Wednesday, 29 October 2014

Happy Birthday My Friend

Not everyone is as lucky as me to be blessed with a friend like you. Thank you so much for coming into my life and standing by my side through thick and thin. I wish you get all that you truly deserve.


Happy Birthday My Friend.. May God Bless U with Health, Wealth and Success with more Smiles..


Sunday, 5 October 2014

మాలిక పత్రిక అక్టోబర్ 2014 సంచిక విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head

పాఠకులందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు. మాలిక పత్రిక అక్టోబర్ సంచిక మరిన్ని ఆసక్తికరమైన కథలు, వ్యాసాలతో ముస్తాబై మీ ముందుకు వచ్చింది..

మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ సంచికలోని విశేేషాలు:

 1. పోతన నన్నెచోడుడు 
 2. ఆరాధ్య - 1
 3. హిమగిరి సొగసుల నేపాల్
 4. పదచంద్రిక
 5. రహస్యం
 6. మొదటి మహిళా సెనెట్
 7. తేడా (తండ్రి - కూతురు)
 8. ముఖపుస్తకాయణం
 9. ప్లానింగ్
10. మాయానగరం 8
11. కొత్తకాపురం
12. హృద్యమైన తెలుగు పద్యం

Saturday, 4 October 2014

మాలిక పత్రిక పదచంద్రిక - సెప్టెంబర్ 2014 ఫలితాలు




శ్రీయుతులు శుభావల్లభ, రెండుచింతల రామకృష్ణమూర్తి, భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హనుమంతరావు, యాడాటి కృష్ణ, బాలసుందరీ మూర్తి, కాత్యాయనీ దేవి, చెనెకల మనోహరు గార్లు ఈ సారి గడిని ఉత్సాహంగా పూరించి పంపినవారు. కూర్పరులని ఉత్సాహపరిచే రీతిలో మనోహరుగారు తప్ప మిగిలిన అందరూ అన్నీ సరిగ్గా పూరించారు.   మనోహరుగారు కేవలం ఒక్క తప్పు (గద్యకవులు బదులు వాచ్యకవులు అని రాసారు)తో పూరించారు.  అందరికీ అభినందనలు.   


Sunday, 14 September 2014

అష్టమ వార్షికోత్సవ శుభవేళ




 ఈ రోజు మంచి రోజు.. మరపురానిది.. మధురమైనది... సినిమా పాట కాదండి. ఈరోజే నేను బ్లాగు మొదలెట్టినరోజు అందుకే  ఈ సంబరం..

వినడానికి వింతగా ఉన్నా నాకు మాత్రం అన్ని పండగలకంటే నేను పుట్టిన రోజు, నా బ్లాగు పుట్టినరోజు చాలా ముఖ్యమైనవి, ఇష్టమైనవి కూడా.. జీవితంలో ప్రతీ సంవత్సరం పెరుగుతూ, ఎదుగుతూ,  నేర్చుకుంటూ, నేర్పిస్తూ, ఆటుపోట్లను, అపజయాలు, అవమానాలను తట్టుకుంటూ,  విజయాలను సొంతం చేసుకుంటూ ఒక సంతృప్తి, గుర్తింపును తెచ్చుకున్నాను. అదే విధంగా జీవితపు రెండవ అంకంలో పిల్లలకోసం మొదలెట్టిన ఈ సాంకేతిక ప్రయాణం నాకు సాహితీపరంగా మరో జన్మ అని చెప్పవచ్చు. మొదటి అంకం నా కుటుంబానికి కేటాయించి విజయాన్ని సాధిస్తే, రెండవ అంకంలో నాకోసం కేటాయించుకుని అందుబాటులోకి వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుని,  రాదు అని కాకుండా ఎందుకు రాదు అని మావారు చెప్పిన పాఠాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ.  నిజజీవితంలోనూ, ఈ మిధ్యాజీవితంలోనూ అనుక్షణం ఒక విద్యార్థిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. ఈ ప్రయాణం అంత సులువు కాదూ, సాఫీగానూ లేదూ. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ బ్లాగర్ గా,  రచయిత్రిగా, సంపాదకురాలిగా,  ప్రచురణకర్తగా ఒక్కో పాత్రని విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చాను. ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ గుర్తింపు, విజయం ఒక పబ్లిషర్‌గా దక్కింది. ఈ సంవత్సరం జనవరి మొదటి తారీఖున మొదలెట్టిన ఈ J.V.Publisher నా పుస్తకం "తెలంగాణ వంటలు - వెజ్" తో మొదలెట్టి ఇప్పటివరకు పది పుస్తకాల ప్రచురణ  విజయవంతంగా సంతృప్తికరంగా పూర్తిచేయడం నా అదృష్టం అని భావిస్తున్నాను. అన్నిటికంటే గొప్పది.. ఒక చాలెంజ్ లా చేసింది సి.ఉమాదేవిగారి ఆరు పుస్తకాలు ప్రచురించడం.. అదే విధంగా మాలిక పత్రిక ముఖ్య సంపాదకురాలిగా మరో గొప్ప బాధ్యత కూడా నాకు సాహిత్య పరంగా ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ పత్రిక ద్వారా వివిధ ప్రక్రియలు, ప్రయోగాలను చేయడం కొత్త శక్తినిస్తుంది.

అందరికంటే ఎక్కువగా, ఎప్పటికీ  నేను ధాంక్స్ చెప్పుకోవాల్సింది నా బ్లాగు జ్యోతికే. నన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను.... కాని ఈ మధ్య బ్లాగులో ఎక్కువ రాయడం కుదరడం లేదు.. ప్చ్...

అదేంటోగాని నా మీద నాకంటే నా మేలు కోరే మిత్రులకు ఎంతో నమ్మకం.. ఈ విజయాలన్నీ సాధించడానికి ప్రియమిత్రులు, శ్రేయోభిలాషుల తోడ్పాటు ఎంతో ఉంది... వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది.  నా ఈ సాంకేతిక జీవన ప్రస్ధానంలో నన్ను గౌరవించి, ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలతో, ఒక గృహిణిని పబ్లిషర్ గా మార్చి,  విజయవంతంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని బ్లాగురచనలో మరో వత్సరంలోకి అడుగిడుతున్న "జ్యోతి"కి అభినందనలు ....  మీ ఆశీర్వాదాలు కూడా కోరుకుంటూ...

గత వార్షికోత్సవాల విశేషాలు:


పంచమ వార్షికోత్సవం

Tuesday, 2 September 2014

మాలిక పత్రిక సెప్టెంబర్ సంచిక విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head

మాలిక పత్రిక సెప్టెంబర్ సంచిక మరిన్ని విశేషాలతో విడుదల అయింది. ఈ నెల ప్రత్యేకంగా నోముల కథా పురస్కారం పొందిన ఐదు కథలను ప్రచురించడం జరిగింది. రెండు రోజుల క్రితమే ఈ బహుమతులు అందజేయబడ్డాయి. అందరినీ అలరించే వివిధ అంశాలతో మీ ముందుకు వస్తుంది ఈ సంచిక..
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ సంచికలోని వ్యాసాలు:

00. క్షమించు నాన్నా
01. మాలిక పదచంద్రిక 
02.  గుర్తుందా నీకు గుర్తుందా?
03. అస్ధిత్వం
04. పేగుముడి
05. బహుముఖం
06. ఎదురు చూపులు
07. ఆఖ్రీ సలాం
08. వినాయకునిపై పద్యాలు
09. అనగనగా బ్నిం కథలు 13
10. మాయానగరం - 7
11. పాప బాబు బ్యాచ్
12. అక్కరలు
13. బులుసు సుబ్రహ్మణ్యం కథలు
14. అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి
15. అనంతవాహిని
16. పిట్ట కొంచెం కూత ఘనం
17. అండమాన్ డైరీ - 7


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008