Tuesday, 30 December 2008

మొగుళ్లు (మగాళ్లు) జిందాబాద్..

చాలా కాలం క్రింద రాసిన టపా ఇది. పని లేని మంగలోడు పిలిచి పిల్లి తల గొరిగాడన్నట్టు ఒకసారి పాత టపాలు గెలుకుతుంటే అది కాస్తా ఎగిరిపోయింది. అదృష్టవశాత్తు ఎక్కడో రాసి పెట్టుకున్న ప్రతి దొరికింది. అది మళ్ళీ రాసి వెబ్ దునియా వాళ్ళకి ఇస్తే అది వాళ్లు అచ్చేసుకున్నారు. ఇక్కడ చూడండి.. పాపం ఈ మగవాళ్ళ కష్టాలు చూస్తె కడుపు తరుక్కుపోతుంది. నా సానుభూతులతో ఈ వ్యాసం మీకోసం..


జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురా

జంకు బొంకు లేక ముందుకు సాగిపొమ్మురా…

అని పాడుకుంటూ పన్నెండు గంటలు నిర్విరామంగా ఆఫీసులో పని చేసి, వంచిన నడుము ఎత్తకుండా కష్టపడి , బస్సులలో నిలబడి రాలేక లోను తీసుకుని కొనుక్కున్న బైకు ఉన్నా కూడా ఈ వెధవ ట్రాఫిక్కులో ఇరుక్కుని( నా పావు జీవితం ఈ రోడ్లపైనే గడిచేటట్టు ఉంది) ముక్కుతూ మూల్గుతూ బాస్‍ని, ప్రభుత్వాన్ని, నా పెళ్ళాన్ని, పోలీసును, కనపడ్డవాళ్ళందరినీ తిట్టుకుంటూ, ఈసురోమంటు ఇంటికి చేరుకున్నాను. బట్టలు మార్చుకుని , మొహం కడుక్కుని శ్రీమతి ఇచ్చిన కాఫీ తాగి కుర్చీలో కూలబడ్డా. ఏం బ్రతుకురా ఇది. వెధవ మగ జన్మ. ఆ దేవుడు మగవాడై ఉండి మాకు ఇన్ని కష్టాలా? ఇంత కూడా సింపతీ లేదా? పుట్టినప్పటినుండి ఇదే డైలాగ్ " వాడికేంటి మగాడు" అంటారు అందరు. చిన్నప్పటినుండే బ్రెయిన్ వాషింగు మొదలవుతుంది. " ఒరేయ్! ఈ ఇంటిని నువ్వే చూసుకోవాలి. అక్క, చెల్లెల్ల పెళ్ళీ పేరంటాలు, అమ్మానాన్నను బాగా చూసుకోవాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి" అని బాగా ప్రిఫేర్ చేస్తారు అందరు కలిసి. భవిష్యత్తులో ఇవన్నీచేయాలని చిన్నప్పటినుండే కాస్త మస్కా కొడతారు. ఆడపిల్లలకంటే ఎక్కువ స్వాతంత్ర్యం, డబ్బులు ఇచ్చి. కాని మార్కులు తగ్గితే మాత్రం వీపు విమానం మోతే. ఇదే మాటలు అమ్మాయిలకెందుకు చెప్పరు. వాళ్లనేమో హాయిగా సుకుమారంగా పెంచుతారు. స్కూలు కొచ్చి ఏడో క్లాసు దాటగానే IIT, EAMCET అని వాళ్ళే నిర్ణయించేసి బందిలదొడ్డిలోకి బర్రెలను తోలినట్టు మమ్మల్ని తోలేస్తారు. అఫ్ కోర్స్ అమ్మాయిలు కూడా మాతో పాటు ప్రతీ దానికి సై అంటు వచ్చేస్తారు. కాని వాళ్లు కంపల్సరీగా చదివి ఉద్యోగాలు చేయాలని లేదు. ఇష్టంలేకుంటె హాయిగా ఇంట్లో కూర్చుంటారు. మగాళ్ళకి మాత్రం చచ్చినట్టు ఉద్యోగం చేయాల్సిందే. ఇంట్లో వారి కోరికలు అవసరాలు తీర్చడానికి. పైగా "ఉద్యోగం పురుష లక్షణం" అంటారు. పొగుడుతున్నారా,ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నారా?... ఆ తర్వాత పెళ్ళి అనే బంధిఖానా తప్పదు. వద్దు అంటే చదువైపోయింది, ఉద్యోగం వచ్చింది. ఇంకా ఏం వెలగబెట్టేది ఉంది అని నన్నో గుదిబండకు కట్టేస్తారు. ఇక జీవితాంతం మరో ఆడదాని కన్నెత్తి కూడా చూడకూడదు. అందాన్ని చూడడం, ఆనందించడం తప్పా?? ప్చ్..

పుట్టగానే నర్సు అమ్మతో "కంగ్రాచ్యులేషన్స్ !వారసుడు పుట్టాడు. " అంటుంది. ఐపోయింది నాపని. వారసుడు అంటూ ఉన్నాలేకున్నా వారి ఆస్థిపాస్తులు, అప్పులు, బాధ్యతలు అంటగట్టేస్తారు పుడుతూనే

స్కూల్లో, కాలేజీల్లో కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకుంటే తల్లితండ్రులను అభినందిస్తారు. మీరు అదృష్టవంతులు. మంచి కొడుకును కన్నారు. మీ పేరు నిలబెడతాడు" అని.ఇక నా గొప్పేంటంట ఇక్కడ.

పెళ్ళిలో అందరూ మా యావిడను మెచ్చుకుంటారు. "అదృష్టవంతురాలివి. మంచి మొగుడు దొరికాడు." నేనేమన్నా పారేసుకున్న పెన్సిల్‍నా దొరకడానికి. అదేంటో నన్ను మాత్రం ఎవ్వరూ మెచ్చుకోరు.ఇన్ని కష్టాలు పడి, చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాకూడా. కష్టం ఒకరిది. అభినందనలు వేరొకరికి. మగాడు అంటే కుటుంబాన్ని పోషించడానికే ఉన్నాడని అందరూ కలిసి ముద్ర వేస్తారు.

జీవితంలో పాతిక వంతు అమ్మ చెప్పినట్టు వినాలి. ముప్పాతిక వంతు పెళ్ళాం చెప్పినట్టు వినాలి. లేకుంటే తేడాలొచ్చేస్తాయి.ముచ్చటకి పెళ్ళాం పిలుపులు చూడండి ఎలా ఉంటాయో. మొదటి సంవత్సరం - ప్రియా , డార్లింగ్ ,, రెండో సంవత్సరం - ఏవండి (గోముగా), మూడో సంవత్సరం -ఏమండోయ్. ఎక్కడున్నారు( కాస్త ప్రేమగా) ,, ఐదేళ్ళ తర్వాతనుండి ఫిక్సెడ్‍గా ఒకే పిలుపు - ఏమయ్యో! ఎక్కడ చచ్చావ్?.. మొగుడనే గౌరవం లేకుండా చప్రాసీని పిలిచినట్టు ఒరే, రా అని పిలవడం, అదేమంటే ఏమవుతుంది. ఇప్పుడంతా మోడర్న్ అంటారు.అసలు నన్నడిగితే ఈనాటి ఇల్లాలికి ఇంటా బయటా స్వాతంత్ర్యం ఎక్కువైంది. పెళ్ళి చేసుకునేది మొగుడనే క్యారెక్టర్‍ని వేపుకు తినడమే అనుకుంటున్నారు. అన్నింటికీ ఆర్గ్యూమెంట్స్. గట్టిగా మాట్లాడితే చాలు వాళ్ళ ఆయుధం తీస్తారు. అదే ఏడుపు. ఆడవాళ్ళు ఏడ్చి గెలుస్తారనేది అక్షర సత్యం. ఇది నాకనుభవమే.

ఇంట్లో హాయిగా నీడపట్టున ఉండి, టీవీ సీరియళ్ళు , సినిమాలు, మహిళామండళ్లు, కిట్టీ పార్టీలు. ఎటూ తోచకుంటే షాపింగ్. వీటన్నింటికి బొక్క పడేది నాకే. గానుగెద్దులా ఎండనక, వాననక కష్టపడి ఇంటికొచ్చిన మొగుడికి సపర్యలు చేయడం నామర్దాగానూ, నామోషీగానూ ఫీలవుతారు . కాస్త కోప్పడితే భర్త రాచి రంపాన పెడుతున్నాడని, ఇంటిపనుల్లో, వంట పనుల్లో అస్సలు సాయం చేయరని కంఫ్లైంట్లు..ఎప్పుడూ చూసినా మొగుళ్ల మీద ఏడుపే ఈ ఆడాళ్ళకి. ఇంకా చెప్పాలంటే నేటి స్త్రీలు హోం డిపార్టుమెంట్‍తో సరిపెట్టుకోకుండా ఫైనాన్స్ కూడా హస్తగతం చేసుకుంటున్నారు. వామ్మో! ఎలా బ్రతికేది. ఇంటి ఖర్చులు, వాళ్ల ఖర్చులు, షాపింగులు అన్నీ మా డబ్బుతోనే చేస్తూ ,,, పైగా మామీదే ఆరోపణలు.

వారమంతా చచ్చే చాకిరి చేస్తామా !. ఆదివారం కాస్త విశ్రాంతిగా ఉందామంటే అదేదో సినిమా చూసి ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని మొదలెట్టారు. ఆ ప్రొడ్యూసర్ , డైరెక్టర్ యెదవల్ని తన్నాలి. ఇలాంటి సినిమాలు తీయకుండా...పూర్వంలోలాగా పనిమనిషి లేకుండా ఉన్నారా? రోట్లో పిండి రుబ్బుతున్నారా. బట్టలు ఉతుకుతున్నారా అన్నింటికి ఆటోమేటిక్ మెషిన్లు ఉన్నాయిగా. అంత నాజూగ్గా తయారయ్యారు ఆడాళ్ళు. అందరూ ఆడాళ్ళనే అయ్యో పాపం అంటారు. ఏం. మగాళ్లకి కష్టాలుండవా? వాళ్ళని అయ్యో అనరే? ఆఫీసులో పని ఎక్కువగా ఉండి రాత్రి ఆలస్యంగా వస్తే అయ్యో పాపం వాళ్ళాయన ఎప్పుడూ ఆలస్యంగానే వస్తాడు. ఆమె ఇంట్లో ఒక్కతే ఉంటుంది. ఎంత కష్టమొచ్చింది. అంటారు గాని, ఆ మొగుడిని మాత్రం అయ్యో పాపం,. ఎంత కష్టపడుతున్నాడు తన భార్యను సుఖపెట్టడానికి అనరు కదా. ఏం సంపాదించినదంతా నాకోసమేనా?... అంటే అన్నారంటారు కాని పెళ్ళిలో పది నిమిషాలు బుట్టలో కూర్చుని వచ్చే ఆడవాళ్ళు జీవితాంతం మొగుడిని బుట్టలో పడేసి ఉంచుతారు. ఐనా తప్పదు. ఆ దేవుళ్లకే తప్పలేదు ఈ తిప్పలు. లక్ష్మీదేవి మహావిష్ణువు కాళ్ల దగ్గర ఎందుకు కూర్చుంది. ఆయన చేసే పనులన్నీ గమనించడానికే. పార్వతీ దేవి శంకరుని సగభాగం ఆక్రమించేసి తను చెప్పినట్టు ఆనంద తాండవమాడిస్తుంది. ఇక సరస్వతి దేవి తక్కువ తిందా బ్రహ్మగారి నాలుక మీద కూర్చుండి తను చెప్పినట్టు మాట్లాడిస్తూ ఉంది. వాళ్ల కష్టాల ముందు నేనెంత వాణ్ణి. తనివితీరా ఏడుద్దామన్నా అదృష్టం లేదు. ఏమంటే ఆడంగి వెధవలా ఏడుస్తున్నాడంటారు. పైగా ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదంట. ఎవరా అన్నది? వాణ్ణి తీసికెళ్ళి హుస్సేన్ సాగర్‍లో వినాయకుడితో పాటు ముంచేయాలి.

నాకు తెలీకడుగుతా పెళ్ళిరోజు, పుట్టినరోజులు గుర్తుంచుకోరని ఎప్పుడు మగాళ్ళ మీద ఆడిపోసుకుంటారు. ఆఫీసులో మా బాస్ గాడు ఎంతా చంఢాలమైన వాడో వాళ్ళకు తెలుసా? హాయిగా ఏసిలో కూర్చుని కంఫ్యూటర్ లో టిక్కు టిక్కు మంటు ఉంటామని కుళ్ళుకుంటారు. ఎప్పుడు మగాళ్లే బహుమతులు ఇవ్వాలా? పెళ్ళాలు ఇస్తే ఏం మునిగిపోతుంది. ఇంటి ఖర్చులకోసం ఇచ్చిన డబ్బులుంటాయి (మనవే కదా) అందులోంచి కనీసం జలుబు చేసినప్పుడు ముక్కు తుడుచుకోడానికి నాలుగు రుమాళ్ళు కొంటారా? లేదు. ఖర్మ . ఏం చేస్తాం? ఆ శ్రీకృష్ణుడికే తప్పలేదు ఈ (పెళ్ళాల) తిప్పలు. సత్యభామతో తన్నులు కూడా తిన్నాడు పాపం. ఒక్క పెళ్ళాంతోనే చస్తున్నాం. ఎనిమిది మంది పెళ్ళాలను ఎలా మెయింటేన్ చేసాడో మహానుభావుడు. పద్మ అవార్డులు, చక్ర అవార్డులన్నీ కలిపి అతనికి ఇచ్చేయాలి.

ఇంకో విషయం …. చిన్నప్పుడు బయటకు వెళుతుంటే అమ్మఅడుగుతుంది.. ఎక్కడికెళుతున్నావు అని… పెళ్ళయ్యాక పెళ్లాం అడుగుతుంది .. ఎక్కడికెళుతున్నావు అని... చచ్చాక అందరూ అడుగుతారు నాకు తెలుసు... .. ఎక్కడికెళుతున్నావు. అని. నా ఇన్ష్యూరెన్స్ డబ్బంతా నా పెళ్ళానికే ఇచ్చాగా, ఇంకా నేనెక్కడికెళితే ఏంటంట? ఇప్పుడు కూడా నన్ను వదలరా?

ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే…

కష్టాలు ఆడాళ్ళకే కాదు .. మగాళ్ళకీ ఉన్నాయి అని. ఊరుకుంటుంటే ఇవి శృతి మించుతాయి. కాబట్టి అందరం ఏకమై సంఘం పెట్టుకుని , ఏం చేయాలని డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే ఈ ఆడాళ్ళు మగాళ్లని నూనే లేకుండానే వేపుకు తింటారు …. దీనివల్ల ఒరిగేదేమీలేదు. కాని కాస్త మనశ్శాంతి. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటే కాస్త మనశ్శాంతి.

ఆడవాళ్ళకే బాధిత సంఘాలు, మహిళామండలి సమితిలు ఉండాలా? భర్తలు పెట్టుకుంటామంటే అదోలా చూస్తారేంటి. జంధ్యాల సినిమాలో బ్రహ్మానందంలా? మా గోడు వినేది ఎవరూ???

Monday, 29 December 2008

సేవను పంచుకుందామా???


ప్రతి ఇంట్లో మనం వాడని బట్టలు ఎన్నో ఉంటాయి. పిల్లలవి, పెద్దలవి.. మన చుట్టాల్లో ఎవరినైనా అడిగితే నిష్టూరాలు. తొడిగి పనికిరాని బట్టలు ఇచ్చారు , కొత్తవి ఇస్తే వాళ్ల సొమ్మేం పోయింది అంటారు. స్టీలు సామాన్లవాడికి వేద్దామంటే ఐదు మంచి ఫ్యాంటు షరతులు ఇస్తే ఒక పప్పు గరిట ఇస్తాడు. వాళ్ళకీ జరీచీరలు కావాలంటారు. మంచి విలువైన బట్టలు అలా ఇవ్వబుద్ధి కాదు. కాస్త చిన్నవైనా పిల్లలు వేసుకోరు. ఖరీదైన బట్టలు . ఎం చేయాలో తోచదు. నాదే ఇదే సమస్య. ప్రశాంతిని అడిగితే ఎవరైనా అవసరమున్నవాళ్ళకి ఇవ్వొచ్చు అంది. మూడు రోజుల క్రింద సాక్షి పత్రికలో వచ్చిన వ్యాసం
" ప్రేమను తొడిగించండి" చూసి సంతోషం కలిగింది.

ప్రతి సంవత్సరం డిసెంబర్ ౩౧ న "షేర్ ఏ సర్వీస్" అనే సంస్థ "వస్త్రదానదినోత్సవం" జరుపుతోంది. పాట బట్టలు సేకరించి అవసరమైనవారికి పంచుతుంది. మనం చేయవలసిందల్లా శుభ్రమైన పాత బట్టలు మూటకట్టి వాళ్లకు ఇవ్వడమే. నేను ఇవాళ మా ఇంట్లో ఉన్నా పాత వస్త్రాలు తీసికెళ్ళి ఇందిరా పార్క్ రోడ్డులో రామకృష్ణ మఠం దగ్గర ఉన్న ఎమెరాల్డ్ స్వీట్ షాప్ లో ( ఈ షాపు గురించి గతంలో ఎవరో బ్లాగినట్టు గుర్తు ) ఇచ్చాను. మీరు మీ వంతు సాయం చేయండి.. మనకు పనికిరానివి, ఎందరికో ఒంటిని కప్పుతుంది. మీరు కూడా మీ ఇంటికి దగ్గర ఉన్నా కలెక్షన్ పాయింటుకు వెళ్లి ఇవ్వండి. క్రింది నంబరుకు ఫోన్ చేస్తే మీ ఇంటికి దగ్గరలో ఉన్నా కలెక్షన్ పాయింట్ చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం కాల్ చేయండి.


షేర్ ఏ సర్వీస్
మెయిల్ : info@shareaservice.com
ఫోన్ : 040-27807425, 30481424

Friday, 26 December 2008

భలే మంచి రోజు...



ముందుగా అందరూ నన్ను క్షమించాలి. ఏదో సరదాకి 25 నాడు మన స్టాల్ ని ఆక్రమించుకుందాం అన్నదానికి చదువరిగారు మహిళలే నిర్వహించండి అని వరమిచ్చారు . కాని తప్పని, క్లిష్టమైన పరిస్థితుల్లో నేనే ఆలస్యంగా రావల్సి వచ్చింది. ప్చ్. మంచి చాన్స్ పోయింది.

ఔరా! పది రోజుల్లో ఎంత మార్పు అనుకుంటూ నేను మా అమ్మాయి పుస్తక ప్రదర్శనకు వచ్చాము. సరిగ్గా పదిరోజులు అంటే 14 వ తేదీ బ్లాగర్ల సమావేశంలో అందరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపాము . అనుకోకుండా ఆ రోజు జరిగిన చర్చలో ఈ పుస్తక ప్రదర్శనలో అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి గురించి తెలియజెప్పాలి అని వేసిన విత్తనం , ఇప్పుడు ఒక స్టాలుగా మొలకెత్తి, ఎందరో తెలుగువారు, ప్రముఖులను ఈ దిశలో ప్రయాణింపజేసాము. ఎటువంటి ఖర్చు లేకుండా అంతర్జాలంలో తెలుగును చాలా సులువుగా రాయొచ్చు, చదవొచ్చు. ఒకమాటలో చెప్పాలంటే సాధారణంగా ఇంగ్లీషుకే వాడుతున్న కంప్యూటర్లకు తెలుగు నేర్పించడం ఇంత తేలికా అని తెలుసుకున్న వారు ఆశ్చర్యచకితులయ్యారు అనడంలో సందేహంలేదు.

దాదాపు అన్ని స్టాల్స్‌లో జనాలు నిండిపోయారు. లోపలికి దూరడానికి కూడా చోటు లేదు. అలా చూస్తూ వెళుతుంటే అనుపమ వాళ్ల స్టాల్ కనిపించింది. సరే వాడి సంగతి చూద్దాం అని వెళ్లాను. మా అమ్మాయి అంటూనే ఉంది. నీకు తెలుగు వచ్చు కదా మళ్లీ ఎందుకు వెళుతున్నావు అని. .. అనుపమ టైపింగ్ ట్యూటర్ అంటే మనకు ఇన్‌స్క్రిప్ట్ నేర్పే ట్యూటర్ అన్నమాట. ఏనిమేషన్లో. కాని దానికి మన కీబోర్డ్ పై తెలుగు అక్షరాల స్టిక్కర్లు అంటించుకోవాలి. మరి ఇంగ్లీషులో చేయాల్సిన పని ఉంటే ఎలా అంటే ఇంకో కీబోర్డ్ పెట్టుకోండి. ఎంత 150 లో వచ్చేస్తుంది కదా అన్నాడు ఆ అబ్బాయి. సరే అని తిరిగి వచ్చేస్తుంటే కొంటారా మేడం అన్నాడు. అప్పుడు వాడిమీద చిన్న బాంబ్ వేసి వచ్చా. నేను తెలుగు బ్లాగర్ ని , లేఖిని, బరహ వాడి, ఇప్పుడు అను వాడుతున్నా. ఎవరైనా అడిగితే చెప్తాలే అన్నా. కాని ఆ ట్యూటర్ చూస్తుంటే నాకు చిరాకేసింది. అంత నిదానమా.. నాకు పనికిరాదు.

అన్ని స్టాళ్ల ముంది జనాలు చాలా మంది ఉన్నా మన eతెలుగు స్టాల్ ఉన్న వరుసలో అన్నీ పత్రికల స్టాళ్లు . అవన్నీ ఖాళీగా వెలవెలబోతున్నాయి. TV9 స్టాల్ లో మాత్రం ఏదో ఆడిషన్స్ జరుగుతుంటే జనాలు గుమిగూడారు. ఆ వరుసలో మన స్టాల్‌లో మాత్రం సందడే సందడి. ముందుగా నేను తయారు చేసి తీసుకువచ్చిన చార్ట్ షీట్లు ఇచ్చాను. అంతకు ముందు శనివారం రోజు మన స్టాల్ కి వెళ్లినప్పుడు సగం గోడలు ఖాళీగా కనిపించాయి. ఉన్నవన్నీ eతెలుగు బ్యానర్లే. అందుకే బ్లాగుల పేర్లు రాసి తీసుకొచ్చాను. ఏవైనా మిగిలిపోతే రాసుకోమని కూడా చెప్పాను. అసలు ఆ చార్టులపై బ్లాగుల పేర్లు రాద్దామంటే ఎక్కువగా మహిళా బ్లాగులే గుర్తొస్తున్నాయి. అలా ఐతే గొడవలైపోతాయని కూడలిలో వెతికి అన్ని రాసాను. కాని రమణి గారి బ్లాగు పేరు అస్సలు గుర్తుకు రాలేదు. అదేంటో ఈ మనసు బ్లాగులు ఎక్కువై బుర్ర పాడైపోతుంది. ( ఏం మనసులో ఏమో) భార్గవ ఆ చార్టులు పెడుతూ ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని జనాలు అడిగితే ఏం చెప్పాలి అంటాడు. నేను అనుకున్నట్టే చదువరిగారు అడగనే అడిగారు. మా పేర్లు లేవా? అన్నీ మహిళా బ్లాగర్ల పేర్లు పెట్టుకున్నారా ఏంటి ? అని అడిగారు. కాదని చెప్పాను. ఇక నేను తెచ్చిన సున్నుండలు అందరికి ఇవ్వమని ఇచ్చి కాస్త బయటకొచ్చి స్టాలు ఫోటోలు తీస్తుంటే పక్కనుండి "నమస్కారం" అని వినవచ్చింది.






"నమస్కారమండి"
"ఒక్క నిమిషం"
"నమస్కారం జ్యోతిగారు"
"నమస్కారం. ఒక్కనిమిషం మాట్లాడతాను"
"నమస్కారం"
ఫోటోలు తీయడం పూర్తిచేసి పక్కకు చూసాను. నేను కస్తూరి మురళీకృష్ణను అని పరిచయం చేసుకున్నారు. ఆయన అంతకు ముందు అన్నదానికి నవ్వొచ్చింది. పక్కనే కొల్లూరి సోంఅషంకెర్ గారు, మహేష్ ఉన్నారు. నేను పిలవకుండానే మురళీకృష్ణగారు .. మీ ఇంటికి వచ్చేస్తాము , మహేష్, సోమశంకర్ కూడా వస్తారు అని పిలిచేసుకున్నారు. ..నవ్వేసి అందాక స్వీట్లు తినండి అని తెచ్చి ఇచ్చాను.

అక్కడున్న అరగంటలో గమనించింది ఏంటంటే... యువకులు కాకుండా మధ్యవయస్కులు ఉద్యోగస్తులు ఏంట్రా .. పుస్తకాల మధ్యలో కంప్యూటర్ ఎందుకుంది? ఏంటి ఈ కథా కమామీషు? అనుకుంటూ తొంగి చూసారు . స్వాతి, మహేష్, శ్రీనివాస్ గారు పాంప్లెట్లు ఇస్తున్నారు. తాడేపల్లిగారు, శ్రీధర్ ఎవరికి వీలైనప్పుడు వాళ్లు అంకోపరిలో లేఖిని గురించి చూపిస్తున్నారు. అందరూ ఒకే మాట అడుగుతున్నారు. ఇలా అంతర్జాలంలో తెలుగు రాయాలంటే ఏదైనా సాఫ్ట్‌వేర్ కొనాలా? అని.. అవసరం లేదు అంటే నమ్మలేకున్నారు. ఉచితంగా కూడా దొరుకుతాయా. అంత ఈజీగా తెలుగు రాయడం, చదవడం, అన్నీ చేయొచ్చా అని.

అక్కడున్న కొద్ది సేపట్లో నేను ఇద్దరు దంపతులను కలిసాను. ఆ పాంప్లెట్ చదువుతూ వారికి కలిగిన సందేహాలు అడిగారు.
"ఈ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? ఆఫీసు ఎక్కడుంది?
"ఈ సంస్థ స్వచ్చందంగా పనిచేసుంది. ఆఫీసు అంటూ లేదు. ఆన్‌లైన్‌లో పని చేస్తుంది."
"ఈ పాంప్లెట్లో ఉన్నవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎలా చదవొచ్చు?"
"ఇందులో చెప్పినవన్నీ నెట్‌లో ఉన్నాయి. ఉచితంగా చదవొచ్చు"
"మరి తెలుగులో ఎలా రాయాలి? ఏదైనా సాఫ్ట్‌వేర్ కొనాలా?"
"అక్కర్లేదండి! ఇక్కడ చెప్పిన్నట్టు లేఖినిలో రాసుకోవచ్చు. అది కాపీ పేస్ట్ చేసుకోవాలి. అదే బరహ ఐతే చిన్న సాఫ్ట్‌వేర్ . అది డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఇంగ్లీషులాగే ఎక్కడైనా తెలుగులో రాసుకోవచ్చు. మెయిల్ కాని, వ్యాసాలు కాని ఏవైనా అన్నీ తెలుగులోనే రాయొచ్చు "
" మరి మాకు ఏదైనా సందేహాలు ఉంటే ఎవరు చెప్తారు?"
" ఇక్కడ చెప్పిన హెల్ప్ సెంటర్లో అడగొచ్చు, లేద ఈ గ్రూపులో చేరితే అక్కడ మేమందరమూ ఉంటాము , ఎవరైనా సహాయం చేస్తారు."
"ఈ సంస్థ ఎక్కడుంది. మళ్లీ కలవాలంటే?"
" ఈ సంస్త సభ్యులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. మీకు ఈ గ్రూపులో ఎప్పుడైనా సహాయం చేయడానికి ఎవరో ఒకరు రెడీగా ఉంటారు"

వాళ్లు ఎంతో సంతోషంగా థాంక్స్ చెప్పి వెళ్లిపోయారు. ఇంకా కొద్ది సేపు ఉండాలనుకున్నాను కాని నాకు వేరే పని ఉండి వెళ్లవలసి వచ్చింది. అందరికి బై చెప్పి భారంగా వెళ్లిపోయాను. ఎలాగూ శ్రీధర్ బ్లాగులొ వివరాలు చదవొచ్చులే అనుకుని. కాని నాకు ఒకటే అనిపించింది. ఎవరెవరో , ఎక్కడివారో. అంతా బ్లాగానుబంధం. చాలా మంది మొదటిసారి కలుసుకుని ఏదో ప్రముఖులను కలుసుకున్నంత ఆనందపడిపోయారు. ఇంతవరకు బ్లాగులలో రచనలతో ఊహల్లో ఉన్న వ్యక్తులను కలుసుకోవడం, ఉన్న కాసేపైనా ఆప్యాయంగా , సరదాగా గడపడం అందరికీ ఒక తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది.. ఈ అవకాశం రాకుంటే మనం కలిసేవాళ్లమా.. ఈ కలయిక వ్యక్తుల మధ్య దూరాన్ని చాలా తగ్గించింది. రూపాలు కాదు మనసులు ముఖ్యం అనే అభిప్రాయం అందరికీ కలిగింది. ఒకటే ఆలోచనా దృక్పధం ఉన్న మనుషుల మధ్య ఒక మధురమైన అనుబంధం . అది మరపురానిది.. మరువలేనిది..

ఈ మహాయజ్ఞంలో వీరుల్లా కష్టపడుతున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వీరందరిని సమన్వయపరచి, ఒక తాటిపై నడిపిస్తున్న పెద్దాయన కూడా ఓ వెయ్యి వీరతాళ్లు వేసేద్దామా?

మరో ముఖ్య విషయం.. ఈ క్రమంలో ఒక వ్యక్తిని కలిసిన బ్లాగర్లందరూ ఒకలాంటి వింత అనుభూతికి , ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతవరకూ ఆ వ్యక్తి తన టపాలతో ఒక గంభీరమైన పెద్ద మనిషిగా అగుపించేవారు. అతని టపాలు, సమాధానాలు చదివిన వారందరికీ ఆ వ్యక్తి పట్ల ఒకలాంటి భయం ఉండేది. కాని ముఖాముఖీ కలుసుకున్న తరవాత అందరికీ ఆ భయం, జంకు తొలగిపోయాయి. అతను ఒక కదిలే విజ్ఞాన భాండాగారం. అతనితో మాట్లాడుతుంటే అలా మంత్రముగ్ధులై వింటూ ఉండిపోతున్నారు. సరదాగా, సూటిగా సుత్తి లేకుండా, అప్పుడప్పుడు వాతలు పెడుతూ ఎన్నో విషయాలు చెప్పే ఆ ప్రముఖ బ్లాగర్ మన తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఇంత సరదాగా ఉంటారు అని ఎవ్వరూ ఊహించలేదు..

Thursday, 25 December 2008

నవ్వుల (రాజు) బాబు ...

ఈ బిజీ బిజీ లైఫ్ లో ఒక్కసారి మనసారా నవ్వుకుందామా?? నవ్వులరాజు తోడుగా..








Tuesday, 23 December 2008

చలో e-తెలుగు స్టాల్

అక్కడేదో పుస్తకాల ప్రదర్శన జరుగుతున్నట్టుందే!!! మరి పుస్తకాల మధ్యలో ఈ కంప్యూటర్ స్టాల్ ఏంటి? పైగా ఉచిత సహాయం అంటున్నారు!! దానికి దీనికి ఏంటి సంబంధం. ఏదో మాకు నచ్చిన పుస్తకాలు కొందామని వచ్చాము. తెలుగుకు కంప్యూటర్ కు ఏంటి సంబంధం . మీ చోద్యం కాకపొతే !!..

కాని తెలుగును పుస్తకాలలో , పత్రికలలో చదవడమే కాక , కంప్యూటర్లలో ఎంతో సులువుగా చదవొచ్చు, రాయొచ్చు అని ఓపికగా వివరిస్తున్నారు మన బ్లాగర్లు. దీనివలన ఎవరికీ ఒక పైసా ఆదాయం లేదు. మిగతా స్టాల్లలా ఎవరూ తమ స్వంత సైట్లు, బ్లాగులు కూడా ప్రచారం చేసుకోవడం లేదు. మరి వారు చేసే పని ఏంటి అంటే??? అక్కడకు వచ్చే తెలుగువారికి కంప్యూటర్లలో కూడా తెలుగు రాయొచ్చు చదవొచ్చు అని చెప్తున్నారు. చూపిస్తున్నారు కూడా. ఇదేం పెద్ద పనా అనుకునేవాళ్లు లేకపోలేదు. కాని దీని వెనక ఎంత కృషి ఉందో అందరికీ తెలియదు. . అంతర్జాతీయ బ్లాగర్ల దినోత్సవం నుండి జరిగిన అనూహ్య మార్పులు, ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిన పనులు శ్రీధర్ బ్లాగులో వివరించాడు. మేము అది చేసాం , ఇది చేసాం అని చెప్పుకోవడం అవసరమా అంటారా? . అవసరమే. రవిగారు రాసిన నివేదిక చదివి బాధ కలిగి నేనే శ్రీధర్ ని రోజువారి సమీక్ష ఇవ్వమన్నా. అందరికీ తెలియాలి వారు నిస్వార్ధంగా చేస్తున్న కృషి. కనీసం కొందరైనా దీనివలన స్ఫూర్తి పొందే అవకాశం ఉంది కదా. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి అది చేయాలి, ఇది చేయాలి అని మాటలు కాక ఇపుడు చేసి చూపించే తరుణం వచ్చింది.


పత్రికలలో వ్యాసం అంటే వాళ్ల సమయం బట్టి మన దగ్గర సమాచారం తీసుకుని కత్తిరించి రాస్తారు. అది జనాలకు ఎంతమేరకు వెళుతుందో తెలియదు. కాని ఇప్పుడు తెలుగు భాషాభినులకు ఈ సులువైన పద్ధతులు నేర్పాలి. ఈ కృషిలో పనిచేస్తున్న శిరీష్, తాడేపల్లి, కశ్యప్, భార్గవ్, పద్మనాభం, శ్రీనివాస,వీవెన్, కిరణ్, అరుణ, అనిల్ , మురళి. .. వీరితో మరి కొందరు కలవాలి. ఇది వారి స్వంత కార్యక్రమం కాదుగా. అందరిదీ. ముందుకు రండి. బ్లాగర్లు , చదువరులు . ప్రతిరోజూ కాకున్నా ఏదో ఒక రోజు తమకు వీలైన సమయం మన స్టాల్ లో గడపండి.

మరో ముఖ్య విషయం. గత శనివారం జరిగిన సమావేశం లో కలిసిన బ్లాగర్లందరూ , ముఖ్యంగా మహిళా బ్లాగర్లు మొదటిసారి కలిసినా చాలా సరదాగా గడిపారు. ఇలా మనమందరం కూడా కలుసుకునే మంచి సందర్భం . మిస్ కాకండి.

ప్రమదావనం సభ్యులకు గమనిక:

25 తారీఖు నాడు మనం కలుద్దామా? మన స్టాల్ దగ్గర కనీసం రెండు గంటలయినా గడపొచ్చు. అలాగే పార్టీ చేసుకుందాం. పుణ్యం , పురుషార్ధం.. రెండూ అవుతాయి. అదంతా కాదుగానీ... ఆ రోజు లేడీస్ డే గా చేసుకుంటే పోలా!!! అధ్యక్షులు చదువరిగారు ఏమనరు. అంతగా ఐతే వరూధినిగారికి చెప్పేద్దాం. ఆరోజు స్టాలుని ఆక్రమించేసుకుంటే సరి.. అప్పుడు దానికి అందం, గ్లామర్ వస్తుంది. అవిడియా బానే ఉందిగా.. :):)

అందరూ వచ్చేయండి మరి !!!


కార్యక్రమానికి తమ వంతు విరాళాలు అందించడానికి వివరాలు ఇవి..

e-తెలుగు సభ్యత్వం..
ప్రవేశ రుసుము :Rs.300
వార్షిక చందా : Rs.200
జీవిత సభ్యత్వం :Rs.2000

Monday, 22 December 2008

పుట్టినరోజు శుభాకాంక్షలు జో!!!




"హ్యాపీ బర్త్ డే ఫ్రెండ్"
"థాంక్ యూ! కాని నాకు పుట్టినరోజు చేసుకోవడం అలవాటు లేదు. అంతా ఇష్టం లేదు"
"ఎందుకలాగ?"
"చిన్నపిల్లలు ఏదో సంబరానికి చేసుకుంటారు. మనం తాడిచెట్ట్లలా పెరిగాం. సిల్లీగా పుట్టినరోజు జరుపుకోవడమేంటి?
"ఇది మరీ బావుంది. పుట్టినరోజు మనది. దానికి చిన్న, పెద్ద తేడా ఏంటి? మనను అభిమానించేవారితో మన పుట్టినరోజు షేర్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇన్ని ఆలోచనలేంటి?"
"ఏమో జ్యోతి! నాకు నచ్చదు. మనం ఏదైనా సాధించి అందరి అభినందనలు అందుకోవడం అంటే ఓకే. కాని పుట్టి మనమేదో ఉద్ధరించినట్టు ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి. ఐ డోంట్ లైక్ ఇట్"

...................................................................................................................

పుట్టడం, గిట్టడం మన చేతిలో లేదు.మనం కోరుకోలేదు. అమ్మా నాన్న అనురాగానికి గుర్తుగా పుట్టిన మనం వారిని ఆనందింపజేస్తాం. చిన్నప్పుడు అమ్మ ప్రతి పుట్టినరోజుకు మర్చిపోకుండా కొత్త బట్టలు , వాటికి మ్యాచింగ్ గాజులు, చెప్పులు, రిబ్బన్లు, స్కూలులో పంచడానికి చాక్లేట్లు ఇప్పిస్తుంది. కాలేజికొచ్చాక అంతలా కాకపోయినా కొత్త బట్టలు వేసుకుని, దగ్గరి స్నేహితులకు స్వీట్లు ఇవ్వడం పరిపాటి. పెళ్లి అయ్యాక జీవిత భాగస్వామి మన పుట్టినరోజు గుర్తుపెట్టుకుని ఏదైనా కొనిస్తే సంతోషం. అలా సంసార సాగరంలో పడ్డాక ఆ మనమేం చిన్నపిల్లలమా , ప్రతిసంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం అంత అవసరమా? అని అనుకుంటారు చాలా మంది.

కాని........

దసరా, దీపావళి, ఉగాది, శివరాత్రి, ఇలా సంవత్సరం పొడుగునా ఏదో ఒక పండగ తప్పనిసరిగా చేసుకుంటాం. కొత్త సంవత్సరం వేడుకలు సరే సరి. ఇవన్నీ తనకు చేయమని ఆ దేవుడు అడిగాడా. కొంతమంది దేశనాయకుల పుట్టినరోజులు ఘనంగా జరుపుతాం. మన కుటుంబ సభ్యులు, కొలీగ్స్, స్నేహితులకు పుట్టినరోజు విషెస్ చెప్తాం. ఇవన్నీ చేయాలని గుర్తుంటుంది . కాని మన పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలని ఎందుకనుకుంటారు?

ఎప్పుడూ భార్య, భర్త, పిల్లలు, బాసు, స్నేహితులు ఇలా అందరిని సంతోషపరచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటాము. మనను మనం సంతోషపెట్టే హక్కు , అధికారం మనకు లేదా? ఎవరో మనను సంతోషపెట్టడమేంటి? మనకు ఏం కావాలి? ఏది సంతోషాన్నిస్తుంది? ఏం చేస్తున్నాం? ఏం చేయగలం? ..ఇవన్నీ మనకే తెలుసు. ముందు మనని మనం సంతోషపరుచుకుంటే గాని పక్కవారిని సంతోషపెట్టలేము. మన గురించి మనం ఆలొచించాలి. అందులో పుట్టినరోజు ఒకటి. ఈ రోజు మనకే ప్రత్యేకమైనది. దానిని మనకు నచ్చినట్టుగా చేసుకోవాలి. పుట్టినరోజు అంటే పార్టీలు, కేకులు బహుమతులు కాదు. ఈ ఒక్కరోజైనా మనకిష్టమైన పనులు చేయాలి. ఎవరూ మనకు అభినందనలు చెప్పలేదు, బహుమతులు ఇవ్వలేదు అని ఫీల్ అవ్వొద్దు. ఐనా ఎవరేంటి మనను సంతృప్తి పరిచేది. మనకు తెలీదా?

ఈ సోదంతా ఎందుకు అంటారా? అదేం లేదండి. కొన్ని రోజుల క్రింద ఒక అబ్బాయితో పైన చెప్పినట్టు వాదన జరిగింది. దాని ప్రతిఫలమే ఈ టపా. ఇవాళే ఎందుకు చెప్పానంటే ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి. మామూలుగా నేను పుట్టినరోజు అస్సలు జరుపుకోను. కాని బ్లాగ్లోకంలోకొచ్చాక జరుపుకున్న మూడవ పుట్టినరోజు మరి ఇది. మొదటిసారి షడ్రుచులులో వందవ టపాతో , రెండవసారి కంప్యూటర్ ఎరా ఆర్టికల్ తో ఎంతో గర్వంగా , సంతోషంగా బ్లాగ్ మిత్రుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నాను. మరిచిపోలేని బహుమతులు అందుకున్నాను. ఇప్పుడు మరింత ఉత్సాహంతో మూడవ పుట్టినరోజు పండగ చేసుకుంటున్నాను. నేను ఏం సాధించానో అది నాకే తెలుసు. ఎంతోమంది ఆప్యాయత, ప్రేమ, గౌరవం దక్కింది. ఇది గర్వకారణం కాదా. సాధ్యమైనంతవరకు నాకు తెలిసింది ఇతరులకు చెప్పడం అలవాటైంది. అంటే కాని ఏదో సాధిద్ధాము, గొప్ప చెప్పుకుందాము అనే దురుద్ధేశ్యం ఏనాటికీ లేదు.

నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

ఎల్లపుడూ నన్ను కాపాడుతూ, అడుగడుగునా నన్ను ఓదార్చి, ఉత్సాహపరిచేందుకు ఆత్మీయులను పంపుతున్న ఆ జగజ్జననికి ఈ జీవితం అంకితం.

Friday, 19 December 2008

ఆడబిడ్డ.. ఎప్పటికీ ఆడ.. బిడ్డేనా???

పుట్టగానే అమ్మో ఆడపిల్లా అంటారు
అది ఆ పసిపాప తెలిసి చేసిన నేరమా
పేగు తెంచుకుని నేలపై పడినప్పుడు
ఆ ఆడపిల్ల అమృత కలశంగా కాలేదు
అగ్నికుంపటి కాలేదు.



గోరుముద్దలు తినిపించి కంటికి రెప్పలా కాచుకున్న అమ్మ
తన చిన్నారి అత్తారింటికి వేళ్లే వేళ భోరున ఏడవదా?
ఈడొచ్చిందని , ఒక తోడును , సరియైన జోడును వెతికిన నాన్న
కళ్లలో పెట్టుకునే వరుడి చేతిలో పెట్టి కంట తడి ఆపుకోగలడా



పరాయిదైనా కూడా బిడ్డ కోసం
కడదాకా ఆరాటపడే అమ్మ ఆరాటం
తపన మాటల్లో వర్ణించగలనా
అమ్మా నేను నీలా కాగలనా??



ఎందుకమ్మా ఆడపిల్లను పరాయిదాన్ని చేస్తారు
పెళ్లికాగానే పుట్టింటికి అతిథిగా మారాలా
పాతికేళ్ల అనుబంధం మర్చిపోవాలా
అత్తిళ్లే తప్ప పుట్టింటితో నాకు సంబంధం లేదా.



అడకగముందే నాకు ఏమి కావాలో తెలుసుకున్నావు
శ్రమ అనుకోకుండా ఇష్టమైనవి చేసి పెట్టావు
తీరైన బట్టలు కుట్టి నాకు తొడిగించి మురిసిపోయావు
అందంగా అలంకరించి బంగారు బొమ్మ అని దిష్టి తీసేవు.



హాయిగా నీ కనుసన్నల్లో ఉన్న నేను
పెళ్లి కాగానే పెద్దదాన్నైపోయానా
ఎవరికిష్టమైనవి వారికి చేయాలి , చేస్తున్నాను కూడా
మరి నాకు ఇష్టమైనవి ఎవరికి తెలుసు. నీకు తప్ప.



తువ్వాయిలా తుళ్లుతూ, నవ్వుతూ ఉన్న నన్ను
బాధ్యతల పంజరంలో పడేసారు
ఈ ఇంటి కట్టుబాట్లలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను
బలవంతంగా పెద్దరికం తెచ్చుకున్నాను.



నా కన్న బిడ్డలకు ఎన్ని చేస్తున్నా
అనుక్షణం నువ్వే గుర్తొస్తావ్..
మళ్లీ నాకు నీ చిట్టితల్లిలా
మారాలనుందమ్మా..



అత్తారింట్లో ఏ బాధలు లేవు
కాని అలసిన మనసు,
నీ తోడు కావాలంటుంది
కాలం వెనక్కి తిరిగితే బాగుండు అనిపిస్తుంది



అమ్మా! నాకొద్దీ పెద్దరికం, బాధ్యత
నీ దగ్గరకొచ్చి అలా మౌనంగా ఉండాలనిపిస్తుంది
నీ ఒడిలో తల పెట్టుకుని మనసారా ఏడవాలనుంది
ఆడబిడ్డగా కాక నీ బిడ్డగా ఉండనిస్తావా??



అత్తింటికెళ్ళినా, పుట్టింటిపై మమకారం
వదలలేని ఆ ఆడపిల్ల అనుబంధానికి
అనురాగానికి అర్ధం చెప్పగలమా?
ఆడపిల్లకి పెళ్ళయ్యాక కూడా
పుట్టిల్లు, మెట్టిల్లు రెండూ కావాలి, అందరిని
ప్రేమగా చూసుకునేది ఆడపిల్లే కదా?

Thursday, 18 December 2008

పుస్తక ప్రదర్శనలో తెలుగు వెలుగులు

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెలుగు బ్లాగులకై స్టాలుని తీసుకుంటున్నాం. వేలలో ఉన్న తెలుగు బ్లాగుల సందర్శకులని లక్షల్లోనికి పెంచే దిశగా పుస్తక ప్రదర్శలలో మన కార్యక్రమాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే, పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కవ శాతం ఉంటారు కాబట్టి.

అయితే, ఈ స్టాలు నిర్వహణకి సంబంధించి ఔత్సాహికులు కావాలి.


ప్రదర్శన నడిచినన్ని రోజలూ అంటే, రేపటినుండి ఈ నెల 28వ తేదీ వరకు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ నడపాలి. కనీసం నలుగురు ఉంటే బాగుంటుందనుకుంటున్నాం.

శని మరియు ఆదివారాలకి బానే దొరుకుతారు. కాబట్టి వారంలోని మిగతా రోజులలో అక్కడ ఉండి సందర్శకులని సంభాళిస్తే చాలు.

అన్ని రోజులూ ఒక్కరే ఉండలేరు కాబట్టి ఒక్కో రోజూ ఒక్కొక్కరూ వంతుల వారీగా చెయాల్సిరావచ్చు. మీకూ ఏయే రోజులలో వీలవుందో చెప్తూ ఇక్కడ స్పందించండి. (దీనికోసం పూట మీ కార్యాలయం నుండి సెలవు తీసుకునే దిశగా కూడా ఆలోచించండి.)

మీ సహాయం మరియు తోడ్పాటు మాకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. మీ నుండి సానుకూల స్పందనని ఆశిస్తూ...

Wednesday, 17 December 2008

పాపం ఐటి - పాటేస్కో..

ఎమున్నదక్కో ఎమున్నదక్కో
పొట్ట పెరిగిపోయి .. జుట్టు రాలిపోయి... ఉన్నా పరువు పోయి
ఈ ఇండస్ట్రీలో నాకు
ఏమున్నది అక్కో ... ఏమున్నది అక్కా...


బి టెక్ చేసినాకా ( సామి )
హైదరాబాదు చేరుకున్నా. ( సామి )
ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే ఆ..ఆ...ఆ....
ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే . ఎంత కావాలి అంటే అంట పెట్టి
జాబ్ కొట్టినా... జాయిన్ అయినా బాంచన్....


ఎమున్నదక్కో.. ఎమున్నదక్కో


ట్రైనింగులు ఇవ్వకపాయే ( సామి )
క్లయింటు ఇంతరాక్షను అన్నాడు ( సామి )
కమ్యూనికేషను బాలేదు అంటే ఆ...ఆ.. ఆ..
కమ్యూనికేషను బాలేదు అంటే కుమిలి కుమిలి ఏడ్చినా
హిందులో వేయించినా బాంచన్..


ఎమున్నదక్కో... ఎమున్నదక్కో...


ప్రాజెక్టు ఇచ్చిండు ( సామి )
పే స్లిప్పు వచ్చింది ( సామి )
పే స్లిప్పు చూపించి ... ఆ..ఆ...ఆ...
పే స్లిప్పు చూపించి.. క్రెడిట్ కార్డు తీసుకున్నా.. అవసరం లేనివి
అన్నీ కొన్న అప్పుల పాలు అయినా బాంచన్...


ఎమున్నదక్కో .. ఎమున్నదక్కో...


ప్రాజెక్టు ఐపోయింది ( సామి )
కొత్తది వస్తాది అన్నాడు ( సామి )
బెంచిలో పెట్టిండూ.. ఆ.. ఆ.. ఆ....
బెంచిలో పెట్టినాక సబ్జెక్టు మర్చిపోయినా ..ఆ రోజు మా హెచ్ . ఆర్ పిలిచిండూ
పోయి కలిసినా బాంచన్...


ఎమున్నదక్కో.. ఎమున్నదక్కో..


బూమ్ తగ్గింది అన్నాడు ( సామి )
కాస్ట్ కటింగు అన్నాడు ( సామి )
బెంచిలో ఉన్నా అని చెప్పి.. ఆ.. ఆ.. ఆ...
బెంచిలో ఉన్నా అని చెప్పి బయటకు తోసిండూ
కొంప కూల్చిండూ బాంచన్..


ఎమున్నదక్కో .. ఎమున్నదక్కో..




నాకు మెయిల్లో ఇంగ్లీషులో వచ్చిన పాటకు తెలుగు రూపం. (అదేంటో నాకు అన్నీ తెలుగులో ఉండాలనిపిస్తుంది)

Monday, 15 December 2008

తెలుగు బ్లాగర్ల దినోత్సవ వేడుకలు

వెబ్ దునియాలో హైదరాబాదు బ్లాగర్ల సమావేశ వివరాలు..

Sunday, 14 December 2008

తెలుగు బ్లాగర్ల మీట్ ... సూపర్ హిట్








ఈ రోజు హైదరాబాదులో జరిగిన తెలుగు బ్లాగుల దినోత్సవం చాలా ఉల్లాసంగా , ఉత్సాహంగా జరిగింది. దాదాపు పాతిక మంది సభ్యులు హాజరయ్యారు. ఆ సమావేశ చిత్రాలు కొన్ని . నివేదిక మాత్రం కొంచం ఎదురు చూడాల్సిందే..

Saturday, 13 December 2008

తడికో తడిక..

కొన్ని రోజుల క్రింద ఈటీవిలో ఈ పాట విన్నాను. భలే ఉండింది. కాని సినిమా పేరు తెలీదు. పాడింది ఎవరో తెలీదు. కాని పాటల ఖజానా పరుచూరి శ్రీనివాస్ గారి పుణ్యమా అని ఈ పాట దొరికింది. అది మీతో పంచుకుంటున్నాను. ఈ పాట అత్తా ఒకింటి కోడలే అనే చిత్రంలోనిది . పాడింది పిఠాపురం, స్వర్ణలత ...


AttaOkintiLodale_1...

మాయదారి కీచులాట మా మధ్య వచ్చింది
రాయబారం సేయవే తడికో తడిక

ఆడి వగలమారి మాటలకు ఒళ్ళంత మండుతుంది
రాయబారమెందుకే తడికో తడిక

నేను ముక్కుపుడక తెచ్చాను
ముంత గూట్లో పెట్టాను
పెట్కోమని, దాన్ని పెట్కోమని
బేగి పెట్కోమని సెప్పవే తడికో తడిక

ఆడి ముక్కుపుడక ముక్కలవా
చూడపోతె రాళ్ళు లేవు
తిప్పబోతె సిన్నమెత్తు సీలలేదు
ఆడి పోసుకోలు మాటలకు
మోసపోను నేనింక - పొమ్మని
సెప్పవే తడికో తడిక

నేను పట్టుచీర తెచ్చాను
పెట్టెలోన పెట్టాను
కట్కోమని, దాన్ని కట్కోమని
బేగి కట్కోమని సెప్పవే తడికో తడిక

ఆడి పట్టుచీరకంచులేదు
కట్టబోతె చెంగులేదు
తెచ్చినాడి తెలివి తెల్లారిపోను
ఆడి యిచ్చకాలమాటలకు ఇరిగింది నా మనసు
ఇడిసి పొమ్మనవే తడికో తడిక
నన్నిడిసి పొమ్మనవే తడికో తడిక

రమణి ముద్దుల గుమ్మ తాను
రాజీకి రాకుంటె
రాతిరి శివరాతిరే తడికో తడిక
ఈ ఏటి కేడు ఏకాసె తడికో తడిక

వంకాయ వండాను వరికూడు తినమని
సెప్పవే తడికో తడిక
ఆణ్ణి తినమని సెప్పవే తడికో తడిక

వగలాడి సేతుల్తో వడ్డనా సేయకుంటె
దిగదని, ముద్ద దిగదని సెప్పవే తడికో తడిక

ఆడి యిచ్చకాల మాటలకు ఇరిగింది నా మనసు
ఇడిసి పొమ్మనవే తడికో తడిక
నన్నిడిసి పొమ్మనవే తడికో తడిక

సిన్నారి పొమ్మంటే సన్నాసం పుచ్చుకుని
ఇంటికింక రానే తడికో తడిక
ఇది యిశదంగ సెప్పవే తడికో తడిక

సన్నాసం ఎందుకు
అన్నాయం సేయకు
నిన్నిడిసి వుండలేను మావోయి మావా, నే
నిన్నిడిసి వుండలేను మావోయి మావా!

ఇక్కడ కూడా వినొచ్చు.

Thursday, 11 December 2008

అంతర్జాతీయ తెలుగు బ్లాగర్ల సమావేశం

తెలుగు బ్లాగుల దినోత్సవం

ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల రెండవ ఆదివారం తెలుగు బ్లాగర్ల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే. తెలీదు అంటే ఇక్కడ చూడండి. కాని ఈ సమావేశాలు ప్రతి ఊర్లో ప్రతి దేశంలో నిర్వహించి, బ్లాగర్లు కలవడానికి వీలు కాదు కదా. అందుకే అంతర్జాతీయ బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేయడమైంది. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కూడలి కబుర్లకు వెళ్ళాలి అంటే. ఎప్పుడు అంటారా?? ఈ శనివారం సాయంత్రం ఆరుగంటలకు (భారత కాలమానం ప్రకారం) కూడలి చాట్ రూమ్ లో కలుద్దాం. దీనికోసం కొత్త స్థలం లో వేదిక ఏర్పాటు చేయబడింది. కంగారు పడకండి. మీపేరు తెలుగులో ఇవ్వడానికి వీలు కాదు . ఇంగ్లీషులో ఇవ్వండి. కాని లోపలికి వెళ్ళాకా ఇంచక్కా తెలుగులోనే మాట్లాడుకోవచ్చు. మరి ఆలస్యమెందుకు .. ఆ రోజుకు ఓ రెండు గంటలు ఖాళీ చేసుకోండి. అమెరికావాళ్ళకు కూడా వారాంతం కాబట్టి సమస్య ఉండదనుకుంటా . ఈ సమావేశాలకు బ్లాగర్లే కాక పాఠకులు కూడా ఆహ్వానితులే.

ప్రమదావనం స్నేహితులకు కూడా ఇదే నా ఆహ్వానం. మీరు కూడా ఈ సమావేశానికి వచ్చేయండి. దుమ్ము దులిపేద్దాం.(ఎవరిదో అది మాకే తెలుసు. మిగతావారు కంగారు పడొద్దని మనవి )

Wednesday, 10 December 2008

విజ్ఞాన సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

రోజు తెలుగు వికిపీడియా ఐదవ పుట్టినరోజు .
సందర్భంగా వికీ సభ్యులకు, నిర్వాహకులకు , వినియోగదారులకుశుభాకాంక్షలు.





తెలుగు వికీపీడియా డిసెంబరు 10, 2003లో మొదలయ్యింది. తెలుగులో వికీపీడియా స్థాపించడానికి నాగార్జున వెన్న మొదటి సారిగా విజ్ఞప్తి చేసారు.వికీపీడియాలో రెండు రకాల నిర్వాహకులు ఉంటారు, (నిర్వాహకులు మరియు అధికారులు). నిర్వాహకులు వ్యాసాలను తొలగించగలరు, వివాదాస్పద వ్యాసాలలో మార్పులు చేయకుండా నిరోధించగలరు, మరియూ ఇతర సభ్యులను మార్పులు చేయకుండా నిరోధించగలరు కూడా. అధికారులు నిర్వాహకులు చేయగలిగే అన్ని పనులు చేయగలిగి కొత్త నిర్వాహకులను తయారు చేయలరు. ఈ పేజిలో నిర్వాహకులు, మరియూ అధికారుల జాబితా ఉంటుంది.


ఇక తెవికి లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు ఇక్కడ చూడవచ్చు. మీరు కూడా అందులో పాలు పంచుకోవచ్చు, ఆసక్తి , ఉత్సాహం ఉంటే .

ఈ వికిపీడియాలో నిస్వార్ధంగా , కృషి చేస్తున్న ఎందఱో ఔత్సాహికులు ఉన్నారు. అందులో కొందరి వివరాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది.

భిక్షు - తెలుగు వికీపీడియాలో సభ్యత్వం తీసుకుని మొదటి సారిగా ఒక రచనను చేసిన సభ్యుడు.
సి.చంద్రకాంతరావు - క్రీడలు, రాజకీయాల వ్యాసాల పై చాలా కృషి చేసారు
చదువరి - తెలుగు వికీపీడియాకు ఒక విధి విధానాన్ని నిర్దేశించారు. ఎన్నో నిర్వాహణా వ్యాసాలను ఆంగ్ల వికీ నుండి తెలుగులోకి అనువదించారు.
చావా కిరణ్ - ప్రతీ తెలుగు గ్రామానికి ఒక వికీ పేజీ ఉండాలనే ఊహను మొదటి సారిగా పైకి తెచ్చారు.
జి.ఎస్. నవీన్ - తెలుగు సినిమాల ప్రాజెక్టుపై చాలా కృషి చేశారు.
ఎమ్ .ప్రదీప్ - మండలాల పేజీల సృష్టించడానికి, కొన్ని నిర్వహణా పనులు చేయడానికి, గణాంకాలను సేకరించడానికి బాట్లను తయారు చేసాను.
రాజశేఖర్ - తెలుగు వికీపీడియాలో జీవశాస్త్రానికి సంబహందించిన వ్యాసాలను బొలెడన్ని తయారు చేసారు.
బ్లాగేశ్వరుడు - ఆకతాయిగా మొదలు పెట్టి నిర్వాహకునిగా మారిన సభ్యుడు. తెలుగు వికీపీడియాలో కొన్ని వ్యాసాలకు తన గొంతుతో చదివి వినిపించారు. [ఉదా: వికీపీడియా:5_నిమిషాల్లో_వికీ]
త్రివిక్రమ్ - విశేష వ్యాసాల స్థాయి వ్యాసాను అందించిన సభ్యుడు. చందమామ వ్యాసం ఈయన తయారు చేసిన వ్యాసాలలో ఒక కలికితు రాయి వంటిది.
వీవెన్ - తెవికీ మొదటి పేజీని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. అలాగే వికీపీడియా సాఫ్టువేరును తెలుగులోకి అనువదించడంలో చురుకుగా పాల్గొన్నారు
నాగార్జున వెన్న - తెలుగు వికీ సృష్టికి బాటలు పరిచారు.
కాసుబాబు - తెలుగు సినిమాలతో మొదలు పెట్టి, ప్రతీ దేశానికీ తెవికీలో ఒక స్థానాన్ని కల్పించారు. ప్రతీ వారం ఒక కొత్త వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా ఎంపిక చేస్తుంటారు. అలాగే ఒక బొమ్మను కూడా ఈ వారం బొమ్మగా ఎంపిక చేస్తుంటారు.
రవిచంద్ర - మీకు తెలుసా శీర్షికను నిర్వహిస్తుంటాడు. ఎన్నో చిట్కాలను కూడా అందచేస్తుంటాడు.
విశ్వనాద్ .బి.కె. - ఎన్నో అందమైన బొమ్మలను తెవికీకి అందించాడు.
వైజాసత్య - తెవికీకి మొట్టమొదటి నిర్వాహకుడు, అధికారి. ప్రస్తుతం దశానిర్దేశాం చేస్తున్నారు. ఇతను కూడా తెవికీ నిర్వహనార్ధం కొన్ని బాట్లను నడుపుతుంటారు.
దేవ్ - ఎన్నో మూసలను తయారు చేసారు, ఒకప్పుడు నిర్వాహకుడు, ప్రస్తుతం స్వచ్చందంగా తన నిర్వాహకత్వాన్ని వదులుకున్నారు.
సాయి - వికీపీడియాను ఆదునీకరించడానికి చాలా కృషి చేసారు.
అహ్మద్ నిసార్ - ఇస్లాంకు సంభందించిన ఎన్నో వ్యాసాలను తెవికీకి అందించారు.
ఎం. రహమతుల్లా - చరిత్ర, కులాలు, ఇస్లాం ప్రముఖులకు సభందించిన పలు వ్యాసాలను తెవికీ అందించారు.
శివరామ ప్రసాద్ - హాం రేడీయో వ్యాసం తో మొదలు పెట్టి కొన్ని పుస్తకాల వ్యాసాలు తయారు చేస్తున్నారు.
కుమార్ రావ్ - చరిత్రకు సంభందించిన పలు వ్యాసాలపై పని చేస్తున్నారు.
బొజ్జా - ఫొటోగ్రఫీకి సంభందించిన వ్యాసాలను తయారు చేస్తున్నారు.
టి. సుజాత - ఎన్నో అక్షరదోశాలను సరి చేసారు. అమెరికాలోని ప్రముఖ పట్టణాలకు వ్యాసాలను తయారు చేస్తున్నారు.

ఇలా నేను పైన చెప్పకుండా మర్చిపోయిన వారు, అనామకంగా వ్యాసాలపై పని చేస్తున్న వారు ఎందరో ఉన్నారు.
ఇక రోజు రోజుకు పెరుగుతూ వస్తూ వికీపీడియాలోని అన్ని బాషలలో తెలుగు అగ్రస్థానంలో ఉంది అని గర్వంగా చెప్పుకొనవచ్చు. ఈ అభివృద్ది వికీ ణాంకాలలో చూడవచ్చు.

ఈ విజ్ఞాన సర్వస్వంలో పాలు పంచుకుంటున్న వారందరికీ అభినందనలు .. ముందు తరానికి ఒక అపూర్వ నిధిని అందిస్తున్న మీ అందరికి మనఃపూర్వక ధన్యవాదములు.

వికీకి సంబంధించిన వివరాలు అందించిన ప్రదీప్ కు థాంక్స్.

Tuesday, 9 December 2008

ఊరగాయలు

రకాలు



పుల్ల పచ్చి మామిడి">మామిడి ముక్కలతో చేసే ఆవకాయ" class="mw-redirect">ఆవకాయ, మాగాయ (ఇంకా రాయలేదు)">మాగాయ, లేక దాని కోరుతో చేసే మామిడికోరు ఊరగాయ; నిమ్మ">నిమ్మ, దబ్బ">దబ్బ, ఉసిరి">ఉసిరి, గోంగూర" class="mw-redirect">గోంగూర, చింతకాయ (ఇంకా రాయలేదు)">చింతకాయ, పండుమిరప (ఇంకా రాయలేదు)">పండుమిరప, ఉల్లి" class="mw-redirect">ఉల్లి, వెల్లుల్లి (ఇంకా రాయలేదు)">వెల్లుల్లి ఊరగాయలూ తరతరాల నుంచీ తెలుగు">తెలుగువాళ్ళు వాడుతున్నారు. ఈ మధ్య టమోటా (ఇంకా రాయలేదు)">టమోటా, దోస (ఇంకా రాయలేదు)">దోస, కారట్టు (ఇంకా రాయలేదు)">కారట్టు, కాలిఫ్లవరు (ఇంకా రాయలేదు)">కాలిఫ్లవరు ఊరగాయల్లాంటివి గూడా వాడడం మొదలుపెట్టారు.


చరిత్ర



పలురకాల ఊరగాయలు (ముఖ్యంగా ఆవకాయ, మాగాయ, గోంగూర ఊరగాయలు) తయారుచేసే విధానాన్ని తెలుగువారే మొదట కనిపెట్టారు. ఊరగాయలు వాడడం ప్రాచీనకాలంనుంచీ జరుగుతోందని చెప్పడానికీ చాలా నిదర్శనలున్నాయి. ఇప్పుడు ఊరగాయలవాడకం ఇండియా" class="mw-redirect">ఇండియా అంతటా వ్యాపించింది. ప్రాచీన తెలుగు సాహిత్యం" class="mw-redirect">తెలుగు సాహిత్యంలో ఊరగాయలను గురించి ప్రస్తావన ఉందికూడా.


గోంగూర గిడసబారినా ఊరగాయలో రుచి తగ్గదు



ప్రాచీన సాహిత్యంనుంచి [2] ఊరగాయలను గురించి ఒక మంచి పద్యం:


(సీసము">సీసము)-


మామిడికాయ (ఇంకా రాయలేదు)">మామిడికాయయు, మారేడుగాయ (ఇంకా రాయలేదు)">మారేడుగాయయు,
గొండముక్కిడికాయ (ఇంకా రాయలేదు)">గొండముక్కిడికాయ, కొమ్మికాయ (ఇంకా రాయలేదు)">కొమ్మికాయ
గరుగుకాయ (ఇంకా రాయలేదు)">గరుగుకాయయు, మొల్గుకాయ (ఇంకా రాయలేదు)">మొల్గుకాయ, యండుగుకాయ (ఇంకా రాయలేదు)">యండుగుకాయ,
లుసిరికెకాయలు, నుస్తెకాయ (ఇంకా రాయలేదు)">నుస్తెకాయ,

లేకరక్కాయయు, వాకల్వికాయయు,
జిఱినెల్లికాయయు, జిల్లకాయ,
కలబంద, గజనిమ్మకాయ, నార్దపుకాయ,
చిననిమ్మకాయయు, జీడికాయ,


(తేటగీతి">తేటగీతి)-


కుందెనపుకొమ్ము, మామెనకొమ్ము, బుడమ
కాయ, యల్లము, మిరియంపుకాయ, కలివి
కాయ, కంబాలు, కరివేపకాయ లాది
యైన యూరుగాయలు గల వతని యింట.


ఈ పద్యం నుంచి 18వ శతాబ్దంలో తెలుగువాళ్ళు ఎన్నో రకాల ఊరగాయలని చేసుకొని తినేవారని తెలుస్తుంది. ఈ పద్యం చదివినప్పుడల్లా నా నోరు ఊరుతుంది. దీనికి ముందే 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు" class="mw-redirect">శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద">ఆముక్తమాల్యద [3] గ్రంధంలో కూడా ఊరగాయలని గురించి ఉంది. ఆముక్తమాల్యద శ్రీకృష్ణుడి భక్తురాలైన గోదాదేవి కధ, చాలా విచిత్రమైనది. టూకీగా ఆ కధ చెప్తాను. తన జీవితాన్ని శ్రీకృష్ణుడికే అంకితం చెయ్యదలచుకొని ఈవిడ పెళ్ళి చేసుకోలేదు. ఈవిడనే మొదటి ఆండాళ్‌ అంటారు. ఈవిడ విష్ణుచిత్తుడి కూతురు. విష్ణుచిత్తుడు ప్రతిరోజూ ఒక కొత్త పూలదండ తయారుచేసి, శ్రీకృష్ణుడి విగ్రహానికి వెయ్యమని కూతురికి ఇచ్చేవాడు. గోదాదేవికి తన నాధుడైన శ్రీకృష్ణుడికి దండ మంచిదైతేనేగానీ వెయ్యడం ఇష్టంలేదు. అదిమంచిదో కాదో తెలుసుకోవడానికి దాన్ని ముందు తను ధరించి, మంచిదనిపించినతర్వాతే శ్రికృష్ణుడి విగ్రహానికి వేసేది. ఒకరోజు విష్ణుచిత్తుడు పూజ చేసే సమయంలో విగ్రహానికి వేసియున్న దండలో పొడుగాటి వెంట్రుకను చూస్తాడు. కూతురు దండను తను ముందు ధరించి తర్వాత దాన్ని విగ్రహాంమీద వేసిందని అతను అప్పుడు తెలుసుకుంటాడు. వాడిన పూలదండను దేవుడికి వెయ్యడం మహాపాపం అంటూ కూతుర్ని కోపగించి, ఆ వాడిన దండ తీసేసి, ఒకకొత్తదండ తయారుచేసి తనే వేస్తాడు. ఆ రాత్రి విష్ణుచిత్తుడికి కృష్ణుడు కలలో కనిపించి "నాకు ఇవ్వాళ నువ్వు వేసిన దండ ఏమీ బాగాలేదు. మళ్ళీ రేపటినుంచీ నాకు మీ అమ్మాయి ఇంతకుముందువేశే దండల్లాంటివే వెయ్యమను" అని హెచ్చరిస్తాడు.


ఆ కాలంలో విష్ణుచిత్తిడు తన అతిధుల భోజనానికి వివిధ ఋతువుల్లో ఏ ఏ వంటకాలు వడ్డన చేశేవాడో, ఈ వంటకాలు చెయ్యడానికి అతని భార్య ఎలాంటి వంటచెరుకు (కట్టెలు, కొబ్బరిచిప్పలు) వాడేదో, ఈ గ్రధంలో 3 పద్యాల్లో వర్ణిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ప్రతిపద్యం క్రిందా బ్రాకెట్టుల్లో దాని తాత్పర్యంకూడా ఇచ్చాను చదవండి.


చంపకమాల">చంపకమాల

చంపకమాల">

గగనము నీటిబుగ్గ కెనగా జడి వట్టిన నాళ్ళు భార్య క-
న్పొగ సొరకుండ నారికెడపుం బొఱియ ల్దగిలించి వండ న-
య్యగవల ముంచిపెట్టు గలమాన్నము, నొల్చిన ప్రప్పు, నాలు గే-
న్పొగవిన కూరలు, న్వడియముల్, వరుగు, ల్పెరుగు, న్ఘృతప్లుతిన్‌


(వరి అన్నము, ఒలిచిన పప్పు, నాలుగైదు కూరలు, వడియము, వరుగు, పెరుగు, నెయ్యి- ఇవి వర్షాకాలపు వంటకాలు.)


చంపకమాల">చంపకమాల

చంపకమాల">

తెలినులి వెచ్చ యోగిరము, దియ్యని చారులు, దిమ్మనంబులున్‌,
బలుచని యంబళు, ల్చెఱకుపా, లెడనీళ్ళు, రసావళు, ల్ఫలం-
బులును, సుగంధి శీతజలము, ల్వడపిందెలు, నీరుజల్లయు,
న్వెలయగ బెట్టు భోజనము వేసవి జందనచర్చ మున్నుగన్‌

(వెచ్చని అన్నము, చారు, తీయని చారు, అంబలి, చెఱకు పాలు, కొబ్బరినీళ్ళు, ఇతర రసములు, పండ్లు, చల్లని నీళ్ళు, వడమామిడిపిందెలు, నీరుమజ్జిగ- ఇవి వేసవికాలపు వంటకాలు.)


మత్తేభవిక్రీడితము (ఇంకా రాయలేదు)">మత్తేభవిక్రీడితము

మత్తేభవిక్రీడితము (ఇంకా రాయలేదు)">

పునుగుందావి నవోదనంబు, మిరియంపుం బొళ్ళతో జట్టి చు-
య్యను నాదాఱనికూరగుంపు ముకుమందై, యేర్చునావం, జిగు-
ర్కొను పచ్చళ్ళును, బాయసాన్నములు, నూరుంగాయలున్‌, జే సుఱు-
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారంబిడు న్సీతునన్‌


(పునుగు వాసనగల అన్నము, మిరియాల పొడులు, ఘమఘమలాడు వేడి కూరలు, ఆవ, చిగురు పచ్చళ్ళు, పాయసము, ఊరుగాయలు, కరిగిన నేయి, పాలు- ఇవి శీతాకాలపు వంటకాలు.) ంఇరపమొక్కలు భారతదేశానికి అమెరికాఖండం నుంచి వఛ్ఛాయి. కారం రుచికి మిరియాలను వాడినట్లు చెప్పాడు, ఈ గ్రధం వ్రాశిన కాలానికి మిరపమొక్కలు ఇంకా భారతదేశానికి రాలేదేమో.


ఆముక్తమాల్యదకు ముందే 14వ శతాబ్దంలో రచింపబడిన క్రీడాభిరామములో [4] కూడా ఊరగాయలను గురించి చెప్పబడిన ఒకపద్యం తాత్పర్యంతో ఇస్తున్నాను చదవండి.


ఉత్పలమాల">ఉత్పలమాల

ఉత్పలమాల">

కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్‌,
గుప్పెడు పంచదారయును, గ్రొత్తగ గాచిన యాల నే, పెస-
ర్పప్పును, గొమ్ము నల్లనటి పండ్లును, నాలుగు నైదు నంజులున్‌,
లప్పలతోడ గ్రొంబెరుగు, లక్ష్మణవజ్ఝల యింట రూకకున్‌



(మంచి సన్నన్నము, గోధుమపిండి వంట (రొట్టె), పంచదార, ఆవు నేయి, పెసరపప్పు, అరటి పండ్లు, నాల్గైదు ఊరుగాయలు, పెరుగు ఇవన్నియు ఒక రూకకు లభించును.) 14వ శతాబ్దములో కాకతీయుల కాలములో.


పద్యాలలో పేర్కొనబడిన కాయలకు ప్రస్థుతం వాడుకలో ఉన్న నామాలు పై సెక్షను పద్యాలలో పేర్కొనబడిన కాయలు కాశే కొన్ని మొక్కలకు వాడుకలో ఉన్న పేర్లు కాలగమనంతో మారాయి. వాటి ప్రస్తుత నామాలూ, వాటినిగురించి కొన్ని వివరాలు:


  • మామిడి: తెలుగులో ఇంకా ఇదే పేరు వాడుకలో ఉంది. ``అంబళం, ``ఆమడమామి , ఆమ్రం అనేపేర్లుగూడా వివిధప్రాంతాల్లో వాడతారు. సంస్కృతంలో ``ఆమ్రా' అంటారు. ఇంగ్లీషులో Mango అంటారు. మామిడి చెట్టుకి బొటానికల్‌ పేరు Mangifera indica (Anacardiaceae or Mango family). ప్రస్థుతం ప్రపంచంలోని ఉష్నమండలాలన్నిటిలోనూ విరివిగా సాగు చెయ్యబడుతోంది. అన్నికాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సుళువుగా మార్కెటులో లభిస్తుంది.

  • మారేడు: తెలుగులో ఇప్పటికీ ఇదేపేరు వాడుకలో ఉంది కానీ, ఈ కాయలు ఇప్పుడు మార్కెటులో ఎక్కువగా కనపడవు. మారేడు చెట్టు నిమ్మజాతికి చెందుతుంది. సంస్కృతంలో దీని పేరు ``భిల్వా', హిందీలో ``బేల్‌. దీని బొటానికల్‌ పేరు Aegle marmelos (Rutaceae family or citrus family).

  • ముక్కిడి: తెలుగులో వివిధ ప్రాతాలలో ``కొండముక్కిడి , ``మాదలింగ , ``మూకొడి , ``మక్కం అనీ పిలుస్తారు. ముక్కిడి మొక్క గన్నేరు, మల్లె జాతికి చెందినది. బొటానికల్‌ పేరు Schrebera swietenoides (Oleaceae family). మార్కెటులో చూడడం అరుదు, కొన్ని చోట్లే లభిస్తుంది.

  • కొమ్మకాయ: ఇప్పుడు మార్కెటులో ఈ కాయను చూడడం చాలా అరుదు.

  • గురుగు లెక గురుగి: గురుగు మొక్క తోటకూర జాతికి చెందుతుంది. పూలతోటల్లో పెంచే ``కోడిజుత్తుతోటకూరా' దీనికి దగ్గర బంధువు. సంస్కృతంలో దీన్ని ``వితున్నా' అంటారు. దీని బొటానికల్‌ పేరు Celosia argentea (Amaranthaceae family). ఇప్పుడు ఎక్కువ వాడకంలో లేదు. సాధారణంగా అడవి, బంజరు ప్రాంతాల్లో కన్పించే గురుగింజ లేక గురువింద (Arbus precatOrius)కీ దీనికి సంబంధం లేదు.

  • మొలుగుకాయ: దిన్ని ``మొలకకాయ , ``ముళ్ళవమ్కాయ అనికూడా పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేష లో సహజంగా పెరిగే మొక్క. వంగమొక్కకి దగ్గర బంధువు, కానీ ఇప్పుడు విరివిగా సాగుచెయ్యబడే వంగమొక్కలు ఇండియాకు ఇతరదేశాలనుంచి తీసుకువచ్చినవి. ఇప్పుడు సాగుచేశే వంకాయ వచ్చాక మొలుగుకాయకు జనాదరణ బాగా తగ్గిపోయింది. ఇప్పటికీ బంజరుప్రాంతాలలో ఈ మొక్క పెరుగుతూ ఉండడం చూడవచ్చు. వాటికి బాగానే కాయలు కాస్తాయి కానీ, వాటిని ఎవ్వరూ తీసుకోవడంలేదు. దీని బొటానికల్‌ పేరు Solanum hirsutum (Solanaceae family (potato family)).

  • ఎడుగు కాయ: ఈ కాయనుగురించి వివరాలు ఏమీ తెలియలేదు. బహుశా కవి ఈ పదాన్ని ``ఎండబెత్తిన ధాన్యపు గింజలూ' అని చెప్పడానికి వాడాడేమో.

  • ఉసిరిక్కాయ: దీన్నే ఇప్పుడు ``రాచ ఉసిరిక్కాయ అంటారు. ఉసిరి జాతిలో చాలా మొక్కలు ఉన్నాయి కానీ, ఇప్పుడు రెందు రకాల ఉసిరి మొక్కలు చాలాచోట్ల కనపడ్తాయి. ఒకటి రాచ ఉసిరి చెట్టు. దీని కాయలు నిమ్మకాయ సైజులో చాలా గట్టిగా ఉంటాయి. ఊరగాయకి ఎక్కువగా వాడేది ఈ రాచ ఉసిరిక్కాయలనే. ఈ చెట్టుకి బొటానికల్‌ పెరు Emblica officinalis (Euphorbiaceae family). దీన్నే సంస్కృతంలోనూ, హిందీలోనూ ఆదిఫల అనీ, ఆమ్ల అనీ పిలుస్తారు. ఈ కాయలు సీజన్లో మార్కెటులో విరివిగా లభిస్తాయి. ఎండబెట్టిన కాయలపిండి కూడా పాకెట్టుల్లో అన్నికాలాల్లోనూ మార్కెటులో దొరుకుతుంది. ఈ రాచ ఉసిరిక్కాయ తింటే డయాబెటీసు నయమవుతుందనీ, ఇంకా ఎన్నోరకాలుగా ఆరోగ్యం మెరుగవుతుందనీ ప్రతీతి. రాచ ఉసిరి ఊరగాయకూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. కానీ సాధారణంగా దంట్లో చాలా ఉప్పు వేస్తారు. తక్కువ ఉప్పు వాడి ఇంట్లో చేసుకున్న రాచ ఉసిరి ఊరగాయ ఒంటికి చాలా మంచిది. ఉసిరిజాతిలో ఎక్కువగా కనపడే ఇంకొక మొక్క పొదలా పెరుగుతుంది. దాన్ని సాధారణంగా ``ఉసిరి పొద అనే పిలుస్తారు. ఆంధ్రాలో చాలా దొడ్లల్లో ఇది కనపడుతుంది. ఇది చాలా విరివిగా కాస్తుంది. కాయలు రాచ ఉసిరికన్నా చిన్నవి, మెత్తగా ఉంటాయి. ఈ కాయ, తీపి, పులుపు రుచులతో తినడానికి బాగుంటుంది. కొందరు వీటితో పప్పు చేస్తారు. ఆ పప్పు చాలా బావుంటుంది.

  • చిరినెల్లికాయ: పద్యలలో చెప్పబడిన ఈ చిరినెల్లి మొక్క కూడా ఉసిరి జాతికి చెందిన ఒక పొద. దీన్ని వివిధ ప్రాతాలలో ``చిన్న ఉసిరి , ``నేల ఉసిరి , ``ఉచ్చి ఉసిరిక , ``పులిసరు , ``ఎత్త ఉసిరిక , అనికూడా పిలుస్తారు. దీని బొటానికల్‌ పెరు Phyllanthus emblica (Euphorbiaceae family).

  • ఉస్తెకాయ: ఉస్తెమొక్క ఆంధ్రప్రదేష్లో సహజంగా పెరుతుతుంది. ఇది వంగజాతికి చెందిన మొక్క (టమోటా, బంగాళదుంప, పొగాకుకూడా ఈ జాతి లోనివే). ఇంగ్లీషులో Gigantic Swallow Wort అంటారు. బొటానికల్‌ పెరు Solanum trilobatum. కొన్నిప్రాతాల్లో అప్పుడప్పుడూ మార్కెటులో లభిస్తుంది.

  • కరక్కాయ: కరక మొక్క బాదం జాతికి చెందిన చెట్టు. ఆయుర్వేదవైద్యంలో కరక్కాయలను దగ్గుమందులో వాడతారు. ఈ చెట్టును సంస్కృతంలో ``హరితకీ' అంటారు. బొటనికల్‌ పేరు Terminelia chebula (Combretaceae family), Chebulic myroblan అనీ, Terminelia indica, Terminelia arjuna అనికూడా అంటారు. మార్కెటులో అరుదుగా లభిస్తుంది.

  • వాకల్వికాయ: దీనినే ``వాక్కాయ అనీ, ``వాకపళ్ళు అనీ కూడా పిలుస్తారు. సీజనులో మార్కెటులో లభిస్తుంది. కాయ పుల్లగా ఉంటుంది. దీంతో పచ్చడి, పులిహోర కూడా చేస్తారు. వాక్కాయ పులుపు మూలాన, దానితో చేశిన పులిహోర చాలా రుచిగా ఉంటుంది. వాక మొక్కకి బొటానికల్‌ పెరు Caris carandas లెక Carissa spirarum (Apocyanaceae or Milkwort family).

  • జిల్లెకాయ: దీనికున్నూ, అన్నిచోట్లా కనపడే జిల్లేడుకున్నూ ఏమీ సంబంధం లేదు. జిల్లెమొక్క ఒక చెట్టు, దాన్నే ``చిల్లచెట్టు , లెక ``ఇందువు చెట్టు అని పిలుస్తారు. దీని బొటానికల్‌ పేరు Strychnos potatorum (Loganiaceae family). ఇప్పుడు ఈ కాయలు మార్కెటులో దొరకడం అరుదు.

  • కలబంద: ఇది ఎడారి ప్రాంతాల్లో పెరిగే చిన్నమొక్క. ఆంధ్రప్రదేష్లో ఇంటితోటల్లో తరచూ కన్పడుతుంది. ఈ మొక్కకి చాలా వెరైటీలు ఉన్నాయి: ``రాకాసి కలబంద , ``పెద్ద కలబంద , ``చిన్న కలబంద , ``ఈనెలకలబంద , ``ఎరికతాళి అనేవి తరచుగా కనపడే వెరైటీలు. ఇంగ్లీషులో ఈ మొక్కను Aloe vera (Liliaceae (i.e., lilly) family) అంటారు. ఈ మొక్క ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. ఆకుమధ్య ఆకుపచ్చరంగు జెల్‌ ఉంటుంది. దానిని మందుల్లోనూ, ఒంటికి రాసుకునే లోషన్లు చెయ్యడానికీ వాడతారు. కానీ ఇప్పుడు దీన్ని ఊరగాయల్లోనూ, ఇతరవంటకాల్లోనూ వాడడం నెను చూడలేదు.

  • గజనిమ్మకాయ: ఇది ఒక రకం నిమ్మకాయ, కొన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. హిందీలో దీన్ని ``మీటానింబూ అంటారు. బొటానికల్‌ పెరు Citrus limettioides (Citrus family, Rutacease).

  • నార్దపుకాయ: దీన్నే ``నారదబ్బకాయ , ``నారదబ్బ , ``దబ్బ అని కూడా పిలుస్తారు. బాగా దళసరి తొక్కతో నారింజపండుకీ, పంపరమనసకీ మధ్య సైజులో ఉంటుంది. నిమ్మజాతి కాయల ఊరగాయలన్నిటిలోకీ దబ్బకాయ ఊరగాయ అతిరుచికరమైనది. బొటానికల్‌ పేరు Citrus medica (Citrus family).

  • చిననిమ్మకయ: చిన్నకాయల నిమ్మజాతి.

  • జీడికాయ: ``జీడి అని, ``జీడిమామిడి అనీకూడా పిలుస్తారు. జీడి పప్పుకి ప్రపంచమంతటా గొప్ప డిమాండు ఉంది గనుక, జీడిమామిడి తోటలు పెంచడం ఇప్పుడు చాలా పెద్ద బిజినెసు అయ్యింది. ఇంగ్లీషులో దీన్ని cashew nut అంటారు. దీని బొటానికల్‌ పేరు Anacardium occidentale (Anacardiaceae family). జీడిమొక్క మామిడిజాతికి చెందిన చెట్టు.

  • బుడమకాయ: ఇది ఒకరకం దోసకాయ. వివిధ ప్రాంతాల్లో దీనిని ``కూతురుబుడమ , ``కోడిబుడమ , అనికూడా పిలుస్తారు. బొటానికల్‌ పేరు Bryonica callosa or Cucumis utilissinus (Cucurbitaceae family).

  • అల్లం: అల్లం ఇప్పటికీ మార్కెటులో విరివిగా లభిస్తోంది. దీన్ని అన్నిరకాల వంటకాల్లోనూ వాడతారు. ``మామిడల్లం , వగైరా పలురకాల అల్లాలు దొరుకుతాయి. ఇంగ్లీషులో దీన్ని Zinger అంటారు.

  • కరివేపకాయ: కరివేప ఆకు చాలా ప్రసిద్ధి చెందింది కదా. ఇండియన్‌ వంటల విశిష్ట లక్షణం ``కర్రీ వాడకం అని చెప్పుకుంటారు కదా, ఆ ``కర్రీ అనే పదం ``కరివేపా' ఆకు నుంచి వచ్చింది. కరివేప ఆకుని ఇంగ్లీషులో curry-leaf అని పిలుస్తారు. ఇప్పుడు కరివేప చెట్టు నుంచి వంటల్లో ముఖ్యంగా వాడేది ఆకు మాత్రమే. కరివేపపంద్లుకూడా చాలా రుచిగా ఉంటాయిగానీ, వాటిని గురించి ప్రస్థుతం ఎవ్వరూ పట్టించుకోరు. ఈ పద్యాలు వ్రాశిన కాలంలో కరివేపకాయల్ని కూడా ఊరగాయల్లో వాడేవారని తెలుస్తుంది.

  • మిరియపుకాయ: బహుశా మిరియాలో, లేక ఒకరకం మిరపకాయలో అయిఉండవచ్చు.

  • మిగిలినవి, కుందెనపుకొమ్మ, మామెనకొమ్మ, కలివికాయ, కంబాలు గురించి వివరాలు ఇంకా లభించలేదు.

చేసే విధానం

మిగతా వంటకాలకూ, ఊరగాయలకూ ముఖ్య భేదం ఏమిటంటే ఊరగాయలు చెయ్యడానికి వేడి అవసరం లేదు. ఊరగాయ చేసే పద్ధతి ఇలా ఉంటుంది: ఊరగాయగా చెయ్యబోతున్న కాయలను బాగా శుభ్రంచేసి, తడి ఆరాక వాటిని ముక్కలుగా కొయ్యాలి (ముక్కల ఊరగాయ చెయ్యడానికి), లేక కోరుగా తురమాలి (కోరు ఊరగాయ చెయ్యడానికి). అప్పుడు వాటిలో ఉప్పు">ఉప్పు, పసుపు">పసుపు, కారం (ఇంకా రాయలేదు)">కారం, ఆవ పిండి (ఇంకా రాయలేదు)">ఆవ పిండి, జీలకర్ర పిండి (ఇంకా రాయలేదు)">జీలకర్ర పిండి, ఆవాలు">ఆవాలు, వెల్లుల్లి (ఇంకా రాయలేదు)">వెల్లుల్లి, వేరుశనగ పప్పు (ఇంకా రాయలేదు)">వేరుశనగ పప్పు, నువ్వుల నూనె (ఇంకా రాయలేదు)">నువ్వుల నూనె, బెల్లం">బెల్లం మొదలైన దినుసులు సరైన మోతాదులలో బాగా కలిపి, మిశ్రమాన్ని ఒక జాడీలో ఉంచాలి. కొన్నిరోజులు ఊరి, కాయముక్కలు మెత్తబడ్డాక అది ఊరగాయ అవుతుంది. కలిపిన దినుసుల సమూహంలో కాయ ఊరడంవల్ల తయారయింది కనుక దానికి "ఊరగాయ" అని పేరు పెట్టారు.


తక్కువ ఉప్పుతో ఊరగాయలు చెయ్యడం



నిలవ ఉంచినప్పుడు బూజు పట్టకుండా ఉండడానికి కాబోలు ఊరగాయల్లో ఉప్పు మరీ ఎక్కువ వేసే వారు పూర్వ కాలంలో. కానీ ఉప్పు ఎక్కువ తింటే బ్లడ్‌ ప్రెజరు (ఇంకా రాయలేదు)">బ్లడ్‌ ప్రెజరు పెరుగుతుందని తెలుసుకున్నాం గదా ఇప్పుడు. అందుకనే తక్కువ ఉప్పుతో ఊరగాయలు చేసే విధానాలు అమలులోకి వచ్చాయి. కానీ ఇలా చేసిన ఊరగాయలు ఎక్కువ కాలం నిలువజేయాలంటే వాటిని రెఫ్రిజిరేటర్లో ఉంచాలి.


పచ్చళ్ళు, ఊరగాయలు



సాధారణంగా మనం ఇడ్లీ">ఇడ్లీ, దోశ (ఇంకా రాయలేదు)">దోశల్లాంటివి తినేటప్పుడు నంచుకోవడానికి "పచ్చళ్ళు" (కొబ్బరి పచ్చడి, దోసపచ్చడి, బీరతొక్కు పచ్చడి వగైరా) వాడతాం. ఈ పచ్చళ్ళు నిలువ ఉండవు, వాటిని సాధారణంగా చేసిన రోజునే వాడేస్తారు (ముఖ్యంగా రెఫ్రిజిరేటర్లు లేని పూర్వ కాలంలో). ఊరగాయలు అలా కాకుండా చాలారోజులు నిలువ ఉంటాయి. ఇదీ పచ్చళ్ళకూ, ఊరగాయలకూ ముఖ్య భేదం. కానీ ఈ మధ్య ఊరగాయలను కూడా పచ్చళ్ళని పిలవడం పరిపాటి అయిపోయింది.


పికిలు అనే పేరు ఎలా వచ్చింది?



ఇంగ్లీషు వాళ్ళు భారత దేశం మొదట వచ్చినప్పుడు మన ఊరగాయలను రుచి చూశారు. ఇలాంటి వంటకాన్ని ఎప్పుడూ చూడకపోవడం చేత, వాటిని ఇంగ్లీషులో ఏమని పిలవాలో వారికి తెలియలేదు అప్పుడు. కానీ వారి పికిల్సులాగా పులుపుగా ఉండడంచేత ఊరగాయలను "పికిల్సు" అని పిలవడం మొదలుబెట్టారు. ఇండియాలో ఇంగ్లీషు వాడకం పెరిగిన కొద్దీ ఊరగాయలను పికిల్సు అని చెప్పుకోవడం వాడుకలోకి వచ్చింది.


ఊరగాయలకూ, మిగతావాళ్ళ పికిల్సుకూ తేడా



ఇండియన్లు చేసే ఊరగాయలకూ, మిగతా దేశస్థులు చేసే పికిల్సు అనే వంటకాలకూ చాలా భేదాలున్నాయి. అమెరికా" class="mw-redirect">అమెరికా, యూరప్‌ (ఇంకా రాయలేదు)">యూరప్‌ల్లో చేసే కుకుంబర్‌ పికిలు, కుకుంబర్‌ని వినెగర్‌లో నానబెట్టడంతో తయారవుతుంది. జర్మన్‌ (ఇంకా రాయలేదు)">జర్మన్‌లు చేశే సవర్‌క్రౌట్‌ తురిమిన కాబేజిని వినగర్లో నానబెట్టడంతో తయారవుతుంది. అలానే కొరియన్‌ (ఇంకా రాయలేదు)">కొరియన్‌లు చేసే కిమ్చి కూడా, తురిమిన కాబేజి, చేపలూ, మాంసం ముక్కలూ వినగర్లో నానబెట్టడంతో తయారవుతుంది. వీళ్ళ పికిల్సన్నిటిలోనూ ముఖ్యంగా తగిలే రుచి పులుపు మాత్రమే. మన ఊరగాయల్లో ఆవ పిండీ, కారం, పసుపు, నువ్వుల నూనె (కొన్నిట్లో కొద్దిగా బెల్లం) మొదలైన దినిసులు ఉండడం ఒక గొప్ప విశేషం. దీనివల్ల మన ఊరగాయల్లో అన్నిరుచులూ తగుల్తాయి.



మార్కెటులో ఊరగాయల లభింపు



ఇప్పుడు చిన్నిచిన్ని పల్లుటురుల్లో తప్పించి చాలామంది ఊరగాయల్ని స్వయంగా చేసుకునే బదులు, తయారుచేయ్యబడ్డ ఊరగాయల్ని మార్కెటులో కొనుక్కుంటున్నారు. దీనివల్ల ఊరగాయల తయారీ, అమ్మకం పెద్ద బిజినెస్‌ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఊరగాయలు చేశే పెద్దపెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఊరగాయల్ని సీసాల్లోనూ, ప్లాస్టిక్‌ పౌచిల్లోనూ పాక్‌ చేశి ప్రపంచమంతటా సరఫరా చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి చాలామంది ఉప్పు, నూనె వాడకం తగ్గించాలనుకుంటున్నారుకదా ఈ రోజుల్లో. ఈ రెండు దినుసుల్నీ తక్కువగా వాది ఊరగాయల్ని చెయ్యడం మొదలుపెట్టితే ఈ కంపెనీలు వారి బిజినెస్‌ వాల్యూముని ఇంకా బాగా పెంచుకోవచ్చు.


ఊరగాయల్ని గురించిన మూడనమ్మకాలు



కొంతమంది, ఊరగాయల్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందనో, లేక దాంట్లోని కారంవల్ల తిన్న మర్నాడు టాయిలెట్‌ వాడినప్పుడు కడుపునొప్పి లేక మంట కల్గుతుందనో అపోహ పడ్తారు. నిజానికి, ఇలా భయపడనవసరం లేదు. అన్ని ఆహారపదార్ధాలనీ తగుమోతాదులలోనే తినాలన్నది మాత్రం సత్యం. ఏ ఆహారపదార్ధమైనాసరే, మోతాదుమించితింటే శరీరానికి అపాయం కల్గవచ్చు. ఉత్తి మంచినీళ్ళైనా సరే తక్కువకాలంలో విపరీతంగా తాగేస్తే శరీరనికి చాలా హాని కల్గుతుంది. ఊరగాయలో ఉప్పు ఎక్కువౌంటే, దాన్ని అతిగా తినడంవల్ల బ్లద్‌ప్రెజరు పెరగవచ్చు. కానీ కారంగానీ, కారంఉన్న ఊరగాయలుగానీ మోతాదులో రోజూ తినడంవల్ల ఆరోగ్యం చెడిపోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. నిజానికి దానివల్ల మెరుగవుతుందికూడా. రోజూ మోతాదులో ఊరగాయలు తినడం జీర్ణశక్తిని పెంచుతుందనీ, మనిషిలోని చలాకీతనాన్నీ, సరదాతనాన్నీ పెంచుతుందనీ పరిశొధనలవల్ల తెలిశింది. ఇంకొకరి మాటలు నమ్మడమెమ్దుకు. మీకు ఊరగాయలు తినే అలవాటు లేకపోతే, నచ్చిన ఊరగాయల్ని కొద్దిగా ప్రతిరోజూ తినడం మొదలుబెట్టి చూడండి. కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది వాటివల్ల మీ జీవితం మెరుగవుతోందని.


ఊరగాయలూ, ఆధ్యాత్మిక చింతనా



ఉప్పు, కారం వగైరా రుచులతో ఉండే ఊరగాయలు మనిషిలో చలాకీతనం, చురుకుదనం, హుషారుతనం పెంపొందిస్తాయని చెప్పాను కదా. కనుక ఊరగాయలు తినడంవల్ల మోహ, కామోద్రేకాలూ; లైంగికవాంచలూ పెరుగుతాయని అనుకోవడం సహజం. 1979-లో రిలీజు అయిన ``ఇంటింటి రామాయణం సినిమా నుంచి ఈ ఆలోచనని సమర్ధించే ఒక పాట చెప్తాను. సినిమాలో ఈ పాటను, ప్రేమించుకొని పెళ్ళికని ఉవ్విళ్ళూరుతున్న ఒక జంట పాడతారు:


ఉప్పూ కారం తినకతప్పదూ
తప్పో ఒప్పో నడక తప్పదూ
కిందా మీదా పడక తప్పదూ
రేపో మాపో మనకు తప్పదూ
తప్పుకాదులే మల్లులు గుప్పు గుప్పు మంటూంటే
ఆ, తప్పులేదులే మనసులు ఎప్పుడెప్పుడంటూంటే
పె ళ్ళెప్పుడెప్పుడంటూంటే
నీరెండ కోకచుట్టీ, నీలిమబ్బు కాటుకెట్టీ
కొండల్లో వాగువల్లే పూలదారి వస్తాఉంటే
నీలో అందం అలలై, నాలో పండిన కలవై
వగా దిగా నువ్‌ రావాలా
ఎగా దిగా నే చూడాలా
కారంగా కన్నుకొట్టీ
గోరంగా కొంగుపట్టీ
కొమ్మల్లో కోయిలల్లే కొత్తమురళీ వాయిస్తుంటే
నీలో వయసే యమునై
నాలో మనసే మధురై
పదే పదే నువ్‌ పాడాలా
పదాలలో నేనుండాలా
పరువాల పంచెకట్టీ
పదునైన పోజుబెట్టీ
హ హహ హాహహా హెహేహెహ్హే
పైరుగాలి వానలాగా
ఆరుబయట వాటేస్తుంటే
పెదవినికోరే పెదవీ
చేతుల కలిపే చెయ్యీ
వయస్సులే జతకావాలా
మనస్సులే శ్రుతికావాలా
చీకటినిండా దీపమెట్టీ
సిగనిండా పూలుబెట్టీ
వగ్గేశే సిగ్గు విడచీ
వగ్గులోకి నువ్వొస్తుంటే
కంటికి నిదురే కరువై
ఒంతరి బ్రదుకే బరువై
ముడీ ముడీ పడికావాలా
వడీ వడీ ఒకతవ్వాలా
లాల లాలలా లా లా లా.


పాటలో, ఉప్పు, కారం తినడం మూలాన శరీరవాంఛలు పెరుగుతాయనే భావన గ్రహించండి. ఊరగాయలు చెయ్యడానికి వాడే మిగతా స్పైసుదినిసులకు గూడా ఈ లక్షణం ఉన్నట్లు ప్రతీతి. దీంట్లో ఆవగింజంత సత్యం లేకపోలేదు. అందుకనే కాబోలు, దైవభక్తీ, భగవచ్చింతనా, ఆద్యాత్మికచింతనా అలవరచుకోమని బోధించే స్వాములు సాధారణంగా ఊరగాయలు తినవద్దని చెప్తుంటారు. నా సలహా మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేశే ఉప్పు, కారం రుచులుగల ఊరగాయల్లాంటి పదార్ధాలని విసర్జించమనడం కన్నా, చిన్నతనం లోనే పిల్లలందరికీ; ప్రాపంచిక, ఐహిక, శరీర వాంఛలను అదుపులో పెట్టుకోగల్గే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యమని నేను చెప్తాను. ఇలాంటి క్రమశిక్షణ నేర్చుకున్నవారు మోతాదులో ఊరగాయలూ, స్పైసులూ తింటే వారి జీవితం చాలా మెరుగవుతుంది.


రిఫరెన్సులు



[1] కట్టా గోపాలకృష్ణ మూర్తి, Department of Industrial and Operations Engineering, University of Michigan, Ann Arbor. కొన్నితెలుగుదనాలతో నా అనుభవాలు, http://telugudiaspora.com/telugu_publications_article14.htm, http://www.tlca.com/adults/telugudanam.html


[2] అయ్యలరాజు నారాయణామాత్యుడు, హంసవింశతి, 4.135, శృంగార కావ్య గ్రంథ మండలి ప్రబంధ పరంపర - 4 originally published in the later half of eighteenth century, re-published by శృంగార కావ్య గ్రంథ మండలి, మచిలీపట్టణం, 1938.


[3] శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద, 1, 79-82, originally written in 16th century, పునర్ముద్రణ, తెలుగువిశ్వవిద్యాలయము, 1995.


[4] వినుకొండ వల్లభరాయడు ,క్రీడాభిరామము, Originally written in 14th century, పునర్ముద్రణ, ఎమెస్కో బుక్స్‌, 166, 1997.

ప్రాచీనగ్రంథాల్లో ఊరగాయలను గురించి చెప్పబడిన విశేషాలు సేకరించిన వారు జెజ్జాల కృష్ణ మోహన రావు. ఈ గ్రంధాల్లో పేర్కొనబడిన కాయల ప్రస్తుత నామాలని గురించిన వివరాలు రిసెర్చిచేసి సేకరించిన వారు : (పాలన) పారనంది లక్ష్మీ నరసింహం.

Friday, 5 December 2008

బాల గాన గందర్వులు



బోసి నవ్వుల పాపాయిలు, పశువులు , పాములు ఇలా అన్నీ పాటకు పరవశిస్తాయంటారు. పెద్ద వాళ్లు, కాస్త ఎదిగిన పిల్లలు తమ మధురమైన గొంతులో పాటలు పాడుతుంటే ఆనందంగానే ఉంటుంది. అది వారు కష్టపడి సాధిస్తారు. కాని ముద్దు ముద్దు మాటలతో మనల్ని అలరించే పిల్లలు అద్భుతమైన పాటలు అలవోకగా పాడేస్తుంటే అలా కళ్లు , చెవులు తెరుచుకుని వినాలనిపిస్తుంది. అదే అద్భుతం ఈ సారేగమప పోటీలో జరుగుతుంది.. అసలు ఈ పిల్లలు నిజంగా పిల్లలేనా లేక గాన గంధర్వులు దిగి వచ్చి పాడుతున్నారా అని అనిపించక మానదు. ఒక్కోసారి న్యాయనిర్ణేతలు కూడా అలా ఆశ్చర్యచకితులై పోతారు. ౨౦-౩౦ మంది పిల్లలతో మొదలయ్యే పోటీ చివరి పదిమంది నుండి ఉత్కంఠ భరితంగా ఉంటుంది. నేనైతే ఆ సమయంలో టీవీ రిమోట్ ఎవ్వరికి ఇవ్వను. చానెల్ మార్చాను ఎంత మొత్తుకున్నా సరే. ఒకసారి షణ్ముఖ ప్రియ పాట వింటూ అలా నిలబడిపోయి అన్నం మాడగొట్టాను.





దామిని, గణేష్, యశస్వి, శ్రీలలిత, సాహితి, శ్రావ్య, నిఖిల్ . షణ్ముఖ ప్రియ ఇలా కొందరు చిన్నారులైతే ఎంత అద్భుతంగా పాడుతున్నారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకటి రెండు రోజులలోనే నేర్చేసుకుంటారంట ఎ పాటైనా.. చివరి అంకంలో కష్టమైన పాటలు కూడా ఎంతో సులువుగా పాడేస్తుంటే జడ్జీలకు కూడా వాళ్ళను ఏమని అభినందించాలో మాటలు రావు. వీళ్ళంతా పాడుతుంటే వినడం కూడా అదృష్టం అనిపిస్తుంది. ఆ బంగారు కొండలను కన్నా తల్లితండ్రులు ఎంత ధన్యులో కదా అనిపిస్తుంది. ఇందులో ఒక్కరు కూడా బలవంతంగా కాని ఒత్తిడితో పాడుతున్నట్టు కాని అనిపించదు. ఆ పిల్లలు కూడా ఎంతో ఆనందిస్తూ ఒక్కో పాట పాడుతుంటే మనకు చెప్పలేనంత ఉద్వేగం కలుగుతుంది. ఒక్కోసారి కళ్ళలో నీళ్లు రాకమానవు..కొందరు చిన్నారులకు ఈ పోటీ అంటే కూడా తెలియుడు. బాగా పాడాలి మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి అంతే. వేరే ఏవీ అక్కరలేదు. మంచి గ్రేడ్ వస్తే వాళ్ల మొహాలు మతాబుల్లా వెలిగిపోతాయి. చివరిలో శ్రుతులు మార్చి ఇచ్చినా కూడా చాలా సులువుగా పాడేస్తున్నారు ఎంతో అనుభవమున్న గాయకుల్లా. పాడేటప్పుడు వాళ్ళను ఎవరో గాంధర్వ గాయకులూ ఆవహించారేమో అని అనిపించక మానదు..

ఈ పిల్లలు అలనాటి ఆణిముత్యాల్లాంటి పాటలు పాడుతుంటే ఘంటసాల, జిక్కి, రాజేశ్వరరావు మొదలైన ప్రముఖులెందరో మన కళ్ళముందు కదలాడుతారు. ఆహా ఎంత మంచి సంగీతం, ఎంత మంచి సాహిత్యం. ఇంత మంచి మంచి పాటలు మన సొంతం కదా అనిపిస్తుంది. ఆ మహానుభావులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పని సంగీత ప్రియులు ఉండరేమో..

కాని కొందరు .. కొందరు ఎంటి చాల మంది రాయడానికి శక్తి లేకో, సమర్ధత లేకో మధురమైన పాతపాటలను రీమిక్స్ చేసి ఖూని చేస్తున్నారు. నాకైతే ఆ పాటలు చూస్తుంటే వాడిని తన్నాలనిపిస్తుంది. వినేవాళ్ళను కూడా తిడతాను. ఆ పాటల ఒరిజినల్స్ వినండి అని చెప్తాను. వాళ్లు రాయలేకపోతే ఊరుకోవాలి కాని మంచి పాటలు ఎందుకు ఖూని చేస్తారో అర్ధం కాదు.

స్పెషల్ న్యూస్..
ముంబై భామ ముమైత్ ఖాన్, ఈటీవీ ప్రభాకర్ (గుర్తున్నాడా) కలిసి జగడం అనే ప్రోగ్రాంతో జనాలను పిచ్చేక్కించడానికి వస్తున్నారు. జాగర్తగా ఉండండి.. తర్వాత మీ ఖర్మ..

Wednesday, 3 December 2008

నా రాత



ఇందులో ఏముందో చదవాలంటే బొమ్మ మీద నొక్కాల్సిందే..

Monday, 1 December 2008

సహాయ

పిల్లలకు ఇచ్చిన పుస్తకాలు ..

ఎప్పుడూ ఇల్లు, పిల్లలు, వంట, షాపింగు, అప్పుడప్పుడు బ్లాగింగు తప్ప వేరే ఏదైనా మంచి పని చేయాలన్న ప్రమదల ఆలోచన అంకురం తొడిగింది.విజయవంతమైంది. ప్రమదావనం సభ్యులు సేకరించిన సొమ్ముతో అంకురంలో ఉన్న అమ్మాయిల కోసం పుస్తకాలు, పెన్నులు, గట్రా కొనడం జరిగింది. ఇందులో ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరెవరు వెళ్లి కొన్నారు, ఎవరెళ్లి ఇచ్చారు అన్నదానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా తలో పని నెత్తిన వేసుకోవడం జరిగింది.


పిల్లల కోసం కొన్న స్టేషనరీ.

ఈ కార్యక్రమానికి మీ అందరి ప్రోత్సాహం అనూహ్యమైనది. ప్రమదావనం సభ్యులే కాకుండా మరికొందరు బ్లాగర్లు, బ్లాగర్లు కాని వారు కూడా సాయం చేయడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషం. ఇది సేవా కార్యక్రమం కాదు. మనకున్న నిధులతో కొందరికైనా సహాయం చేయాలనే ఒక చిన్ని ఆలోచన. ఈసారి ఏదైనా వృద్ధాశ్రమమానికి అవసరమైన మందులు కాని వస్తువులు కాని ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆ తర్వాత చిన్న పిల్లలకోసం.. ఈ విధంగా సేకరించిన సొమ్మంతా ఏ సంస్థకు ఇవ్వకుండా వారికి అవసరమైన వస్తువులు కొని, స్వయంగా వెళ్లి అందజేయాలని మా నిర్ణయం. ఎందుకంటే ఈ డబ్బు దుర్వినియోగం కావొద్దు కదా.. ఎక్కడ ఎక్కువ అవసరం ఉంది అని తెలుసుకోవడానికి. ఈసారి TMAD ప్రశాంతి సహాయం తీసుకోవడం జరుగుతుంది.

అమ్మాయిలకు చాలా అవసరమైన వస్తువులు. ఇవి అందుకున్న చిట్టి తల్లులు ఎంతో మురిసిపోయారని సంస్థ నిర్వాహకురాలు చెప్పారు..


minimum contribution is Rs.500 per person per each programme...



ఈ సహాయ కార్యక్రమానికి చేయూత నివ్వాలనుకున్నవారు నాకు మెయిల్ చేస్తే డబ్బు ఎలా పంపాలో వివరాలు తెలియజేస్తాను.

jyothivalaboju@gmail.com

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008