటారనే నా అనుమానం...వారు చెప్పిన మాట నిజమనిపిస్తోంది...

సుధామ

నిన్న బుక్ ఫెయిర్ కు ప్రమదాక్షరి స్టాల్ కు వచ్చాను.నేను స్టాల్ లో వున్నంతసేపూ మీరు వనితా టీ.వీ వారికి కాబోలు ఇంటర్వ్యూ ఇచ్చే బిజీలో వున్నారు.వేదిక మీద విశాలాంధ్ర వారి దశాబ్ది కవిత ఆవిష్కరణ సమయం అవుతోందని మిమ్మల్ని కలవకుండానే వెళ్ళిపోవలసి వచ్చింది.ఏమైనా మీరు ఇలా అందరి అభిమానపాత్రురాలిగా,సెలబ్రిటీగా దర్శనమివ్వడం అమితానందం కలిగించింది.నవ నత్సర శుభాకాంక్షలతో...సుధామ

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008