Sunday, May 10, 2009

అమ్మ


అమ్మ గురించి చెప్పదానికేముందు అదొక అద్భుతమైన వరం. అందరూ చెప్పారు . నేను మాత్రం ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను.

అమ్మల్లారా : పిల్లలను ప్రేమతో పెంచండి.. చదువు వగైరా అన్నీ చెప్పించండి. అలాగే చిన్నప్పటినుండే బాధ్యతలు కూడా నేర్పించండి. ఎప్పుడు చేయిపట్టుకుని చేయకుండా వాళ్లు సొంతంగా చేసుకునేలా తయారు చేయండి. అవసరమైనప్పుడే మీ చేయూతనివ్వండి. పెద్దయ్యాక కూడా ప్రతిదానికీ మీ మీద ఆధారపడనివ్వకండి.. ఆ తర్వాత మీరు వాళ్ల మీద ఆధార పడవద్దు. చదువు, ఉద్యోగం పెళ్లి అయ్యాక కొడుకులు , కూతుళ్ళ జీవితాల్లో మన ప్రమేయం ఉండకూడదు. వాళ్ల ఇష్టమొచ్చినట్టు చేసుకోనివ్వాలి. అసలు ఆ చింతే మనకు వద్దు. ఎవరి జీవితం వారిష్ట మొచ్చినట్టు ఉంటారు. అవసరమైనప్పుడే మనము ముందుకు రావాలి. ఒక బాధ్యత తీర్చుకున్నాక తప్పుకోవడమే మేలు. లేదంటే అనవసరంగా గొడవలు...మనస్పర్ధలు.. బాధలు ఎందుకు??? కొడుకులు మనము పున్నామ నరకం నుండి తప్పిస్తారనో, ముసలితనంలో చేరదీస్తారనో అసలు ఎదురు చూడొద్దు. ఆ ఆలోచనే మంచిది కాదు. దాని గురించి మనమే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. కోపం వద్దు అమ్మల్లారా.. మనమూ మారాలి..


పిల్లలారా : మీకు చిన్నప్పటినుండి అమ్మ కంటికి రెప్పలా చూసుకుని అన్ని దగ్గరుండి నేర్పిస్తుంది. పెద్దవాల్లయ్యాక అమ్మ కాని , నాన్న కాని ఏదైనా మాట అంటే మీకు నచ్చాడు. మీకేమీ తెలియదు, అనవసరంగా కలగచేసుకోవద్దు అంటారు. ఒకే .. కాని మీకు అవసరమొచ్చినప్పుడు , సేవలు చేయడానికి అదే అమ్మా ఎందుకు కావాలి? మీకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవాలంటే అక్కరలేని అమ్మా మీ భార్యా పిల్లలకు సేవలు చేయడానికి మాత్రం కావాలి. జీతం బత్తెం లేని నమ్మకమైన పనిమనిషి కావాలిగా.. అసలు అమ్మా పెళ్లి చేసుకుని వచ్చింది మీకు చచ్చేదాకా సేవలు చేయడానికి మాత్రమేనా. చిన్నపిల్లలు అని మీ అవసరాలు తెలుసుకుని అమర్చిపెడుతుంది. కాని మీ పనులు మీరు చేసుకోగలిగినపుడు కూడా అమ్మా ఎందుకు పని చేయాలి. నువ్వు కూర్చో మేము చేస్తాం అనే మాట వస్తుందా. కాస్త వయసు ముదిరితే తల్లితండ్రుల మాటలు అర్ధం లేనివిగా ఉంటాయి. వారితో గడిపే టైం ఉండదు. అందుకే ... బలవంతంగా అమ్మా నాన్నలను చూడాలి అనే ఆలోచన మానుకోండి.. మీ జీవితం మీరు చూసుకోండి.. వారి మానాన వారిని వదిలేయండి..

వింతగా ఉంది కదూ ఈ మాటలు. కాని ఈ రోజుల్లో అందరు అమ్మలు ఇలాగే ఆలోచించాలి. పిల్లలను చదివించి, పెళ్లి చేసి వదిలేయాలి. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో మన ప్రమేయం ఉండకూడదు.ఏమంటే మీకేమి తెలీదు అంటారు. ఎందుకు ? ఇవన్నీ అవసరమా?? అవసరమున్నప్పుడే మనం అడుగు ముందుకేయాలి. లేదంటే మన పని మనం చూసుకోవడం మేలు. ఇది బయటివాల్లతో కాదు.మన పిల్లలతో కూడా ఇదే విధంగా ఆలోచించాలి .. ఎన్నో కుటుంబాలలో చూసిన గొడవల మూలంగా నేను ఈ నిర్ణయానికొచ్చాను. ఏదో మీకు సలహా ఇస్తున్నాను. దీనికి పన్ను ఉండదు కదా. ఉచిత సలహా అన్నమాట .. అమ్మమాట..


ఈరోజు మరో ప్రత్యేకత ఉంది.. గత సంవత్సరం ఇదే మదర్స్ డే రోజు ప్రమదావనం మొదలైంది.. ఎక్కడో ఈ ఊరో తెలీకుండా బ్లాగుల్లో కామెంట్ల ద్వారా పరిచయాలు కలిగిన మహిళా బ్లాగర్లు ప్రమదావనం అనే వేదిక మీద ఒకేసారి కలవడం మొదలైంది. అది దినదినప్రవర్ధమానమై ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టింది. మరి కొన్ని చేయడానికి సర్వసన్నద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రమదావనం సభ్యులందరికీ శుభాకాంక్షలు..


ఈ రోజు మహిళా బ్లాగర్లు " అమ్మా" అనగానే కలిగే స్పందనను తమదైన విభిన్న శైలిలో మన కళ్ళ ముందుంచారు. అన్నీ ఒక్కచోట ఇదిగో..

సాహితి
సురుచి
అంతరంగ తరంగాలు
మకరందం
చైతన్యం
జాజిపూలు
పరిమళం
ప్రియదర్శిని
ఇట్లు నీ నేస్తం
రమ్యంగా కుటీరాన
జాహ్నవి
మధురవాణి

8 వ్యాఖ్యలు:

భమిడిపాటి సూర్యలక్ష్మి

జ్యోతి గారూ ,మీరు చెప్పిన చిన్న మాటలొ చాలా అర్దముందండి.మా భావాలే మీ అక్షరాలలో తెలియబరచారు.మేము చేసి చూపిస్తూన్నాము.

పరిమళం

జ్యోతి గారు మీరన్నట్టు వృద్ధాప్యం లో పిల్లల మీద ఆధారపడ కుండా ఏర్పాటు చేసుకోవడం మంచిదే ! మదర్స్ డే శుభాకాంక్షలు. అలాగే ప్రమదావనం సభ్యులందరికీ శుభాకాంక్షలు.

Anonymous

జ్యోతి గారూ,

మా కోడలికి అత్తగారే కాకుండా, అత్తగారికి అత్తగారు( మా అమ్మ గారు) కూడా ఉండేవారు, ఆవిడ స్వర్గస్తులైన తరువాత, మా పిల్లల్ని "ఫ్రీ" గా ఉంచుదామని రాజమండ్రి వచ్చి బ్లాగ్ మిత్రులందరినీ బోరు కొడ్తున్నాము. ఈవిడేమో పిల్లలు, పిల్లలు అని ప్రతీ రెండు నెలలకీ పూనా ప్రయాణం చేయిస్తుంది నా చేత. మేము 100 పర్సెంట్ మీ భావాలతో ఏకీభవిస్తున్నాము.

Bolloju Baba

వినటానికి బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తోంది. అదేమిటో తెలియటం లేదు.

బొల్లోజు బాబా

మాలా కుమార్

జ్యొతి గారు ,
మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజం.కాని భాద్యతల నుండి తప్పుకొవటము కష్టము.ఎదొ చాతనయినంతవరకు పిల్లల కి సాయము చెద్దామనే వుంటుంది కదా.

మధురవాణి

జ్యోతి గారూ,
మీరు చెప్పినవాటితో కొంతవరకు నేను కూడా ఏకీభవిస్తున్నాను.
కష్టాలో, సుఖాలో.. పిల్లలు వాళ్ళంతట వాళ్ళు నేర్చుకునే వీలుని తల్లిదండ్రులు కల్పించాలి.
పిల్లలు అస్సలు కాస్త కూడా బాధపడకూడదని అన్నీటికీ వీళ్ళే కష్టపడి.. వాళ్లకి అమర్చి పెట్టకూడదు. అలా అయితే ఇంకా వాళ్ళెప్పుడు నేర్చుకుంటారు మరి.? ఎలా ఎదుర్కోవాలో చెప్పి.. ఎదుర్కోవడం మాత్రం పిల్లలకే విడిచిపెట్టాలి. ఏమంటారూ.?
ప్రమదలందరి 'అమ్మ' కబుర్లని ఒక చోట చేర్చినందుకు ధన్యవాదాలు.

జ్యోతి

లక్ష్మిగారు,

చాలా మంచిపని చేశారు..

ఫణిబాబుగారు,

మీ ఇద్దరి కబర్లతో మాకెవ్వరికీ బోర్ కొట్టడం లేదండి. అమ్మమనసు కదా.. ఎక్కువరోజలు పిల్లలను వదలి ఉండలేదు. మీకు మాత్రం ఉండదేంటి. పిల్లలను, వాళ్ల పిల్లలను చూడాలని.

బాబాగారు,
మీ పిల్లలు చిన్నవాళ్లేమో. అందుకే తేడా కనిపిస్తుంది. మీకు ఇలాంటి పుత్రరత్నాలు కనపడలేదేమో. గత నెలలో నలుగురు కొడుకులు,తమ తల్లిని బయటకు గెంటేసారు.అది చూసి ఊరివారు వాళ్లను ఇళ్లనుండి గెంటేసి తాళాలు వేసారు. ఇక నిన్న డెబ్బె ఏళ్ల తల్లి కొడుకు మూలంగా ఆత్మహత్య చేసుకుంది..

మధురవాణిగారు,
నిజమే. నేను చెప్పేది అదే.

మాలగారు.
కొన్ని బాధ్యతలు తప్పవు.. కాని వీలైనంతవరకు పిల్లలకు పెళ్లి చేసాక మన జోక్యం ఉండకూడదు.. అవసరమైతే తప్ప..

నేస్తం

:) మనసుకు హత్తుకునేలా చాలా బాగా రాసారు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008